హైపర్‌గ్లైసీమియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైపర్‌గ్లైసీమియా
వర్గీకరణ & బయటి వనరులు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 6234
MeSH {{{m:en:MeshID}}}

హైపర్‌గ్లైసీమియా (ఆంగ్లం: Hyperglycemia), లేదా రక్తంలో అధిక చక్కెర నిల్వలు అనేది రక్తంలోని ప్లాస్మాలో ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ ప్రసరణ కావడమనే ఒక పరిస్థితి. ఈ రకమైన పరిస్థితి సాధారణంగా గ్లూకోజ్ స్థాయి 10 mmol/l (180 mg/dl) కంటే ఎక్కువైనప్పుడు చోటు చేసుకుంటుంది, అయితే, గమనించదగిన రీతిలో ఈ రకమైన సమస్యలో గ్లూకోజ్ స్థాయిలు 15-20 mmol/l (270-360 mg/dl) కంటే ఎక్కువైతే తప్ప రుగ్మతకు సంబంధించిన లక్షణాలు ప్రారంభం కాకపోవచ్చు. అయినప్పటికీ, దీర్ఘకాలిక స్థాయిలు 7 mmol/l (125 mg/dl) మించితే అవయవ నష్టం ఏర్పడే అవకాశముంది.

ఈ పదానికి మూలం గ్రీకు నుంచి వచ్చింది: హైపర్- , అనగా అర్థం అధికమైన ; -గ్లైక్- , అనగా అర్థం తీపి; మరియు -ఎమియా , అనగా అర్థం "రక్తం యొక్క".

నిర్వచనం[మార్చు]

గ్లూకోజ్ స్థాయిలను లెక్కకట్టడమనేది రెండు రకాలుగా ఉంటుంది:

 1. ప్రతీ డెసీలీటర్‌కు మిల్లీగ్రామ్ (mg/dl), యునైటెడ్ స్టేట్స్‌తో సహా ఇతర దేశాల్లో (ఉదాహరణకు జపాన్, ఫ్రాన్స్, ఈజిప్ట్, కొలంబియా)లలో ఈ రకంగా లెక్కిస్తారు; లేదా
 2. ప్రతి లీటరులో మిల్లీమోల్స్ (mmol/l), 18 యొక్క కారకం ద్వారా విభజించడం (mg/dl) ద్వారా దీన్ని సాధించవచ్చు.[1]

శాస్త్రీయ సంబంధ పత్రికలు mmol/l ఉపయోగించే దిశగా అడుగులు వేస్తున్నాయి; కొన్ని పత్రికలు ప్రస్తుతం mmol/lను ప్రాథమిక యూనిట్‌గా తీసుకున్నప్పటికీ, ఆధారాల్లో మాత్రం mg/dl అని చూపుతున్నాయి.[2]

గ్లూకోజ్ స్థాయిలనేవి భోజనానికి ముందు మరియు తర్వాత, అలాగే రోజులోని వివిధ సమయాల్లో వేర్వేరుగా ఉంటాయి; "సాధారణ" అనే నిర్వచనం సైతం వైద్య నిపుణులను బట్టి మారుతుంటుంది. సాధారణంగా మాత్రం చాలామంది (ఆకలితో ఉండే పెద్దవారు) విషయంలో ఇది 80 నుంచి 110 mg/dl లేదా 4 నుంచి 6 mmol/lగా ఉంటుంది. మొత్తంమీద స్థిరమైన స్థాయిలో 126 mg/dl లేదా 7 mmol/l పైబడి ఉండడమనేది సాధారణంగా హైపర్‌గ్లైసీమియా కలిగి ఉన్నట్టుగా పరిగణించబడుతుంది, అదేసమయంలో స్థిరమైన రీతిలో 70 mg/dl లేదా 4 mmol/l కంటే దిగువన ఉండడం హైపర్‌గ్లైసెమిక్‌గా చెప్పబడుతుంది. ఆకలితో ఉన్న పెద్దవారిలో, రక్తంలోని ప్లాస్మా గ్లూకోజ్ 300 mg/dl కంటే ఎక్కువ కాకూడదు. రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉండడమనేది రక్త నాళాలను దెబ్బతీసేందుకు కారణం కావడంతో పాటు అవి రక్తాన్ని సరఫరా చేసే అవయవాలు సైతం నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది, మొత్తంమీద ఈ పరిస్థితి మధుమేహానికి సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది.

