Jump to content

హోషియార్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 31°32′N 75°55′E / 31.53°N 75.92°E / 31.53; 75.92
వికీపీడియా నుండి
హోషియార్‌పూర్
Í
హోషియార్‌పూర్ చిహ్నాలు
హోషియార్‌పూర్ is located in Punjab
హోషియార్‌పూర్
హోషియార్‌పూర్
పఝాబ్‌లో హోషియార్‌పూర్ పట్టణ స్థానం
Coordinates: 31°32′N 75°55′E / 31.53°N 75.92°E / 31.53; 75.92
దేశం India
రాష్ట్రంపంజాబ్
జిల్లాహోషియార్‌పూర్
Founded byహర్‌గోవింద్‌రాం, రాం చంద్ - మహమ్మద్ బిన్ తుగ్లక్ దీవానులు[1]
Named forహోషియార్‌ ఖాన్
Government
 • Typeమునిసిపాలిటీ
 • Bodyహోషియార్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్
Elevation
296 మీ (971 అ.)
జనాభా
 (2011)
 • Total1,68,443
Demonym(s)హోషియార్‌పూరియా, హోషియార్‌పూరీ
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
PIN
146001
ప్రాంతపు కోడ్+91-1882
Vehicle registrationPB07
Websitehttp://www.hoshiarpur.nic.in/

హోషియార్‌పూర్ పంజాబ్ రాష్ట్రం, దోఆబా ప్రాంతంలోని నగరం. ఇదిహోషియార్‌పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది మునిసిపల్ కార్పొరేషన్ పాలనలో ఉంది. దీన్ని పద్నాలుగో శతాబ్దం ప్రారంభంలో స్థాపించారు. 1809 లో దీనిని మహారాజా కరణ్‌వీర్ సింగ్ దళాలు ఆక్రమించాయి. 1849 లో పంజాబ్ రాష్ట్రంలో ఐక్యమైంది.

సముద్ర మట్టం నుండి హోషియార్‌పూర్ సగటు ఎత్తు 296 మీటర్లు . హోషియార్‌పూర్ జిల్లా పంజాబ్ ఈశాన్య భాగంలో ఉంది. ఇది జలంధర్ రెవెన్యూ విభాగంలో ఉంది. ఇది దోఆబా ప్రాంతంలోని బిస్ట్ దోఆబ్ భాగంలో ఉంది. హోషియార్‌పూర్ ఈశాన్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా , ఊనా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. నైరుతిలో, షహీద్ భగత్ సింగ్ నగర్, జలంధర్ , కపుర్తాలా జిల్లాలు, వాయవ్యంలో గురుదాస్పూర్ జిల్లా సరిహద్దుగా ఉన్నాయి.

జనాభా

[మార్చు]
హోషియార్‌పూర్ నగరంలో మతం[2]
మతం శాతం
హిందూ మతం
  
75.67%
సిక్కు మతం
  
21.45%
జైనమతం
  
0.93%
ఇస్లాం
  
0.78%
ఇతరాలు
  
1.17%

2011 తాత్కాలిక జనాభా లెక్కల ప్రకారం, హోషియార్‌పూర్ నగరంలో 1,68,443 జనాభా ఉంది, అందులో 88,290 మంది పురుషులు, 80,153 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 89.11 శాతం. [3]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [4]హోషియార్‌పూర్ జనాభా 1,89,371. జనాభాలో పురుషులు 50.9%, ఆడవారు 49.1%. హోషియార్‌పూర్ సగటు అక్షరాస్యత రేటు 85.40%, 2001 లో 81.00% తో పోలిస్తే. పురుషుల అక్షరాస్యత 89.90%, స్త్రీ అక్షరాస్యత 80.80%. హోషియార్‌పూర్లో, జనాభాలో 10% 11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

  • 1,000 మగవారికి ఆడవారు: 962
  • జనాభా సాంద్రత (కిమీకి 2. ): 396
  • జనాభా పెరుగుదల శాతం (2001–2011): 7.1%
  • పిల్లల లింగ నిష్పత్తి (0–6 వయస్సు): 859

ఈ జిల్లాలో షెడ్యూల్డ్ కుల జనాభా 34.3% [5] [6]

రవాణా

[మార్చు]
భగవాన్ వాల్మీకి ISBT

హోషియార్‌పూర్ లోని భగవాన్ వాల్మీకి అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ నుండి పంజాబ్ రోడ్ వేస్, హిమాచల్ రోడ్ వేస్, ఢిల్లీ, హర్యానా రోడ్ వేస్, పిఆర్టిసి, [7] చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్, జమ్మూ & కాశ్మీర్ రోడ్ వేస్, రాజస్థాన్ స్టేట్ రోడ్‌వేస్ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు అనేకమంది ప్రైవేట్ సంస్థలు కూడా వివిధ ప్రదేశాలకు బస్సులను నడుపుతున్నాయి..

హోషియార్‌పూర్ రైల్వే స్టేషన్ కోడ్ HSX. ఈ స్టేషన్లో ఒకే ప్లాట్‌ఫారము ఉంది. ఈ స్టేషన్ను 1905 లో నిర్మించారు. ఇక్కడి నుండి ఢిల్లీ, అమృత్‌సర్, జలంధర్, ఫిరోజ్‌పూర్ లకు నేరుగా రైళ్ళున్నాయి

హోషియార్‌పూర్‌కు సమీప విమానాశ్రయం ఆదంపూర్ విమానాశ్రయం. ఇది నగరానికి నైరుతిలో 25 కి.మీ. దూరంలో ఉంది. స్పైస్జెట్ ఇక్కడి నుండి ఢిల్లీ విమానాశ్రయానికి రోజువారీ విమాన సర్వీసును నడుపుతోంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం అమృత్‌సర్ లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది125 కి.మీ. దూరంలో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Municipal Council Hoshiarpur – About us". Municipal Council Hoshiarpur. Archived from the original on 2 అక్టోబరు 2015. Retrieved 4 September 2015.
  2. "Hoshiarpur City Population Census 2011 – Punjab".
  3. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 October 2015.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  5. "State-wise, District-wise List of Blocks with >40% but less than 50% SC population". Archived from the original on 23 July 2013. Retrieved 12 July 2012.
  6. "Jat Sikhs: A Question of Identity". Retrieved 12 July 2012.
  7. "PEPSU Road Transport Corporation, Patiala". Archived from the original on 2017-01-12. Retrieved 2020-11-04.