హ్యాంగోవర్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Hangover
Classification and external resources
Portrait de Suzanne Valadon par Henri de Toulouse-Lautrec.jpg
"The Hangover" (portrait of Suzanne Valadon, by Toulouse-Lautrec)
ICD-10G44.83, F10

మధ్యం, ఇతర మత్తు పానీయాలను మితిమీరి సేవించినప్పుడు కలిగే తీవ్ర శారీరక అసౌకర్యమే హ్యాంగోవర్ ‌ (pronounced /ˈhæŋoʊvər/). తలనొప్పి, వికారం, వెలుగును, శబ్దాలను భరించలేకపోవడం, బద్ధకం, తీవ్ర అలసట, అతిసారం, విపరీతమైన దాహం వంటివి దీని తాలూకు అతి సాధారణ లక్షణాలు. తాగిన మత్తు దిగగానే ఇవన్నీ ఒకటకటిగా వేధిస్తాయి. హ్యాంగోవర్‌ ఏ సమయంలోనైనా రావచ్చు. కాకపోతే రాత్రి పూట అతిగా మద్యం సేవిస్తే ఉదయం లేచినప్పుడు ఉండే పరిస్థితిని సూచించేందుకు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. శారీరక ఇబ్బందులతో పాటు విపీతరమైన డిప్రెషన్‌, ఒత్తిడి వంటి మానసిక సమస్యలకు కూడా హ్యాంగోవర్‌ కారణమవుతుంది.

హైపోగ్లైసీమియా (రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి తగ్గడం), డీహైడ్రేషన్‌ (ఒంట్లో నీటి స్థాయి పడిపోవడం), అకెటల్‌డీహైడ్‌ మత్తు, గ్లూటమైన్‌ తిరగబెట్టడం, విటమిన్‌ బీ 12 లోపం వంటివన్నీ హ్యాంగోవర్‌ సమయంలో కలిగే లక్షణాలు.[1] ఒకోసారి మద్యపానం తర్వాత హ్యాంగోవర్‌ లక్షణాలు కొద్దిరోజుల పాటు కొనసాగవచ్చు. మద్యం సేవించేవారిలో దాదాపు 25 నుంచి 30 శాతం మంది హ్యాంగోవర్‌కు అతీతంగా ఉంటారు.[2] హ్యాంగోవర్‌ తాలూకు కొన్ని లక్షణాలను తీవ్రమైన ఇథనాల్‌ స్రావంగా కూడా పరిగణిస్తారు. ఇవి మద్యపానం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాల మాదిరిగా ఉంటాయి. ఇథనాల్‌ ఎక్కించడం ద్వారా ఎలుకల్లో బ్రెయిన్‌ రివార్డ్‌ త్రెషోల్డ్‌ (లాటరల్‌ హైపోథాలమస్‌లో అమర్చిన ఎలక్ట్రోడ్‌లు కరెంటును గ్రహించేందుకు అవసరమైన స్థాయి) వంటి పెరుగుదలను పరీక్షించిన ఒక అధ్యయనంతో దీన్ని పోల్చవచ్చు.[3] ఇక యాంటీ డియూరెటిక్‌ హార్మోన్‌ స్రావాన్ని మద్యం అడ్డుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ వస్తుంది.

పదచరిత్ర[మార్చు]

హ్యాంగోవర్‌ నిజానికి 19వ శతాబ్దానికి సంబంధించిన ఒక పదబంధం. (మీటింగ్‌ వంటివాటిలో) పూర్తికాని, లేదా మిగిలిన ఉన్న పనికి సూచికగా దీన్ని వాడేవారు. మితిమీరిన మద్యపానం అనంతరం ఉదయం కలిగే ఇబ్బంది అనే అర్థంలో 1904లో తొలిసారిగా హ్యాంగోవర్‌ను వాడారు.[4][5]

నార్వే భాషలో వెయ్‌సాల్జియా క్వెయిస్‌ (మితిమీరిన వ్యభిచారం వల్ల కలిగే అసౌకర్యం) నుంచి, గ్రీకులో అల్జియా (నొప్పి) నుంచి వచ్చింది.[4]

లక్షణాలు[మార్చు]

డీహైడ్రేషన్‌, భరించలేని అలసట, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, అతిసారం, కడుపు ఉబ్బరం, బలహీనత, ఒళ్లు బాగా వేడెక్కడం, నోట్లో బాగా లాలాజలం ఊరడం, శ్రద్ధా లేమి, చెమట పట్టడం, ఒత్తిడి, డిస్పోరియా, చిరాకు, వెలుతురును, శబ్దాలను తట్టుకోలేకపోవడం, వణకు, తప్పటడుగులు, నిద్ర సమస్యలు, విపరీతమైన ఆకలి, హాలిటోసిస్‌, అర్థం చేసుకోవడంలో అశక్తత వంటివన్నీ మద్యం తాలూకు హ్యాంగోవర్‌ లక్షణాలు. హ్యాంగోవర్‌ సమయంలో మద్యం రుచి, వాసన, ఆలోచనలనే చాలామంది అసహ్యించుకుంటారు. అయితే దీని లక్షణాలు వ్యక్తిని బట్టి, సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా మద్యపానం తర్వాత చాలా గంటలు గడిచాక హ్యాంగోవర్‌ మొదలవుతుంది. ఇది వ్యక్తీకరణ సామర్థ్యాలను కూడా నేరుగా ప్రభావితం చేస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు.