దీర్ఘకాలిక హైపర్‌గ్లైసీమియాను HbA1c పరీక్ష ద్వారా లెక్కగట్టవచ్చు. mmol/l స్థాయిలు 8 నుంచి 15 వరకు ఉండడాన్ని అధ్యయనం చేయడం ద్వారా తీవ్రమైన హైపర్‌గ్లైసీమియా యొక్క నిర్వచనం అనేది వివిధ రకాలుగా ఉంటుంది.[3]

సంకేతాలు మరియు లక్షణాలు[మార్చు]

తాత్కాలిక హైపర్‌గ్లైసీమియా అనేది తరచూ ఎలాంటి ఇబ్బందినీ కలిగించకపోవడంతో పాటు ఏవిధమైన లక్షణాలను సైతం చూపించదు. కొన్నిసార్లు ఎలాంటి ప్రభావాలు లేదా లక్షణాలను చూపకుండానే నిర్థిష్ట కాలాల్లో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థాయికి మించి గణనీయంగా పెరగగలవు. అయినప్పటికీ, దీర్ఘకాలిక హైపర్‌గ్లైసీమియా స్థాయిలు సాధారణం కంటే కొంచెం ఎక్కువైనా సరే, కొన్నేళ్ల కాలంలో విభిన్న రకాల రుగ్మతలకు కారణం కాగలదు, మూత్రపిండాల వైఫల్యం, నాడీ సంబంధిత వైఫల్యం, హృదయ సంబంధిత సమస్యలతో పాటు రెటినాకు నష్టం లాంటివన్నీ ఇందులో భాగంగా చోటు చేసుకుంటాయి.

ఈ రకమైన దీర్ఘకాలిక రుగ్మతలను నివారించడం కోసం డయాబెటిస్ మిల్లిటస్ (సర్వసాధారణంగా ఈ పరిస్థితికి దీర్ఘకాలిక హైపర్‌గ్లైసీమియా కారణమవుతుంది.)లో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని వీలైనంత వరకు సాధారణ స్థాయికి దగ్గరగా ఉండేలా చూడడమే లక్ష్యంగా చికిత్స సాగుతుంది.

తీవ్రమైన హైపర్‌గ్లైసీమియా కారణంగా గ్లూకోజ్ స్థాయిలు అత్యధిక స్థాయికి చేరుకోవడమనేది వైద్యపరమైన అత్యవసర స్థితికి దారితీయడంతో పాటు వివిధ రకాల తీవ్రమైన రుగ్మతలకు దారితీస్తుంది (ఆస్మాటిక్ డయూరిసిస్ ద్వారా ద్రవ నష్టం చోటు చేసుకోవడం లాంటివి ఇందులో భాగంగా చోటుచేసుకుంటాయి). మితిమీరిన స్థాయిలో ఇన్సులిన్‌పై ఆధారపడిన మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఈ రకమైన పరిస్థితి తరచూ కనిపిస్తూ ఉంటుంది.

కింది పేర్కొన్న లక్షణాలనేవి తీవ్రమైన లేదా దీర్ఘకాలిక హైపర్‌గ్లైసీమియాతో సంబంధం కలిగినవై ఉండవచ్చు, ఇందులోని మొదటి మూడింటిని ప్రధానమైన హైపర్‌గ్లైసీమియా త్రయంగా పేర్కొంటారు:

