హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:HPBooks హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ , బ్రిటష్ రచయిత్రి జ్.కే.రౌలింగ్ వ్రాసిన హ్యారీ పాటర్ నవలల్లో ఏడవది మరియు ఆఖరుది. ఈ పుస్తకము జూలై 21, 2007న విడుదల చేశారు. దీనితో 1997లో ప్రచురించబడిన హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ అనే పుస్తకముతో మొదలైన శ్రేణి ముగింపు దశకు వచ్చింది. ఈ పుస్తకము హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్ (2005) వెనువెంటనే జరిగే ఘటనలని వివరించి, ఎంతో ఆసక్తిగా ఎదురు చూడబడిన హ్యారీ పాటర్,లార్డ్ వోల్దేమోర్త్ మధ్య జరిగే ఆఖరిపోరుకు దారి తీస్తుంది.

హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పుస్తకాన్ని యునైటెడ్ కింగ్డమ్ లో బ్లూమ్స్బెరి పబ్లిషింగ్ వారు, యునైటెడ్ స్టేట్స్లో లో స్కాలస్టిక్ వారు, కెనడాలో రైన్కోస్ట్ బుక్స్ వారు, ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్లో ఎలెన్&అన్విన్ వారు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా తొంబైమూడు దేశాల్లో విడుదలైన డెత్లీ హాలోస్ పుస్తకము అమ్మకాలలో చరిత్రని తిరిగి వ్రాసి అత్యధిక వేగంగా అమ్ముడుపోయిన పుస్తకముగా నమోదు అయింది. విడుదలైన మొదటి 24 గంటలలో మొత్తం 15 మిలియన్లు ప్రతులు విక్రయించబడ్డాయి,[5] కేవలం U.S. మరియు U.K.లోనే అమ్మబడిన 11 మిలియన్ల కంటే ఎక్కువ పుస్తక ప్రతులు కూడా వీటిలో ఉన్నాయి. గతంలో విడుదలైన హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్ .[1] పుస్తకము మొదటి రోజునే అత్యధిక స్థాయిలో విక్రయించబడినదిగా చరిత్రకెక్కి 9 మిలియన్లు ప్రతులు అమ్మింది. ఈ నవల ఉక్రైనియన్[2], స్వీడిష్[3], పోలిష్[4] మరియు హిందీ[5] వంటి అనేక భాషలలోనికి అనువాదము చేయబడినది.

ఈ నవలకు 2008 సంవత్సరపు కొలోరాడో బ్లూ స్ప్రూస్ బుక్ అవార్డు వంటి అనేక బిరుదులు లభించాయి, మరియు ఈ నవలని అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ "యువతకు అత్యుత్తమ పుస్తకము"గా జాబితాలో చేర్చింది.[16] ఈ పుస్తకానికి సాధారణంగా అనుకూల విమర్శలే వచ్చినప్పటికి, కొంత మంది విమర్శకులు మాత్రం నవలలో పాత్రలు ఏ మార్పు లేకుండా పాత విధముగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నవలని ఆధారంగా చేసుకొని రెండు-భాగములు కలిగిన ఒక చలనచిత్రం తయారవుతూ వుంది, ఈ చిత్రము యొక్క మొదటి భాగము నవంబరు 2010 నాటికి విడుదల చేయవలసి ఉంది.

విషయసంగ్రహము[మార్చు]

కథా పరిచయం[మార్చు]

హ్యారీ పాటర్ నవలల వరుసలో విడుదలైన మొత్తం ఆరు నవలల్లో, ముఖ్య పాత్రైన హ్యారీ పాటర్, కౌమారంలో ఉన్నప్పుడు వచ్చే సమస్యలతోపాటు ఒక ప్రసిద్ధ మంత్రశక్తి సంపన్నుడు కూడా కావడం వలన కలిగే ఇబ్బందులను కూడా కలగలిపి చాలా కష్టాలు పడ్డాడు. హ్యారీ పసివాడిగా ఉన్నప్పుడు, ఒక శక్తిమంతుడైన దుష్ట మాంత్రికుడు లార్డ్ వోల్దేమోర్త్ హ్యారీ తల్లితండ్రులని హత్య చేశాడు, అయితే హ్యారీని చంపడానికి ప్రయత్నించిన అనంతరం రహస్యంగా మాయమైపోతాడు. దీనివల్ల హ్యారీ వెంటనే ప్రసిద్దిచెందుతాడు, అతన్ని పెంచడానికి చుట్టాలైన మగుల్ లేదా మంత్రశక్తి లేని వాళ్ళు అయిన ఆంట్ పెటునియా మరియు అంకుల్ వెర్నాన్ సంరక్షణలో ఉంచుతారు.

హ్యారీ మళ్ళీ మంత్రలోకంలో తన 11 సంవత్సరాల వయస్సులో పున:ప్రవేశం చేసి, హోగ్వార్ట్స్ స్కూల్ అఫ్ విచ్క్రాఫ్ట్ అండ్ విజార్డ్రీలో చేరుతాడు. అతను రాన్ వెస్లీ మరియు హెర్మియాన్ గ్రాంజర్తో స్నేహం చేస్తాడు. త్వరలోనే లార్డ్ వోల్దేమోర్త్ , మళ్ళీ తన శక్తిని (మరియు ఒక శరీరాన్ని) తిరిగి పొందడానికి, హ్యరీని ఎదిరిస్తాడు. వేసవి సెలవులు తరువాత పాఠశాలకి తిరిగి వచ్చాక, చారిత్రాత్మిక "చాంబర్ అఫ్ సీక్రట్స్" తెరవబడిందని అనుకున్నప్పుడు అనేకసార్లు విద్యార్థుల మీద దాడి జరిగింది. హ్యారీ బెసిలిస్క్ని చంపి, మంత్రించబడ్డ డైరీలో నిలవవుంచబడిన లార్డ్ వోల్దేమోర్త్ యొక్క "జ్ఞాపకశక్తి"ని ఓడించి ఈ దాడులని ఆపుతాడు. మరుసటి ఏడాది, పారిపోయిన హంతకుడు సిరియస్ బ్లాక్ తన మీద గురి పెట్టాడని హ్యారీ వింటాడు. హోగ్వార్ట్స్ లో ఖచ్చితమైన రక్షణ ప్రమాణాలు ఉన్నప్పటికి, హ్యారీ మూడవ సంవత్సరం చదువుతు ఉన్నప్పుడు చివరిలో బ్లాక్ హ్యారిని ఎదిరిస్తాడు. అయితే బ్లాక్ ని ఎవరో ఇరికించారని, వాస్తవంగా అయన తన గాడ్ఫాదర్(సంరక్షకుడు) అని తెలుసుకుంటాడు. హ్యారీ పాఠశాలలో నాలుగో సంవత్సరము చదువుతూ ఉన్నప్పుడు ట్రైవిజార్డ్ టోర్నమెంట్ అనే ఒక ప్రమాదకరమైన మంత్ర పోటిలో పాల్గొంటాడు. ఈ పోటి ముగింపులో లార్డ్ వోల్దేమోర్త్ పూర్తి శక్తితో తిరిగి రావడాన్ని హ్యారీ చూస్తాడు. మరుసటి సంవత్సరం పాఠశాల మొదలయినప్పుడు, మాంత్రిక మంత్రిత్వశాఖ డోలోరేస్ అమ్బ్రిడ్జ్ ని హాగ్వార్ట్స్ యొక్క కొత్త ఉన్నత విచారణకర్తగా నియమిస్తుంది. అమ్బ్రిడ్జ్ కి వ్యతిరేకంగా రహస్యంగా ఒక విద్యార్థుల బృందాన్ని ఏర్పరచిన అనంతరం హ్యారీ, అతని అనేక మంది మిత్రులు కలసి, వోల్దేమోర్త్ యొక్క డెత్ ఈటర్స్ అనే ఒక చీకటి ప్రపంచానికి చెందిన మంత్రగాళ్ళు మరియు మంత్రగత్తెల బృందాన్ని అతి కష్టం మీద ఓడిస్తారు. హ్యరీ పాఠశాలలో ఆరవ సంవత్సరం చదువుతున్నప్పుడు, వోల్దేమోర్త్ హార్క్రక్స్ లని వాడుతూ చిరంజీవిగా ఉంటున్నాడనే విషయాన్నీ హ్యారీ తెలుసుకుంటాడు. హార్క్రక్స్ లు ఏదైనా ఒక వస్తువులో ఉంచబడిన ఆత్మ యొక్క శకలాలు. దీని వలన శరీరం చనిపోయినప్పుడు, ఆత్మయొక్క భాగం కొంత మిగిలి ఉండి అవ్యక్తికి మళ్ళీ ప్రాణం ఇచ్చి పునర్జన్మ కల్పించటానికి వీలుంటుంది.[17] అయితే, సృష్టించవలసిన శరీరం నశించిపోయినప్పుడు, అ మంత్రగాడు లేదా మంత్రగత్తె, శారీరిక ఆకారం లేకుండా సగం-ప్రాణం కల స్థితిలో మిగిలిపోతారు.[6] హార్క్రక్స్ ని కనుగొనటానికి వెళ్లి తిరిగివస్తూ ఉండగా, అ పాఠశాలకి ప్రధానోపాధ్యాయుడు మరియు హ్యరి యొక్క గురువైన ప్రొఫెసర్ డంబుల్ డోర్ అదే పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడైన సేవేరస్ స్నేప్ చేత చంపబడుతారు, హ్యారీకి స్నేప్ కి మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతూ ఉండేది, హ్యరీకి స్నేప్ ఒక డెత్ ఈటర్ అనే అనుమానం ఉండేది. పుస్తకం చివరి భాగములో హ్యారీ మరుసటి సంవత్సరము తాను పాఠశాలకు తిరిగిరానని, హార్క్రక్సుల కోసం అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.

