హైపర్‌ లిపిడెమియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హైపర్ లిపిడేమియా
Classification and external resources
Hyperlipidaemia - lipid in EDTA tube.jpg
A 4mL sample of hyperlipidemic blood with lipids separated into the top fraction. (Sample is in an EDTA collection tube.)
ICD-10 E78
ICD-9 272.0-272.4
DiseasesDB 6255
MeSH D006949

హైపర్‌లిపిడెమియా , హైపర్‌లిపోప్రొటీనెమియా , లేదా హైపర్‌లిపిడామియా (బ్రిటిష్‌ ఇంగ్లిష్‌) అనేది రక్తంలో ఏదో ఒక, లేదా అన్ని రకాల కొవ్వులు, మరియు/లేదా లైపోప్రొటీన్ల స్థాయిలో పెరుగుదల మూలంగా తలెత్తే అసాధారణ పరిస్థితి. (ఉదహరింపు పొరపాటు: Closing </ref> missing for <ref> tag లేదా అక్వైర్డ్‌ (సెకండరీగా కూడా పిలుస్తారుస్త్ర) ఇతర అంతర్గత వ్యాధుల వల్ల వచ్చేవిగా వర్గీకరిస్తారు.[1] అక్వైర్డ్‌ తరహా వ్యాధి ప్లాస్మా లిపిడ్‌, లైపోప్రొటీన్‌ జీవక్రియల్లో మార్పుచేర్పుల వల్ల వస్తుంది.[1] పైగా హైపర్‌లెపిడెమియా ఇడియోపథిక్‌, అంటే, తెలియని కారణం వల్ల సోకేది కూడా కావచ్చు.

హైపర్‌లిపిడెమియాలను నేరుగా లిపిడ్‌లను ఎలివేట్‌ చేసిన తరహాల్లోకి కూడా వర్గీకరించవచ్చు. అంటే హైపర్‌కొలెస్ట్రోలెమియా, హైపర్‌ట్రైగ్లిజరిడెమియా, లేదా రెండూ కలిసి హైపర్‌లిపిడెమియాగా చెప్పవచ్చు. లోపోప్రొటీన్‌ల ఎలివేటెడ్‌ స్థాయిలను కూడా హైపర్‌లెపిడెమియాలో ఒక రకంగా చెప్పుకోవచ్చు.

ఫ్యామిలియల్‌ (ప్రైమరీ)[మార్చు]

ఫ్యామిలియిల్‌ హైపర్‌లిపిడెమియాలను ఫ్రెడెరిక్‌సన్‌ క్లాసిఫికేషన్‌ ప్రకారం వర్గీకరిస్తారు. ఇది ఎలక్ట్రోఫొరెసిస్‌పై లైపోప్రొటీన్‌, లేదా ఆల్ట్రాసెంట్రిఫ్యుజేషన్‌పై ఆధారపడుతుంది.[2] అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా దీన్ని అనుసరించింది. ఇది నేరుగా హెచ్‌డీఎల్‌కు దారి తీయదు. పైగా ఈ లక్షణాల్లో కొన్నింటికి పాక్షికంగా కారణమయ్యే భిన్న రకాల జన్యువుల మధ్య తేడాలను కూడా గుర్తించదు. అయితే ఆదరణ ఉన్న వర్గీకరణ వ్యవస్థగా మాత్రం దీనికి గుర్తింపు ఉంది. కాకపోతే చాలామంది దీన్ని కాలదోషం పట్టినదిగా భావిస్తారు.