 • పాలీఫాగియా - తరచూ ఆకలి, ప్రత్యేకించి ఆకలిని వ్యక్తపరుస్తుంటారు
 • పాలీడిప్సియా - తరచుగా దప్పిక, ప్రత్యేకించి అధిక దప్పిక
 • పాలీయూరియా - తరచూ మూత్రవిసర్జన
 • అస్పష్టమైన దృష్టి
 • అలసట (నిద్రలేమి).
 • బరువు తగ్గడం
 • గాయం స్వస్థతలో సమస్యలు (తెగడం, కోతలు, మొదలుగునవి.)
 • ఎండిపోయిన నోరు
 • పొడిబారిన లేదా దురదతో నిండిన చర్మం
 • పాదాలు లేదా మడమల్లో జలదరింపు
 • అంగస్థంభన సమస్యలు
 • పునరావృత సంక్రమణలు బాహ్య చెవి వ్యాధులు (ఈతగాళ్ల చెవి)
 • అసాధారణ స్థాయిలో గుండె కండరాల సంకోచం
 • మగత
 • కోమా

ఇతర లక్షణాలేవీ లేకుండా తరచూ ఆకలివేస్తుండడమనేది రక్తంలోని గ్లూజోజ్ స్థాయిలు బాగా తక్కువగా ఉన్నాయనే విషయాన్ని సూచించగలవు. తాము తీసుకున్న ఆహారంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో నోటి ద్వారా హైపోగ్లైసీమిక్ ఔషధాలు లేదా ఇన్సులిన్ తీసుకున్న మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఈ రకమైన పరిస్థితి కనిపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణం కంటే తక్కువ చేరడం వల్ల వెంటనే ఆకలి రూపంలో ప్రతిస్పందన వెలువడుతుంది. ప్రత్యేకించి జువనైల్ ఆన్‌సెట్ రూపంలో టైప్ I మధుమేహంలో ఈ రకమైన ఆకలి సాధారణంగా కనపించదు, అయితే, నోటి ద్వారా తీసుకునే హైపోగ్లైసీమిక్ ఔషధాలను ఉపయోగించని పక్షంలో దీన్ని నిర్వహించడం కష్టం కాగలదు.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అత్యధిక స్థాయికి చేరిన సమయంలో పాలీడిప్సియా మరియు పాలీయూరియాలు చోటు చేసుకుంటాయి, తత్ఫలితంగా ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల (గ్లైకోసూరియా) ద్వారా విసర్జితం కావడం వల్ల ఆస్మాటిక్ డైయూరిసిస్ (అతిమూత్ర వ్యాధి)కి దారితీస్తుంది.

డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌ రుగ్మతలో కింద పేర్కొన్న లక్షణాలు చోటు చేసుకోవచ్చు:

 • కీటోయాసిడోసిస్
 • కుస్‌మౌల్ హైపర్‌వెంటిలేషన్: లోతుగానూ, వేగంగానూ శ్వాసించడం
 • తికమక లేదా స్మారకస్థితి తక్కువ స్థాయిలో ఉండడం
 • గ్లైకోసూరియా మరియు ఆస్మాటిక్ డైయూరిసిస్ కారణంగా నిర్జలీకరణం
 • తీవ్రమైన ఆకలి మరియు/లేదా దాహం
 • శ్వాసలో 'మగ్గిన పండ్ల' వాసన వెలువడడం
 • దుఃఖపూరిత స్థితి పెరగడం మరియు ఆందోళనతో పాటుగా జ్ఞాపకశక్తి సంబంధిత చర్యల్లో అసక్తత[4][5]

కారణాలు[మార్చు]

డయాబెటిస్ మెల్లిటస్[మార్చు]

ఆకలితో ఉన్న సమయాల్లోనూ దీర్ఘకాలిక హైపర్‌గ్లైసీమియా అంటిపెట్టుకుని ఉండడానికి డయాబెటిస్ మెల్లిటస్ అత్యంత సాధారణ కారణంగా నిలవడంతో పాటు నిజానికి దీర్ఘకాలిక హైపర్‌గ్లైసీమియా అనేది వ్యాధికి సంబంధించిన నిర్వచించబడిన లక్షణంగా నిలుస్తుంది. చిన్నపాటి విరామాలతో సంభవించే హైపర్‌గ్లైసీమియా అనేది మధుమేహం శరీరంలో తిష్టవేయడానికి ముందు సంభవించే అవకాశముంది. అలాగే ప్రత్యక్షమైన కారణం లేకుండానే హైపర్‌గ్లైసీమియా యొక్క తీవ్రమైన లక్షణాలు కన్పించడమనేది వృద్ధి చెందుతున్న మధుమేహం లేదా వ్యాధికి సంబంధించిన సన్నద్ధతకు సూచనగా ఉండే అవకాశముంది.