కారణాలు[మార్చు]

ఇథనాల్‌డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. దానివల్ల మూత్రోత్పత్తి బాగా పెరుగుతుంది (డయారిసిస్‌). ఫలితంగా తలనొప్పి, పొడి నోరు, బద్ధకం వంటివి మొదలవుతాయి. డీహైడ్రేషన్‌ వల్ల మెదడులో ద్రావకాల సాంద్రత కూడా తగ్గుతుంది. మద్యపానం తర్వాత నీరు బాగా తాగడం వల్ల దీని బారి నుంచి బయట పడవచ్చు. మద్యపానం వల్ల పొట్టపై పడే ప్రభావం విసుగుకు కూడా దారితీస్తుంది.

ఇథనాల్‌ను కాలేయపు ఎంజైములు విచ్ఛిత్తి చేయడం ద్వారా వచ్చే ఉత్పత్తులు కూడా హ్యాంగోవర్‌ లక్షణాలకు కారణమవుతాయి. ఆల్కహాల్‌ డీహైడ్రోజనీస్‌ ఎంజైమ్‌ వల్ల ఇథనాల్‌ అకెటల్‌డీహైడ్‌గా మారుతుంది. తర్వాత అకెటల్‌డీహైడ్‌ డీహైడ్రోజనిస్‌ ఎంజైమ్‌ వల్ల అది అసిటిక్‌ యాసిడ్‌గా రూపాంతరం చెందుతుంది. అకెటల్‌డీహైడ్‌ (ఇథనాల్‌) మద్యం కంటే కూడా 10 నుంచి 30 రెట్లు మత్తుకారకం.[6]

ఈ రెండు రియాక్షన్లు జరగాలంటే NAD+ to NADH మారాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్‌ఏడీహెచ్‌ సాయంతో సిట్రిక్‌ యాసిడ్‌ శృంఖలంలోని మూడు ఎంజైమ్‌లు (సిట్రేట్‌ సింథేస్‌, ఐసోసిట్రేట్‌ డైహైడ్రోజెనస్‌, ఆల్ఫా కీటోగ్లాట్రేట్‌ డీహైడ్రోజెనస్‌) శృంఖలాన్ని పూర్తిగా ఆపేస్తాయి. గ్లైకోలిసిస్‌ తుది ఉత్పత్తి అయిన పైరువేట్‌ పేరుకోవడం మొదలవుతుంది. మితిమీరిన NADH వల్ల ప్రాణాన్ని నిలబెట్టే క్రమంలో NAD+ను పునరుత్పత్తి చేసే క్రమంలో లాక్టేట్‌ డీహైడ్రోజెనస్‌ పైరువేట్‌ నుంచి లాక్టేట్‌ను ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. ఇది కాస్తా గ్లుకోనియోజెనెసిస్‌ వంటి ఇతర దారుల నుంచి పైరువేట్‌ను మళ్లిస్తుంది. తద్వారా బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయిల్లో తగ్గుదలను, ముఖ్యంగా మెదడులో భర్తీ చేయగల కాలేయం సామర్థ్యాన్ని ఇది బాగా దెబ్బ తీస్తుంది. గ్లూకోజే మెదడుకు ప్రాథమిక శక్తి కారకం. దాంతో గ్లూకోజ్‌ లేమి (హైపోగ్లైకోమా) కాస్తా అలసట, బద్ధకం, బలహీనత, మూడ్‌ పావడడం, శ్రద్ధ లేమి వంటివాటికి దారి తీస్తుంది.

గ్లూటథోయిన్‌, ఇతర డీటాక్సిఫికేషన్‌ ఏజెంట్లను సరఫరా చేయగల కాలేయం సామర్థ్యాన్ని మద్యపానం దెబ్బ తీస్తుంది.[7] అకెటల్‌డీహైడ్‌, ఇతర విష కారకాలను రక్త ప్రవాహం నుంచి సమర్థంగా తొలగించే సామర్థ్యాన్ని ఇది తగ్గిస్తుంది.[8] అదనంగా మరిన్ని విష కారకాలను, ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేసే CYP2E1 ఎంజైమ్‌ కూడా మద్యపానం వల్ల ఉత్పత్తవుతుంది.[9]

