హైదరాబాదు మహానగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
(హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ
GHMC Logo.jpg
రకం
రకం
నగర పాలక సంస్థ
చరిత్ర
స్థాపితం1869[1]
నాయకత్వం
మేయర్
డిప్యూటి మేయర్
బాబా ఫసి ఉద్దీన్
(తెలంగాణ రాష్ట్ర సమితి)
మున్సిపల్ కమీషనర్
బి. జనార్థన్ రెడ్డి
నిర్మాణం
సీట్లు 150
రాజకీయ వర్గాలు
తెలంగాణ రాష్ట్ర సమితి (99)
ఎ.ఐ.ఎం.ఐ.ఎం (44)
భారతీయ జనతా పార్టీ (04)
భారత జాతీయ కాంగ్రెస్ (02)
తెలుగుదేశం పార్టీ (01)
నినాదం
On Mission Tomorrow
సమావేశ స్థలం
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ భవనం
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జి.హెచ్.ఎం.సి.) హైదరాబాద్, సికింద్రాబాద్ లోని ప్రజల అవసరాలను తీర్చడంకోసం ఏర్పడిన సంస్థ. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉంది. దీనిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) నిర్వహిస్తుంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 64 (ఎక్స్ అఫీషియల్) సభ్యులు, 5గురు లోకసభ ఎంపీలు జిహెచ్ఎంసి అధికారక ఎన్నికలలో పాల్గొంటారు.[2][3][4].1951 నుంచి 1954 వరకు హైదరాబాద్‌ కార్పొరేషన్‌కు మాడపాటి హనుమంతరావు తొలి మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్ బొంతురామ్మోహన్.

చరిత్ర[మార్చు]

హైదరాబాదు మహానగరపాలక సంస్థ

నిజాం ప్రభుత్వం 1869లో మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. హైదరాబాద్‌, ఛాదర్‌ఘాట్‌ను రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు.అప్పట్లో హైదరాబాద్‌లో నాలుగు, ఛాదర్‌ఘాట్‌లో ఐదు డివిజన్లు ఉండేవి.1886లో ఛాదర్‌ఘాట్‌ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మార్పు చేశారు.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్‌ మున్సిపాలిటీలో 3.5లక్షల జనాభా మాత్రమే ఉండేవారు.1921లో హైదరాబాద్‌ 84చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా కూడా అధిక శాతం పెరిగింది.ఈ నేపథ్యంలో 1933లో ఛాదర్‌ఘాట్‌ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు చేశారు. 1934లో తొలిసారి ఈ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు.1937లో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్ని కలిపి జూబ్లీహిల్స్‌ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి,1942లో హైదరాబాద్‌ మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్‌ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 1950లో సికింద్రాబాద్‌కు కార్పొరేషన్‌ హోదా కల్పించడంతోపాటు జూబ్లీహిల్స్‌ మున్సిపాలిటీని హైదరాబాద్‌ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్‌ హోదా కల్పించారు.1955లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ద్వారా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ మున్సిపాలిటీలను కలిపేసి ‘మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎంసీహెచ్‌)’గా మార్చారు.

జనాభా గణాంకాలు[మార్చు]

అవార్డులు[మార్చు]

ఎగ్జిక్యూటివ్[మార్చు]

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మొట్టమొదటి ముఖ్య కమీషనర్ గా సి.వి.ఎస్.కె. శర్మని నియమించింది.

2016 జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో వివిధ పార్టీల ఫలితాలు[మార్చు]

క్రమసంఖ్య పార్టీపేరు జండా కూటమి కార్పొరేటర్ల సంఖ్య Change
01 తెలంగాణ రాష్ట్ర సమితి TRS Flag.svg - 99 99 (పెరుగుదల)
02 ఎ.ఐ.ఎం.ఐ.ఎం Indian Election Symbol Kite.svg - 44 1 (పెరుగుదల)
03 భారతీయ జనతా పార్టీ

BJP election symbol.svg -783x768.png

ఎన్.డి.ఎ. 04 1 (పెరుగుదల)
04 భారత జాతీయ కాంగ్రెస్ Hand INC.svg యు.పి.ఎ. 02 50 (తగ్గుదల)
05 తెలుగుదేశం పార్టీ Indian Election Symbol Cycle.png ఎన్.డి.ఎ. 01 44 (తగ్గుదల)

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-01-01. Retrieved 2017-01-11.
  2. "GHMC poll fray 2016".
  3. "GHMC in dilemma over ex-officio members".
  4. http://www.sakshipost.com/index.php/news/politics/72601-here-are-the-50-ex-officio-members-eligible-to-vote-in-ghmc-mayor-election.html[permanent dead link]

ఇవి కూడా చూడండి[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]