Jump to content

హ్మార్

వికీపీడియా నుండి

హ్మార్
మ్హార్, ఖౌసక్
హ్మార్ టాంగ్ / ఖౌసక్ టాంగ్
ఉచ్ఛారణ[hmar]
స్థానిక భాషభారతదేశం
ప్రాంతంమిజోరం,[1] మణిపూర్,[2] అస్సాం,[3] త్రిపుర, మేఘాలయ[4]
స్వజాతీయతహ్మార్ ప్రజలు
స్థానికంగా మాట్లాడేవారు
98,988 (భారతదేశంలో మొదటి భాషగా, 2011)[5][5]
సినో-టిబెటన్
భాషా సంకేతాలు
ISO 639-3hmr
Glottologhmar1241
ELPHmar

హ్మార్ భాష (Hmar: Khawsak Țawng) ఉత్తర మిజో భాషల్లో ఒకటి. ఈశాన్య భారతదేశానికి చెందిన హ్మార్ ప్రజలు ఈ భాషను మాట్లాడతారు. ఇది కూకీ-చిన్ భాషా కుటుంబ శాఖకు చెందింది. హ్మార్ మాట్లాడే ప్రజలు తరచుగా మిజో భాషను తమ రెండవ భాషగా ఉపయోగిస్తారు.[8][9]

వర్గీకరణ

[మార్చు]

హ్మార్ భాష టిబెటో-బర్మన్ భాషా కుటుంబంలో ఒక భాగం. ఇది ప్రత్యేకంగా జోహ్నాట్లక్ భాషల సమూహం కింద వర్గీకరించబడింది.[6][10] హ్మార్ సహా జోహ్నాట్లక్ భాషలు మిజోరం, పొరుగున ఉన్న ఈశాన్య భారత ప్రాంతాలలో, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాలలో మాట్లాడబడతాయి.[6] ఈ భాషా వాక్యాలలో క్రియ చివరగా వస్తుంది (కర్మ-క్రియ-కర్త క్రమం).[10]

వాన్‌బిక్ (2007) కూకీ-చిన్ భాషల వర్గీకరణ ప్రకారం, హ్మార్ 'సెంట్రల్' శాఖలో చేర్చబడింది.[6] ఈ శాఖలో మిజో, లై వంటి భాషలు కూడా ఉన్నాయి. కూకీ-చిన్ భాషలను వాన్‌బిక్ సెంట్రల్, పెరిఫెరల్ (నార్తర్న్, సదర్న్), మారైక్ శాఖలుగా విభజించారు. 'నార్త్ వెస్టర్న్ కూకీ-చిన్' లేదా 'ఓల్డ్ కూకీ' (దీనిలో ఐమోల్, అనల్, కోమ్ వంటి భాషలు ఉన్నాయి) అని పిలిచే మరొక సమూహం కూడా ఉంది. ఇది ప్రధాన కూకీ-చిన్ సమూహ లక్షణాలైన క్రియా రూపాంతరాలు లేకపోవడంచే ప్రత్యేకంగా నిలుస్తుంది.[6]

టిబెటో-బర్మన్ (తరచుగా సినో-టిబెటన్ అని పిలుస్తారు) విస్తృత వర్గీకరణపై పరిశోధకులలో చర్చలు కొనసాగుతున్నాయి. బ్లెంచ్, పోస్ట్ (2013) వంటి కొందరు పరిశోధకులు ఈ భాషల భౌగోళిక విస్తరణ, వైవిధ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబించడానికి ట్రాన్స్-హిమాలయన్ అనే పదాన్ని ప్రతిపాదించారు. ఈశాన్య భారతదేశంలోని అనేక భాషలు స్వతంత్ర శాఖలుగా ఉంటూ, చైనీస్ లేదా టిబెటన్, బర్మీస్ వంటి ప్రసిద్ధ భాషలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే సాంప్రదాయ ద్వంద్వ వర్గీకరణలను సవాలు చేస్తున్నాయి.[11] సంక్లిష్టమైన భాషా సంబంధాలు, తక్కువ నమోదు కలిగిన భాషలకు సమాన ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఈ పండితులు నొక్కిచెప్పారు.[11]

ఈ ప్రాంతంలోని అనేక భాషల మాదిరిగానే, హ్మార్ అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. పలు వ్యాకరణ అంశాలలో మరింత ప్రామాణీకరణ సాధించాల్సి ఉంది.[10]