దీనికి తోడు ఫ్యూసెల్‌ ఆయిల్స్‌, మద్యం ఉప ఉత్పత్తులుగా చెప్పే కంజెనర్స్‌ వంటి ఇతర మధ్యాల ఉనికి ఇలాంటి సమస్యలను మరింతగా పెంచుతుంది (కంజెనర్స్‌ అంటే జింక్‌, ప్రాథమికంగా తీయని మధ్యాల్లో ఫ్లేవర్‌ను మరింతగా పెంచేందుకు కలిపే ఇతర లోహాలు). అందుకే డిస్టిల్డ్‌ మద్యం, ముఖ్యంగా వోడ్కా వంటివి తాగినప్పుడు ఇలాంటి లక్షణాలు బాగా తగ్గుతాయి.[10] బౌర్బన్‌ వంటి ముదురు రంగు మధ్యాల వోడ్కా వంటి లేత రంగు మధ్యాల కంటే దారుణమైన హ్యాంగోవర్‌కు దారి తీస్తాయని 2009లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. లేత రంగు మధ్యాల్లో కంటే ముదురు రంగు వాటిలో అధిక మోతాదులో కన్పించే కంజెనర్లే ఇందుకు కారణమని తేలింది.[11]

తూర్పు ఆసియాకు చెందిన చాలామందిలో సాధారణంగా ఇథనాల్‌ను అకెటల్‌డీహైడ్‌గా మార్చేందుకు ఆల్కహాల్‌ డీహైడ్రోజెనస్‌ ఎంజైమ్‌కు తోడ్పడే ఆల్కహాల్‌ డీహైడ్రోజెనస్‌ జన్యువు లేకపోవడం గమనించవచ్చు. పైగా వీరిలో సగానికి పైగా వ్యక్తుల్లో ఏదో ఒకరకంగా అకెటల్‌డహైడ్‌ డహైడ్రోజనస్‌ ఉంటుంది. ఇది అకెటల్‌డీహైడ్‌ను అసెటిక్‌ యాసిడ్‌గా మార్చడంలో పెద్దగా పని చేయదు.[12] ఈ సమ్మేళనం వల్ల ఆ వ్యక్తులు మద్యం తాలూకు తక్షణ ప్రతిస్పందన బారిన పడతారు. ఎందుకంటే మద్యం సేవించగానే అకెటల్‌డీహైడ్‌ పేరుకుంటుంది. తద్వారా తక్షణ, తీవ్రతరమైన హ్యాంగోవర్‌ లక్షణాలు వారిలో తలెత్తుతాయి. అందుకే వీరు తాగుబోతులుగా మారే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి.[13][14]

వయసు పైబడే కొద్దీ హ్యాంగోవర్‌ కూడా తీవ్రతరమవుతుందని తరచూ చెబుతుంటారు. ఆల్కహాల్‌ డీహైడ్రోజెనస్‌ ఎంజైమ్‌ల స్రావం తగ్గడమే దీనికి కారణమని భావిస్తారు. ఈ ఎంజైమ్‌ ఆల్కహాల్‌ను జీర్ణం చేసేందుకు దోహదపడుతుంది.[15]

సాధ్యమైన పరిష్కారాలు[మార్చు]

వైద్యపరంగా చూస్తే హ్యాంగోవర్లు చాలా తక్కువే అర్థమయ్యాయని భావించవచ్చు. వైద్య నిపుణులు కూడా సాధారణంగా మద్యపాన దుష్పరిణామాలను చికిత్స, నివారణ దృష్టితోనే ఎక్కువగా అధ్యయనం చేస్తారు. మితిమీరిన మద్యపానానికి హ్యాంగోవర్‌ ఒక చెక్‌లాగా పనిచేస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది.[16]

హ్యాంగోవర్‌పై అతి తక్కువగా జరిగిన సీరియస్‌ అధ్యయనాలు, దీన్ని నివారించవచ్చా, లేదంటే కనీస స్థాయికి తగ్గించవచ్చా అని పరిశోధించాయి. పైగా హ్యాంగోవర్‌కు సంప్రదాయ చికిత్స పద్ధతులు మరియు సాధారణ కూరగాయ వైద్యం కూడా ఎక్కువగా ఉన్నాయి. తాగిన ఇథనాల్‌ పరిమాణాన్ని తగ్గించడం, లేదా లోపలున్న మద్యం జీర్ణమయ్యేదాకా (కాలేయం ఆక్సిడేషన్‌ పద్ధతి ద్వారా మద్యం శరీరం నుంచి వెళ్లేదాకా ప్రభావం చూపడం వల్ల ఇది జరుగుతుంది) సదరు వ్యక్తిని పడుకోబెట్టడం తప్ప ప్రస్తుతానికి హ్యాంగోవర్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు నిరూపితమైన విధానమేదీ లేదు. బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో వచ్చిన నాలుగు పేజీల సమీక్ష వ్యాసం ఇలా ముగిసింది: సంప్రదాయిక, ఇరత్రా పద్ధతుల్లో ఏవీ మధ్యం తాలూకు హ్యాంగోవర్‌ను సమర్థంగా తగ్గించగలవని ఇప్పటిదాకా గట్టి ఆధారాలేవీ దొరకలేదు. కాబట్టి ఇప్పటివరకైతే మధ్యం తాలూకు హ్యాంగోవర్‌ లక్షణాలను నివారించగల ఏకైక పరిష్కార మార్గం తాగుడు మానేయడం మాత్రమే.[17]