ఓఎంఐఎం సినానిమ్స్‌ లోపం ఇంక్రీజ్‌డ్‌ లైపోప్రొటీన్‌ ప్రదాన లక్షణాలు చికిత్స సెరమ్‌ అపియరెన్స్‌
టైప్‌ 1 (రేర్‌) 238600 బర్గర్‌-గ్రుట్జ్‌ సిండ్రోమ్‌, లేదా ఫ్యామిలియల్‌ హైపర్‌చైలోమైక్రోనేమియా డిక్రీజ్డ్‌ లైపోప్రొటీన్‌ లైపాస్ (ఎల్‌పీఎల్‌) ఆర్‌ ఆల్టర్డ్‌ ఏపీఓ సీ2 చైలోమైక్రాన్స్‌ అబ్డామినల్‌ పెయిన్‌ (ఫ్రమ్‌ పాంక్రియాటైటిస్‌), లైపెమియా రెటినాలిస్‌, ఎరప్టివ్‌ స్కిన్‌ గ్జాంతమస్‌, హెపటోస్ప్లెనోమెగలీ ఆహార నియంత్రణ క్రీమీ టాప్‌ లేయర్‌
టైప్‌ 2ఏ 144400 ఫ్యామిలియల్‌ హైపర్‌చైలేస్ట్రొలేమియా ఎల్‌డీఎల్‌ రిసెప్టర్‌ డెఫీషియన్సీ ఎల్‌డీఎల్‌ గ్జాంతెలాస్మా, అక్రుస్‌ సెనిలిస్‌, టాండెన్‌ గ్జాంతమస్‌ బైల్‌ ఆసిడ్‌ సీక్వెంట్రాంట్స్‌, స్టాటిన్స్‌, నియాచిన్‌ క్లియర్ చెయ్యి
టైప్‌ 2బీ 144400 ఫ్యామిలియల్‌ కంబైన్డ్‌ హైపర్‌లెపిడెమియా డిక్రీజ్డ్‌ ఎల్‌డీఎల్‌ రిసెప్టర్‌ అండ్‌ ఇంక్రీజ్డ్‌ ఏపీఓబీ ఎల్‌డీఎల్‌ అండ్‌ వీఎల్‌డీఎల్‌ స్టాటిన్స్‌, నియాచిన్‌, ఫైబ్రేట్‌ క్లియర్ చెయ్యి
టైప్‌ 3 (రేర్‌) 107741 ఫ్యామిలియల్‌ డైస్‌బెటాలిపోప్రొటీనెమియా డిఫెక్ట్‌ ఇన్‌ ఏపీఏ ఈ 2 సింథసిస్‌ ఎల్‌డీఎల్‌ ఫైబ్రేట్స్‌, స్టాటిన్స్‌ టర్బిడిటీ
టైప్‌ 4 144600 ఫ్యామిలియల్‌ హైపర్‌లిపెమియా ఇంక్రీజ్డ్‌ వీఎల్‌డీఎల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ డిక్రీజ్డ్‌ ఎలిమినేషన్‌ వీఎల్‌డీఎల్‌ ఫైబ్రేట్‌, నియాచిన్‌, స్టాటిన్స్‌ టర్బిడిటీ
టైప్‌ 5 (రేర్‌) 144650 ఎండోజెనస్‌ హైపర్‌ట్రైగ్లిజరిడెమియా ఇంక్రీజ్డ్‌ వీఎల్‌డీఎల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ డిక్రీజ్డ్‌ ఎల్‌పీఎల్‌ వీఎల్‌డీఎల్‌ అండ్‌ క్లైమిక్రానిక్స్ నియాచిన్‌, ఫైబ్రేట్‌ క్రీమీ టాప్‌లేయర్‌ అండ్‌ టుర్బిడ్‌ బాటమ్‌

హైపర్‌లైపోప్రొటీనేమియా టైప్‌ 1[మార్చు]

టైప్‌ 1 హైపర్‌లైపోప్రొటీనేమియా లైపోప్రొటీన్‌ లిపాస్‌ లోపాలకు సంబంధించిన ఒక తరహా హైపర్‌లైపోప్రొటీనెమియా.