భౌగోళిక విస్తరణ

[మార్చు]

ప్రాంతాలు, మాట్లాడేవారి సంఖ్య

[మార్చు]

2011 భారత జనగణన ప్రకారం హ్మార్ భాషను మాతృభాషగా మాట్లాడేవారి సంఖ్య 98,988 గా నమోదైంది.[5] హ్మార్ ప్రజలు వేర్వేరు ప్రాంతాలలో చెల్లాచెదురుగా నివసించడం వలన వివిధ ప్రాంతాల మధ్య స్వల్ప యాస భేదాలు ఏర్పడ్డాయి.

మాండలికాలు

[మార్చు]

మణిపూర్‌లో, హ్మార్ భాష ఆ ప్రాంతంలోని ఇతర కూకిష్ మాండలికాలైన థాడౌ, పైతే, ఐమోల్, వైఫెయ్, సిమ్తే, కోమ్, గాంగ్తే భాషలతో పాక్షిక పరస్పర అవగాహనను కలిగి ఉంది.[12]

ప్రస్తుతం గుర్తించబడుతున్న హ్మార్ భాషను గతంలో ఖౌసక్ మాండలికం అని పిలిచేవారు.[13] వివిధ హ్మార్ సమూహాలు ఇతర మాండలికాలను విస్తృతంగా మాట్లాడుతున్నప్పటికీ, సాహిత్య, బోధనా ప్రయోజనాల కోసం ఖౌసక్ మాండలికాన్ని ఉమ్మడి భాషగా ఆమోదించాయి.[10]

చరిత్ర

[మార్చు]

హ్మార్ ప్రజలు మొదట ఉత్తర-తూర్పు భారత రాష్ట్రాలలో ప్రత్యేక గిరిజన సమాజంగా గుర్తించబడ్డారు. అధికారిక గుర్తింపుకు ముందు, వీరు తరచుగా 'కూకీ' లేదా 'ఓల్డ్ కూకీ' అనే పదం కింద వర్గీకరించబడ్డారు, ఇది కొండ ప్రాంత తెగలకు బయటి వ్యక్తులు ఉపయోగించిన సాధారణ పేరు.[10] భారత ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జాబితా (సవరణ) ఉత్తర్వు, 1956 ప్రకారం హ్మార్ తెగను అధికారికంగా గుర్తించింది.[10] దీనివల్ల వివిధ తెగలు సాధారణ పేర్లకు బదులుగా తమ నిర్దిష్ట పేర్లతో పిలవబడే అవకాశం లభించింది.[10]

తొలి రికార్డులు

[మార్చు]

హ్మార్ భాష 20వ శతాబ్దం ప్రారంభంలో జార్జ్ అబ్రహాం గ్రియర్సన్ రూపొందించిన లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా మొదటిసారిగా రాతపూర్వకంగా నమోదైంది.[10]

ధ్వనిశాస్త్రం

[మార్చు]

అక్షరమాల (హ్మార్ హావ్రౌప్), అక్షరక్రమం

[మార్చు]

'హ్మార్ హావ్రౌప్' అని పిలిచే హ్మార్ అక్షరమాలలో 25 అక్షరాలు ఉన్నాయి: 6 అచ్చులు, 19 హల్లులు.[14][10] ఇది రోమన్ లిపికి చెందిన రూపాంతరం. ఉచ్చారణలో సహాయపడటానికి కొన్ని ప్రత్యేక గుర్తులు ఉపయోగిస్తారు.[15]

హ్మార్ హావ్రౌప్
AAwBChDEFGNgH
IJKLMNOPRS
TȚUVZ

ఉచ్చారణ పాఠం

[మార్చు]
ఉచ్చారణ మార్గదర్శి
అక్షరాలు[15]ఉన్నట్లుగా
afather లోని "aa"
awawkward లోని "aww"
bbee
chchaw
ddee
eee
feff
gacknowledge లోని "ek"
ngangst లోని "ang"
heich
ieye
jjay
kkay
lel లేదా elle
mem
nend లోని "en"
oouch లోని "ou"
ppee
rare
sess
ttee
tree
uooh
vvee
zzet

రాత విధానం

[మార్చు]