డయాబెటిస్ మెల్లిటస్‌లో రకం మరియు వ్యాధి పరిస్థితిపై ఆధారపడి హైపర్‌గ్లైసీమియాకు తక్కువ ఇన్సులిన్ స్థాయిలు (డయాబెటిస్ మెల్లిటస్ రకం 1) మరియు/లేదా కణ స్థాయిలో ఇన్సులిన్‌కు నిరోధకం (డయాబెటిస్ మెల్లిటస్ రకం 2) లాంటివి కారణమవుతాయి. తక్కువ ఇన్సులిన్ స్థాయిలు మరియు/లేదా ఇన్సులిన్ నిరోధకత అనేది శరీరం గ్లూకోజ్‌ని గ్లైకోజన్‌గా మార్చే విధానానికి అడ్డు తగులుతుంది (దీనివల్ల పిండిపదార్థం లాంటి శక్తి చాలావరకు కాలేయంలో పోగుపడుతుంది), దీంతో రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్‌ని తొలగించడమనే ప్రక్రియ కష్టతరంగానూ లేదా అసాధ్యంగానూ మారుతుంది. శరీరంలో సాధారణ గ్లూకోజ్ స్థాయిలు ఉన్నట్టైతే, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే రక్తంలో ఉండే గ్లూకోజ్ నిల్వ ద్వారా శరీరానికి కేవలం 20-30 నిమిషాలకు సరిపడే శక్తిని మాత్రమే అందగలదు, దీన్నిబట్టి శరీరం యొక్క అంతర్గత నియంత్రణ వ్యవస్థ అనేది గ్లూకోజ్ స్థాయిలను కచ్చితమైన స్థితివద్ద నిర్వహిస్తుందనే విషయం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో శరీరంలో అంతర్గతంగా ఉండే ఈ వ్యవస్థ విఫలమైనట్టైతే, శరీరంలో గ్లూకోజ్ అసాధారణ స్థాయిలకు చేరడంతో పాటు ఫలితంగా అది హైపర్‌గ్లైసీమియాకు దారితీస్తుంది.

ఔషధాలు[మార్చు]

బీటా బ్లాకర్‌లు, ఎపినెఫ్రిన్, థియాజిడ్ డైయూరిటిక్‌లు, కార్టికోస్టెరాయిడ్‌లు, నియాసిన్, పెంటామిడిన్, ప్రోటీస్ ఇన్‌హిబిటర్లు, L-యాస్పర్‌జెన్స్,[6] మరియు కొన్ని యాంటీసైకోటిక్ కారకాలతో సహా కొన్ని నిర్దిష్ట ఔషధాలు హైపర్‌గ్లైసీమియా ప్రమాదాన్ని అధికం చేస్తాయి.[7] యాంఫెటమైన్ లాంటి ఉత్ప్రేరకాలు యొక్క తీవ్రమైన నిర్వహణ అనేది హైపర్‌గ్లైసీమియాను ఉత్పత్తి చేస్తుంది; అయితే, దీర్ఘకాలిక ఉపయోగమనేది హైపోగ్లైసీమియాను ఉత్పత్తి చేస్తుంది. జైప్రెక్సా, మరియు సైంబాల్టా లాంటి కొన్ని నవీన, ద్వి చర్య యాంటీ-డిప్రెషెంట్లు సైతం స్పష్టమైన హైపర్‌గ్లైసీమియాకు కారణం కాగలదు.