హైపర్‌లైపోప్రొటీనేమియా టైప్‌ 2[మార్చు]

హైపర్‌లైపోప్రొటీనేమియా టైప్‌ 2 ఇప్పటిదాకా ఉన్నవాటిలో అతి సాధారణ రకం. ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌తో పాటుగా ట్రైగ్లిజెరైడ్‌ స్థాయిలో ఎలివేషన్‌ కూడా ఉందా లేదా అన్నదాని ఆధారంగా దీన్ని టైప్‌ 2ఏ, టూబీగా కూడా మరింతగా వర్గీకరించారు.

టైప్‌ 2ఏ[మార్చు]

ఇది అక్కడక్కడా (తిండి పద్ధతుల వంటి వాటి కారణంగా) తలెత్తవచ్చు. పాలీజెనిక్‌, లేదా క్రోమోజోమ్‌ 19 పై ఎలడీఎల్‌ రిసెప్టర్‌ జన్యువు మ్యుటేషన్‌ (జనాభాలో 0.2 శాతం), లేదా ఏపీఓబీ జన్యువు (0.2 శాతం) వంటి ఫక్తు కుటుంబ కారణాల వల్ల కూడా రావచ్చు. కుటుంబ కారణాలను టెండన్‌ గ్జాంతొమా, గ్జాంథెలాస్మా, ప్రిమెచ్యుర్‌ కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి వచ్చే అవకాశం హెటెరోజైగోట్స్‌లో 500 మందిలో ఒకరికి, హెAమోజైగోట్లలో 10 లక్షల మందిలో ఒకరికి ఉంటుంది.

టైప్‌ 2బీ[మార్చు]

హెచ్చు వీఎల్‌డీఎల్‌ స్థాయిలు ట్రైగ్లిజరైడ్స్‌, ఎసెటిల్‌ సీఓఏ సబ్‌స్ట్రేట్ల మితిమీరిన ఉత్పత్తి, బీా100 సింథెసిస్‌లో పెరుగుదల వంటివాటి వల్ల నమోదవుతాయి. ఎల్‌డీఎల్‌ క్లియరెన్సుల్లో తగ్గుదల వల్ల కూడా ఇది జరగవచ్చు. జనాభాలో దీని వ్యాప్తి 10 శాతం.

  • ఫ్యామిలికల్‌ కంబైన్డ్‌ హైపర్‌లిపోప్రొటీనెమియా (ఎఫ్‌సీహెచ్‌)
  • సెకండరీ కంబైన్డ్‌ హైపర్‌ప్రొటీనెమియా (సాధారణంగా జీవక్రియ వ్యాధి పరంగా, దానికిది వ్యాధి నిర్ధారణ ప్రాతిపదిక)

హైపర్‌లైపోప్రొటీనెమియా టైప్‌ 3[మార్చు]

ఇది హెచ్చు కైలోమైక్రాన్లు, ఐడీఎల్‌ (ఇంటెర్మీడియట్‌ డిన్సిటీ లైపోప్రొటీన్‌) వల్ల వస్తుంది. బ్రాడ్‌ బెటా డిసీజ్‌ , లేదా డైస్‌బెటాలైపోప్రొటీనెమియా గా కూడా దీన్ని పిలుస్తారు. దీనికి అతి సాధారణమైన కారణం ఏపీఓఈ ఈ2/ఈ2 జెనోటైప్‌ ఉనికి. ఇది హెచ్చు కొలెస్ట్రాల్‌తో కూడుకున్న వీఎల్‌డీఎల్‌(బీటా-వీఎల్‌డీఎల్‌) వల్ల వస్తుంది. దీని వ్యాప్తి జనాభాలో 0.02 శాతం.

