Jump to content

1951 ఆసియా క్రీడలలో భారతదేశం

వికీపీడియా నుండి
India at the
1951 ఆసియా క్రీడలు
IOC codeIND
NOCఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్
in న్యూఢిల్లీ
Medals
Ranked 2nd
Gold
15
Silver
16
Bronze
20
Total
51
ఆసియా క్రీడలు appearances
auto

మొట్టమొదటి ఆసియా క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. న్యూ ఢిల్లీలో మార్చి 4 నుండి మార్చి 11, 1951 వరకూ ఈ క్రీడలు జరిగాయి. భారతదేశం 15 బంగారు పతకాలు, 16 రజత పతకాలు, 20 కాంస్య పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది.

కాంతి షా భారత దేశానికి ఆసియా క్రీడలలో తొలి పతకాన్ని అందించాడు. ఇతడు ఈత పోటీలలో 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఈవెంటులో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. కాగా సచిన్ నాగ్ 100 మీ. ఫ్రీస్టైల్ ఈత పోటీలో భారత దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. భారత ఫుట్‌బాల్ జట్టు ఆసియా క్రీడలలో తొలి స్వర్ణపతకాన్ని అందించింది. 2022 ఆసియా క్రీడలు ముగిసే సమయానికి 1951లో జరిగిన మొదటి విడత ఆసియా క్రీడలలో మాత్రమే డైవింగ్, స్విమ్మింగ్, వాటర్ పోలో ఈవెంట్లలో స్వర్ణ పతకాలను సాధించింది. సైక్లింగ్‌లో కూడా ఈ క్రీడలలోనే పతకాన్ని సాధించగలిగింది. ఇంతవరకూ జరిగిన ఆసియా క్రీడలలో 1951 ఆసియా క్రీడలలో అథ్లెటిక్స్‌లో 34 పతకాలతో ఉత్తమ ప్రదర్శనను ఇచ్చింది.

పతకాల వివరాలు

[మార్చు]

క్రీడల వారీగా పతకాలు

[మార్చు]
Medals by sport
క్రీడ ర్యాంకు స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
అథ్లెటిక్స్ 2 10 12 12 34
డైవింగ్ 1 2 1 1 4
స్విమ్మింగ్ 3 1 1 4 6
ఫుట్‌బాల్ 1 1 0 0 1
వాటర్ పోలో 1 1 0 0 1
సైక్లింగ్ 2 0 1 2 3
వెయిట్ లిఫ్టింగ్ 3 0 1 1 2
మొత్తం 2 15 16 20 51