క్లిష్టమైన అనారోగ్యం[మార్చు]

గుండెపోటు లేదా మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ లాంటి తీవ్రమైన ఒత్తిడితో బాధపడే ఎక్కువ శాతం రోగుల్లో హైపర్‌గ్లైసీమియా వృద్ధి చెందే అవకాశముంది, అలాగే మధుమేహం సమస్యను గుర్తించకపోవడం జరిగినప్పుడు సైతం ఈ పరిస్థితి చోటుచేసుకుంటుంది. ఇది అంత సౌమ్యమైనది కాదని మానవ మరియు జంతు సంబంధిత అధ్యయనాలు సూచిస్తుండడంతో పాటు ఈ రకమైన ఒత్తిడి అనేది హైపర్‌గ్లైసీమియాతో పాటుగా గుండెపోటు మరియు మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ అనంతరం మరణాలు సంభవించే ప్రమాదాన్ని కూడా ప్రేరేపిస్తుంది.[8]

మధుమేహం లేని స్థితిలో ప్లాస్మా గ్లూకోజ్ >120 mg/dlగా ఉండడమనేది సెప్సిస్‌కు సంబంధించిన వైద్యపరమైన సంకేతంగా నిలుస్తుంది.

భౌతిక గాయం, శస్త్రచికిత్స మరియు అనేక రూపాల్లో ఉండే తీవ్రమైన ఒత్తిడి లాంటివి తాత్కాలికంగా గ్లూకోజ్ స్థాయిలను పెంచగలవు.

మానసిక ఒత్తిడి[మార్చు]

ఇన్ఫెక్షన్ మరియు వాపు లాంటి సమయాల్లో సహజంగానే హైపర్‌గ్లైసీమియా చోటుచేసుకుంటుంది. శరీరం ఒత్తిడికి గురైన సమయంలో, ఎండోజీనియస్ కేట్‌కోలమైన్లు విడుదల కావడంతో పాటు ఇతర అంశాలు కలిసి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరిగేందుకు కారణమవుతాయి. గ్లూకోజ్ స్థాయిలు పెరగడమనేది వ్యక్తి నుంచి వ్యక్తికి మరియు తాపజనక ప్రతిస్పందన నుంచి ప్రతిస్పందనకు వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైనా రోగి ఏకకాలంలో హైపర్‌గ్లైసీమియాతో పాటుగా ఏదోఒక జబ్బుతో సతమతమవుతుంటే తప్ప మొదటి దశ హైపర్‌గ్లైసీమియా కారణంగా ఏరోగి విషయంలోనూ వెనువెంటనే మధుమేహం ఉన్నట్టుగా గుర్తించడం జరగదు. అటుపై పరీక్షల్లో భాగంగా, ఆకలితో ఉన్నప్పుడు ప్లాస్మా గ్లూకోజ్, క్రమరహిత ప్లాస్మా గ్లూకోజ్, లేదా భోజనం అనంతరం రెండు గంటల తర్వాత ప్లాస్మా గ్లూకోజ్ స్థాయి లాంటి వాటిని తప్పక పరీక్షిస్తారు.

చికిత్స[మార్చు]

హైపర్‌గ్లైసీమియాకు చికిత్స అనేది గుర్తించిన కారణాన్ని తొలగించడంపై ఆధారపడి ఉంటుంది, ఉదాహరణ కు ఈ సమస్యకు కారణం మధుమేహం అయితే దానికి చికిత్స చేయాల్సి ఉంటుంది. చాలా కేసుల్లో తీవ్రమైన హైపర్‌గ్లైసీమియాకు నేరుగా ఇన్సులిన్‌ను ఇవ్వడం ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. మరికొన్నిసార్లు నోటి ద్వారా తీసుకునే హైపోగ్లైసెమిక్ థెరపీ మరియు జీవనశైలి మార్పు ద్వారా తీవ్రమైన హైపర్‌గ్లైసీమియాకు చికిత్స చేయవచ్చు.[9]

చిక్కులు[మార్చు]

సరైన సమయంలో చికిత్స చేయకుంటే హైపర్‌గ్లైసీమియా అనేది తీవ్రమైన సమస్యగా పరిణమించగలదు. హైపర్‌గ్లైసీమియాకు చికిత్స చేయడంలో విఫలమైనట్టైతే, కెటోయాసిడోసిస్ అనే పరిస్థితి చోటు చేసుకుంటుంది. శరీరంలో చాలినంత ఇన్సులిన్ లేని సమయంలో కెటోయాసిడోసిస్ వృద్ధి చెందుతుంది. ఇన్సులిన్ లేనట్టైతే, ఇంధనం కోసం శరీరం గ్లూకోజ్‌ని ఉపయోగించుకునే సమర్థతను కోల్పోతుంది, తత్ఫలితంగా శరీరం తనకు అవసరమైన శక్తి కోసం కొవ్వులను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది.