కథా సారాంశం[మార్చు]

డంబుల్ డోర్ మరణానంతరం, వోల్దేమోర్త్ తన అధికార ఆరోహణను పూర్తిచేసి, తాంత్రిక మంత్రివర్గము పై అజమాయిషీని సాధిస్తాడు. వోల్దేమోర్త్ యొక్క మిగిలిన మూడు హార్క్రక్సులను కనుగొని వాటిని నాశనం చేయాలనే ఉద్దేశంతో హ్యారీ, రాన్ మరియు హెర్మియోన్ పాఠశాలనుండి బయటకు వచ్చేస్తారు. వాళ్ళ కుటుంబాలు మరియు స్నేహితుల క్షేమం కొరకు వాళ్ళు ఏకాంతవాసము చేస్తారు. వాళ్ళకి మిగిలిన హార్క్రక్సుల గురించి ఎక్కువ జ్ఞానం లేదు, అయితే వాటిలో రెండు హోగ్వార్ట్స్ వ్యవస్థాపకులయిన రోవేనా రావెంక్లా మరియు హేల్గా హుఫుల్పఫ్ కి చెందిన వస్తువులలో ఉన్నాయని, మూడవది వోల్దేమోర్త్ యొక్క పాముని పోలి ఉన్ననాగిని అని మాత్రం తెలుసు. వ్యవస్థాపకుల వద్ద ఉన్న ఆరెండు వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలియవు కాని నాగినిని, వోల్దేమోర్త్ వద్దనే ఉన్నట్లు భావించారు. వారు హార్క్రక్స్ ల కొరకు వెతుకుతూ ఉండగా, ఆ ముగ్గురు డంబుల్డోర్ యొక్క గతం గురించిన విషయాలు మరియు స్నేప్ యొక్క నిజమైన ఉద్దేశాలను తెలుసుకుంటారు.

ఈ ముగ్గురూ మాంత్రిక మంత్రిత్వంలో రహస్యంగా ప్రవేశించి, వోల్దేమోర్త్ యొక్క మొదటి హర్క్రక్స్ అయిన సాలజార్ స్లితరిన్ యొక్క తాయత్తుని సంపాదిస్తారు. వాళ్ళు గోడ్రిక్ గ్రిఫెన్డర్ యొక్క కత్తిని కూడా సంపాదిస్తారు, హర్క్రక్స్లను నాశనం చేసే శక్తి ఉన్న కొన్ని వస్తువుల్లో, ఈ కత్తి ఒకటి, ఈ కత్తితో తాయత్తుని నాశనం చేస్తారు. ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు ముగ్గురూ ఒక విచిత్రమైన చిహ్నాన్ని చూస్తారు. అది పౌరాణిక డెత్లీ హాలోస్ ని సూచించే గుర్తు అని జెనోఫిలియస్ లవ్గుడ్ అనే ఒక అసాధారణమైన మాంత్రికుడు చెపుతాడు. మూడు పవిత్రమైన వస్తువలే హాలోస్ అని తెలియవస్తుంది. అవి ఏమనగా, ఇతరులని మరల జీవితులని చేయు శక్తి కలిగిన రేసర్రెక్షన్ స్టోన్; ఎవరు ఓడించలేని దండం, ఎల్దర్ వాండ్; ఎవరికి ఓడని, కనిపించని ఇన్విసిబిలిటి క్లోక్. వోల్దేమోర్త్, ఎల్దర్ వాండ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడని హ్యారి తెలుసుకుంటాడు. కాని అ ముగ్గురు, తమకోసం వాండ్ ని సంపాదించడానికంటే వోల్దేమోర్త్ యొక్క హార్క్రక్స్లని కనిపెట్టడమే ముఖ్యం అని నిర్ణయిస్తారు. వాళ్ళు మాంత్రికుల బ్యాంక్ అయిన గ్రిన్గోట్స్ లో ఉన్న బెల్లాట్రిక్స్ లెస్ట్రాన్జ్ యొక్క రహస్యసొరుగును పగులగొట్టి మరొక హర్కరుక్స్ అయిన హేల్గా హఫుల్పుఫ్ యొక్క కప్ ని సంపాదిస్తారు. ఇంకొక హార్క్రుక్స్ హోగ్వార్ట్స్ లో దాచిపెట్టబడిందని హ్యారీ తెలుసుకుంటాడు. హ్యారీ, రాన్ మరియు హేర్మియోన్ ముగ్గురూ పాఠశాలలో ప్రవేశిస్తారు. మరొక హార్క్రుక్స్ అయిన రావేన్క్లా యొక్క డయాడంని కనిపెట్టి, రెండిటిని నాశనం చేయటంలో సఫలీకృతులౌతారు.

ఆ పుస్తకము లోని అంతిమ దశలో హోగ్వార్ట్స్ యుద్ధము జరుగుతుంది . హ్యారీ, రాన్ మరియు హేర్మియోన్ ముగ్గురూ వోల్దేమోర్త్ పెరుగుదలని వ్యతిరేకించే మాంత్రిక విద్యార్ధులు, మాంత్రిక ప్రపంచపు సభ్యులతో కలసి హాగ్వార్ట్స్ ని వోల్దేమోర్త్ , అతని డెత్ ఈటర్స్ మరియు ఇతర మంత్ర జీవులు నుండి రక్షిస్తారు. ఆ యుద్ధము మొదటి అంకములో చాలా ముఖ్య పాత్రధారులు హతులవుతారు. హ్యారీ పసిబిడ్డగా ఉన్నప్పుడు వోల్దేమోర్త్ దాడి చేసినప్పుడు, అనుకోకుండా హ్యరీని ఒక హార్క్రక్స్ చేశాడని హ్యారీ తెలుసుకుంటాడు. అందువలన వోల్దేమోర్త్ నశించాలంటే, తాను కూడా చనిపోవాలని హ్యారీ తెలుసుకుంటాడు. హ్యారీ వోల్దేమోర్త్ కి లొంగిపోతాడు, వోల్దేమోర్ట్ హ్యారీ మీద మృత్యు శాపం ప్రయోగించి హ్యారీని జీవన్మరణము కాని లిమ్బో స్థితిలోకి పంపిస్తాడు. అక్కడ హ్యారీ డంబుల్ డోర్ ని కలుస్తాడు, అయన హ్యారీకి ఈ విధంగా వివరిస్తాడు: వోల్దేమోర్త్ , పూర్తి శక్తిని మళ్ళీ తెచ్చుకోవడానికి హ్యారీ యొక్క రక్తాన్ని ఉపయోగించాడు, అందువల్ల వోల్దేమోర్ట్ చేపట్టే ఎటువంటి హానినుండి కూడా హ్యారీకి రక్షణ ఉంటుంది, ఎందుకంటే, హ్యారీలో ఉన్న హార్క్రుక్స్ నాశనమైపోయింది, హ్యారీ కిల్లింగ్ కర్స్ లో ఉన్నప్పటికి కూడా, అతను మరల తన శరీరాన్ని తిరిగిపొందవచ్చు. అ తరువాత హ్యారీ తన శరీరాన్ని తిరిగి పొందడంతో మళ్ళీ యుద్ధం మొదలవుతుంది, ఆఖరిగా మిగిలి ఉన్న హార్క్రక్స్ ని నాశనం చేశాక, హ్యారి వోల్దేమోర్త్ ని ఓడించగలుగుతాడు.