పతక విజేతలు

[మార్చు]
పతకం పేరు[1] క్రీడ ఈవెంటు
 Gold సచిన్ నాగ్ స్విమ్మింగ్ పురుషుల 100 మీ. ఫ్రీ స్టైల్
 Gold మహాబీర్ ప్రసాద్ అథ్లెటిక్స్ పురుషుల 10 కి.మీ. నడక
 Gold నిక్కా సింగ్ అథ్లెటిక్స్ పురుషుల 1500 మీ.
 Gold లావీ పింటో అథ్లెటిక్స్ పురుషుల 200 మీ.
 Gold రంజిత్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల 800 మీ.
 Gold భక్తవర్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల 50 కి.మీ.నడక
 Gold మదన్‌లాల్ అథ్లెటిక్స్ పురుషుల షాట్ పుట్
 Gold అమిత్ సింగ్ బక్షీ
గోవింద్ సింగ్
బల్వంత్ సింగ్
కర్ణన్ సింగ్
అథ్లెటిక్స్ పురుషుల 4 × 400 మీ. రిలే
 Gold కె. పి. ఠక్కర్ డైవింగ్ పురుషుల 3 మీ. స్ప్రింగ్ బోర్డ్
 Gold ఫుట్‌బాల్ పురుషుల జట్టు[2]
 Gold లావీ పింటో అథ్లెటిక్స్ [పురుషుల 100 మీ.
 Gold ఛోటా సింగ్ అథ్లెటిక్స్ పురుషుల మారథాన్
 Gold మఖన్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల డిస్కస్ త్రో
 Gold కె. పి. ఠక్కర్ డైవింగ్ పురుషుల 10 మీ. ప్లాట్‌ఫామ్
 Gold
భారత జాతీయ పురుషుల వాటర్ పోలో జట్టు
వాటర్ పోలో పురుషుల జట్టు
 Silver కాంతి షా స్విమ్మింగ్ పురుషుల 100 మీ బ్యాక్‌స్ట్రోక్
 Silver సోమనాథ్ చోప్రా అథ్లెటిక్స్ పురుషుల హ్యామర్ త్రో
 Silver కామినేని ఈశ్వరరావు వెయిట్ లిఫ్టింగ్ పురుషుల మిడిల్ హెవీవెయిట్ 90 కె.జి.
 Silver మరియన్ గాబ్రియల్ అథ్లెటిక్స్ పురుషుల 200 మీ.
 Silver కుల్వంత్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల 800 మీ.
 Silver ప్రీతమ్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల 5000 మీ.
 Silver తేజా సింగ్ అథ్లెటిక్స్ పురుషుల 400 మీ. హర్డిల్స్
 Silver బి. దాస్ అథ్లెటిక్స్ పురుషుల 50 కి.మీ. నడక
 Silver బలదేవ్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల లాంగ్ జంప్
 Silver పర్సా సింగ్ అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రో
 Silver రోషన్ మిస్త్రీ అథ్లెటిక్స్ మహిళల 100 మీ.
 Silver మేరీ డిసౌజా సెక్వీరా
రోషన్ మిస్త్రీ
బానూ గుల్జార్
పాట్ మెండోంకా
అథ్లెటిక్స్ మహిళల 4×100 మీ. రిలే
 Silver ధన్‌గర్ లహంగార్డ్
రాజ్ కుమార్ మెహ్రా
మదన మోహన్
గురుదేవ్ సింగ్
సైక్లింగ్ పురుషుల 4000 మీ టీమ్ పర్స్యూట్
 Silver అషు దత్ డైవింగ్ పురుషుల 3 మీ. స్ప్రింగ్ బోర్డ్
 Silver అమిత్ సింగ్ బక్షీ అథ్లెటిక్స్ పురుషుల 400 మీ.
 Silver లావీ పింటో
మరియన్ గాబ్రియల్
రామ్ స్వరూప్
ఆల్ఫ్రెడ్ షమీన్
అథ్లెటిక్స్ పురుషుల 4×100 మీ. రిలే
 Bronze నేతై చాంద్ బైసక్ సైక్లింగ్ పురుషుల 1000 మీ. టైమ్ ట్రయల్
 Bronze జహంగీర్ నైగంవాలా స్విమ్మింగ్ పురుషుల 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్
 Bronze ఇసాక్ మన్సూర్
బిమల్ చంద్ర
శంభు సాహా
సచిన్ నాగ్
స్విమ్మింగ్ పురుషుల 4 x 100 మీ ఫ్రీస్టైల్ రిలే
 Bronze దండమూడి రాజగోపాలరావు వెయిట్ లిఫ్టింగ్ పురుషుల హెవీ వెయిట్ +90 కె.జి.
 Bronze కాంతి షా
జహంగీర్ నైగంవాలా
సచిన్ నాగ్
స్విమ్మింగ్ పురుషుల 3 x 100 మీ. మెడ్లీ రిలే
 Bronze బిమల్ చంద్ర స్విమ్మింగ్ పురుషుల 400 మీ. ఫ్రీస్టైల్
 Bronze గురుబచన్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల 10000 మీ
 Bronze కేసర్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల 10 కి.మీ. నడక
 Bronze కిషన్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల హ్యామర్ త్రో
 Bronze కుర్షీద్ అహ్మద్ అథ్లెటిక్స్ పురుషుల డెకాథ్లాన్
 Bronze రోహింటన్ నోబుల్ సైక్లింగ్ పురుషుల 1000 మీ. స్ప్రింట్
 Bronze మేరీ సిమోస్ అథ్లెటిక్స్ మహిళల హైజంప్
 Bronze బార్బరా వెబ్‌స్టర్ అథ్లెటిక్స్ మహిళల షాట్ పుట్
 Bronze గోవింద్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల 400 మీ
 Bronze అజిత్ సిం‍గ్ అథ్లెటిక్స్ పురుషుల 3000 మీ. స్టీపుల్‌ఛేజ్
 Bronze సూరత్ సింగ్ మాథుర్ అథ్లెటిక్స్ పురుషుల మారథాన్
 Bronze మేరీ డిసౌజా సెక్వీరా అథ్లెటిక్స్ మహిళల 200 మీ.
 Bronze సిల్వియా గాంట్లెట్ అథ్లెటిక్స్ మహిళల లాంగ్ జంప్
 Bronze బార్బరా వెబ్‌స్టర్ అథ్లెటిక్స్ మహిళల జావెలిన్ త్రో
 Bronze టి. టి. దండ్ డైవింగ్ పురుషుల 10 మీ. ప్లాట్‌ఫామ్

మూలాలు

[మార్చు]
  1. "Asian Games 1951 Indian medal winners".
  2. Majumdar, Rounak (22 April 2019). "The Golden Years of Indian Football". www.chaseyoursport.com. Kolkata: Chase Your Sport. Archived from the original on 7 November 2020. Retrieved 28 January 2022.