Jump to content

1000 వాలా

వికీపీడియా నుండి
1000 వాలా
దర్శకత్వంఅఫ్జల్ షేక్
నిర్మాతషారుఖ్
తారాగణం
  • అమిత్ డ్రీమ్ స్టార్
  • షారుఖ్ బేగ్
  • నవిత గంగత్
ఛాయాగ్రహణంచందు అజ్
కూర్పురవితేజ
సంగీతంవంశీకాంత్ రేఖనా
నిర్మాణ
సంస్థ
సూపర్ హిట్ మూవీ మేకర్స్
పంపిణీదార్లుSKML మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
2025 మార్చి 14 (2025-03-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

1000 వాలా 2025లో విడుదలైన తెలుగు సినిమా. సూపర్ హిట్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై షారుఖ్ బేగ్ నిర్మించిన ఈ సినిమాకు అఫ్జల్ దర్శకత్వం వహించాడు.[1] అమిత్, షారుఖ్ బేగ్, నవిత గంగాత్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 14న విడుదలైంది.[2][3]

అర్జున్ (అమిత్ డ్రీమ్ స్టార్) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో తన తాతయ్య వద్ద పెరుగుతాడు. చిన్నప్పటి నుండే నటుడు కావాలనే కోరిక ఉండడంతో జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు. అతని స్నేహితుడు బుజ్జి తండ్రి (పిల్ల ప్రసాద్) అర్జున్ టాలెంట్‌ను గుర్తించి, హైదరాబాద్‌కు రమ్మంటాడు. అక్కడ, సినిమా ఛాన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది. సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత చనిపోయిన అమిత్ స్థానంలో తనను తీసుకువచ్చి సినిమా పూర్తిచేస్తున్నారని తెలుస్తుంది. డేవిడ్ (షారుఖ్ భైగ్) కావ్యను చంపేందుకు ప్రయత్నిస్తాడు. అర్జున్ ఆమెను కాపాడుతాడు. అయితే చివరకు అమిత్‌ను ఎవరు చంపారు? అర్జున్ జీవితం ఎలా మారింది? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]
  • అమిత్ డ్రీమ్ స్టార్
  • షారుఖ్ బేగ్
  • నవిత గంగత్
  • ముక్తార్ ఖాన్
  • పిల్ల ప్రసాద్
  • సుమన్[5]

మూలాలు

[మార్చు]
  1. "థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో.. '1000 వాలా'! టీజర్ విడుదల". Chitrajyothy. 25 June 2024. Archived from the original on 1 January 2026. Retrieved 1 January 2026.
  2. "'1000 వాలా' రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?". 10TV Telugu. 7 March 2025. Archived from the original on 1 January 2026. Retrieved 1 January 2026.
  3. "1000 Wala: మార్చ్ 14న 1000 వాలా". NTV Telugu. 7 March 2025. Archived from the original on 1 January 2026. Retrieved 1 January 2026.
  4. "1000 Wala Review: 1000 వాలా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!". Zee News Telugu. 14 March 2025. Archived from the original on 1 January 2026. Retrieved 1 January 2026.
  5. "అమిత్ హీరోగా సుమన్ ప్రధాన పాత్రలో 1000 వాలా.. ఘనంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్". News 18 Telugu. 14 February 2025. Archived from the original on 1 January 2026. Retrieved 1 January 2026.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1000_వాలా&oldid=4743787" నుండి వెలికితీశారు