1987 క్రికెట్ ప్రపంచ కప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1987 క్రికెట్ ప్రపంచ కప్
అధికారిక లోగో
తేదీలు1987 అక్టోబరు 8 – నవంబరు 8
నిర్వాహకులుఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్, నాకౌట్
ఆతిథ్యం ఇచ్చేవారు
  • ఇండియా
  • పాకిస్తాన్
ఛాంపియన్లు ఆస్ట్రేలియా (1st title)
పాల్గొన్నవారు8
ఆడిన మ్యాచ్‌లు27
అత్యధిక పరుగులు గ్రాహం గూచ్ (471)
అత్యధిక వికెట్లు క్రైగ్ మెక్ డెర్మట్ (18)
1983
1992

1987 క్రికెట్ ప్రపంచ కప్ (స్పాన్సర్‌షిప్‌ను బట్టి అధికారికంగా దీన్ని రిలయన్స్ కప్ 1987 అని పిలుస్తారు) క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో నాలుగవది. ఇది 1987 అక్టోబరు 8 నుండి నవంబర్ 8 వరకు భారతదేశం, పాకిస్తాన్‌లలో జరిగింది. ఇది ఇంగ్లాండ్ వెలుపల జరిగిన మొదటి టోర్నమెంటు. ఒక్కో జట్టు ఆడే ఓవర్ల సంఖ్యను 60 నుండి 50కి తగ్గించడం మినహా, 1983 నాటి ఎనిమిది జట్ల ఈవెంట్ నుండి వన్-డే ఫార్మాట్ ఏమీ మారలేదు.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన రెండవ అత్యంత సన్నిహితంగా పోరాడిన ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను ఏడు పరుగుల తేడాతో ఓడించి, మొదటిసారిగా ఈ పోటీని గెలుచుకుంది. ఆతిథ్య దేశాలైన భారత్, పాకిస్థాన్‌లు రెండూ సెమీ-ఫైనల్‌లో నిష్క్రమించాయి. వెస్టిండీస్ అంచనాలను అందుకోవడంలో విఫలమై గ్రూప్ దశ లోనే నిష్క్రమించింది.[1]

ఫార్మాట్

[మార్చు]

నాలుగు జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి. 50 ఓవర్ల మ్యాచ్‌లలో ప్రతి జట్టు ప్రతి ఇతర జట్టుతో రెండుసార్లు ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. అక్కడ గెలిచిన రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. అన్ని మ్యాచ్‌లు పగటిపూటనే జరుగుతాయి. టోర్నమెంట్ చరిత్రలో చివరిసారిగా జట్లు సంప్రదాయ తెల్లని దుస్తులలో కనిపించాయి. టెస్ట్/ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఉపయోగించిన సంప్రదాయ ఎరుపు బంతులనే వాడారు.

అర్హత

[మార్చు]

టెస్ట్ హోదాను కలిగిన మొత్తం ఏడు (అర్హత) దేశాలు ఆటోమాట్యిగ్గా టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తాయి. 1986 ICC ట్రోఫీ విజేతలకు ఒక స్థానం లభిస్తుంది; నెదర్లాండ్స్‌ను ఓడించి బెర్త్ సంపాదించిన జింబాబ్వేకి ఇది రెండోసారి.

వేదికలు

[మార్చు]

  

వేదిక నగరం సామర్థ్యం మ్యాచ్‌లు
భారతదేశం
ఈడెన్ గార్డెన్స్ కలకత్తా, పశ్చిమ బెంగాల్ 1,20,000 2
వాంఖడే స్టేడియం బొంబాయి, మహారాష్ట్ర 45,000 2
MA చిదంబరం స్టేడియం మద్రాసు, తమిళనాడు 50,000 2
లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ 30,000 1
ఎం. చిన్నస్వామి స్టేడియం బెంగళూరు, కర్ణాటక 45,000 1
నెహ్రూ స్టేడియం ఇండోర్, మధ్యప్రదేశ్ 25,000 1
అరుణ్ జైట్లీ గ్రౌండ్ ఢిల్లీ 48,000 1
సర్దార్ పటేల్ స్టేడియం అహ్మదాబాద్, గుజరాత్ 48,000 1
సెక్టార్ 16 స్టేడియం చండీగఢ్, పంజాబ్ - హర్యానా 48,000 1
బారాబతి స్టేడియం కటక్, ఒడిశా 25,000 1
విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ నాగ్‌పూర్, మహారాష్ట్ర 40,000 1
గ్రీన్ పార్క్ కాన్పూర్, ఉత్తరప్రదేశ్ 40,000 1
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం జైపూర్, రాజస్థాన్ 30,000 1
నెహ్రూ స్టేడియం పూణే, మహారాష్ట్ర 25,000 1
పాకిస్తాన్
ఇక్బాల్ స్టేడియం ఫైసలాబాద్, పంజాబ్ 25,000 1
మున్సిపల్ స్టేడియం గుజ్రాన్‌వాలా, పంజాబ్ 20,000 1
నియాజ్ స్టేడియం హైదరాబాద్, సింధ్ 15,000 1
జాతీయ స్టేడియం కరాచీ, సింధ్ 45,000 3
గడ్డాఫీ స్టేడియం లాహోర్, పంజాబ్ 35,000 2
అర్బాబ్ నియాజ్ స్టేడియం పెషావర్, ఖైబర్ పఖ్తుంక్వా 25,000 1
పిండి క్లబ్ గ్రౌండ్ రావల్పిండి, పంజాబ్ 25,000 1