హ్మార్ భాష రోమన్ ఆధారిత 25 అక్షరాల అక్షరమాలను ఉపయోగిస్తుంది.[10] વિવિધ హ్మార్ సమూహాల మధ్య సాహిత్య ప్రయోజనాలు, భాషా బోధన కోసం ఖౌసక్ మాండలికం ప్రామాణిక రూపంగా స్వీకరించబడింది.[10]

తొలి సాహిత్యం, ప్రచురణలు

[మార్చు]

హ్మార్ సాహిత్యంలో ప్రారంభ ప్రయత్నాలు మతపరమైన ప్రయోజనాలు, స్వభాషలో అక్షరాస్యత పెంపొందించే లక్ష్యంతో సాగాయి.[10]

  • డోక్టర్ తంగ్లుంగ్ 1928-1929 ప్రాంతంలో బు హ్మాస (మొదటి పాఠ్యపుస్తకం) పేరుతో హ్మార్ భాషా ప్రాథమిక పుస్తకాన్ని రచించారు. ఇది మణిపూర్‌లోని ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికీ ఉపయోగించబడుతోంది.[10]
  • సంకీర్తన ప్రార్థనా పుస్తకాలు తొలి ప్రచురణలలో ఉన్నాయి.[10]
  • బైబిల్ నూతన నిబంధన 1947లో, సంపూర్ణ బైబిల్ 1972లో హ్మార్ భాషలో ప్రచురితమయ్యాయి.[10]
  • వైద్యుడైన డాక్టర్ తంగ్లుంగ్ సంకలనం చేసిన నిఘంటువు తొలి లౌకిక సాహిత్య రచనలలో ఒకటి.[10]
  • సమాజ నాయకత్వంలోని ప్రయత్నాల ద్వారా వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు, వార్షిక పత్రికలు వెలువడ్డాయి.[10]

20వ శతాబ్దం మధ్యకాలం నుండి, ఆధునిక భారతీయ భాషగా (MIL) హ్మార్ భాష రూపాంతరం చెందడానికి అనేక పుస్తకాలు ప్రచురించబడ్డాయి.[10]

అధికారిక హోదా, వినియోగం

[మార్చు]

ఈశాన్య భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యా ప్రయోజనాల కోసం, ఆధునిక భారతీయ భాషగా (MIL) హ్మార్ భాష గుర్తించబడింది.

మణిపూర్

[మార్చు]
  • 1956: మణిపూర్ ప్రభుత్వం హ్మార్ భాషను అధికారికంగా గుర్తించింది.[10]
  • 1968: మణిపూర్‌లో ప్రాథమిక స్థాయిలో హ్మార్ బోధనకు అనుమతి లభించింది.[10]
  • 1985: హ్మార్ భాష MIL హోదా పొంది, పదవ తరగతి (HSLC) పరీక్షలలో 50 మార్కుల సగం పేపర్‌గా చేర్చబడింది.[10]
  • 1997: పదవ తరగతి పరీక్షలలో హ్మార్ పూర్తి పేపర్‌గా మారింది.[10]
  • 2000: హైయర్ సెకండరీ స్థాయిలో చేర్చబడింది.[10]
  • 2003 నుండి: మణిపూర్ విశ్వవిద్యాలయం డిగ్రీ స్థాయిలో హ్మార్ అధ్యయనానికి అనుమతి ఇచ్చింది.[10]

అస్సాం

[మార్చు]
  • అస్సాం ప్రభుత్వం 1969 మార్చి 25 నాటి ఉత్తర్వు ద్వారా హ్మార్ భాషను బోధనా మాధ్యమంగా గుర్తించింది.[10]
  • 1984-1985: ఉత్తర కాచార్ హిల్స్ జిల్లాలో ప్రాథమిక తరగతులలో హ్మార్ బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టబడింది.[10]
  • కాచార్‌లోని హ్మార్ఖౌలియెన్, దిఫుచెర్రా వంటి ప్రదేశాలలో అప్పర్ ప్రైమరీ స్థాయి వరకు హ్మార్ బోధించే మిడిల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి.[10]
  • పాఠ్య ప్రణాళిక అభివృద్ధికి SCERT ద్వారా కొత్త పాఠ్యపుస్తకాలు రూపకల్పన చేయబడ్డాయి.[10]
  • 2007: అస్సాం సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (SEBA) పదవ తరగతి పరీక్షలలో హ్మార్ భాషను లాంగ్వేజ్ పేపర్‌గా ప్రవేశపెట్టింది.[10]
  • 2008: అస్సాం హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 11, 12 తరగతులలో MIL పేపర్‌గా అనుమతించింది.[10]
  • 2010: అస్సాం విశ్వవిద్యాలయం డిగ్రీ స్థాయి కోర్సుల్లో హ్మార్ భాషను MIL పేపర్‌గా గుర్తించింది.[10]

