1947 దేశవిభజన ఆర్కైవ్
| 1947 విభజన ఆర్కైవ్ | |
|---|---|
| Location | బర్క్‌లీ, కాలిఫోర్నియా, అమెరికా |
| Type | మౌఖిక చరిత్రా ప్రయత్నం |
| Established | 2011 |
| Collection size | 2025 జూన్ నాటికి 12,000+ వీడియో ఇంటర్వ్యూలు |
| Website | http://www.1947partitionarchive.org/ |
1947 పార్టిషన్ ఆర్కైవ్ అనేది కాలిఫోర్నియాలోని బర్కిలీలో ఉన్న 501(c)(3) లాభాపేక్షలేని మౌఖిక చరిత్ర సంస్థ. ఢిల్లీలో గునీతా సింగ్ భల్లా స్థాపించిన, నమోదైన ట్రస్టు. ఇది 1947లో భారతదేశ విభజనకు సంబంధించిన ప్రత్యక్ష కథనాలను సేకరించి, భద్రపరిచి, ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది.[1]
విభజన కథలు, హిందూ-ముస్లిం సంబంధాల మధ్య ఉన్న సున్నితమైన సంబంధం దృష్ట్యా, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ గ్రంథాలయాల సహకారంతో ఆర్కైవ్ సేకరణలోని ఒక చిన్న భాగాన్ని ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలకు విడుదల చేశారు.[2] ప్రస్తుతం, విద్యా పరిశోధన కోసం కథల పూర్తి సంకలనాన్ని ఆన్‌లైన్‌లో చూసేందుకు, పండితులకు మంజూరు చేస్తున్నారు. 1947 పార్టిషన్ ఆర్కైవ్ ప్రధాన కార్యాలయంలో అపాయింట్‌మెంట్ ద్వారా పూర్తి సేకరణను ప్రజలు కూడా చూడవచ్చు.[3][4]
2021 జూలై 27 న, ఈ సంస్థ కాలిఫోర్నియాలోని బర్కిలీ నగర ప్రభుత్వంతో కలిసి జూన్ 3 ను విభజన స్మరణ దినంగా ప్రకటించింది. ఎందుకంటే 1947లో ఇదే రోజున భారతదేశాన్ని విభజించే మౌంట్‌బాటన్ ప్రణాళికను వైస్రాయ్ ప్రకటించారు.[5][6][7] 2024 ఆగష్టు 8 న ఈ సంస్థ "10,000 మెమరీస్: ఎ లివ్డ్ హిస్టరీ ఆఫ్ పార్టిషన్, ఇండిపెండెన్స్ అండ్ వరల్డ్ వార్ II ఇన్ సౌత్ ఏషియా" అనే పుస్తకాన్ని విడుదల చేసింది. దక్షిణాసియా లోను, ఇతర ప్రాంతాలలోని వివిధ దేశాలలోనూ విస్తరించి ఉన్న విభజన బాధితుల గొంతులను వినిపించే దాదాపు 300 మౌఖిక సాక్ష్యాలు, 1,000 ఛాయాచిత్రాలూ ఇందులో ఉన్నాయి.[8][9][10]
చరిత్ర
[మార్చు]2010లో డాక్టర్ గునీతా సింగ్ భల్లా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉన్న విభజన ప్రత్యక్ష సాక్షులతో వీడియో ఇంటర్వ్యూలను రికార్డ్ చేయడం ప్రారంభించడంతో ఈ సంస్థ మొదలై, 2011 లో అధికారికంగా రూపుదిద్దుకుంది. 1947 విభజన ఆర్కైవ్ సృష్టికి హిరోషిమా శాంతి స్మారక చిహ్నం, వివిధ హోలోకాస్ట్ స్మారక చిహ్నాల కృషి ప్రేరణగా నిలిచాయి.[2][11][12]
సంస్థ
[మార్చు]1947 విభజన ఆర్కైవ్, విభజన సాక్షుల ఇంటర్వ్యూల సేకరణను క్రౌడ్-సోర్స్ చేస్తుంది. కథల సేకరణ, ఇంటర్వ్యూ పద్ధతులలో వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడానికి ఆన్‌లైన్ ఓరల్ హిస్టరీ వర్క్‌షాప్ రూపంలో ఉచిత తరగతులను నిర్వహిస్తుంది. [13] 2025 జూన్ నాటికి, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇజ్రాయెల్‌తో సహా 14 దేశాల్లోని 450 పైచిలుకు నగరాలు, గ్రామాల నుండి 12,000 కంటే ఎక్కువ ఇంటర్వ్యూలను సేకరించారు. [14][15][16] ఈ ఇంటర్వ్యూలు విభిన్న భాషల్లో విభిన్న మాండలికాలలో నమోదు చేసారు. ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి వ్యక్తికీ చెందిన వలస నమూనాలను చూపించే స్టోరీ మ్యాప్, ఆర్కైవ్ వెబ్‌సైట్‌లో ఉంది.