ఆఖరి మాట[మార్చు]

పుస్తకములో ఆఖరి మాట, వోల్దేమోర్త్ మరణించిన 19 సంవత్సరాలు తరువాత కాలాన్ని సూచిస్తుంది, అప్పుడు హ్యారీ, జిన్ని పెళ్లి అయిపోయి, వాళ్ళ పిల్లలైన జేమ్స్ మరియు ఆల్బస్ ని హాగ్వార్ట్స్ కి పంపుతారు, రాన్, హేర్మియోన్ ఇద్దరూ పెళ్లి చేసుకొని, పిల్లలు కలిగి ఉంటారు.

పూర్వరంగం[మార్చు]

పుస్తకం పేరు ఎంపిక[మార్చు]

ఈ పుస్తకము పేరుని విడుదల చేయడానికి కొంత సమయం ముందు, తాను ఈ పుస్తకానికి మూడు పేర్లని పరిశీలించినట్లు జ్.కే.రౌలింగ్ చెప్పారు. హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ అని చివరగా పెట్టబడిన పేరుని 2006 డిసెంబరు 21 నాడు బహిరంగంగా విడుదల చేశారు, ఈ పేరును రౌలింగ్ యొక్క వెబ్ సైటులో క్రిస్మస్ థీమ్ తో రూపొందించిన ఒక హంగ్మన్ పదకేళి ద్వారా తెలియచెప్పారు, కొన్నాళ్ళకి ఈ పేరుని పుస్తకాన్ని ప్రచురించే వాళ్ళు కూడా ధ్రువపరచారు. ఒక లైవ్ చాట్ కార్యక్రమములో, ఆమె అనుకున్న మిగిలిన రెండు పేర్లు ఏమని అడగ్గా, అవి హ్యారీ పాటర్ అండ్ ది ఎల్దర్ వాండ్ మరియు హ్యారీ పోటర్ అండ్ ది పెవేరెల్ క్వెస్ట్ అని రౌలింగ్ చెప్పారు.

పుస్తకం పూర్తి చేయటం గురించి రౌలింగ్ చెప్పినవి[మార్చు]

రౌలింగ్ ఈ పుస్తకాన్ని, జనవరి 2007 నాడు ఎడిన్బర్గ్లో ఉన్న బల్మోరల్ హోటల్ లో బస చేసినప్పుడు పూర్తి చేశారు, ఆమె అ హోటల్ గదిలో ఉన్న హెర్మిస్ యొక్క పాలరాయి ప్రతిమ మీద ఈ విధముగా వ్రాసి సంతకం చేశారు: "జ్.కే.రౌలింగ్, హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ అనే పుస్తకాన్ని వ్రాయడం ఈ గదిలో (652), జనవరి 11, 2007 నాడు పూర్తి చేశారు ."[27] తన వెబ్ సైటులో ఆమె వ్రాసిన ఒక ప్రకటనలో ఏమన్నారంటే, "నేను నా జీవితములో ఎప్పుడు ఇంత మిశ్రమ భావోద్వేగానికి లోననవలేదు, ఒకే సమయములో నిస్పృహ మరియు ఆనందాతిశయములకు కూడా లోనవుతానని కలలో కూడా ఊహించలేదు." ఆమె తన మిశ్రమ భావాలను చార్లెస్ డికెన్స్, 1850 సంవత్సరములో ప్రచురించిన తన డేవిడ్ కాపర్ ఫీల్డ్ నవల యొక్క ముందు మాటలో "రెండు సంవత్సరాల ఊహా శక్తితో జరిగిన కార్యము" అని వ్రాసిన విధముగా ఉన్నవని భావించారు. ఆమె ఇంకా అన్నారు, "దానికి నేను కేవలం నిటూర్చగలను. పదిహేడు సంవత్సరాలు ప్రయత్నించగలను, చార్లెస్...." ఆమె తన సందేశాన్ని ఈ విధముగా ముగించారు, "డెత్లీ హాలోస్ నాకు చాలా ఇష్టమైనది, అది ఈ పరంపరను ముగించడానికి ఉన్న అతి అద్భుతమైన మార్గం."[7]

ఈ పుస్తకము యొక్క ప్రచురణకి ముందు ఆమెని అడిగినప్పుడు, తాను మార్చాలకున్న, ఈ కథ యొక్క ముగింపుని మార్చలేను అని రౌలింగ్ చెప్పారు. "ఈ పుస్తకాలు ఎంతో కాలముగా వ్రాస్తూ ఉండటంతో, ఇప్పటికి ఆరు పుస్తకాలు పూర్తి అయి, ఇవన్ని కూడా ఒకే దిశ వైపే దారి చూపుతున్నాయి. "అందువల్ల, నేను నిజంగానే మార్చలేను ."[8] చివరి పుస్తకము, వరుసలో ఇంతకు ముందు పుస్తకమైన "హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్ "కి చాలా దగ్గిర సంబంధం కలిగి ఉందని ఆమె అన్నారు. ఈ రెండు పుస్తకాలు ఒకే పుస్తకము యొక్క రెండు భాగాలవలె అనిపిస్తాయని అన్నారు.[9] ఈ పుస్తకము యొక్క చివరి అధ్యాయము "1990 సంవత్సరములో వ్రాసినట్లు", తను మొదట్లో వ్రాసిన పుస్తకాలవలె ఉన్నట్లు ఆమె చెప్పారు.[10]

విడుదల[మార్చు]

విక్రయం మరియు ప్రచారం[మార్చు]

దస్త్రం:Hpdeathlyhallowsscholastic fullcover.gif
జాకెట్ ఆర్ట్ అఫ్ స్కాలస్టిక్ (US) ప్రచురణ.

పుస్తకము విడుదల చేసిన రోజు, లండన్లో ఉన్న నాచురల్ హిస్టరీ మ్యుజియంలో రాత్రి అంతా పుస్తకములో సంతకం చేసి, చదివే కార్యక్రమం జరిగింది, రౌలింగ్, ఎన్నుకోబడిన 1700 అతిధులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.[38] రౌలింగ్, అక్టోబర్ 2007 సంవత్సరములో US లో పర్యటించారు. అప్పుడు న్యూయార్క్ లో ఉన్న కార్నెగీ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దీనికి అనుమతి చీటీని స్వీప్ స్టేక్ ద్వారా కేటాయించారు.[11]

హ్యారీ పాటర్ పరంపరని అమెరికాలో ప్రచురించిన స్కాలస్టిక్ ఇన్క్,అనేక మిలియన్ల డాలర్ల ఖర్చుతో "త్వరలోనే 7 వస్తుంది" అనే ఒక విక్రయ ప్రచారాన్ని మొదలు పెట్టింది. దీనిలో భాగంగా, ఒక "శూరుడు బస్" యునైటెడ్ స్టేట్స్ లోని, నలభై గ్రంధాలయాలకి వెళ్ళడం, ఆన్ లైన్ లో అభిమానుల మధ్య చర్చలు మరియు పోటీలు,సేకరించగలిగే పుష్తకగుర్తులు, టాట్టూలు, అభిమానులు ఆతి ఎక్కువగా చర్చించుకునే ఏడు డెత్లీ హాలోస్ ప్రశ్నలని దశలవారీగా విడుదల చేయడం వంటి కార్యక్రమాలని నిర్వహించారు.[12] పుస్తక విడుదలకి ముందు ప్రచారములో భాగంగా, స్కాలస్టిక్ చివరి పుస్తకములో సమాధానములు దొరికే ఏడు ప్రశ్నలను విడుదల చేసింది:[13]

 1. ఎవరు బ్రతికి ఉంటారు? ఎవరు చనిపోతారు?
 2. స్నేప్ మంచివాడా లేక చెడ్డవాడా?
 3. హాగ్వార్ట్స్ ని తిరిగి తెరుస్తారా ?
 4. ఎవరు ఎవరికి దగ్గరౌతారు?
 5. హార్క్రక్సులు ఎక్కడ ఉన్నాయి?
 6. వోల్దేమోర్త్ ఓడిపోతాడా?
 7. డెత్లీ హాలోస్ అంటే ఏవి?