ప్రభావశీలం కాని, నిరూపితం కాని చికిత్స పద్ధతులు[మార్చు]

హ్యాంగోవర్‌ లక్షణాలను పోగొట్టే ఆహారాలు, ద్రవాలు, చర్యలు ఎన్నో ఉన్నాయి. ప్లినీ ద ఎల్డర్‌ చెప్పిన మేరకు ప్రాచీన రోమన్లు పచ్చిగుడ్లగూబ గుడ్లను గానీ, కాల్చిన కానరీని గానీ ఇందుకు వాడేవారు.[18] ఇక 1878 పారిస్‌ వరల్డ్‌ ఎక్స్‌పొజిషన్‌లో ప్రవేశపెట్టిన ప్రయరీ ఆయిస్టర్‌ అయితే పచ్చి యోక్‌ను వర్సిస్టర్‌షైర్‌ సాస్‌, టబస్కో సాస్‌, ఉప్పు, మిరియం పొడులతో కలిపిన మిశ్రమాన్ని ఇందుకు సిఫార్సు చేసింది.[19] 1938లో రిట్జ్‌-కార్ల్‌టన్‌ హోటల్‌ ఒక హ్యాంగోవర్‌ పరిష్కారాన్ని కనిపెట్టింది. కోకాకోలా, [19] పాల మిశ్రమాన్ని ఇందుకు వాడింది. (అసలు కోకకోలానే హ్యాంగోవర్‌కు చికిత్సగా కనిపెట్టారని కొందరు చెబుతారు).[20][21] బాగా తాగుడు అలవాటున్న రచయిత ఎర్నెస్ట్‌ హెమింగ్వే అయితే ఇందుకోసం టమాటో జ్యూస్‌, బీర్‌లపై ఆధారపడేవాడు.[22] హ్యాంగోవర్‌ ప్రభావాన్ని తగ్గించడం కోసమే కొన్ని మిశ్రమాలను అభివృద్ధి కూడా చేశారు. ఇందుకోసం తయారు చేసిన బ్లాక్‌ వెల్వెట్‌లో షాంపేన్‌, ఫ్లాట్‌ గిన్నిస్‌ స్టౌట్‌[22] సమపాళ్లలో కలిసి ఉంటాయి. బాగా వేయించిన తిళ్లు, టమాటో జ్యూస్‌, చురుకైన లైంగిక కార్యకలాపాలు ఇందుకు విరుగుడని చాలామందికి నమ్మకముందని వైన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఫోక్‌లోరిస్టులు 1957లో చేసిన ఒక అధ్యయనం తేల్చింది.[23]

హ్యాంగోవర్‌ ప్రభావాన్ని బాగా తగ్గించేదిగా స్నానాన్ని కూడా చెబుతారు. బాగా వేడి నీళ్లను, చన్నీళ్లను[24] వెంటవెంటనే పోసుకోవడం ఇందుకు విరుగుడంటారు. దీంతోపాటు వ్యాయామం, [25] ఆవిరి స్నానం, సానా కూడా మంచి ఫలితమిస్తాయని నమ్మిక. అయితే సానా చాలా ప్రమాదకరమని, దానివల్ల హైపర్‌థెర్మియా పెరిగిపోయి, ప్రమాదకరమైన గుండె సమస్యలకు దారి తీయవచ్చని వైద్య శాస్త్రం నమ్ముతుంది).[26]

మరిన్ని నిరూపితం కాని చికిత్సలు:

 • గ్లోబ్‌ ఆర్టిచోక్‌ (సినరా స్కోలిమస్‌ ) చెప్పిన ప్రకారం: మధ్యం వల్ల కలిగే హ్యాంగోవర్‌ను తగ్గించడంలో ఆర్టిచోక్‌ ఎక్స్‌ట్రాక్టులు పెద్దగా పని చేయవని మా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.[27]
 • ప్రోప్రనోలల్‌: ప్రోప్రనోలల్‌ హ్యాంగోవర్‌ ప్రభావాన్ని తగ్గించదని మేం కరాఖండిగా చెప్పగలం.[28][29]
 • ఫ్రక్టోజ్‌ అండ్‌ గ్లూకోజ్‌: 1976లో చేసిన ఒక అధ్యయనం ఇలా తేల్చింది. ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌ రెండూ ఇథనాల్‌ వల్ల మొదలైన జీర్ణాశయ ఇబ్బందులను ప్రభావవంతంగా పోగొడతాయని మా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. కానీ మధ్యం తాలూకు మత్తు, హ్యాంగోవర్‌ లక్షణాలను పోగొట్టడంలో మాత్రం అవి పని చేయవు[30]. అయితే తేనె నాకడం (ఇందులో ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌ చాలా ఎక్కువగా ఉంటాయి) హ్యాంగోవర్‌ ప్రభావాన్ని బాగా తగ్గిస్తుందని చెబుతుంటారు.[31]
 • కుడ్జు (పురారియా మొనాంటా వర్‌. లబాటా ) : కకొంటో వంటి నివారణ పద్ధతుల్లో ప్రధానంగా దీన్ని వాడతారు. ఒక అధ్యయనం ఇలా తేల్చింది: 'పురారియా లబటా ను తరచూ, ముఖ్యంగా ఇథనాల్‌ను హెచ్చుస్థాయిలో తీసుకున్నప్పుడు వాడితే అకెటల్‌హైడ్రోకు సంబంధించిన నెపోలాజం, పాథాలజీ వంటివాటి బారిన పడే ప్రమాదముంది. పురారియా లబాటా ఏఎల్‌డీహెచ్‌2ను తగ్గించేందుకు వాడే ఉపశమనకారకం. కాబట్టి హ్యాంగోవర్‌కు మందుగా దీన్ని వాడటం సరికాదనే అన్పిస్తోంది.[32]