ఆర్కైవ్ కథల సేకరణ పద్ధతులలో స్టోరీ స్కాలర్స్, ఒక ఫెలోషిప్ కార్యక్రమం ఉంది. దీనిలో ఎంపిక చేసిన ప్రాంతంలో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి విద్యా ప్రతిభ, మునుపటి అనుభవం ఆధారంగా వ్యక్తులను ఎంపిక చేస్తారు. సిటిజన్ హిస్టోరియన్స్ అనే ఒక కార్యక్రమం ద్వారా స్వచ్ఛంద సేవకులు, విభజన కథలను సంస్థ వెబ్‌సైట్‌కు అందించవచ్చు.[17] ఆర్కైవ్ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ఆధారంగా, "ఓరల్ హిస్టరీ అసోసియేషన్, బేలర్ విశ్వవిద్యాలయ ఓపెన్-సోర్స్ ఆన్‌లైన్ వనరుల ద్వారా వివరించబడిన విధంగా, మౌఖిక చరిత్రలను డాక్యుమెంట్ చేయడానికీ, ప్రాథమిక పద్ధతులను నేర్చుకోవడానికీ, ఉచిత మౌఖిక చరిత్ర వెబినార్ వర్క్‌షాప్‌లలో చేరడానికీ ప్రపంచవ్యాప్తంగా సాధారణ పౌరులను ఆహ్వానించారు." [18] డాక్టర్ భల్లా ప్రకారం, "వర్క్‌షాప్‌కు హాజరైనవారు తమ మొదటి మౌఖిక చరిత్ర ఇంటర్వ్యూను విజయవంతంగా సమర్పిస్తారు. అది ఆర్కైవ్ వారి తొమ్మిది-పాయింట్ల ప్రమాణాలకు సరిపోలితే, వారిని 'సిటిజన్ హిస్టోరియన్' వాలంటీర్లుగా ధృవీకరిస్తారు."[18]
ఢిల్లీ విశ్వవిద్యాలయం, అశోక విశ్వవిద్యాలయం, గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయాల సహకారంతో, 'టాటా ట్రస్ట్స్ పార్టిషన్ ఆర్కైవ్ రీసెర్చ్ గ్రాంట్స్' పేరుతో, ఒక నెలపాటు పూర్తిస్థాయిలో పాల్గొని, విభజనపై పరిశోధన చేయడానికి విశ్వవిద్యాలయ అధ్యాపకులకు, విద్యార్థులకు ఆర్కైవ్ గతంలో నిధులను అందించింది. "క్రౌడ్‌సోర్సులో జీవన జ్ఞాపకాల ద్వారా పంజాబ్, దక్షిణాసియాలో అంతరించిపోతున్న చరిత్రను" సేకరించడమే ఈ ఆర్కైవ్ ప్రాథమిక లక్ష్యం.[19]
ఇవి కూడా చూడండి
[మార్చు]- విభజన మ్యూజియం, అమృత్సర్
- విభజన మ్యూజియం, ఢిల్లీ
- కోల్‌కతా విభజన మ్యూజియం
- భారతదేశ విభజనకు వ్యతిరేకత
- భారత తాత్కాలిక ప్రభుత్వం
- భారతదేశ విభజన సమయంలో మహిళలపై హింస
- భారతదేశ విభజన
- బెంగాల్ విభజన
మూలాలు
[మార్చు]- ↑ Sengupta, Somini (13 August 2013). "The New York Times". Retrieved 2014-07-13.
- 1 2 "Now an archive that collects stories of Partition". The Indian Express. 25 May 2014. Retrieved 2014-07-13.
- ↑ "Explore the Personal Stories of Partition". The 1947 Partition Archive - Spotlight Exhibits. May 22, 2017.[permanent dead link]
- ↑ "Archive Access – 1947 partition archive".
- ↑ "First Partition remembrance day marked in US, India". The Times of India. 2022-06-05. ISSN 0971-8257. Retrieved 2023-07-11.
- ↑ Writer, Staff (August 9, 2021). "City of Berkeley Proclaims 'Partition Remembrance Day'". India Currents.
- ↑ Gupta, Kavya (August 2, 2021). "Berkeley City Council names June 3 as annual 'Partition Remembrance Day' to honor India-Pakistan Partition". www.dailycal.org.
- ↑ "Partition archive' inaugural book 10,000 Memories, a lived history of partition set to release on Friday". The Times of India. 2023-03-09. ISSN 0971-8257. Retrieved 2023-07-11.
- ↑ Punwani, Jyoti. "Gripping storytelling session busts many myths surrounding Partition". Hindustan Times.
- ↑ "10000 Memories – To know where we are going, we must know where we have come from".
- ↑ Singh Bhalla, Guneeta (August 13, 2016). "Why we gave up our careers to bring you stories of Partition". Dawn.
- ↑ "75 years of India partition: How tech is opening window into past". Al Jazeera. August 12, 2022.
- ↑ "Archiving memories of shared, partitioned past". thenews.com.pk. Archived from the original on 2018-12-26. Retrieved 2014-07-13.
- ↑ "1947 beyond the tracks". indiatoday.in. 25 January 2020. Retrieved 2020-02-19.
- ↑ "The 1947 Partition Archive website". Retrieved June 19, 2025.
- ↑ Anand Chawla, Noor (July 30, 2022). "RECORDING STORIES OF PARTITION SURVIVORS FROM AROUND THE WORLD". The Sunday Guardian.
- ↑ "1947 Partition Archive Project Director Interview". California Humanities Blog. calhum.org. Archived from the original on 2017-03-08. Retrieved 2017-03-07.
- 1 2 . "The 1947 Partition Archive: A Living, Evolving Crowdsourced Archive on India's 1947 Partition".
- ↑ Bhatt, Neha (August 12, 2022). "Legacy of India's Partition was reduced to a minor event. After 75 years, community groups are bringing private pain to the fore". The Globe and Mail.