"హ్యారీ పాటర్ ప్రదేశము"- అనే ఒక మాంత్రిక మరియు సంబాషణతో కూడిన వీధి వేడుకని స్కొలాస్టిక్ న్యూయార్క్ నగరంలో ఉన్న తమ ప్రధాన కార్యాలయములో సమర్పించారు. ఇక్కడే మొట్ట మొదటి డెత్లీ హాలోస్ యొక్క సంతకం చేసిన U.S. ప్రచురణని, జూలై 20, 2007 నాడు విడుదల చేశారు. ఈ వేడుకలో భాగంగా ఒక ఇరవైనాలుగు అడుగుల (ఆరు మీటర్లు) ఎత్తైన భారీ వోమ్పింగ్ విల్లో, ముఖ వర్ణచిత్రం, మాయాజాల దండం తయారీ, నిప్పు-తినేవాళ్ళు, ఇంద్రజాలికులు, గారడివిద్యాకారులు, మరకాళ్ళతో నడిచేవాళ్ళు ఉన్నారు.[14]

డెత్లీ హాలోస్ నవలను 2007 సంవత్సరం జూలై 21వ తారీఖున ఆవిష్కరించినప్పుడు మాడేలిన్ మెక్కన్ అను ఒక కనబడకుండా పోయిన బ్రిటీషు చిన్నారి యొక్క ముఖచిత్రంతో కూడిన పెద్ద పత్రములను ప్రపంచములోని అన్ని పుస్తక దుకాణములలోను ప్రదర్శించునట్లుగా, పుస్తక విక్రేతలకు పత్రాలు అందజేయుటకు, జే.కే.రౌలింగ్ తన ప్రచురణకర్తలతో అంగీకారం కుదుర్చుకున్నారు.[15]

ఉత్సుకతని పోగొట్టే కథనాల నిషేధం[మార్చు]

రౌలింగ్, ఒక బహిరంగ విన్నపము చేసి, ఎవరిదగ్గిరైనా ఆఖరి పుస్తకము గురించిన ఏదైనా సమాచారం ఉంటే, దానిని వారిని బైటకి చెప్ప వద్దని అడిగారు. అలా చెప్పడంవల్ల, ఇతర పాఠకులు అనుభవించే ఉత్సాహం దెబ్బతింటుందని చెప్పారు.[16] ఈ మేరకు, బ్లూమ్స్ బరి సంస్థ, జూలై 21 వరకి పుస్తకములోని విషయాలు బయటకు రాకుండా ఉండడానికి GB£10 మిలియన్లు ఖర్చుపెట్టింది.[17] హ్యారీ పాటర్ పరంపర యొక్క U.S. సంపాదకుడు అయిన ఆర్థర్ లెవిన్, డెత్లీ హాలోస్ ప్రతులను ముందుగానే పత్రికా విమర్శకలకి ఇవ్వలేదని చెప్పారు. అయితే, రెండు U.S. పత్రికలు పుస్తక విమర్శని ముందుగానే ప్రచురించాయి.[18] గతంలో ఇటువంటి నిషిద్ధమైన కార్యాలు చేస్తే పుస్తక విక్రయదారులుకి తరువాత విడుదలయ్యే పుస్తకాలు ఇవ్వబడేవి కావు.కాని ఆ సారి అటువంటి భయములేని కారణాన కొన్ని దుకాణాలు నిషేధానికి విరుధ్ధంగా ప్రతుల్ని ముందుగానే పంచుతాయనే అనుమానం ఉండేది.[19]

ఆన్ లైన్ లో బట్టబయిలు చేయడం మరియు ముందుగానే వినియోగం[మార్చు]


పుస్తక విడుదలకి వారం రోజుల ముందు నిజమనిపించే అనేక కథాసంబంధ విషయాలు వివిధ రూపాలలో బయటపడ్డాయి. జూలై 16న, U.S. ప్రచురణలోని మొత్తం 759 పేజీల యొక్క ఛాయాచిత్రాలు పూర్తి వివరాలతో నవల అవిష్కరించవలసిన తేదికి ముందే దొంగతనంగా విడుదల అయి పూర్తిగా తిరిగి వ్రాయబడ్డాయి.[58][60][62][64] ఆ ఛాయాచిత్రాలు తరువాత వేరు వేరు వెబ్ సైట్లలో, పీర్-టు-పీర్ వ్యవస్థలోను ప్రదర్శించబడడంతో స్కొలాస్టిక్ కోర్ట్ సమ్మన్లు ద్వారా అసలు మూలాన్ని వెదికి పట్టుకోవాలని ప్రయత్నించారు.[20] హ్యారీ పాటర్ కథల చరిత్రలో ఇది అత్యంత తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణించబడుతుంది.[21] రౌలింగ్ మరియు ఆమె న్యాయవాది ఇద్దరూ ఆన్లైన్లో కథావస్తువు బయిటికి రావడం జరిగిన మాట వాస్తవమే అని తెలిపారు.[22] ద బాల్టిమోర్ సన్ మరియు ద న్యుయోర్క్ టైమ్స్ జూలై 18, 2007 న ప్రచురించిన ప్రచురణలలో అనేక లీక్ల గురించి విశదీకరించారు. విడుదలకి ఒక్క రోజు ముందు ద న్యుయోర్క్ టైమ్స్ పత్రికలో ముందుగానే విడుదలైన కథ నిజమైనదేనని నిర్ధారణ చేసింది.[21]

U.S.కి పంపించిన పుస్తకాల్లో సుమారుగా పదివేలల్లో ఒక (0.0001) ప్రతిని మాత్రమే ముందుగా పంపించామని స్కాలస్టిక్ ప్రకటించింది-అంటే మొత్తం 1,200 ప్రతులు అన్నమాట. మేరీల్యాండ్ లో ఉన్న ఒకరికి డీప్ డిస్కౌంట్.కాం నుండి తపాలాలో ఒక ప్రతి, పుస్తక విడుదలకి నాలుగు రోజులు ముందుగానే వచ్చింది. ఈ విషయం మీద స్కాలస్టిక్ మరియు డీప్ డిస్కౌంట్ రెండు సంస్థలు కూడా నమ్మలేని విధముగా స్పందించాయి. స్కాలస్టిక్ మొదట్లో ఇది ఒక "మానవ తప్పిదమని" నమ్ముతున్నామని ప్రకటించింది. అందువల్ల ఏ విధమైన ప్రాయశ్చిత్తము గురించి ఆలోచించడం లేదని చెప్పారు.[23] అయితే, మరుసటి రోజు, తాము డీప్ డిస్కౌంట్ మీద, మరియు దాన్ని పంపిణి చేసే సంస్థైన లేవి హొం ఎంటర్టైన్మెంట్ మీద చట్టపరమైన చర్య తీసుకోబోతున్నట్లు స్కాలస్టిక్ ప్రకటించింది.[24] షికాగోలో ఉన్న కుక్ కౌంటీ యొక్క సర్క్యూట్ న్యాయస్థానంలో నష్ట పరిహారానికోసం స్కాలస్టిక్ దావా వేసింది. దీంట్లో ఆ సంస్థ, "డీప్ డిస్కౌంట్ ఒప్పందాన్ని పూర్తిగా మరియు ఘోరమైన రీతిలో ఉల్లంఘన చేసిందని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూడబడుతున్న ఒక పుస్తక విడుదల కోసం చాలా జాగ్రత్తగా చెపట్టిన ప్రణాళికలో వారు కూడా భాగమని వారికి తెలుసు", అని పేర్కొంది.[25] ముందుగానే బయటికి వచ్చిన కొన్ని పుస్తకాలు ఈబేలో దర్శనం ఇచ్చాయి. ఒక పుస్తకమైతే US$18 ప్రారంభ ధరతో మొదలయి US$250 వరకి పెరిగి, పబ్లిషెర్స్ వీక్లీ కి విక్రయించ బడింది.[26]

ధరల యుద్ధాలు మరియు ఇతర వివాదాలు[మార్చు]

అస్డా,[27][28] ఇంకా అనేక ఇతర UK సూపర్ మార్కెట్లు బాగా తగ్గించినబడిన ధరలో ముందుగానే పుస్తకానికి విక్రయ ఆర్డర్లు తీసుకున్నాయి. తరువాత అస్డా, పుస్తక విడుదలకి రెండు రోజుల ముందు, పుస్తకాన్ని GB£5కే (సుమారు US$8) అమ్ముతామని చెప్పి, ఒక ధరల యుద్ధానికి తెర లేపింది. ఇతర చిల్లర వ్యాపార సంస్థలు కూడా బాగా తగ్గించబడిన ధరలోనే పుస్తకాన్ని అమ్మటానికి ముందుకు వచ్చారు. ఈ ధరలలో పుస్తకము పెద్ద నష్టానికి దారి తీస్తుంది. దీనితో సాంప్రదాయ UK పుస్తక విక్రయ దారులు గగ్గోలు పెట్టారు. ఇటువంటి పరిస్ధితిల్లో పోటి చేయడం అసాధ్యమని వారు వాదించారు. స్వతంత్రంగా నిర్వహిచబడే దుకాణాలు అతి ఎక్కువగా నిరసన వ్యక్తం చేశాయి. అయితే UK యొక్క అతిపెద్ద పుస్తకాలు మాత్రమే అమ్మే దుకాణాల వరుస అయిన వాటర్ స్టోన్స్ కూడా సూపర్ మార్కెట్ ధరలతో పోటే చేయలేక పోయింది. కొన్ని చిన్న పుస్తక దుకాణాలు, టోకు వ్యాపారుల దగ్గిరనుండి కాకుండా సూపర్ మార్కెట్ల నుండి వాళ్ళకి కావలసిన సరకును కొన్నారు. ఈ విధముగా మొత్తంగా కొనడాన్నిఆపటానికి, అస్డా ఒక్కొక్క వినియోగదారునికి రెండు ప్రతులే ఇచ్చేవిధంగా పరిమితి విధించింది. UK పుస్తకాల విక్రయదారుల సంఘం ప్రతినిధి అయిన ఫిలిప్ విక్స్, "ఇది మేము కనీసం పాల్గొనటానికి కూడ వీలులేని యుద్ధం. సూపర్ మార్కెట్లు ఈ పుస్తకాన్ని వేయించిన గింజల డబ్బా లాగ ఒక నష్టం కలిగించే వస్తువులాగ పరిగణించడం పెద్ద తలవంపు" అని చెప్పారు. సింబా ఇన్ఫర్మేషన్ సంస్థలో విశ్లేషకుడు అయిన మైఖేల్ నోరిస్ ఈ విధంగా చెప్పారు :"మీరు పుస్తకము యొక్క ధరని మాత్రమే తగ్గించడం లేదు. ఈ సందర్భములో, మీరు చదువడంలోని విలువని కూడా తగ్గిస్తున్నారు."[29]