కాస్త ఫలితమివ్వగల పద్ధతులు[మార్చు]

 • కన్నాబిస్‌: కన్నాబిస్‌ను నాసాకు చికిత్సకారకంగా వాడతారు. ఆకలిని పెంచేందుకు, కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లను తగ్గించేందుకు కూడా వాడతారు.[33]
 • కుక్క వెండ్రుకలు: హ్యాంగోవర్‌ రాగానే మరింత మద్యం సేవిస్తే ఆ లక్షణాలు నెమ్మదిస్తాయన్నది సాధారణంగా ఉన్న నమ్మకం. హ్యాంగోవర్‌ ఒకరకమైన లోటును సూచిస్తుందని, మరింత మద్యం ద్వారా దాన్ని పూడ్చగానే ఆ లక్షణాలు వాటంతటవే నెమ్మదిస్తాయని చెప్పే సిద్ధాంతం దీనికి ఆధారం.[34] అదనపు మద్యపానం కచ్చితంగా సెడేటింగ్‌, మత్తు తరహా ప్రభావాలను కలిగిస్తుంది.[35] ఇది బాగా వాడుకలో కూడా ఉంది.[23] కానీ ఇది కేవలం హ్యాంగోవర్‌ లక్షణాలను మరికొంత సమయం పాటు వాయిదా మాత్రమే వేస్తుందన్నది ఆతిథ్య రంగ నిపుణులతో పాటు వైద్యులు కూడా చెప్పేమాట.[36] పైగా దీనివల్ల మధ్యానికి మరింత బానిసవుతారని చెబుతారు.[37] పెర్నెట్‌ బ్రాంకా, [38] బ్లడీ మేరీ[35] బ్రాండ్లను ఇందుకోసం బాగా ఇష్టపడతారు.
 • ఆహారం, నీరు: గుడ్ల వంటి సిస్టెయిన్‌ ఉండే ఆహారంతో పాటు బాగా నీటిని తాగడం వల్ల పోయిన తేమ తిరిగి వస్తుందని, హ్యాంగోవర్‌ ప్రభావం త్వరగా పోతుందని భావిస్తారు. బేకన్‌ శాండ్‌విచ్‌ కూడా హ్యాంగోవర్లను ప్రభావవంతంగా తగ్గిస్తుందని చెబుతారు.[39]
 • రీహైడ్రేషన్‌: రీహైడ్రేషన్‌, ప్రొస్టాగ్లాండిన్‌ ఇన్హిబిటర్స్‌, విటమిన్‌ బీ 6 వంటివి ప్రభావవంతంగా పని చేస్తాయి.[40]
 • ఆక్సిజన్‌: వియనాల్లో రెండు ఆస్పత్రుల్లో 231 మంది రోగులపై యాదృచ్ఛిక పద్ధతిలో పరీక్ష జరిపారు. దాని ఫలితాలను 1999లో అనెస్తీషియాలజీలో, ద న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రచురించారు. శస్త్రచికిత్స సమయంలో, రెండు గంటల అనంతరం రోగులకు 80 శాతం ఆక్సిజన్‌, 20 శాతం నైట్రోజన్‌ మిశ్రమాన్ని ఇవ్వడం ద్వారా మత్తు ప్రభావాన్ని బాగా తగ్గించవచ్చని ఆ పరీక్షలో తేలింది. ఇలా అదనపు ఆక్సిజన్‌ తీసుకున్న రోగుల్లో కేవలం 17 శాతం మంది మాత్రమే నాసా, వాంతుల వంటి సమస్యలతో బాధపడ్డారు. అదే సాధారణ పద్ధతిలో 70 శాతం ఆక్సిజన్‌, 30 శాతం నైట్రోజన్‌ తీసుకున్న వారిలో మాత్రం ఈ సంఖ్య ఏకంగా 30 శాతం కావడం విశేషం.[41] ఈ అధ్యయన సారథి ఈ ఫలితాలపై ఇలా చెప్పారు. అదనపు ఆక్సిజన్‌ చౌకైనది. రిస్కు లేనిది. నాసా, ఇతరత్రా బాగా తెలిసిన మత్తు మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది కూడా. డాక్టర్‌ సెస్లెర్‌ బృందం చేసిన ఇలాంటి అధ్యయన ఫలితం కూడా అనెస్తీషియాలజీలో 1999 అక్టోబర్‌లో ప్రచురితమైంది. ఆక్సిజన్‌ సరఫరాను 80 శాతానికి పెంచినా రోగుల్లో ఊపిరితిత్తుల పనితీరు సమస్యలేమీ తలెత్తలేదని అది పేర్కొంది. దీనికి తోడు వైద్య సిబ్బంది, స్కూబా డైవర్లు, మిలిటరీ పైలట్ల వంటి అదనపు ఆక్సిజన్‌ను పీల్చుకునే సౌకర్యమున్న వారు చెప్పిన ప్రకారం చూసినా, కొన్నిసార్లు మద్యపానం వల్ల కలిసిన హ్యాంగోవర్‌ను తగ్గించేందుకు కూడా అదనపు ఆక్సిజన్‌ సరఫరా బాగా దోహదపడుతుంది. దీనికి ఆధారం ఒక్కటే... అదనపు ఆక్సిజన్‌ వల్ల ఆక్సిజన్‌ థెరపీ జరుగుతుంది. జీర్ణక్రియ వేగం పెరుగుతుంది. విష రసాయనాల విచ్ఛిత్తి ప్రక్రియ కూడా వేగం పుంజుకుంటుంది.