హేమెన్ గుప్తా
హేమెన్ గుప్తా | |
|---|---|
| జననం | హేమెన్ గుప్తా 1914, మార్చి 21 రాజ్‌మహల్, జార్ఖండ్ |
| మరణం | 1967, మే |
| వృత్తి | సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1930–1967 |
| పేరుపడ్డది | ఆనంద్ మఠ్ (1952), ఫెర్రి (1953), కాబూలీవాలా (1961) |
| భాగస్వామి | రత్న గుప్తా |
| పిల్లలు | జయంత గుప్తా (కుమారుడు) జయశ్రీ గుప్తా మోత్వానే (కుమార్తె) |
హేమెన్ గుప్తా జార్ఖండ్ కు చెందిన సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.[1][2] హిందీ సినిమాలు, బెంగాలీ సినిమాలలో పనిచేశాడు.
జీవిత విషయాలు
[మార్చు]హేమెన్ గుప్తా 1914, మార్చి 21న జార్హాండ్‌లోని రాజ్‌మహల్‌లో జన్మించాడు. తండ్రి పూర్ణానంద్ గుప్తా స్టేట్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేశాడు. తండ్రి బంగ్లాదేశ్‌లోని ఢాకాకి బదిలీ చేయబడడంతో అక్కడ హేమెన్ తన చిన్నతనంలో గడిపాడు.
ఢాకాలో ఉన్నత పాఠశాల, అండర్గ్రాడ్ కళాశాలలో చదువులను పూర్తి చేసాడు. అక్కడ అకడమిక్ గౌరవాలతో పట్టభద్రుడయ్యాడు. అండర్గ్రాడ్ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా (ప్రస్తుతం కోల్‌కతా)కి మారాడు.
కలకత్తాలో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందేందుకు జాతీయ విప్లవ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1928లో స్థానిక కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో చేరాడు, బ్రిటిష్ అధికారులు విధ్వంసకర కార్యకలాపాలుగా భావించిన దానిలోకి ఆకర్షితుడయ్యాడు.
1931లో బ్రిటీష్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు, రెండు ఆరోపణలపై దోషిగా నిర్ధారించారు.
సినిమాలు
[మార్చు]దర్శకుడు
[మార్చు]| సంవత్సరం | సినిమా |
|---|---|
| 1966 | నేతాజీ సుభాష్ చంద్రబోస్ |
| 1961 | కాబూలీవాలా |
| 1960 | బాబర్ |
| 1959 | ఇన్సాఫ్ కహాన్ హై |
| 1957 | రాజ్ కమల్ |
| 1956 | తక్సాల్ |
| 1954 | మీనార్ |
| 1953 | ఫెర్రీ (కష్టి) |
| 1952 | ఆనంద్ మఠ్ |
| 1951 | బియాలీష్ (42) |
| 1948 | భూలి నై |
| 1947 | అభియాత్రి |
| 1944 | తక్రార్ |
| 1943 | ద్వాంద |
నిర్మాత
[మార్చు]| సంవత్సరం | సినిమా |
|---|---|
| 1954 | కష్టి |
| 1952 | ఆనంద్ మఠ్ |
| 1951 | బియాలీష్ (42) |
స్క్రీన్ ప్లే రచయిత
[మార్చు]| సంవత్సరం | సినిమా |
|---|---|
| 1956 | తక్సాల్ |
| 1954 | (ఫెర్రీ) కష్టి |
| 1952 | ఆనంద్ మఠ్ |
| 1951 | బియాలీష్ (42) |
మూలాలు
[మార్చు]- ↑ "9 Bengali films that captured India". The Times of India. Bennett, Coleman & Co. Ltd. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 August 2020.
- ↑ Bengali Cinema: 'An Other Nation'. Routledge. 1 November 2010. ISBN 9781136912160. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 August 2020.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హేమెన్ గుప్తా పేజీ
- https://cinemaazi.com/feature/hemen-gupta-his-life-and-times Archived 2023-03-27 at the Wayback Machine