1932
స్వరూపం
1932 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1929 1930 1931 - 1932 - 1933 1934 1935 |
దశాబ్దాలు: | 1910లు 1920లు 1930లు 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జూన్ 25: భారతదేశం తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడింది.
- జూలై 30: 10వ వేసవి ఒలింపిక్ క్రీడలు లాస్ ఏంజిల్స్‌లో ప్రారంభమయ్యాయి.
- సెప్టెంబర్ 24: భారత్ లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
- నవంబరు 17: లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
జననాలు
[మార్చు]- జనవరి 2: ఓగేటి అచ్యుతరామశాస్త్రి, పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త.
- ఫిబ్రవరి 1: విఠల్‌రావు దేశపాండే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. (మ.2016)
- ఫిబ్రవరి 6: భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010)
- ఫిబ్రవరి 11: రావి కొండలరావు, తెలుగు సినిమా నటుడు, రచయిత.
- ఫిబ్రవరి 14: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018)
- ఫిబ్రవరి 25: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016)
- మే 3: బూదరాజు రాధాకృష్ణ, భాషావేత్త. (మ.2006)
- జూన్ 11: ధారా రామనాథశాస్త్రి, నాట్యావధాని.
- జూన్ 21: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (మ.2000)
- జూన్ 22: అమ్రీష్ పురి, భారత సినిమా నటుడు. (మ.2005)
- జూలై 18: భవనం వెంకట్రాంరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
- ఆగష్టు 9: జాలాది రాజారావు, తెలుగు రచయిత. (మ.2011)
- ఆగష్టు 10: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (మ.2010)
- ఆగస్టు 23: ఉండేల మాలకొండ రెడ్డి, ఇంజనీరు, తెలుగు రచయిత, కవి.
- సెప్టెంబర్ 29: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (మ.2004)
- అక్టోబరు 12: యుషిరో మియురా, తన 70వ యేట, 75వ యేట, 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు.
- అక్టోబరు 24: జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (మ. 2022)
- అక్టోబరు 26: ఎస్. బంగారప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి .
- నవంబరు 4: వి.బి.రాజేంద్రప్రసాద్, జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015)
- నవంబరు 7: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013)
- డిసెంబరు 21: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014)
- డిసెంబరు 28: నేరెళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ కళాకారుడు.
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 9: దొంతులమ్మ, ఆంధ్ర యోగిని, అవధూత.
- మే 20: బిపిన్ చంద్ర పాల్, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు. (జ.1858)
- సెప్టెంబర్ 16: రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857)