[42] అయితే హ్యాంగోవర్‌ వల్ల జరిగే శారీరక ఇబ్బందులను అధిక ఆక్సిజన్‌ సరఫరా పెద్దగా తగ్గించలేదని కొన్ని వర్గాలు (వైమానిక సందర్భంగా) చెబుతున్నాయి.[43]
 • టోల్ఫెనామిక్‌ యాసిడ్‌ (టీఏ): ఒక అధ్యయనం ఇలా పేర్కొంది: డ్రగ్‌ ఎఫికసీని సబ్జెక్టివ్‌గా మదింపు చేయడంలో ప్లాసిబో కంటే టీఏ చాలా మెరుగని (p < 0.001 శాతం) తేలింది. హ్యాంగోవర్‌ లక్షణాలను తగ్గించడంలోనైతే మరీ మెరుగని (0.01) తేలింది. టీఏ గ్రూపులో తలనొప్పి బారిన పడ్డ కేసులు మరీ తక్కువగా (0.01) నమోదయ్యాయి. నాసా, వాంతులు, ఇరిటేషన్‌, దాహం, నోరు పొడిబారడం వంటివాటిలో కాస్త ఎక్కువగా (0.05) నమోదయ్యాయి.[44]
 • విటమిన్‌ బీ 6 (పిరిటినాల్‌) : విటమిన్‌ బీ 6 బాగా ఎక్కువగా తీసుకుంటే (రోజువారీ వాడకం కంటే కొన్ని వందల రెట్లు) హ్యాంగోవర్లు తగ్గుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.[40][45]
 • క్లోరోమెథియజాల్‌: రక్తపోటును తగ్గించేందుకు, అడ్రినాలిన్‌ ఉత్పత్తిని తగ్గించేందుకు, శారీరక అసౌకర్యాలను నివారించేందుకు క్లోరోమెథియజాల్‌ దోహదపడుతుందని తేలింది. కానీ బద్ధకం, నిద్రమత్తు వంటివాటిపై మాత్రం పెద్దగా పని చేసినట్టు కన్పించలేదు. పైగా కాగ్నివ్‌ పరీక్ష ఫలితాలు కూడా వీటితో పెద్దగా ప్రభావితం కాలేదు. సైకోమోటార్‌ పనితీరు మాత్రం బాగా అదుపులోకి వచ్చింది. అల్ప హ్యాంగోవర్‌ కంటే తీవ్రమైన హ్యాంగోవర్‌ బారిన పడ్డవారు క్లోరోమెథియజాల్‌ నుంచి బాగా లబ్ధి పొందినట్టు కన్పించింది.[46] అయితే అధ్యయనంలో పాల్గన్న 8 మందీ క్లోరోమెథియజాల్‌ తీసుకోవడం వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు ఎదుర్కొన్నారు. కాబట్టి ఈ వయసు వారికి ఇది అభిలషణీయమైన చికిత్స కాదు.[47]
 • రోసిగ్లిటజాన్‌: (ఎలుకలపై చేసిన అధ్యయం): ఏఎల్‌డీ2ను పెంచడం ద్వారా ఇథనాల్‌ వల్ల వచ్చిన హ్యాంగోవర్‌ లక్షణాలను ఇది బాగా తగ్గించింది[48]
 • ఆక్సీటైక్లిస్టైన్‌: ఆక్సీటైక్లాడీహైడ్‌ ద్వారా హ్యాంగోవర్‌ లక్షణాలను ఎ-ఆక్సీటైక్లిస్టైన్‌ నిరోధిస్తుందని, తగ్గిస్తుందని కొందరు చెబతారు. మరీ ముఖ్యంగా దీన్ని మధ్యంతో పాటుగా తీసుకుంటే ఫలితం మెరుగ్గా ఉంటుందని అంటారు.[49][50] ఆక్సీటల్‌డీహైడ్‌ టాక్సిటీని మరింతగా తగ్గించేందుకు ఎన్‌ఏసీని విటమిన్‌ బీ 1 (థియామైన్‌)తో పాటుగా తీసుకోవాలి.[6]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • బ్లడ్‌ ఆల్కహాల్‌ మోతాదు
 • ఆహారం, పానీయాలు
 • హెయిర్‌ ఆఫ్‌ ద డాగ్‌
 • ద హ్యాంగోవర్‌ (సినిమా)
 • ద హ్యాంగోవర్స్‌