హైపర్‌లైపోప్రొటీనెమియా టైప్‌ 4[మార్చు]

ఈ తరహా వ్యాధి ట్రైగ్లిజెరైడ్స్‌ వల్ల వస్తుంది. దీన్ని హైపర్‌ట్రైగ్లిజరిడెమియా (లేదా ప్యూర్‌ హైపర్‌ట్రైగ్లిజిడెమియా )గా కూడా పిలుస్తారు. ఎన్‌సీఈపీ-ఏటీపీ3 నిర్వచనం ప్రకారం హెచ్చు ట్రైగ్లిజరైడ్స్‌ (200 ఎంజీ/డీఎల్‌). దీని వ్యాప్తి వయోజనుల్లో 16 శాతం.[3]

హైపర్‌లైపోప్రొటీనెమియా టైప్‌ 5[మార్చు]

ఈ తరహా వ్యాధి 1వ తరహాకు దగ్గరగా ఉంటుంది. కాకపోతే కైలోమైక్రాన్లతో పాటుగా హెచ్చు వీఎల్‌డీఎల్‌లు కూడా ఉంటాయి.

దీన్ని గ్లూకోజ్‌ ఇంటాలరెన్స్‌, హైపర్‌రురిసెమియాతో కూడా కలిపి చెబుతారు.

వర్గీకరించని ఫ్యామిలియల్‌ రకాలు[మార్చు]

వర్గీకరించని రకాలు చాలా అరుదు:

  • హైపో - ఆల్ఫా లైపోప్రొటీనెమియా
  • హైపో - బెటా లైపోప్రొటీనెమియా (వ్యాప్తి 0.01ా0.1 శాతం)

అక్వైర్డ్‌ (సెకండరీ)[మార్చు]

అక్వైర్డ్‌ హైపర్‌లెపిడెమియాస్‌ (సెకండరీ డైస్లిపోప్రొటీనెమియాస్‌గా కూడా పిలుస్తారు) బహూశాఒరకరంగా ప్రైమరీ హైపర్‌లిపిడెమియా రూపాలకు మారురూపాలే. వాటి మాదిరి పరిణామాలే వీటిలో కూడా ఉండవచ్చు.[1] ప్రిమెచ్యూర్‌ అథెరోస్‌క్లెరోసిస్‌, లేదా చెప్పుకోదగ్గ హైపర్‌ట్రైగ్లిజెరిడెమియాతో కలిసినప్పుడు పాంక్రియాటైటిస్‌, ఇతర చైలోమైక్రోనెమియా సిండ్రోమ్‌ విషమ పరిస్థితులకు ఇవి దారి తీస్తాయి.[1] అక్వైర్డ్‌ హైపర్‌లిపిడెమియాకు దారి తీసే అతి సాధారణ కారణాలు:

అక్వైర్డ్‌ హైపర్‌లిపిడెమియాకు దారి తీసే ఇతర పరిస్థితులు:

  • హైపోథెరోయిడిజం[1]
  • రేనల్‌ ఫెయిల్యూర్‌[1]
  • నెప్రోటిక్‌ సిండ్రోమ్‌[1]
  • ఆల్కహాల్‌[1]
  • కొన్ని అరుదైన ఎండోక్రైన్‌ వ్యాధులు,[1] మెటబాలిక్‌ వ్యాధులు[1]

ఈ పరిస్థితులకు వీలైనప్పుడు చికిత్స, ఇబ్బంది కలిగించే మందుల వాడకాన్ని ఆపడం వంటిది సాధారణంగా హైపర్‌లిపిడెమియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రత్యేకమైన కొవ్వులను తగ్గించే థెరపీ కూడా కొన్ని సందర్భాల్లో అవసరం కావచ్చు.

తరచుగా ఈ విభాగంలో చేర్చకపోయినా, హైపర్‌లిపిడెమియాకు దారి తీయగల మరో కారణం పోస్ట్‌ప్రాండియల్‌ హైపర్‌లిపిడెమియా. ఇది ఆహారంలో కింద పేర్కొన్న వాటి పెరుగుదల వల్ల వస్తుంది. రిఫరెన్స్‌ నేమ్‌ = ఎస్లెవియర్‌ ద ఫ్రీ డిక్షనర్‌.‌కామ్‌ హైపర్‌లిపిడెమియా. సైటింగ్‌:

  • శాండర్స్‌ కాంప్రెహెన్సివ్‌ వెటెర్నరీ డిక్షనరీ, మూడో సంపుటం, 2007 బై ఎస్లెవియర్‌ రిఫరెన్స్‌.