మలేషియాలో కూడా ఇటువంటి ఒక ధరల యుద్ధం ఏర్పడి, పుస్తకము యొక్క విక్రయాలలకు సంబంధించి వివాదాలకు దారి తీసింది.[30] మలేషియాలోని నాలుగు అతిపెద్ద పుస్తకాల దుకాణాల వరుసలైన, MPH బుక్ స్టోర్స్, పాపులర్ బుక్ స్టోర్స్, టైమ్స్ మరియు హారిస్ సంస్థలు టేస్కో మరియు కేరిఫోర్ హైపెర్మార్కెట్ల వైఖరికి నిరశనగా హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పుస్తకాన్ని తాము విక్రయించమని నిర్ణయించారు. మలేషియాలో ఈ పుస్తకము యొక్క చిల్లర విక్రయ ధర MYR 109.90 (సుమారు GB£16) అయితే, టేస్కో మరియు కేరిఫోర్ పుస్తకాన్ని MYR 69.90 (సుమారు GB£10)కి విక్రయించారు. పుస్తక దుకాణాల ఈ చర్య, పంపిణి సంస్థయిన పెంగ్విన్ బుక్స్ మీద ఒత్తిడి పెట్టి, హైపెర్ మార్కెట్లనుండి పుస్తకాన్ని తొలగించాలనే ప్రయత్నములో భాగముగా భావించారు. మొత్తం మీద, 2007 జూలై 24 నాటికి, ధరల యుద్ధం ముగించి, సంబంధించిన నాలుగు పుస్తక దుకాణాలు పుస్తక విక్రయాన్ని, తగ్గించిన ధరలో, తిరిగి ప్రారంభించారు. టేస్కో మరియు కేరిఫోర్, పుస్తకాన్ని నష్టానికి విక్రయిస్తున్నారని పెంగ్విన్ బుక్స్ ధ్రువపరచి, ఇది మంచి వ్యాపార పద్ధతి మరియు న్యాయ వ్యాపార ధోరణి కాదని పేర్కొంది.[31]

ఇస్రాయెల్లో ఈ పుస్తకాన్ని శనివారం తెల్లవారుజామున విడుదలచేయటంతో షబ్బత్ని అతిక్రమించినట్లుగా భావించి నిరసించటం జరిగింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి అయిన ఎలి ఇషాయ్,"యూదుల మత సంప్రదాయం, విలువల ప్రకారం శనివారం రాత్రి రెండు గంటలకు ఇటువంటిది జరగటం నిషిద్ధము. వారిని మరొక రోజు జరుపుకొనమనండి."అని అన్నారు.[32] పని మరియు విరామము నకు సంబంధించిన చట్టం ఫై ఆధారపడి తాను దీనిఫై నేరాపాదన చేసి జరిమానా విధిస్తానని ఇషాయ్ తెలిపారు.[33]

ప్రచురణ మరియు స్పందన[మార్చు]

విమర్శాత్మకమైన ప్రతి స్పందన :[మార్చు]

బాల్టిమోర్ సన్ యొక్క విమర్శకురాలు మేరీ కెరోల్ మెక్కాలీ ఈ రచనలను ప్రశంసిస్తూ "ఇది ఒక అధ్బుతమైన బిల్డంగ్శ్రోమన్ కథ, అనగా బాల్యం నుండి యుక్త వయసుకి మారే కథ" అని ప్రశంసించారు.|బాల్టిమోర్ సన్ యొక్క విమర్శకురాలు మేరీ కెరోల్ మెక్కాలీ ఈ రచనలను ప్రశంసిస్తూ "ఇది ఒక అధ్బుతమైన బిల్డంగ్శ్రోమన్ కథ, అనగా బాల్యం నుండి యుక్త వయసుకి మారే కథ" అని ప్రశంసించారు.]]'. ఈ పుస్తకం శ్రేణిలోని మిగిలిన నవలలకన్నా గంభీరంగా ఉందని, వచనం మరింత సూటిగా ఉందని వ్యాఖ్యానించారు.[34]. ఇంతే కాక, ది టైమ్స్కు చెందిన పరిశీలకుడైన యాలిస్ ఫోర్దామ్ ఇలా వ్రాశారు, "రౌలింగ్ యొక్క మేధస్సు భ్రమలోకాన్ని పూర్తిగా ఆస్వాదించునట్లు చేయటంలోనే కాకుండా ఎంతో నిశబ్దంగా కథా గమనంలో పాత్రలను ప్రవేశపెట్టి, అవి నిజమైన,ధైర్యవంతమైన, అందరికి ప్రియమైన, కొన్ని తప్పులు కూడా కలబోసిన నిజజీవిత పాత్రలవలె అగుపించునట్లు చేయగల ప్రతిభ కూడా ఆమెలో ఉంది." ఫోర్ధమ్ ఇలా ముగించారు." మనము చాలా దూరం కలసి సాగాము. రౌలింగ్ కాని హ్యారీ కాని మనని ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు."[35] న్యూయార్క్ టైమ్స్కు చెందిన రచయిత మిచికో కాకుటానీ హ్యారీని ఒక నాయకుడుగాను, నిజ జీవితానికి దగ్గర సంబంధంగల పాత్రధారిగాను కూడా సృష్టించగలిగిన రౌలింగ్ సామర్ధ్యమును పొగడ్తలతో అంగీకరించారు. [36]'

టైమ్ పత్రికకి చెందిన లేవ గ్రాస్మన్ ఈ పుస్తకాన్ని 2007 సంవత్సరంలో 10 అతి ఉత్తమ కల్పనా కథల్లో ఒకటిగా పేరుకొని, ఈ పుస్తకానికి #8వ స్థానం ఇచ్చారు. ఈయన రౌలింగ్ పుస్తకాలు ఇంకా ఒక ప్రపంచవ్యాప్త సామాహిక మాధ్యమంగా వున్నాయని నిరూపించాయని ప్రశంసించారు. గ్రాస్మాన్ ఈ నవలని ఈ శ్రేణిలో ఇంతకు ముందు విడుధలైన పుస్తకాలతో పోల్చి ఈ విధముగా చెప్పారు: "ఇది పాటర్ శ్రేణి పుస్తకాల్లో అత్యుత్తమమైనది కాదు, కాని ఇది ఒక ముగింపు లాగ అనిపిస్తుంది. రౌలింగ్ పాటిస్తూ వస్తున్న కథాంశానికి చివరి అంకము. అది ఏమంటే: మరణం వాకిట్లో కూడా ప్రేమని కొనసాగిస్తూ ఉండటం యొక్క ప్రాముఖ్యత".[37][38] నవలా రచయత్రి ఎలిజబెత్ హ్యాండ్ హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్, శ్రేణికి సరైన ముగింపని అంగీకరించారు. అయితే, ఆమె చేసిన ఒక విమర్శ ఏమంటే,"... కథ చెప్పే విధానము మరియు పాత్రల యొక్క అధ్బుతమైన మరియు క్లిష్టమైన సంఘర్షణ చదువుతుంటే, మూడు పుస్తకాల్లో చెప్పాల్సిన విషయాలను ఒక పుస్తకములో ఇరికించినట్టు అనిపిస్తుంది."[39]

