హౌరాబ్రిడ్జ్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హౌరాబ్రిడ్జ్
(2018 తెలుగు సినిమా)
తారాగణం రాహుల్ రవీంద్రన్,
చాందినీ చౌదరి,
మనాలీ రాథోడ్‌
రావు రమేష్‌,
ఆలీ,
అజయ్
భాష తెలుగు

హౌరాబ్రిడ్జ్ 2018 ఫిబ్రబరి 3 న విడుదలైన తెలుగు సినిమా.

చిన్నప్పుడు మాచవరం వంతెన వలన అర్జున్ (రాహుల్ రవీంద్రన్), శ్రుతి అలియాస్‌ స్వీటీ (మనాలి రాథోడ్‌) మధ్య పరిచయం ఏర్పడుతుంది. నాటి నుంచి స్వీటీని మర్చిపోలేని అర్జున్‌ ఆమే తన జీవిత భాగస్వామిగా భావిస్తుంటాడు. 18 ఏళ్ల తర్వాత స్వీటీని వెతుక్కుంటూ మాచవరానికి వస్తాడు. అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న స్వీటీ (చాందిని చౌదరి).. చిన్నప్పటి నుంచి తనను చదివించి, పెద్ద చేసిన బావ అజయ్‌ (అజయ్‌)ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ, అర్జున్‌ ఆమెను తన స్వీటీ అనుకుని దగ్గరవుతాడు. క్రమంగా స్వీటీ కూడా అతడ్ని ఇష్టపడుతుంది. ఇంతలో అర్జున్‌కు తను చిన్నప్పుడు చూసిన అసలు స్వీటీ.. శ్రుతి అనే విషయం తెలుస్తుంది. దీంతో స్వీటీ(చాందిని చౌదరి)కి ఒక వీడియో సందేశం పంపి, శ్రుతిని వెతుక్కుంటూ వెళ్లిపోతాడు. ఇంతలో స్వీటీ అర్జున్‌తో ప్రేమ విషయాన్ని తన బావకు చెబుతుంది. ఆ తర్వాత అర్జున్‌ దూరమయ్యాడని తెలుసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుంది. మరి అర్జున్‌, శ్రుతి కలిశారా?, స్వీటీ పెళ్లి ఎవరితో జరిగింది? అనేది మిగిలిన కథలో భాగం.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • సంగీతం: శేఖర్‌ చంద్ర
  • ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
  • ఛాయాగ్రహణం: విజయ్‌ మిశ్రా
  • దర్శకత్వం: రెవోన్‌ యాదు
  • నిర్మాణం: ఈఎంవీఈ స్టూడియోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]