హేమావతి నందన్ బహుగుణ
| హేమావతి నందన్ బహుగుణ | |||
భారతదేశం 2018 స్టాంపుపై హేమవతి నందన్ బహుగుణ | |||
13వ కేంద్ర ఆర్థిక మంత్రి | |||
| పదవీ కాలం 1979 జూలై 28 – 1979 అక్టోబర్ 25 | |||
| ప్రధాన మంత్రి | చరణ్ సింగ్ | ||
|---|---|---|---|
| ముందు | చరణ్ సింగ్ | ||
| తరువాత | చరణ్ సింగ్ | ||
| పదవీ కాలం 1973 నవంబర్ 8 – 1975 నవంబర్ 29 | |||
| ముందు | రాష్ట్రపతి పాలన | ||
| తరువాత | రాష్ట్రపతి పాలన | ||
| పదవీ కాలం (1980 - 1982), (1982 – 1984) | |||
| ముందు | పండిట్ జగన్నాథ్ శర్మ | ||
| తరువాత | చంద్ర మోహన్ సింగ్ నేగి | ||
| నియోజకవర్గం | గర్హ్వాల్ | ||
| పదవీ కాలం (1977 – 1980) | |||
| ముందు | షీలా కౌల్ | ||
| తరువాత | షీలా కౌల్ | ||
| నియోజకవర్గం | లక్నో | ||
| పదవీ కాలం (1971 – 1975) | |||
| ముందు | హరి కృష్ణ శాస్త్రి | ||
| తరువాత | జానేశ్వర్ మిశ్రా | ||
| నియోజకవర్గం | అలహాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 25 April 1919 పౌరి గర్హ్వాల్, ఆగ్రా & ఔధ్ యునైటెడ్ ప్రావిన్సులు, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత ఉత్తరాఖండ్ , భారతదేశం ) | ||
| మరణం | 1989 మార్చి 17 (వయసు: 69) క్లీవ్‌ల్యాండ్ , ఒహియో, యూఎస్ | ||
| రాజకీయ పార్టీ | భారతీయ లోక్ దళ్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ , జనతా పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ | ||
| జీవిత భాగస్వామి | కమలా బహుగుణ | ||
| బంధువులు | సౌరభ్ బహుగుణ (మనవడు) | ||
| సంతానం | విజయ్ బహుగుణ (కొడుకు) రీటా బహుగుణ జోషి (కుమార్తె) | ||
| పూర్వ విద్యార్థి | అలహాబాద్ విశ్వవిద్యాలయం | ||
హేమవతి నందన్ బహుగుణ (25 ఏప్రిల్ 1919 - 17 మార్చి 1989) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1973 నవంబరు 8 నుండి 1975 నవంబరు 30 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]హేమావతి నందన్ బహుగుణ 1919 ఏప్రిల్ 25న ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్‌లోని బుఘానిలో గర్హ్వాలి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించగా[1] ఆ తరువాత వారు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు మారారు.[2]
హేమావతి నందన్ బహుగుణ మొదటి భార్య ఎల్లప్పుడూ అతని స్వగ్రామమైన బుఘానిలో ఒక సాధారణ గ్రామీణ మహిళగా నివసించేది. అతని రెండవ భార్య కమలా బహుగుణ అతనితో అలహాబాద్‌లో నివసించింది, వారికి ముగ్గురు పిల్లలకు తల్లి:
- వారి పెద్ద కుమారుడు విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన అలహాబాద్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి & భారతీయ జనతా పార్టీ సభ్యుడు. విజయ్ కుమారుడు సౌరభ్ బిజెపి నుండి ఉత్తరాఖండ్ శాసనసభ సభ్యుడు. ఆయన 2022లో పుష్కర్ సింగ్ ధామి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, నైపుణ్యాభివృద్ధి & ఉపాధి, ప్రోటోకాల్ & చెరకు అభివృద్ధి మంత్రిగా పని చేస్తున్నాడు.[3]
- రెండవ కుమారుడు శేఖర్ బహుగుణ.
- ఈ దంపతుల కుమార్తె రీటా బహుగుణ జోషి యుపి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా, అలహాబాద్ మేయర్‌గా, లోక్‍సభ సభ్యురాలిగా పని చేసింది.
ఎన్నికలలో పోటీ
[మార్చు]- 1971: కాంగ్రెస్ సభ్యుడిగా అలహాబాద్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
- 1977: జనతా పార్టీ మద్దతుతో 'కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ' సభ్యునిగా లక్నో నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
- 1980: గర్హ్వాల్ నుండి కాంగ్రెస్ సభ్యుడిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు, కానీ త్వరలోనే కాంగ్రెస్ & లోక్‌సభ రెండింటినీ విడిచిపెట్టాడు.
- 1982 ఉప ఎన్నిక: గర్హ్వాల్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు, తన కాంగ్రెస్ ప్రత్యర్థిని ఓడించాడు.
- 1984: ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో అమితాబ్ బచ్చన్ చేతిలో ఓడిపోయాడు.
మరణం
[మార్చు]బహుగుణ 1988లో అనారోగ్యానికి గురై కరోనరీ బైపాస్ సర్జరీ కోసం అమెరికాకు వెళ్లగా సర్జరీ విజయవంతం కాకపోవడంతో 1989 మార్చి 17న క్లీవ్‌ల్యాండ్ ఆసుపత్రిలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Mishra, Anand (16 August 2020). "Big fight for Brahmin votes in Uttar Pradesh". Deccan Herald. Retrieved 27 September 2020.
- ↑ "Hemanti Nandan Bahuguna". Pauri Garhwal Group. Archived from the original on 1 June 2007. Retrieved 15 March 2015.
- ↑ "Uttarakhand CM Dhami allots portfolios, keeps over two dozen departments with himself". The Indian Express. 30 March 2022. Retrieved 7 December 2022.