దీనికి భిన్నంగా, క్రిస్టియన్ సైన్స్ మానిటర్కి చెందిన జెన్నీ సాయర్, ఈ విధముగా చెప్పారు, "హ్యారీ పాటర్ శ్రేణిలో చాలా ప్రేమించదగిన విషయాలు ఉన్నాయి. అధ్బుతమైన మేధస్సుతో చూపబడిన మాంత్రిక ప్రపంచమునుండి అనేక ఇతివృత్తాలుకల కథ వరకు," అయితే "ఈ కథ ఒక మారుతున్న వ్యక్తి గురించినది" యౌవనము తప్ప హ్యారీలో పెద్దగా మార్పులు ఏమి లేవు. రౌలింగ్ అనుకున్నవిధముగా అతను తప్పకుండా మంచి మార్గములోనే నడుస్తూ ఉండటంతో, వోల్డ్‌మోర్ట్ మీద అతని ఆఖరి విజయం అనివార్యం కావడమే కాకుండా పస లేనిదిగా ఉంది.[40] 2007 ఆగస్టు 12లో న్యూ యార్క్ టైమ్స్కు చెందిన [[క్రిస్టోఫర్ హిచెన్స్|క్రిస్టోఫర్ హిచెన్స్]] ఈ పుస్తక శ్రేణిని రెండవ ప్రపంచ యుద్ధం సమయపు ఆంగ్ల బోర్డింగ్ పాఠశాల కథలతో పోల్చారు. అయన ఇంకా ఏమన్నారంటే, ఈ పుస్తక పరంపర మొత్తముతో "రౌలింగ్ మరణంలేని కీర్తిని సంపాదించారు". రౌలింగ్ deus ex machinaని వాడటం అతనికి నచ్చలేదు.ఇంకా పుస్తకములోని మధ్య భాగములో జరిగే శిబిరాల ఘటనలు అతి పెద్దగా ఉన్నాయని, "వోల్దేమొర్ట్ అయాన్ ఫ్లెమింగ్ నవలలో వచ్చే విలన్ కంటే కూడా ఎక్కువ నీరసం కలిగిస్తున్నాడు[108]" అని వ్రాశారు.

మాక్ కాలీతో సహా కొందరు విశ్లేషకులు పుస్తకం గురించి అతి త్వరగా ఒక నిర్ణయానికి రావడం పట్ల స్టీఫెన్ కింగ్ ఆక్షేపించారు.[110] పుస్తక విడుదలకి ముందు నెలకొన్న అత్యంత రహస్యము వల్ల విమర్శకలకి పుస్తకాన్ని చదివి ఒక అభిప్రాయానికి రావడానికి కావలసిని సమయం లేకపోవడం వల్ల ఇది తప్పనిసరి అయిందని ఆయిన భావించారు. ముందుగా బయటికి వచ్చిన కొన్ని విమర్శలలో ఎక్కువ లోతుగా లేదని కూడా అయన అన్నారు. వ్రాత శైలి ఇంకా మెరుగయింది, పరిపక్వత పొందింది తప్ప నిరాశ కలిగించే విధముగా లేదని అయన భావించారు. పుస్తకమొక్క విషయము పెద్ద వాళ్ళకి సంబంధించినవిగా మారిందని అన్నారు. రౌలింగ్ ఈ శ్రేణి మధ్యలో నుండి పెద్ద వాళ్ళని దృష్టిలో ఉంచుకునే వ్రాశారు అని అన్నారు. ఈ పుస్తకాలని హకిల్బరి ఫిన్ మరియు ఆలిస్ ఇన్ వండర్లాండ్ లతో పోల్చారు. ఈ రెండు పుస్తకాలు గొప్ప సనాతన గ్రంథాలుగా బావించబడుతాయంటే దానికి ఒక కారణం ఏమనగా ఈ పుస్తకాలు పిల్లలు, పెద్దలు ఇద్దరకి నచ్చే విధముగా ఉన్నాయి కనుక.

విక్రయాలు[మార్చు]

Lines at Borders at midnight to buy the book

హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాల్లోస్ నవల యొక్క అమ్మకాలు మునుపెన్నడూ లేనంతగా జరిగాయి. డెత్లీ హాలోస్ యొక్క తొలి U.S. అచ్చులో 12 మిలియను ప్రతులు అచ్చయ్యాయి. ఈ సంఖ్యలో ఒక మిలియను కంటే ఎక్కువ ప్రతులు అమేజాన్ మరియు బార్నెస్ & నోబెల్ వారిచే ముందుగానే ఆజ్ఞాపించబడినవి.[41] డెత్లీ హాలోస్ 500,000 ప్రతులు బార్న్స్ & నోబెల్ సైట్ ద్వారా పెట్టబడిన ప్రీ-ఆర్డర్ తో, ఇంతకు ముందు ఉన్న ప్రీ-ఆర్డర్ రికార్డ్ ను అధికమించింది అని అ సంస్థ 2007 ఏప్రిల్ 12 నాడు ప్రకటించింది.[42] ఆవిష్కరించిన తొలినాడే అత్యధికంగా 8.3 మిలియను ప్రతులు యునైటెడ్ స్టేట్స్[43][44] లోను, 2.65 మిలియను ప్రతులు యునైటెడ్ కింగ్డం[45] లోను విక్రియింబడ్డాయి. WH స్మిత్ వద్ద విక్రయాలు అత్యధికంగా జరిగి ప్రతి క్షణానికి 15 పుస్తకాల విక్రయించే స్థాయికి చేరుకున్నాయి.[46] జూను 2008 సంవత్సరం నాటికి అనగా పుస్తకము ప్రచురించి దాదాపు సంవత్సరం తిరిగేసరికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 44 మిలియను పుస్తకాలు అమ్ముడు పోయాయి.[47]

పురస్కారాలు మరియు గౌరవాలు[మార్చు]

హారీ పాటర్ అండ్ డెత్లీ హలోస్ పుస్తకము అనేక పురస్కారాలు అందుకుంది.[48] 2007 సంవత్సరములో ఈ పుస్తకము న్యుయార్క్ టైమ్స్ వారి 100 గొప్ప పుస్తకాల[49] జాబితా స్థానాన్ని మరియు ఉత్తమ పిల్లల పుస్తకాలలో ఒకటిగాను[50] స్థానం సంపాదించింది. పబ్లిషర్స్ వీక్లీ పత్రిక హ్యారీ పాటర్ అండ్ డెత్లీ హలోస్ పుస్తకాన్ని 2007 సంవత్సరములోని ఉత్తమ పుస్తకాలలో ఒకటిగా అభివర్ణించింది.[51] 2008 సంవత్సరములో అమెరికన్ లైబ్రరీ అస్సోసియేషన్ యువతకి ఆతి ఉత్తమమైన పుస్తకాల్లో[52] ఈ నవల ఒకటని, ఇంకా ఇది ఒక పేరుపొందిన పిల్లల పుస్తకమని[53] తెలిపింది. ఇదే కాక హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాల్లోస్ నవల 2008 సంవత్సరపు కోలోరాడో బ్లూ స్ప్రూస్ పుస్తక బహుమానమును గెలుచుకుంది.[48]

రౌలింగ్ యొక్క వ్యాఖ్యానము మరియు అదనపు సమాచారము[మార్చు]

ఆన్ లైన్ చాట్ లోని,[54][55] ఒక ముఖాముఖీ[56] సంభాషణలో మరియు ఆమె వెబ్సైట్ యొక్క 'ఈ నెల మాంత్రికుడు' అనే భాగంలో, మరియు 2007 U.S. ఓపెన్ బుక్ టూర్ వంటి సందర్భాలలో రౌలింగ్ పుస్తకములో చేర్చని పాత్రల గురించిన అదనపు విషయాలని వెల్లడించారు. ముందుగా చెప్పిన విషయాల్లో ముగ్గురు ముఖ్య పాత్రలు మరియు వాళ్ళ కుటుంబాల గురించిన వివరాలు ఉన్నాయి. మొదటిగా బైటికి వచ్చినవి హ్యారీ గురించిన విషయాలు.

