హైదరాబాద్ మేయర్ల జాబితా
హైదరాబాదు మేయర్ | |
---|---|
అధికారిక నివాసం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
ప్రారంభ హోల్డర్ | మాడపాటి హనుమంతరావు |
నిర్మాణం | 1951 |
హైదరాబాద్ మేయర్, హైదరాబాదు మహానగరపాలక సంస్థకు మేయర్.
పద వివరణ
[మార్చు]నగర పాలక సంఘంలకు, పట్టణ పురపాలక సంఘంలకు ఎన్నికలు ముగిసిన తరువాత, ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశంలో, కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారు, వారిలోని ఒకరిని అధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని మేయర్ లేదా నగర మేయర్ అంటారు.[1]
జిహెచ్ఎంసి ఏర్పాటు
[మార్చు]నిజాం ప్రభుత్వం 1869లో మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చి, హైదరాబాద్, ఛాదర్‌ఘాట్‌ను రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఈ రెండింటిని కలిపి 1933లో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు. 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలిపేసి ‘మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)’గా మార్చారు.
2007, ఏప్రిల్ 16న రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు (ఎల్.బి. నగర్, గడ్డి అన్నారం, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కాప్రా, అల్వాల్, కుతుబుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు) 8 గ్రామ పంచాయతీలు (శంషాబాద్, సతమరై, జల్లపల్లి, మమిడిపల్లి, మఖ్తల్, అల్మాస్ గూడా, సర్దానగర్, రావిరాల) హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో విలీనం చేయడం ద్వారా హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఏర్పడింది.
2005జూలై లో ప్రభుత్వ ఉత్తర్వు (జి.ఓ) 261 జారీ చేయగా, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్న అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటుకు సంబంధించిన జి.ఓ. నెంబరు 261 ను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007, ఏప్రిల్ 16న ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం 2019లో హైదరాబాదు మహానగరపాలక సంస్థను ఆరు మండలాలుగా (దక్షిణ, తూర్పు, ఉత్తర, ఈశాన్య, పశ్చిమ, మధ్య మండలాలు), 150 వార్డులుగా విభజించింది.[2][3]
జాబితా
[మార్చు]పేరు | పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు | పార్టీ | మూలాలు |
---|---|---|---|---|
హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ (ఎంసిహెచ్) | ||||
మాడపాటి హనుమంతరావు | 1951 | 1954 | ఆంధ్ర మహాసభ | |
ధరణీధర్ సంఘీ | 1954 | 1955 | ||
షాబుద్ధీన్ అహ్మద్ ఖాన్ | 1955 | 1956 | ||
కిషన్ లాల్ | 1956 | 1958 | ||
కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ | 1958 | 1959 | భారత జాతీయ కాంగ్రెస్ | [4][5][6][7] |
రోషన్ ఆలీఖాన్ | 1959 | 1960 | ||
వేదప్రకాష్ దోషజ్ | 1960 | 1961 | ||
రామూర్తి నాయుడు | 1961 | 1962 | ||
రాణి కుముదిని దేవి | 1962 | 1963 | భారత జాతీయ కాంగ్రెస్ | మొదటి మహిళా మేయర్ |
బనారస్‌లాల్ గుప్తా | 1963 | 1964 | ||
ఎంఆర్ శ్యామ్‌రావు | 1964 | 1965 | ||
సరోజినీ పుల్లారెడ్డి | 1965 | 1966 | భారత జాతీయ కాంగ్రెస్ | |
అక్బర్ ఆలీ అన్నారీ | 1966 | 1968 | ||
కె. కొండారెడ్డి | 1968 | 1969 | ||
ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్ | 1969 | 1970 | భారత జాతీయ కాంగ్రెస్ | [8] |
1971 | 1975 | |||
అత్యవసర పరిస్థితి కారణంగా ఖాళీగా ఉంది (1976-1977) | ||||
1977 | 1981 | |||
1982 | 1986 | |||
కె. ప్రకాష్ రావు | 1986 | 1987 | ఏఐఎంఐఎం | [9] |
ఎంకే మోబీస్ | 1987 | 1988 | ||
అనుముల సత్యనారాయణ | 1988 | 1989 | ఏఐఎంఐఎం | |
అలంపల్లి పోచయ్య | 1989 | 1991 | ఏఐఎంఐఎం | |
జుల్ఫికర్ అలీ | 1991 | 1995 | ఏఐఎంఐఎం | |
ఎండి మోబీన్ | 1995 | 1999 | ఏఐఎంఐఎం | |
ఎన్నికలు జరగలేదు (1999-2002) | ||||
తీగల కృష్ణారెడ్డి | 2002 | 2007 | తెలుగుదేశం పార్టీ | |
ఎన్నికలు జరగలేదు (2007- 2009) | ||||
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) మేయర్ | ||||
బండా కార్తీకరెడ్డి | 2009 | 2012 | భారత జాతీయ కాంగ్రెస్ | |
మహమ్మద్ మాజిద్ హుస్సేన్ | 2012 | 2014 | ఏఐఎంఐఎం | |
ఎన్నికలు జరగలేదు (2014-2016) | ||||
బొంతు రామ్మోహన్ | 2016 ఫిబ్రవరి 11 | 2021 ఫిబ్రవరి 10 | తెలంగాణ రాష్ట్ర సమితి | [10] |
గద్వాల విజయలక్ష్మి | 2021 ఫిబ్రవరి 11 | ప్రస్తుతం | తెలంగాణ రాష్ట్ర సమితి |
మూలాలు
[మార్చు]- ↑ "ఎన్నికైన పురపాలక సంఘం ప్రతినిధుల శిక్షణా కరదీపిక| (1.13.1 (పేజి సంఖ్య.42" (PDF). Archived from the original (PDF) on 2021-04-21. Retrieved 2020-12-01.
- ↑ "Sixth zone created in GHMC". The Hindu. Special Correspondent. 2018-05-11. ISSN 0971-751X. Retrieved 2020-12-01.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ Reporter, Staff (2017-05-26). "GHMC's new circles to be established by June 1". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-01.
- ↑ "KCR thanked for gesture - The Hindu". The Hindu. thehindu.com. 4 September 2015. Retrieved 2020-12-01.
- ↑ "The champion of Bahujana emancipation - The Hans India". thehansindia.com. 25 August 2016. Retrieved 2020-12-01.
- ↑ "Mudiraj – a multi-faceted personality". The Hindu. 12 August 2012 – via www.thehindu.com.
- ↑ Thomas, A.F. "About Krishna Swamy Mudiraj". Krishnaswamy Mudiraj Memorial Trust. Archived from the original on 6 July 2019. Retrieved 2020-12-01.
- ↑ Singh, T. lalith (2015-03-04). "Former Hyderabad mayor Laxminarayan Mudiraj dead". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-01.
- ↑ Mohammed, Syed (21 January 2016). "Can MIM create Dalit-Muslim magic? | Hyderabad News". The Times of India. Retrieved 2020-12-01.
- ↑ S, Rohit P. (2016-02-12). "Bonthu Rammohan of TRS named Hyderabad Mayor". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-01.