1923
స్వరూపం
1923 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1920 1921 1922 - 1923 - 1924 1925 1926 |
దశాబ్దాలు: | 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1: స్వరాజ్ పార్టీ చిత్తరంజన్ దాస్ చేత స్థాపించబడింది
- ఏప్రిల్ 18: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి జరిగింది.
- నవంబర్ 28: భోగరాజు పట్టాభి సీతారామయ్య చే మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.
జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 6: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. (మ.1998)
- మార్చి 23: షేక్ అయాజ్, ప్రసిద్ధ పాకిస్థానీ సింధీ కవి. సితార-ఎ-ఇంతియాజ్ పురస్కారగ్రహీత. (మ.1997)
- మే 16: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మెర్టన్ మిల్లర్.
- మే 27: అమెరికా దౌత్యనీతివేత్త హెన్రీ కిసింజర్.
- మే 28: నందమూరి తారక రామారావు, తెలుగు సినీ నటుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ( మ.1996)
- జూన్ 23: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (మ.1986)
- జూలై 1: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (మ.1980)
- జూలై 2: విస్లావా సింబోర్స్కా, కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2012)
- జూలై 16: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (మ.2017)
- జూలై 21: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2005)
- జూలై 22: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (మ.1976)
- ఆగష్టు 14: కులదీప్ నయ్యర్, భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత.
- ఆగష్టు 23: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (మ.1985)
- ఆగష్టు 23: బలరామ్ జక్కర్ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
- ఆగష్టు 24: హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (మ.2010)
- ఆగష్టు 29: హీరాలాల్ గైక్వాడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- సెప్టెంబరు 2: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత, పండితుడు.
- సెప్టెంబరు 16: లీ క్వాన్ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్ జాతి పిత. (మ.2015)
- సెప్టెంబరు 26: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.2011)
- సెప్టెంబరు 24: కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేత. (మ.2006)
- అక్టోబరు 2 : ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన విద్యావేత్త. మాజీ వైస్ఛాన్స్లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం.
- అక్టోబరు 13: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణులు. (మ.2012)
- అక్టోబర్ 23: బైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (మ.2010)
- నవంబరు 16: తాడేపల్లి లక్ష్మీ కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (మ.2009)
- నవంబరు 19: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (మ.2017)
- : కృష్ణాజిరావు సింధే, తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాద లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (మ.2004)
- : అనగాని భగవంతరావు, న్యాయవాది, మంత్రివర్యులు. (మ.1986)
- : బొడ్డేపల్లి రాజగోపాలరావు, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. (మ.1992)
మరణాలు
[మార్చు]- జనవరి 1: రామ్గోపాల్ మలానీ, హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.
- జూలై 12: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877)
- ఫిబ్రవరి 10: రాంట్జన్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- ఆగష్టు 20: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (జ.1856)