మిజోరం, మేఘాలయ

[మార్చు]

మిజోరం, మేఘాలయ రాష్ట్రాలలో హ్మార్ తెగ షెడ్యూల్డ్ తెగగా గుర్తించబడింది.[10] ఈ రాష్ట్రాలలో ప్రాథమిక స్థాయిలో హ్మార్ భాషా బోధనను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.[10]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • తీక్ భాష
  • మిజో భాష
  • కూకీ-చిన్ భాషలు
  • ఈశాన్య భారత భాషలు
  • హ్మార్ ప్రజలు

మూలాలు

[మార్చు]
  1. "Open Government Data (OGD) Platform India". data.gov.in. 21 జనవరి 2022.
  2. "Open Government Data (OGD) Platform India". data.gov.in. 21 జనవరి 2022.
  3. "Open Government Data (OGD) Platform India". data.gov.in. 21 జనవరి 2022.
  4. "Open Government Data (OGD) Platform India". data.gov.in. 21 జనవరి 2022.
  5. 1 2 3 "Statement 1: Abstract of speakers' strength of languages and mother tongues - 2011". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 7 జూలై 2018.
  6. 1 2 3 4 5 Post, Mark W. & Burling, Robbins. (2013). "The Tibeto-Burman languages of Northeast India". In Owen-Smith, Thomas & Hill, Nathan (Eds.), Trans-Himalayan Linguistics : Historical and Descriptive Linguistics of the Himalayan Area. De Gruyter.
  7. 1 2 Glottolog 4.8. Hamric. Retrieved 10 July 2024 from https://glottolog.org/resource/languoid/id/hmar1241
  8. "Did you know Hmar is vulnerable?". Endangered Languages (in ఇంగ్లీష్). Archived from the original on 31 జూలై 2023. Retrieved 31 జూలై 2023. ... Hmar speakers of Manipur use Manipuri while Assamese and Bengali are used in Assam. Ethnic Hmars living in Mizoram speak Mizo as their first language....
  9. Lisam, Khomdan Singh (2011). Encyclopaedia Of Manipur (3 Vol.) (in ఇంగ్లీష్). Gyan Publishing House. p. 561. ISBN 978-81-7835-864-2. ... They speak Hmar language and converse well in Manipuri (Meiteilon) ...
  10. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 Bapui, Vanlal Tluonga. (2017). "Teaching of Hmar Language with Special Reference to Assam". Language and Language Teaching, 6(2), Issue 12, pp. 1-4.
  11. 1 2 Blench, Roger & Post, Mark W. (2013). "Rethinking Sino-Tibetan phylogeny from the perspective of North East Indian languages". In Owen-Smith, Thomas & Hill, Nathan (Eds.), Trans-Himalayan Linguistics : Historical and Descriptive Linguistics of the Himalayan Area. De Gruyter.
  12. Singh, Chungkham Yashawanta (1995). "The linguistic situation in Manipur" (PDF). Linguistics of the Tibeto-Burman Area. 18 (1): 129–134. doi:10.32655/LTBA.18.1.09. Retrieved 19 జూన్ 2014.
  13. Infimate, Marina Laltlinzo (2022). "Causativization in Hmar". Himalayan Linguistics (in ఇంగ్లీష్). 21 (2). doi:10.5070/H921255411.
  14. Pangamte, L. Ruoivel (2019). New Hmar Grammar And Composition. Hmar Literature Society Manipur. p. 1.
  15. 1 2 Bapui, VL Tluonga (2012). Hmar Tawng Inchukna (A Lexical Study of the Hmar Language & Usages). The Assam Institute of Research for Tribals and Scheduled Castes.
"https://te.wikipedia.org/w/index.php?title=హ్మార్&oldid=4912761" నుండి వెలికితీశారు