Jump to content

100 డేస్ లవ్‌స్టోరీ

వికీపీడియా నుండి
100 డేస్ లవ్‌స్టోరీ
100 డేస్ లవ్‌స్టోరీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
దర్శకత్వంవిజయమిత్ర
నిర్మాతపురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ
తారాగణం
  • జయ శివసూర్య
  • నిఖితశ్రీ
ఛాయాగ్రహణంశేషు డి.నాయుడు
కూర్పుశ్యామ్ కుమార్. పి
సంగీతంతరుణ్‌ రాణాప్రతాప్‌
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్
విడుదల తేదీ
2026 ఫిబ్రవరి 27 (2026-02-27)(థియేటర్)
సినిమా నిడివి
118 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

100 డేస్‌ లవ్‌స్టోరీ అనేది 2026, ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు సినిమా.[1][2] శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా, విజయమిత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జయ శివసూర్య, నిఖితశ్రీ జంటగా నటించారు.[3] ‘అతి ప్రేమ భయానకం’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్‌.

కథా నేపథ్యం

[మార్చు]

తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దారుణ హత్యకు గురికావడంతో, జీవితం పట్ల ఆశ కోల్పోయి తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్న ఒక యువకుడి కథ ఇది. ఆ చీకటి రోజుల్లోకి మరో అమ్మాయి వెలుగులా వస్తుంది. ఆమె స్వచ్ఛమైన ప్రేమ, అతనిలోని బాధను పోగొట్టి అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. అతను మళ్ళీ జీవితం మీద ఆశతో కొత్తగా బతకడం మొదలుపెడతాడు.

కానీ, ఆ తర్వాత అతనికి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. తాను ఇప్పుడు ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి మరెవరో కాదు, తన మొదటి ప్రేయసిని దారుణంగా చంపిన హంతకుడి సొంత చెల్లి అని! ఈ చేదు నిజం తెలిసినా, ఆమె స్వచ్ఛమైన ప్రేమ అతనిలోని పగను కరిగించేస్తుంది.

సరిగ్గా అప్పుడే అసలు భయం మొదలవుతుంది. తనను చంపిన వాడి రక్తసంబంధీకురాలితోనే తన ప్రియుడు సంతోషంగా ఉండటాన్ని ఆ మొదటి ప్రేయసి తట్టుకోలేకపోతుంది. అంతులేని కోపం, పగతో రగిలిపోతున్న ఆమె.. ఒక ఆత్మగా (Ghost) తిరిగి వస్తుంది. వాళ్ళిద్దరిపై పగ తీర్చుకోవడానికి, వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి ఆ దెయ్యం చేసే భయంకరమైన ప్రయత్నాలే ఈ కథ.

నటీనటులు

[మార్చు]
  • జయ శివసూర్య
  • నిఖిత శ్రీ
  • ఇషా మనోహరి ప్రియ
  • జబర్దస్త్ అప్పారావు
  • ఆకెళ్ళ గోపాలకృష్ణ
  • కుమరున్ సేతురామన్
  • పురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ

ప్రచారం

[మార్చు]

2026, జనవరి 26న ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది.[4]

విడుదల

[మార్చు]

ఈ చిత్రం 2026, ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల నుండి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "100 Days Love Story (2026) - Movie | Reviews, Cast & Release Date in Hyderabad". BookMyShow (in Indian English). Retrieved 2026-03-05.
  2. 100 Days Love Story Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes, retrieved 2026-03-05
  3. ABN (2026-02-15). "'100 డేస్ లవ్ స్టోరీ'.. ప్రేమ కథా చిత్రాల్లో కొత్త ఒరవడి | 100 days love story releasing on 27th avm". Chitrajyothy Telugu News. Retrieved 2026-03-05.
  4. telugu, NT News (2026-01-27). "అతి ప్రేమ భయానకం". www.ntnews.com. Retrieved 2026-03-05.
  5. Prakash, Lok. "100 Days Love Story: 'అతి ప్రేమ భయానకం' కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న'100 డేస్ లవ్ స్టోరీ'.. రిలీజ్ ఎప్పుడంటే?". rtvlive.com. Retrieved 2026-03-05.

బయటి లింకులు

[మార్చు]