హ్యారీ మాంత్రిక మంత్రిత్వశాఖలో ఒక ఆరర్ అయి తరువాత శాఖకి అధిపతిగా నియమితుడయ్యాడని ఆమె అన్నారు. హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్లో హ్యారీని ప్రేమించిన జిన్ని వెస్లి, హోలీహెడ్ హర్పీస్ క్విడ్డిచ్ జట్టులో కొన్నాళ్ళు ఆడి తరువాత హ్యరీని పెళ్ళి చేసుకొని కాపురాన్ని ప్రారంభిస్తుంది. తరువాత డైలీ ప్రాఫట్ పత్రికకి క్విడ్డిచ్ విలేకరిగా చేరుతుంది. రాన్ వెస్లి కొన్నాళ్ళు జార్గే యొక్క దుకాణంలో పనిచేసి ఆ వీస్లీస్ విజార్డ్ వీజేస్, తరువాత ఆరర్ గా హ్యరీతో కలిసి పని చేస్తాడు. హేర్మియాన్ తన తల్లితండ్రులని ఆస్ట్రేలియాలో కనిపెదుతుంది. వారి భద్రత కోసం తాను పెట్టిన జ్ఞాపకాలు మార్పుచేసే తంత్రాన్ని ఉపసంహరిస్తుంది. ఆరంభములో మాంత్రిక శాఖలో మాంత్రిక జీవుల నియంత్రణ మరియు కట్టుబాటు చేసే శాఖలో కొన్నాళ్ళు పనిచేసి, హౌస్ ఎల్వేస్ జీవితాల్లో గణనీయమైన మెరుగుదల తెస్తుంది. ఆమె తరువాత మాంత్రిక చట్టాల అమలుచేసే శాఖలో పనిలో చేరి, అన్యాయపరమైన స్వచ్ఛమైన రక్తం కలిగినివాళ్ళకే అనుకూలంగా ఉండే చట్టాలని తొలగించడంలో సహాయ పడుతుంది. వాళ్ళ ముగ్గురులో ఆమె మాత్రమే హోగ్వార్ట్స్ కి తిరిగి వెళ్లి ఏడవ సంవత్సరం చదువుని పూర్తి చేస్తుంది. రౌలింగ్ చెప్పిన ఇంకొక విషయము ఏమనగా, డంబెల్దోరే ఒక స్వలింగసంపర్కుడు.[57][58] తరువాత వోల్డ్‌మోర్ట్ గతి గురించి రౌలింగ్ చెప్పారు. మరణానంతరం అతను, కింగ్స్ క్రాస్ లిమ్బోలో హ్యారీ చూసినట్టు, మరుగుజ్జు రూపములో ఉండిపోతాడు. అతను చేసిన నేరాలు అతి ఘోరమైనవి కాబట్టి అతను ఒక ప్రేతంగా మారలేడు.

ఇంకా మాంత్రిక ప్రపంచములో ఏర్పడే మార్పులని రౌలింగ్ ఈ విధముగా తెలియచేశారు. హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్ అఫ్ ది ఫీనిక్స్లో ఒక చిన్న పాత్రగా పరిచయమైన కింగ్స్లీ శాకేల్బోల్ట్ శాశ్వతంగా మాంత్రిక శాఖ మంత్రి అవుతారు. రాన్ తనయుడు, పెర్సి వీస్లి అతని క్రింద ఒక ఉన్నత అధికారిగా పని చేస్తాడు. శాకేల్బోల్ట్ ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలలో ఒకటి ఏమంటే, మాంత్రికుల కారాగారమైన అస్కబాన్లోడేమెన్టార్లు వాడబడవు. హ్యారీ, రాన్ మరియు హీర్మియాన్ ముగ్గురూ మంత్రిత్వంలో సంస్కరణలు చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తారు.[54] హ్యారీ ఏడాదిలో అనేక సార్లు హోగ్వార్ట్స్ వెళ్ళి అక్కడ డిఫెన్సు అగైన్స్త్ ది డార్క్ ఆర్ట్స్ గురించి పాఠములు చెప్పేవాడు.[56] చివరగా స్నేప్ యొక్క చిత్రం ప్రధాన ఉపాధ్యాయుడు కార్యాలయంలో పెట్టలేదు ఎందుకంటే అతను కొంతకాలం ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పటికినీ,మధ్యలోనే మానివేశారు. హ్యారీ స్నేప్ యొక్క చిత్రాన్ని పెట్టించి, అతని నిజ స్వరూపాన్ని అందరికి బహిరంగ పరుస్తాడు.[54]

అనువాదములు[మార్చు]

హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పొందిన ప్రపంచవ్యాప్త కీర్తి వల్ల, ఈ పుస్తకము అనేక భాషలలో అనువదించబడింది . 2007 సెప్టెంబరు 25న మొదటి అనువాదం,ఉక్రేనియన్ భాషలో విడుదల అయింది (Гаррі Поттер і смертельні реліквії అనే పేరుతో).[151] హ్యారీ పాటర్ అండ్ ది రేలిక్స్ అఫ్ డెత్ (Harry Potter och Dödsrelikerna), అని రౌలింగ్ ఈ పుస్తకానికి స్వీడిష్ భాషలో పేరు పెట్టారు. స్వీడిష్ బాషలో ఈ పుస్తక ప్రచురణకర్త "డేత్లి హాలోస్" అనే రెండు పదాలని, పుస్తకాన్ని చదవకుండా అనువదించడములో ఉన్న ఇబ్బందిగా చెప్పినప్పుడు, రౌలింగ్ ఈ విధముగా పేరు పెట్టారు. [3]పోలిష్ భాషలో మొదటి అనువాదము, 2008 జనవరి 26న[4] ఒక కొత్త పేరుతో విడుదల అయింది : Harry Potter i Insygnia Śmierci - హ్యారీ పాటర్ అండ్ ది ఇంసిగ్నియా అఫ్ డెత్[59] హింది అనువాదం, Harry Potter aur Maut ke Tohfe (हैरी पॉटर और मौत के तोहफे) అంటే హ్యారీ పాటర్ అండ్ ది గిఫ్ట్స్ అఫ్ డెత్ అనే పేరుతో మంజుల్ పబ్లికేషన్ ద్వారా, 2008 జూన్ 27 న ఇండియాలో విడుదల అయింది. [5]

చలనచిత్రం తీయడం[మార్చు]

హ్యారీ పాటర్ అండ్ డెత్లీ హలోస్ కథని రెండు-భాగాల చలనచిత్రానికి అనువుగా తీయాలని తీర్మానించగా డేవిడ్ యేట్స్ అ రెండు భాగాలకి దర్శకత్వం వహిస్తారు. మొదటి భాగం 2010 సంవత్సరము నవంబరు 19న విడుదల కావలసివుండగా రెండవ భాగం 2011 సంవత్సరము జూలై 15న విడుదల చేయవలసివుంది.[60][61] 2007-2008 రైటర్స్ గిల్డ్ అఫ్ అమెరికా యొక్క సమ్మె ముగించే వరకు స్టీవ్ క్లోవ్స్ తన పని ప్రారంభించలేదు కనుక చలనచిత్ర యొక్క కథ తయారుకావటం ఆలస్యం అయింది.[62] చిత్రీకరణ 2009 సంవత్సరము ఫిబ్రవరి నెలలో మొదలయి ఒక సంవత్సరము పాటు సాగుతుంది.[63] మొదటి మూడు చిత్రాలలో సంగీతం అందించిన జాన్ విలియమ్స్, తిరిగి సంగీతం అందించటానికి ఆసక్తి చూపారు.[64]

సూచనలు[మార్చు]

