హైదరాబాదులో ఎల్‌జీబీటీ సంస్కృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన ఆరు-బ్యాండ్ రెయిన్‌బో జెండా

ఎల్‌జీబీటీ అనేది లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ లకు సంక్షిప్తపదం. 1990ల నుండి ఈ పదం వాడుకలో ఉంది. సాధారణంగా మగ (ఎం), ఆడ(ఎఫ్) వాళ్ల మధ్య ఒకరంటే ఒకరికి ఆకర్షణ ఏర్పడుతుంది. కానీ క్లిష్టమైన పరిస్థితుల ప్రభావంతో ఇలాకాకుండా పలు రకాల కలయికలు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఎం, ఎఫ్ లకు ఎల్, జి, బి, ఐ, టి, క్యూ లు కూడా తోడయ్యాయి. ఇందులో

ఎల్ - లెస్బియన్ అంటే ఒక ఆడవ్యక్తికి మరో ఆడవ్యక్తిపై ఆకర్షణ ఉండడం.

జి - గే అంటే ఒక మగవ్యక్తికి మరో మగవ్యక్తి మీద ప్రేమ కలగడం.

బి - బైసెక్సువల్ అంటే ఎవరికైనా, ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలగొచ్చు. వీరిలో ఒక మగవాడికి మరో మగవాడిపై కానీ మరో ఆడవ్యక్తిపై కానీ ప్రేమ కలుగుతుంది. అలాగే ఒక ఆడవ్యక్తికి మరో ఆడవ్యక్తిపై కానీ మగవాడిపై కానీ ప్రేమ కలుగుతుంది.

టి - ట్రాన్స్‌జెండర్ అంటే మూడో జెండర్ అన్నమాట. పుట్టినపుడు వీళ్లు మగపిల్లలు లేదా ఆడపిల్లలు అనుకుంటారు. కానీ పెరిగి పెద్దయ్యాక వాళ్లు దానికి భిన్నంగా తయారవుతారు. వీరిలో అబ్బాయిగా పుట్టిన వ్యక్తికి, పెద్దయ్యాక ఆడవారి లక్షణాలు బైట పడటం, అదే విధంగా ఆడపిల్లగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక మగవాడి లక్షణాలు కనిపించడం జరుగుతుంది. వీరు మనసుతో పాటు శరీరం కూడా మారాలని అనుకుంటే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ లేదా సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ సహాయంతో తమ శరీరంలో మార్పులు చేసుకుంటారు. వీరిని ట్రాన్స్‌సెక్సువల్ అని పిలుస్తారు.

ఐ - ఇంటర్‌సెక్స్ అంటే పుట్టినపుడు జనానాంగాలను బట్టి వాళ్లు మగపిల్లలో, ఆడపిల్లలో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నవాళ్ళు. వీళ్లను డాక్టర్లు పరీక్షించి ఆడపిల్ల, మగపిల్లాడు అని నిర్దారిస్తారు.

క్యూ - క్వీర్ అంటే ఈ వర్గం వాళ్లకు తాము ఎవరనే విషయంపై వాళ్లకే స్పష్టత ఉండదు. పైగా తమకు ఎవరు ఇష్టం అన్నది కూడా తెలియదు.

ఇలా పాశ్చాత్య పదాలు ఎన్ని ఉన్నా హైదరాబాదులో 'హిజ్రా'లుగానే ఎక్కువగా తెలుసు. ఇక హిజ్రాలను అరావనీ, కోథీ, శివశక్తి, జోగ్తి హిజ్రా అని దేశంలో వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

దేశంలో ఇతర మెట్రోనగరాలలతో పోలిస్తే హైదరాబాదు సంప్రదాయ నగరం. కానీ బెంగుళూరు తర్వాత రెండవ ఐటీ-రాజధానిగా మారడం ప్రారంభించినప్పటి నుండి ఎల్‌జీబీటీ సంస్కృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం అన్ని సంస్కృతుల ప్రజల నిరంతర ప్రవాహం ఇక్కడికి ఉండడమే. 2013, 2014లలో ఎల్జీబీటీ ప్రైడ్ మార్చ్ [1]లతో సహా హైదరాబాద్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఎల్‌జీబీటీ క్రియాశీలతలో కొంత పెరుగుదల ఉంది. మెల్లగా, అగ్రశ్రేణి ఎం.ఎన్.సీలు తమ హైదరాబాద్ కార్యాలయాలలో ఎల్‌జీబీటీ స్నేహపూర్వక విధానాలను ప్రవేశపెడుతున్నాయి.[2]

సంస్థలు[మార్చు]

  • ఎల్‌జీబీటీ హక్కుల కోసం హైదరాబాద్‌లో కొన్ని సంస్థలు పని చేస్తున్నాయి. వాటిలో కొన్ని..
  • వజూద్[3]
  • సురక్ష
  • క్వీర్ నిలయం
  • క్వీర్ క్యాంపస్ హైదరాబాద్
  • హైదరాబాద్ ఫర్ ఫెమినిజం
  • హైదరాబాద్ క్వీర్ స్వాభిమాన్ యాత్ర
  • హైదరాబాద్‌ హబ్సిగూడలో లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌, క్యూటి సెంటర్‌[4]

హైదరాబాదులో ఎల్‌జీబీటీ సంఘటనలు[మార్చు]

  • 2012: LGBT సపోర్ట్ గ్రూప్ వాజూద్ సెటప్[3]
  • 2013: మొదటి క్వీర్ ప్రైడ్ నగరంలో జరిగింది
  • 2014: క్వీర్ క్యాంపస్ హైదరాబాద్ ద్వారా మొదటి క్వీర్ కార్నివాల్.[5]
  • 2019: ఇండియాస్ ఫస్ట్ డ్రాగ్ కాన్, హైదరాబాద్ డ్రాగ్ కాన్ 2019 హైదరాబాద్ డ్రాగ్ క్లబ్ ద్వారా భారతీయ మొదటి డ్రాగ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది
  • 2021: క్వీర్ నిలయం సెటప్ - హైదరాబాద్‌లోని LGBTQIA+ కమ్యూనిటీకి సపోర్ట్ గ్రూప్.
  • 2021: హైదరాబాద్ మొదటి క్వీర్ మ్యాగజైన్ - క్వీర్‌నామా[6]

పోలీస్‌ శాఖ అండ[మార్చు]

ఎల్‌జీబీటీ సమాజానికి మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్‌ శాఖ వేదిక ఉంది. ఇది ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుంది.[7]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Hyderabad Queer Pride 2013". Gaylaxy Magazine. July 24, 2012. Retrieved 19 July 2014.
  2. "MNCs in Hyderabad becomes LGBT-friendly". Deccan Chronicle. 2013-10-17. Archived from the original on 2014-07-15. Retrieved 2015-05-20.
  3. 3.0 3.1 "WAJOOD". Wajoodlgbt.blogspot.in. 2012-03-29. Retrieved 2015-05-20.
  4. "Transgenders: ట్రాన్స్‌ జెండర్లకు లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌.. హైదరాబాద్‌లో తొలిసారిగా ఏర్పాటు |". 2023-05-06. Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-06.
  5. "Hyderabad Queer Carnival ends on gay note". Deccan Chronicle. 2014-01-19. Retrieved 2015-05-20.
  6. "Home". queernilayam.org. Archived from the original on 2023-02-23. Retrieved 2023-02-23.
  7. "ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై వేదిక". 2023-02-21. Archived from the original on 2023-02-21. Retrieved 2023-02-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)