శరీరం కొవ్వులను విచ్ఛిన్నం చేసే సమయంలో కీటోన్స్ అని పిలవబడే వ్యర్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. భారీ సంఖ్యలో పోగుపడిన కీటోన్లని శరీరం భరించలేదు కాబట్టి మూత్రం ద్వారా వాటిని తొలగించేందుకు శరీరం ప్రయత్నిస్తుంది. అయితే, ఈ ప్రయత్నంలో సైతం శరీరం మొత్తం కీటోన్లని శరీరం నుంచి తొలగించలేక పోవడం వల్ల అవి రక్త ప్రవాహంలో పోగుపడి చివరకు కీటోయాసిడోసిస్ పరిస్థితికి దారితీస్తుంది.

కీటోయాసిడోసిస్ అనేది ప్రాణ హాని తలపెట్టగల పరిస్థితి కావడం వల్ల వెనువెంటనే చికిత్స అవసరమవుతుంది. స్వల్ప స్థాయిలో శ్వాసక్రియ, శ్వాసలో పండ్ల వాసన రావడం, వికారం మరియు వాంతి మరియు పూర్తిగా ఎండిపోయిన నోరు లాంటి లక్షణాలు ఈ స్థితిలో చోటు చేసుకుంటాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • హైపోగ్లైసీమియా
 • మధుమేహం
 • ప్రీడయాబెటస్

సూచనలు[మార్చు]

 1. రక్తంలోని గ్లూకోజ్ పరివర్తకం-mg/dl నుంచి mmol/L మరియు మధమేహంతో ఉన్న వైస్-వెర్సా పిల్లలు
 2. mg/dl మరియు mmol/l? అంటే ఏమిటిపరివర్తకం చేయడం ఎలా?
 3. Giugliano D, Marfella R, Coppola L; et al. (1997). "Vascular effects of acute hyperglycemia in humans are reversed by L-arginine. Evidence for reduced availability of nitric oxide during hyperglycemia". Circulation. 95 (7): 1783–90. PMID 9107164. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 4. Pais I, Hallschmid M, Jauch-Chara K; et al. (2007). "Mood and cognitive functions during acute euglycaemia and mild hyperglycaemia in type 2 diabetic patients". Exp. Clin. Endocrinol. Diabetes. 115 (1): 42–6. doi:10.1055/s-2007-957348. PMID 17286234. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 5. Sommerfield AJ, Deary IJ, Frier BM (2004). "Acute hyperglycemia alters mood state and impairs cognitive performance in people with type 2 diabetes". Diabetes Care. 27 (10): 2335–40. doi:10.2337/diacare.27.10.2335. PMID 15451897.CS1 maint: multiple names: authors list (link)
 6. Cetin M, Yetgin S, Kara A; et al. (1994). "Hyperglycemia, ketoacidosis and other complications of L-asparaginase in children with acute lymphoblastic leukemia". J Med. 25 (3–4): 219–29. PMID 7996065. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 7. Luna B, Feinglos MN (2001). "Drug-induced hyperglycemia". JAMA. 286 (16): 1945–8. doi:10.1001/jama.286.16.1945. PMID 11667913.
 8. Capes SE, Hunt D, Malmberg K, Pathak P, Gerstein HC (2001). "Stress hyperglycemia and prognosis of stroke in nondiabetic and diabetic patients: a systematic overview". Stroke. 32 (10): 2426–32. doi:10.1161/hs1001.096194. PMID 11588337.CS1 maint: multiple names: authors list (link)
 9. Ron Walls MD; John J. Ratey MD; Robert I. Simon MD (2009). Rosen's Emergency Medicine: Expert Consult Premium Edition - Enhanced Online Features and Print (Rosen's Emergency Medicine: Concepts & Clinical Practice (2v.)). St. Louis: Mosby. ISBN 0-323-05472-2.CS1 maint: multiple names: authors list (link)

బాహ్య లింకులు[మార్చు]