నిర్వహణ[మార్చు]

టైప్‌2 చికిత్సకు ముందుగా ఆహారపుటలవాట్లను మార్చుకోవడం అవసరం. దానితోనే చికిత్స మొదలవుతుంది. కానీ చాలామంది రోగులకు కార్డియోవాస్క్లుయర్‌ రిస్కును తగ్గించేందుకు స్టాటిన్స్‌ (హెచ్‌ఎంజీ-సీఓఏ రిడక్టేస్‌ ఇన్హిబిటర్స్‌) వంటివాటిని కూడా వాడాల్సి రావచ్చు. ఒకవేళ ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలు మరీ పెరిగితే ఫైబ్రేట్లను ఎంచుకోవడం మేలు. ఎందుకంటే వాటి ప్రభావం మరింత లాభదాయకంగా ఉంటుంది. స్టాటిన్స్‌, ఫైబ్రేట్లను కలగలిపిన చికిత్స మంచి ప్రభావవంతంగా ఉంటుంది. కానీ అది మయోపతీ, రాబ్డోమొలిసిస్‌ వంటి విపరిణామాలకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి సునిశిత పర్యవేక్షణలో మాత్రమే దీన్ని వాడాల్సి ఉంటుంది. స్టాటిన్లకు సాధారణంగా జోడించే ఇతర ఏజెంట్లలో ఎజెటిమైబ్‌, నియాచిన్, బైల్‌ ఆసిడ్‌ సీక్వెస్ట్రాంట్స్‌ ఉన్నాయి. చేప నూనెతో కూడిన ఆహారపు చికిత్సను కూడా ట్రైగ్లిజరైడ్స్‌ స్తాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. మరీ ఎక్కువ తీవ్రత ఉన్న రోగుల్లో దీని ఫలితం కూడా అంతే ఎక్కువగా కనిపిస్తుంది.[4] ప్లాంట్‌ స్టెరోల్‌ ఉండే ఉత్పత్తులు, ω3 కొవ్వు ఆమ్లాల వల్ల కూడా లబ్ధి పొందిన కేసులు కొన్ని లేకపోలేదు.[5]

సూచనలు[మార్చు]

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Chait అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. Fredrickson, DS; Lees, RS (1965). "A system for phenotyping hyperlipoproteinemia" (PDF). Circulation 31: 321–7. PMID 14262568. 
  3. థర్డ్‌ రిపోర్ట్‌ ఆఫ్‌ ద నేషనల్‌ కొలెస్టరాల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం (ఎన్‌సీఈపీ) ఎక్స్‌పర్ట్‌ ప్యానెల్‌ ఆన్‌ డిటెక్షన్‌, ఎవాల్యుయేషన్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ హై బ్లడ్‌ కొలెస్టరాల్‌ ఇన్‌ అడల్ట్స్‌ (అడల్ట్‌ ట్రీట్‌మెంట్‌ ప్యానెల్‌ 3) ఫైనల్‌ రిపోర&్ట. సర్క్యులేషన్‌ 2002; 106; పేజ్‌ 3240
  4. మ్యాటర్‌ ఎం, ఓబెయిడ్‌ ఓ. ఫిష్‌ ఆయిల్‌ అండ్‌ ద మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ హైపర్‌ ట్రైగ్లిజరిడెమియా. న్యూట్ర్‌ హెల్త్‌. 2009;20(1):41-9.
  5. Thompson, GR (2004). "Management of dyslipidaemia.". Heart (British Cardiac Society) 90 (8): 949–55. doi:10.1136/hrt.2003.021287. PMC 1768388. PMID 15253984. 

బాహ్య లింకులు[మార్చు]