Jump to content

హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం

వికీపీడియా నుండి
హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
రాష్ట్రంతెలంగాణ
నగరంహైదరాబాదు
జిల్లా
విస్తీర్ణం
 • Total7,257 కి.మీ2 (2,802 చ. మై)
జనాభా
 (2020)
 • Totalఅంచనా 97,46,000[2]
 • జనసాంద్రత10,477/కి.మీ2 (27,140/చ. మై.)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరం పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. హైదరాబాదు, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలతో హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతం హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలోని 7,257 కి.మీ2 (2,802 చ. మై) విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 9.75 మిలియన్ల జనాభా ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

2008 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం (G.O.Ms.No.570 MA & UD (11) డిపార్ట్ మెంట్, తేది.25.08.2008) ద్వారా హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్  ప్రాంతంలో (రీజియన్)  ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ప్రణాళిక, సమన్వయ పరచడం, పర్యవేక్షించడం, ప్రోత్సహించడం కోసం ఇది ఏర్పాటు చేయబడింది. మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక అధికారులు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు, తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఇతర సంస్థల అభివృద్ధి కార్యకలాపాలను సమన్వయం ఈ సంస్థ చేస్తుంది.[3]

హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంత ప్రతిరూప పటం

అధికార పరిధి

[మార్చు]

హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాలను కలిగివుంది. ఇందులో 175 గ్రామాలు, 31 గ్రామాలతో కూడిన 12 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలు ఉన్నాయి.

క్రమసంఖ్య జిల్లా మండలాలు మొత్తం మండలాలు
1 హైదరాబాదు జిల్లా మొత్తం జిల్లా 16
2 మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా మొత్తం జిల్లా - ఘటకేసర్, శామీర్‌పేట, మేడ్చెల్, ఉప్పల్, కీసర, కుత్బుల్లాపూర్, మేడిపల్లి, బాచుపల్లి, దుండిగల్, కాప్రా, బాలానగర్, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, అల్వాల్ 14
3 రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, కందుకూర్, మహేశ్వరం, మంచాల్, మొయినాబాదు, రాజేంద్ర నగర్, సరూర్‌నగర్‌, షాబాద్, శంషాబాదు, శంకర్‌పల్లి, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, ఫరూఖ్‌నగర్, గండిపేట్, కొత్తూరు, నందిగామ, శేరిలింగపల్లి 20
4 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురం, సంగారెడ్డి, అమీనాపూర్, గుమ్మడిదల, జిన్నారం, కంది, హత్నూర 8
5 మెదక్ జిల్లా మనోహరబాద్, నర్సాపూర్, శివంపేట, తూఫ్రాన్ 4
6 సిద్ధిపేట జిల్లా మర్కూక్, ములుగు, వర్గల్ 3
7 యాదాద్రి జిల్లా బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి 5

నగరపాలక సంస్థలు

[మార్చు]

హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ క్రింది నగరపాలక సంస్థలు ఉన్నాయి.

  1. హైదరాబాదు మహానగరపాలక సంస్థ
  2. బోడుప్పల్ నగరపాలక సంస్థ
  3. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ
  4. నిజాంపేట నగరపాలక సంస్థ
  5. జవహర్‌నగర్ నగరపాలక సంస్థ
  6. బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ
  7. మీర్‌పేట నగరపాలక సంస్థ
  8. బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ

పురపాలక సంఘాలు

[మార్చు]

హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ క్రింది పురపాలక సంఘాలు ఉన్నాయి.

  1. సంగారెడ్డి పురపాలక సంఘం
  2. బొల్లారం పురపాలక సంఘం
  3. తెల్లాపూర్ పురపాలక సంఘం
  4. అమీన్‌పూర్ పురపాలక సంఘం
  5. భువనగిరి పురపాలక సంఘం
  6. చౌటుప్పల్ పురపాలక సంఘం
  7. పోచంపల్లి పురపాలక సంఘం
  8. మేడ్చల్ పురపాలక సంఘం
  9. దమ్మాయిగూడ పురపాలక సంఘం
  10. నాగారం పురపాలక సంఘం
  11. పోచారం పురపాలక సంఘం
  12. ఘట్ కేసర్ పురపాలక సంఘం
  13. గుండ్లపోచంపల్లి పురపాలక సంఘం
  14. తూమ్ కుంట పురపాలక సంఘం
  15. దుండిగల్ పురపాలక సంఘం
  16. కొంపల్లి పురపాలక సంఘం
  17. పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం
  18. ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం
  19. జల్​పల్లి పురపాలక సంఘం
  20. షాద్‌నగర్ పురపాలక సంఘం
  21. శంషాబాద్ పురపాలక సంఘం
  22. తుర్కయాంజల్ పురపాలక సంఘం
  23. ఆదిభట్ల పురపాలక సంఘం
  24. శంకర్‌పల్లి పురపాలక సంఘం
  25. తుక్కుగూడ పురపాలక సంఘం
  26. మణికొండ పురపాలక సంఘం
  27. నార్సింగ్ పురపాలక సంఘం
  28. నర్సాపూర్ పురపాలక సంఘం
  29. తూప్రాన్ పురపాలక సంఘం

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "About HMDA". Hyderabad Metropolitan Development Authority. Archived from the original on 2019-12-03. Retrieved 2020-10-03.
  2. 2.0 2.1 http://www.demographia.com/db-worldua.pdf
  3. "Home". Hyderabad Metropolitan Development Authority (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-11-24.