హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్
Indian Railways Suburban Railway Logo.svg
MMTS sanathnagar.jpg
ముఖ్య వివరాలు
స్థానిక ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారత దేశము
ట్రాన్సిట్ రకంసబర్బన్ రైలు
లైన్ల సంఖ్య3
స్టేషన్ల సంఖ్య27
రోజువారీ ప్రయాణికులు170,000
నిర్వహణ
ప్రారంభమైన కార్యాచరణ9 ఆగష్టు, 2003
నిర్వహించేవారుదక్షిణ మధ్య రైల్వే
సాంకేతిక అంశాలు
వ్యవస్థ పొడవు43 కిలోమీటర్లు (27 మై.)*
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) (బ్రాడ్ గేజ్)
విద్యుదీకరణ25 kV, 50 Hz ఎసి (ఓవర్హెడ్ క్యటెనరీ ద్వారా)

మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎం. ఎం, టి, ఎస్.) హైదరాబాదులో ఒక శివారు రైలు వ్యవస్థ. ఇది తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వేల ఉమ్మడి భాగస్వామ్యం కలిగివుంది. ఈ పదమునకు అర్థము బహుళ విధ రవాణా వ్యవస్థ

మొదటిదశ[మార్చు]

ఎం.ఎం.టి.ఎస్ మొదటి దశ పథకం 178 కోట్ల రూపాయలతో, అనగా 28 మిలియన్ యూఎస్ డాలర్ల వ్యయంతో నిర్మింపబడి అప్పటి ఉపప్రధాని ఎల్.కే. అద్వానీ, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 43 కి. మి నిడివి గల మార్గముతో 27 స్టేషన్లతో అలరారుతోంది మొదటి దశ. ఇందులో ప్రధానంగా రెండు మార్గాలు గలవు. ఒకటి లింగంపల్లి-బేగంపేట-హైదరాబాదు (నాంపల్లి) . మరొకటి లింగంపల్లి-బేగంపేట-సికిందరాబాదు-కాచిగూడ-ఫలక్‌నుమా మార్గం.

మొదటిదశ మార్గాలు[మార్చు]

ఎం.ఎం.టి.ఎస్ మార్గం మార్గపు పేరు సర్వీసుల సంఖ్య
హైదరాబాదు - లింగంపల్లి హెచ్‌ఎల్ 26
లింగంపల్లి- హైదరాబాదు ఎల్‌హెచ్ 23
ఫలక్‌నామా - లింగంపల్లి ఎఫ్‌ఎల్ 28
లింగంపల్లి- ఫలక్‌నామా ఎల్‌ఎఫ్ 30
ఫలక్‌నామా - హైదరాబాదు ఎఫ్‌హెచ్ 5
హైదరాబాదు- ఫలక్‌నామా హెచ్‌ఎఫ్ 3
సికింద్రాబాద్- ఫలక్‌నామా ఎస్‌ఎఫ్, ఎస్‌యు 3, 3
ఫలక్‌నామా - సికింద్రాబాద్ ఎఫ్‌ఎస్, యుఎస్ 3, 3
లింగంపల్లి- సికింద్రాబాద్ ఎల్‌ఎస్ 2

రెండవ దశ[మార్చు]

107 కి.మి ల నిడివి గల రెండవ దశ ఎం.ఎం.టి.ఎస్ పథకాన్ని చేపట్టాలని భారతీయ రైల్వే శాఖ 2010-వ సంవత్సరపు మే నెలలో నిర్ణయించింది. 632 కోట్లరూపాయల బడ్జెట్ నిధుల కేటాయింపుతో ఈ రెండవ దశ పథకం 1-3-2012 నాడు అమోదం పొందింది. ఈ రెండవ దశపథకం, రెండు దశల వారీగా జరుగును. అవి:

దశ మార్గము నిడివి (కి.మి) వ్యయము (రూ.కోట్లలో)
మొదటి దశ ఫలక్‌నామా -రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 20 85
పఠాన్ చెఱువు -తెల్లాపుర్ 9 32
లింగంపల్లి-తెల్లాపుర్ 15 42
సికిందరాబాదు-బొల్లారం 14 30
సనత్ నగర్-మౌలాలి 21 170
రెండవ దశ మౌలాలి-మల్కాజ్ గిరి-సీతాఫలమండి 10 25
బొల్లారం -మనోహరాబాదు 24 74
మౌలాలి-బీబీనగర్ 28 120

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]