సూచనలు[మార్చు]

 1. Perry, Lacy. "HowStuffWorks "How Hangovers Work"". Health.howstuffworks.com. Retrieved 2010-03-26. Cite web requires |website= (help)
 2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 4. "Hangover: Online Etymology Dictionary". Etymonline.com. Retrieved 2009-10-18. Cite web requires |website= (help)
 5. "Frank Kelly Rich: On the Cuff & Under the Table: The Origins and History of Drinking Words and Phrases (Modern Drunkard Magazine 2008)". Drunkard.com. Retrieved 2009-10-18. Cite web requires |website= (help)
 6. 6.0 6.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 7. Kera Y, Ohbora Y, Komura S (1989). "Buthionine sulfoximine inhibition of glutathione biosynthesis enhances hepatic lipid peroxidation in rats during acute ethanol intoxication". Alcohol Alcohol. 24 (6): 519–24. PMID 2576368.CS1 maint: multiple names: authors list (link)
 8. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 9. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 10. Wiese JG, Shlipak MG, Browner WS (6 June 2000). "The alcohol hangover". Ann. Intern. Med. 132 (11): 897–902. PMID 10836917.CS1 maint: multiple names: authors list (link)
 11. 8:32 p.m. ET (2009-12-18). "Whiskey hangover worse than vodka, study says - Behavior- msnbc.com". MSNBC. Retrieved 2010-02-03. Cite web requires |website= (help)
 12. Xiao Q, Weiner H, Crabb DW (1996). "The mutation in the mitochondrial aldehyde dehydrogenase (ALDH2) gene responsible for alcohol-induced flushing increases turnover of the enzyme tetramers in a dominant fashion". J. Clin. Invest. 98 (9): 2027–32. doi:10.1172/JCI119007. PMC 507646. PMID 8903321.CS1 maint: multiple names: authors list (link)
 13. Earleywine, Mitchell (1999). Mind-Altering Drugs: The Science of Subjective Experience. OUP USA. p. 163. ISBN 978-0195165319.
 14. "Alcohol Metabolism in Asian-American Men with Genetic Polymorphisms of Aldehyde Dehydrogenase — Ann Intern Med". Annals.org. 1997-09-01. Retrieved 2010-02-03. Cite web requires |website= (help)
 15. "Medical miscellany: Why hangovers get worse with age | Mail Online". Dailymail.co.uk. 2009-11-10. Retrieved 2010-03-26. Cite web requires |website= (help)
 16. Glater, Jonathan D. (2004-12-07). "Raw Eggs? Hair of the Dog? New Options for the Besotted". The New York Times.
 17. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 18. http://www.ఫోర్బెస్.com/2003/01/01/cx_cd_0101featsidebar_3.html
 19. 19.0 19.1 Felten, Eric (2008-12-27). "Recipe to Cure a New Year's Eve Hangover - WSJ.com". Online.wsj.com. Retrieved 2010-03-26. Cite news requires |newspaper= (help)
 20. Ian Ellis. "March 29 - Today in Science History". Todayinsci.com. Retrieved 2010-03-26. Cite web requires |website= (help)
 21. "// Welcome To". Colamyths.com. Retrieved 2010-03-26. Cite web requires |website= (help)
 22. 22.0 22.1 [1]
 23. 23.0 23.1 ఎ హెయిర్‌ ఆఫ్‌ ద డాగ్‌ అండ్‌ సమ్‌ దర్‌ హ్యాంగోవర్‌ క్యూర్స్‌ ఫ్రమ్‌ పాపులర్‌ ట్రెడిషన్ ఫ్రాంక్‌ ఎం.పౌల్సన్‌ ద జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ ఫోక్‌లోర్‌, సంపుటి 74, నంబర్‌ వ292 (1961 ఏప్రిల్‌ాజూన్‌). పేజీలు 152ా168.
 24. Read, Jennifer (17 March 2010). "Eight great SDNN-recommended hangover cures". San Diego News Network. Retrieved 2 May 2010. Cite web requires |website= (help)
 25. "Hangover Remedies". Health 911. Retrieved 2 May 2010. Cite web requires |website= (help)
 26. ఆన్‌ క్లిన్‌ రెసిడెన్స్‌. 1988, 20(4): 287ా91. ద సానా అండ్‌ ఆల్కహార్‌. యికహ్రీ ఆర్‌, హెయ్‌కొనెన్‌.ఇ, సౌకాస్‌.ఎ.[2]
