‘కొకొరొ’ నవల
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |

‘కొకొరొ’ (Kokoro) ఒక జపనీస్ నవల.
జపాన్ దేశపు పురాతన, ఆధునిక సంధి కాలంలో సోసెకి నట్సు మే (Natsume Soseki) (1867 - 1916) అనే ప్రఖ్యాత జపనీస్ రచయిత తను మధ్య వయసు నుండి వృద్ధాప్యానికి పరివర్తనం చెందే సంధి వయసులో 1914 లో తన మరణానికి రెండు సంవత్సరాల ముందు ఈ నవలను రాశాడు. ఆయన మరణించిన ఇరవై ఏడు ఏండ్ల తరువాత, 1941లో మొట్ట మొదటిసారి ఆంగ్లభాలోకి అనువాదమైన ఈ నవల, 1957, 2020 లో రెండు పర్యాయాలు పునర్ముద్రణ అయింది. ఈ నవలను 1955లోను, 1973 లోనూ The Heart పేరుతో సినిమాగా తీశారు.
1957 లోనే ఆదర్శ గ్రంథమండలివారి కోసం శ్రీనివాస చక్రవర్తి గారు మొట్టమొదటిసారిగా ఈ నవలను తెలుగులోకి అనువాదం చేశారు. 2014 లో ‘పీకాక్ ఈ నవల చిన్నదే కానీ, ప్రపంచ వ్యాప్తంగా పాఠకు అలరించింది.
నవల దాదాపుగా ఉత్తమ పురుషలో, 'అలగరి' కథన పద్ధతిలో, ఎత్తుగడ నుండి ముగింపు వరకు పాఠకుడి ఆసక్తిని సడలనివ్వదని విమర్శకుకులు వ్యాఖ్ఖ్యానించారు.
ఈ నవలలో ప్రథాన పాత్రలు నాలుగే, ఆ నాలుగులో ముఖ్యమయినది 'సెన్సే' పాత్ర. ఇతనే ఈ నవలలో నాయకుడు, నవలా వస్తువు తగినట్లు నవల విషాదాంతంగా ముుగుస్తుంది.‘సొసెకి నట్సు మే’ నవల ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషలలోకి అనువదించబడింది.
సంక్షిప్త కథ
[మార్చు]ఓ యువకుడు తన మిత్రునితో గడిపేందుకు ‘కమలారా’ అనే పట్టణానికొస్తాడు. ఇతను వచ్చిన మరునాడే ఆ మిత్రుని తండ్రికి బాగలేకపోవడంతో వెంటనే ఇంటికి రావాల్సిందిగా సమాచారం రావడంతో తను వెళ్ళిపోతాడు, కానీ కొత్త యువకుడు మాత్రం ఆ గదిలోనే వుండిపోతాడు. సముద్రతీరంలో అతనికి 'సెన్సే' అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. తరువాత కొద్దిరోజులకే సెన్సే కమలారా నుండి టోక్యో వెళ్ళిపోయిన మరికొద్ది రోజులకు ఆ యువకుడు టోక్యో వెళ్ళి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒకనాడు సెన్సే ఇంటికి వెళతాడు. సెన్సే భార్య “తను ప్రతి నెలా ఇదే రోజున జోషిగాయాలోని ఓ సమాధిని సందర్శించడానికి వెళతాడు. ఈరోజు కూడా ఆలాగే వెళ్లా"డని చెబుతుంది. ఆ విషయం విన్న యువకుడు తిన్నగా జోషిగాయా వెళ్ళి, 'పితృవనం'లో సెన్సేను కలుస్తాడు. ఆసమయంలో అతని మొహంలో విచిత్రమైన విషాద ఛాయలు ఇట్టే కన్పించి అట్టే మాయమౌతాయి. కారణం ఆ యువకుడికి అర్ధంకాదు. మాటల సందర్భంలో సెన్సే ఆ యువకునితో “ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న మా దంపతులం ‘ఎంతో సుఖపడుతున్నాము’ అనడానికి బదులుగా ‘సుఖపడాల్సివుంది’ అంటాడు. ఆ మాటల్లోని భావాన్ని పట్టుకున్న యువకుడు, సెన్సే దంపతుల మధ్య సఖ్యత లేదన్న సందేహం కలిగి, వాళ్ళ వివాహం వెనుక ఏదో భయంకరమైన, రమణీయమైన శృంగారగాథలు వున్నాయని భావిస్తాడు. ఆ విషయంలో స్పష్టతకోసం సెన్సే భార్యతో కూడా విషయాన్ని ప్రస్తావించినా, ఆవిడ బయటపడదు. ఇంతలో ఆ యువకుడికి ఇంటి దగ్గర తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో ఇంటికెళ్ళిపోతాడు. వెళ్ళినవాడు పరిస్థితుల కారణంగా చాలా రోజులు ఇంటివద్దనే వుండి పోతాడు. అనుకోకుండా ఒకరోజు ఆ యువకుడికి 'సెన్సే' దగ్గర్నుండి పెద్ద ఉత్తరం వస్తుంది. ఉత్తరాన్ని విప్పగానే “ఈ ఉత్తరం నీ చేతికి అందేసరికి నేనీ లోకంలో ఉండను. నేనీ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు వివరిస్తున్నాను. చదివిన వెంటనే నా భార్యకు తెలియనివ్వకుండా దీన్ని చింపేయ్. నేను ప్రతినెలా ఏ సమాధి దగ్గరికి వెళుతున్నానో ఆ సమాధికి, నా జీవితానికి, నా భార్యజీవితానికి కూడా ముడిపడి వున్న సంబంధ మేమిటో నీకు తెలిసిపోతుంది. ప్రతిమనిషీ ఒక బలహీన క్షణంలో తెలిసో, తెలియకో తిరిగి తీసుకోలేనంత పెద్ద తప్పుచేస్తాడు. ఆ తప్పు ఒక్కోసారి ఎదుటి మనిషి ప్రాణాలను కూడా బలికోరుతుంది. ఒకనాడు నేను చేసిన ఒకానొక పనివల్ల ఎంతో మంచిమనిషి, మేధావి, స్నేహశీలి, అధ్యాత్మికవేత్త అయిన నా ప్రాణమిత్రుడు కనుమరుగైపోయాడు. ఆ పశ్చాతాపంతోనే ఇప్పుడు నేనూ వెళ్లిపోతున్నాను” అంటూ రాసిపెట్టి వుంటుంది. సెన్సే జీవితంలో మరుగున పడిన అనేక సంఘటనల వివరాలు ఆ ఉత్తరం చదివిన తరువాత పాఠకులకు నవలా సారాంశం అవగతమౌతుంది. పాఠకులు తప్పకుండా ఆ మిత్రుల మృతికి రెండు అశృ బింుదువులను చిందిస్తారు.
మూలాలు
[మార్చు]- 1. అనిల్ బత్తుల పబ్లికేషన్స్ ‘కొకొరొ’ నవల
- 2. శిరంశెట్టి కాంతారావు ముఖపుస్తకంలో వ్యాసం.
- 3. సోసికీ నట్సుమే జపాను దేశపు నవల