 1. "Harry Potter finale sales hit 11m". BBC. 23 July 2007. Retrieved 2007-07-27. Cite web requires |website= (help)
 2. "Ukrainian Potter comes first". Kyiv Post. 27 July 2007. Retrieved 2007-07-29. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 "Släppdatum för sjunde Harry Potter-boken klar!". Tiden. Retrieved 2007-07-24. Cite web requires |website= (help)
 4. 4.0 4.1 "Translated Edition of Deathly Hallows Hits Stores in Poland". Leaky Cauldron website. 25 January 2008. Retrieved 2008-01-25. Cite web requires |website= (help)
 5. 5.0 5.1 "Harry Potter aur Maut Ke Tohfe - Hindi Version of the Deathly Hallows". India Club. Retrieved 2009-08-04. Cite web requires |website= (help)
 6. రౌలింగ్, జ్. కే. (2000). హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లేట్ అఫ్ ఫైర్ (ఆంగ్లంలో). లండన్: బ్లూమ్స్బరి, et al. p.566. UK ISBN 0-7475-4624-X.
 7. "Rowling reacts to Potter's end". USA Today. Associated Press. 2007-02-06. Retrieved 2007-07-21.
 8. "One-on-one interview with J.K. Rowling" (reprint). ITV. 2005-07-17. Retrieved 2007-06-16. Cite news requires |newspaper= (help)
 9. Rowling, J. K. (2004-03-15). "Progress on Book Six". J. K. Rowling Official Site. Retrieved 2006-12-23. Cite web requires |website= (help)
 10. "Rowling to kill two in final book". BBC News. 2006-06-27. Retrieved 2007-07-25. Cite news requires |newspaper= (help)
 11. "The Open Book Tour, October 2007". J.K.Rowling Official Site. 14 July 2007. Retrieved 2007-07-14. Cite web requires |website= (help)
 12. "Scholastic announces record breaking 12 million first printing in United States of Harry Potter and the Deathly Hallows". Scholastic. 14 March 2007. Retrieved 2007-07-09. Cite web requires |website= (help)
 13. "Harry Potter: Shrieking Shack Poll". Scholastic. Retrieved 2007-08-18. Cite web requires |website= (help)
 14. "Scholastic to Host "Harry Potter Place"". Scholastic. 2007-06-26. Retrieved 2007-06-26. Cite web requires |website= (help)
 15. "Rowling in Madeleine poster plea". BBC News. 2007-07-16. Retrieved 2007-07-17. Cite news requires |newspaper= (help)
 16. Rowling, J. K. (14 May 2007). "J.K.Rowling Official Site". Retrieved 2007-05-18. Cite web requires |website= (help)
 17. "10 million pounds to guard 7th Harry Potter book". Rediff News. 16 July 2007. Retrieved 2007-07-16. Cite web requires |website= (help)
 18. "Editor Says Deathly Hallows Is Unleakable". MTV Overdrive (video). 17 July 2007. Retrieved 2007-07-19. Cite web requires |website= (help)
 19. "Potter embargo "could be broken"". BBC News. 12 July 2007. Retrieved 2007-07-17. Cite web requires |website= (help)
 20. Hoyt, Clark (30 July 2007). "Did the Times Betray Harry Potter Fans?". New York Times. Retrieved 2007-07-30. Cite web requires |website= (help)
 21. 21.0 21.1 Fenton, Ben (17 July 2007). "Web abuzz over Potter leak claims". Retrieved 2007-07-20. Cite web requires |website= (help)
 22. Malvern, Jack (2007-07-19). "Harry Potter and the great web leak". Retrieved 2007-07-19. Cite web requires |website= (help)
 23. "The spell is broken". The Baltimore Sun. 18 July 2007. Retrieved 2007-07-18. Cite web requires |website= (help)
 24. "Press release from Scholastic". PR Newswire (from Scholastic). 18 July 2007. Retrieved 2007-07-18. Cite web requires |website= (help)
 25. "Distributor mails final Potter book early". MSNBC Interactive. 18 July 2007. Retrieved 2007-07-18. Cite web requires |website= (help)
 26. "I Was an eBay Voldemort". National Review Online. 20 July 2007. Retrieved 2007-07-20. Cite web requires |website= (help)
 27. "Potter book firm clashes with supermarket over price". Times Newspapers. 2007-07-17. Retrieved 2009-07-17. Cite web requires |website= (help)
 28. Addley, Esther (18 July 2007). "Harry Potter and the supermarket giant, a very modern publishing tale". The Guardian. Retrieved 2009-07-18. Cite web requires |website= (help)
 29. "British retailer sells final Potter book for $10, setting dangerous precedent for U.S. market". July 20, 2007. Archived on 2007-08-22. Error: If you specify |archivedate=, you must also specify |archiveurl=. http://web.archive.org/web/20070822145746/http://www.iht.com/articles/2007/07/20/arts/0721potter-asda.php. Retrieved 2009-07-17. 
 30. "Harry Potter and the ugly price war". The Star Malaysia. 21 July 2007. Retrieved 2007-07-21. Cite web requires |website= (help)
 31. "Bookstores end Harry Potter boycott". The Star Malaysia. 24 July 2007. Retrieved 2007-07-24. Cite web requires |website= (help)
 32. "Plans for Sabbath sales of Harry Potter draw threats of legal action in Israel". International Herald Tribune. 17 July 2007. మూలం నుండి 2007-09-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-07-18. Cite web requires |website= (help)
 33. "Yishai warns stores over Harry Potter book launch on Shabbat". Haaretz. 21 July 2007. Retrieved 2007-07-18. Cite web requires |website= (help)
 34. McCauley, Mary Carole (18 July 2007). "An inevitable ending to Harry Potter series". Baltimore Sun. Retrieved 2007-07-21. Cite web requires |website= (help)
 35. Fordham, Alice (21 July 2007). "Harry Potter and the Deathly Hallows". The Times. Retrieved 2007-07-25. Cite web requires |website= (help)
 36. Kakutani, Michiko (19 July 2007). "An Epic Showdown as Harry Potter Is Initiated Into Adulthood". New York Times. Retrieved 2009-07-20. Cite web requires |website= (help)
 37. గ్రోస్స్మన్, లెవ్; "ది 10 బెస్ట్ ఫిక్షన్ బుక్స్"; టైమ్ పత్రిక; 24 డిసెంబర్ 2007; పేజీలు 44–45.
 38. Grossman, Lev (24 December 2007). "Top 10 Fiction Books". time.com. Retrieved 2007-12-24. Cite web requires |website= (help)
 39. Hand, Elizabeth (22 July 2007). "Harry's Final Fantasy: Last Time's the Charm". The Washington Post Company. Retrieved 2009-07-20. Cite web requires |website= (help)
 40. Sawyer, Jenny (25 July 2007). "Missing from Harry Potter  a real moral struggle". Christian Science Monitor. Retrieved 2007-07-25. Cite web requires |website= (help)
 41. "Record print run for final Potter". BBC. 15 March 2007. Retrieved 22 May 2007. Cite news requires |newspaper= (help)
 42. "New Harry Potter breaks pre-order record". RTÉ.ie Entertainment. 13 April 2007. Retrieved 23 April 2007. Cite web requires |website= (help)
 43. Blais, Jacqueline (2007-07-24). "'Deathly Hallows' records lively sales". USAToday. Retrieved 2009-07-13. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Cite web requires |website= (help)
 44. Rich, Motoko (July 22, 2007). "Record First-Day Sales for Last 'Harry Potter' Book". New York Times. Retrieved 2009-07-13. Cite web requires |website= (help)
 45. "'Harry Potter and the Deathly Hallows' Breaks Records". Associated Press. July 24, 2007. Retrieved 2009-07-13. Cite web requires |website= (help)
 46. Phelvin, Patrick (23 Jul 2007). "Harry Potter and the hallowed sales figures". Telegraph. Retrieved 2009-07-13. Cite web requires |website= (help)
 47. "#9 J.K. Rowling". Forbes.com LLC. 06.11.08. Retrieved 2009-07-19. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 48. 48.0 48.1 "Harry Potter and the Deathly Hallows". Arthur A. Levine Books. 2001–2005. Retrieved 2009-07-17. Cite web requires |website= (help)CS1 maint: date format (link)
 49. "100 Notable Books of 2007". The New York Times. December 2, 2007. Retrieved 2009-07-17. Cite web requires |website= (help)
 50. Fleischman, Paul (December 2, 2007). "Notable Children's Books of 2007". The New York Times. Retrieved 2009-07-17. Cite web requires |website= (help)
 51. Staff (11/5/2007). "PW's Best Books of the Year". Reed Business Information. Retrieved 2009-07-17. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 52. "Best Books for Young Adults 2008". American Library Association. 2008. Retrieved 2009-07-17. Cite web requires |website= (help)
 53. "2008 Notable Children's Books". American Library Association. 2008. Retrieved 2009-07-17. Cite web requires |website= (help)
 54. 54.0 54.1 54.2 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; webchat అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 55. "Rowling Answers Fans' Final Questions". MSN Entertainment. 2007-07-30. Retrieved 2007-07-31. Cite news requires |newspaper= (help)
 56. 56.0 56.1 Brown, Jen (2007-07-25). "Finished Potter? Rowling tells what happened next". MSNBC. Retrieved 2007-07-26. Cite news requires |newspaper= (help)
 57. "Rowling says Dumbledore is Gay". Newsweek. 16 October 2007. Retrieved 2007-10-21. Cite news requires |newspaper= (help)
 58. "JK Rowling outs Dumbledore as gay". BBC News. 2007-10-20. Retrieved 2007-10-21. Cite news requires |newspaper= (help)
 59. "Harry Potter i insygnia śmierci". LibraryThing. 24 December 2007. Retrieved 2007-12-24. Cite web requires |website= (help)
 60. "Official: Two Parts for Deathly Hallows Movie". ComingSoon.net. 25 February 2009. Retrieved 2009-03-02. Cite web requires |website= (help)
 61. "Release Date Set for Harry Potter 7: Part I". ComingSoon.net. 25 April 2008. Retrieved 2008-05-25. Cite web requires |website= (help)
 62. "About Those Harry Potter Rumours". Empire. 14 January 2008. Retrieved 2008-02-14. Cite web requires |website= (help)
 63. Richards, Olly (2008-03-14). "Potter Producer Talks Deathly Hallows". Empire. Retrieved 2008-03-15. Cite news requires |newspaper= (help)
 64. "Williams Might be Back for Last Potter Film". JWFAN. 2007-08-22. Retrieved 2007-08-25. Cite news requires |newspaper= (help)

వెలుపటి వలయము[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.