హైదరాబాద్ బ్రదర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాద్ బ్రదర్స్
Hyderabad Brothers.jpg
వ్యక్తిగత సమాచారం
జననంయాకుత్ పురా, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీత విద్వాంసులు, గాత్ర కళాకారులు, సంగీత ద్వయం

హైదరాబాద్ బ్రదర్స్‌గా ప్రఖ్యాతులైన డి.రాఘవాచారి, డి.శేషాచారి కర్ణాటక సంగీత గాన ద్వయం.[1] భారతీయ శాస్త్రీయ కర్ణాటక సంగీతంలో సుప్రసిద్ధులైన గాత్రకళాకారుల ద్వయాలలో హైదరాబాద్ సోదరులు కూడా ఒకరు.[2] నగరంతో వారికున్న అనుబంధం వల్ల కర్ణాటక సంగీతంలో హైదరాబాద్ బ్రదర్స్ లేదా హైదరాబాద్ సోదరులుగా ప్రాచుర్యం పొందారు.[2]

పరంపర[మార్చు]

రాఘవాచారి, శేషాచారి సంప్రదాయ సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందినవారు.[1] తండ్రి దరూర్ రత్నమాచార్యుల వద్ద వారు సరిగమలు నేర్చుకున్నారు. హైదరాబాద్ సోదరుల తల్లి దరూర్ సులోచనా దేవి కూడా కర్ణాటక సంగీత విద్వాంసురాలే.[1] తరచుగా శేషాచారి, రాఘవాచారిల తల్లిదండ్రులు సులోచనాదేవి, రత్నమాచార్యులు జంటగా యాదగిరిగుట్టలో సంగీత కచేరీలు చేసేవారు.[1] శేషాచారి, రాఘవాచారి కుటుంబం మొదట హయత్ నగర్కు చెందినది కాగా అనంతరకాలంలో కుటుంబం యాకుత్ పురాకు మారింది. అక్కడే శేషాచారి, రాఘవాచారి జన్మించారు.[1] రాఘవాచారి శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, హైదరాబాద్‌లో సంగీతానికి సంబంధించిన లోతులు, మెళకువలు సుసర్ల శివరాం శిష్యత్వంలో నేర్చుకున్నారు.[1][2]

పురస్కారాలు[మార్చు]

  1. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Ranee Kumar (19 January 2012). "At the pinnacle". The Hindu. Retrieved 8 May 2013.
  2. 2.0 2.1 2.2 Aruna Chandaraju (15 July 2012). "Music is food for the soul". Deccan Herald. Retrieved 8 May 2013.