 27. మాక్స్‌ హెచ్‌.పిట్లర్‌, అడ్రియన్‌ ఆర్‌.వైట్‌, క్లార్‌ స్టీవెన్సన్‌, ఎడ్జర్డ్‌ ఎర్నెస్ట్‌ ఎఫెక్టివ్‌నెస్‌ ఆఫ్‌ ఆర్టిచోక్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ ఇన్‌ ప్రివెంటింగ్‌ ఆల్కహాల్‌ ఇండ్యూస్డ్‌ హ్యాంగోవర్స్‌: ఎ రాండమైజ్డ్‌ కంట్రోల్ట్‌ ట్రయల్‌ CMAJ 2003 డిసెంబర్‌ 9; 169 (12)
 28. Bogin RM, Nostrant TT, Young MJ (1986). "Propranolol for the treatment of the alcoholic hangover". Am J Drug Alcohol Abuse. 12 (3): 279–84. doi:10.3109/00952998609007397. PMID 3503570.CS1 maint: multiple names: authors list (link)
 29. Bogin RM, Nostrant TT, Young MJ (1987). "Propranolol for the treatment of the alcoholic hangover". Am J Drug Alcohol Abuse. 13 (1–2): 175–80. doi:10.3109/00952998709001507. PMID 3318398.CS1 maint: multiple names: authors list (link)
 30. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 31. "UMDNJ Experts Suggest Remedies for Holiday Headaches". Umdnj.edu. 2007-12-20. Retrieved 2009-10-18. Cite web requires |website= (help)
 32. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 33. థెరపాటిక్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ కన్నబీస్‌ అండ్‌ కన్నబినాయిడ్స్‌
 34. న్యూ హ్యాంగోవర్‌ ట్రీట్‌మెంట్స్‌ గో బియాండ్‌ ట్రెడిషన్స్‌ 'హెయిర్‌ ఆఫ్‌ ద డాగ&' న్యూయార్క్‌ టైమ్స్‌ న్యూస్‌ సర్వీస్‌ 2004 డిసెంబర్‌ 6. [3]
 35. 35.0 35.1 "Anti-Hangover Tips". The Webtender. Retrieved 2010-03-26. Cite web requires |website= (help)
 36. English, Camper (2006-12-29). "For hangovers, bartenders prefer the 'hair of the dog' - SFGate". Articles.sfgate.com. Retrieved 2010-03-26. Cite news requires |newspaper= (help)
 37. "Hangover Myths Slideshow: Hangover Cures, Herbal Remedies, Hair of the Dog, and Other Common Myths". Webmd.com. 2008-11-14. Retrieved 2010-03-26. Cite web requires |website= (help)
 38. Curtis, Wayne (2010-03-05). "The Bitter Beginning - Magazine". The Atlantic. Retrieved 2010-03-26. Cite web requires |website= (help)
 39. "Bacon sandwich really does cure a hangover". The Daily Telegraph. London. 7 April 2009. Retrieved 2 May 2010.[dead link]
 40. 40.0 40.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 41. డాక్టర్‌ డేనియల్‌ సెస్లర్‌ ఎక్స్‌ట్రా ఆక్సిజన్‌ ఫర్‌ అనెస్తీషియా హ్యాంగోవర్‌. ద న్యూయార్క్‌ టైమ్స్‌ 1999 నవంబర్‌ 9.
 42. తిమోతీ వాకర్‌ అండ్‌ మేరీ ఫిట్జ్‌గెరాల్డ్‌. ఎ డ్రింకర్స్‌ గైడ్‌ టు హ్యాంగోవర్స్‌. ద ఇండిపెండెంట్‌. 2007 ఏప్రిల్‌ 17
 43. Reihheart, Richard (2007). Basic Flight Physiology. McGraw-Hill Professional. p. 179. ISBN 0-7735-0801-5.
 44. ఎస్‌.కైవోలల్‌, జ.పరంతియెన్‌, టి.ఒస్టెమాన్‌, హెచ్‌.తిమోనెన్Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).‌ 90
 45. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 46. Myrsten AL, Rydberg U, Ideström CM, Lamble R (1980). "Alcohol intoxication and hangover: modification of hangover by chlormethiazole". Psychopharmacology (Berl.). 69 (2): 117–25. doi:10.1007/BF00427636. PMID 6779303.CS1 maint: multiple names: authors list (link)
 47. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 48. Jung TW, Lee JY, Shim WS; et al. (2006). "Rosiglitazone relieves acute ethanol-induced hangover in Sprague-Dawley rats". Alcohol Alcohol. 41 (3): 231–5. doi:10.1093/alcalc/agl013. PMID 16554376. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 49. ఫాక్స్‌, SW CERI: లివింగ్‌ విత్‌ ఆల్కహాల్‌ స్మార్ట్‌ డ్రగ్‌ న్యూస్‌ . 1996 డిసెంబర్‌ 13
 50. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3845: bad argument #1 to 'pairs' (table expected, got nil).

బాహ్య లింకులు[మార్చు]

మూస:Bartendమూస:Alcoholic beverages మూస:Headache