హైదరాబాద్ బుక్ ట్రస్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 1980 లో హైదరాబాదు కేంద్రంగా ప్రారంభించిన లాభాపేక్ష రహిత పుస్తక ప్రచురణ సంస్థ.[1][2] దీని స్థాపకుడు సి. కె. నారాయణ రెడ్డి. ఈ సంస్థలో ఇంకా ఎం. కె. ఖాన్, జి. మనోహర్, శాంతా సింహా, గీత రామస్వామి సభ్యులుగా ఉన్నారు.[3] అన్ని వర్గాల తెలుగు ప్రజల అభిరుచులనూ, సామాజిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని విశాల దృక్పథంతో పుస్తకాలు వెలువరించాలన్నది ఈ సంస్థ లక్ష్యం. ప్రతి సంవత్సరం విభిన్న అంశాలపై పది నుంచి ఇరవై పుస్తకాల దాకా ప్రచురిస్తున్నారు వీరు.

ఈ సంస్థ చాలావరకు స్వచ్ఛంద సేవకుల సహాయంతో నడుస్తున్నది. వీరు పుస్తకాలు చదవడం, సమీక్షించడం, దిద్దుబాట్లు చేయడం, ముఖ చిత్రాలు రూపొందించడం, ఇంకా ప్రచురణలో అవసరమైన ఇతరపనులు చేస్తుంటారు.

మూలాలు[మార్చు]

  1. Borah, Prabalika M (20 September 2012). "Positively GRITTY". The Hindu. Retrieved 19 April 2018.
  2. "Hyderabad Book Trust". tradeindia.com. Retrieved 19 April 2018.
  3. కె., శ్రీ సత్యవాణి (2013). తెలుగు వెలుగు: ఊరూ వాడా తిరిగి పుస్తకాలు అమ్మాను. హైదరాబాదు: రామోజీ ఫౌండేషన్. pp. 48, 49.