గ్రూప్ దశ

[మార్చు]

గ్రూప్ A

[మార్చు]
Pos Team Pld W L T NR Pts RR
1  India 6 5 1 0 0 20 5.413
2  Australia 6 5 1 0 0 20 5.193
3  New Zealand 6 2 4 0 0 8 4.887
4  Zimbabwe 6 0 6 0 0 0 3.757
1987 అక్టోబరు 9
స్కోరు
ఆస్ట్రేలియా 
270/6 (50 ఓవర్లు)
v  భారతదేశం
269 (49.5 ఓవర్లు)
ఆస్ట్రేలియా won by 1 run
MA Chidambaram Stadium, Madras, India
1987 అక్టోబరు 13
స్కోరు
ఆస్ట్రేలియా 
235/9 (50 ఓవర్లు)
v  జింబాబ్వే
139 (42.4 ఓవర్లు)
ఆస్ట్రేలియా 96 పరుగులతో గెలిచింది
MA Chidambaram Stadium, Madras, India
1987 అక్టోబరు 14
స్కోరు
భారతదేశం 
252/7 (50 ఓవర్లు)
v  న్యూజీలాండ్
236/8 (50 ఓవర్లు)
ఇండియా 16 పరుగులతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, Bangalore, India
1987 అక్టోబరు 17
స్కోరు
జింబాబ్వే 
135 (44.2 ఓవర్లు)
v  భారతదేశం
136/2 (27.5 ఓవర్లు)
ఇండియా 8 వికెట్లతో గెలిచింది
Wankhede Stadium, Bombay, India
1987 అక్టోబరు 27
స్కోరు
ఆస్ట్రేలియా 
251/8 (50 ఓవర్లు)
v  న్యూజీలాండ్
234 (48.4 ఓవర్లు)
ఆస్ట్రేలియా 17 పరుగులతో గెలిచింది
Sector 16 Stadium, Chandigarh, India
1987 అక్టోబరు 30
స్కోరు
ఆస్ట్రేలియా 
266/5 (50 ఓవర్లు)
v  జింబాబ్వే
196/6 (50 ఓవర్లు)
ఆస్ట్రేలియా 70 పరుగులతో గెలిచింది
బారాబతి స్టేడియం, కటక్, India

గ్రూప్ బి

[మార్చు]
Pos Team Pld W L T NR Pts RR
1  Pakistan 6 5 1 0 0 20 5.007
2  England 6 4 2 0 0 16 5.140
3  West Indies 6 3 3 0 0 12 5.160
4  Sri Lanka 6 0 6 0 0 0 4.041
1987 అక్టోబరు 8
స్కోరు
పాకిస్తాన్ 
267/6 (50 ఓవర్లు)
v  శ్రీలంక
252 (49.2 ఓవర్లు)
పాకిస్తాన్ 15 పరుగులతో గెలిచింది
Niaz Stadium, Hyderabad, Pakistan
1987 అక్టోబరు 9
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
243/7 (50 ఓవర్లు)
v  ఇంగ్లాండు
246/8 (49.3 ఓవర్లు)
ఇంగ్లాండ్ 2 వికెట్లతో గెలిచింది
Municipal Stadium, Gujranwala, Pakistan
1987 అక్టోబరు 131
స్కోరు
పాకిస్తాన్ 
239/7 (50 ఓవర్లు)
v  ఇంగ్లాండు
221 (48.4 ఓవర్లు)
పాకిస్తాన్ 18 పరుగులతో గెలిచింది
Pindi Club Ground, Rawalpindi, Pakistan
1987 అక్టోబరు 13
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
360/4 (50 ఓవర్లు)
v  శ్రీలంక
169/4 (50 ఓవర్లు)
వెస్టిండీస్ 191 పరుగులతో గెలిచింది]]
National Stadium, Karachi, Pakistan
1987 అక్టోబరు 17
స్కోరు
ఇంగ్లాండు 
296/4 (50 ఓవర్లు)
v  శ్రీలంక
158/8 (45 ఓవర్లు)2
ఇంగ్లాండ్ 108 పరుగులతో గెలిచింది
Arbab Niaz Stadium, Peshawar, Pakistan
1987 అక్టోబరు 20
స్కోరు
ఇంగ్లాండు 
244/9 (50 ఓవర్లు)
v  పాకిస్తాన్
247/3 (49 ఓవర్లు)
పాకిస్తాన్ 7 వికెట్లతో గెలిచింది
National Stadium, Karachi, Pakistan
1987 అక్టోబరు 21
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
236/8 (50 ఓవర్లు)
v  శ్రీలంక
211/8 (50 ఓవర్లు)
వెస్టిండీస్ 25 పరుగులతో గెలిచింది]]
Green Park, Kanpur, India
1987 అక్టోబరు 25
స్కోరు
పాకిస్తాన్ 
297/7 (50 ఓవర్లు)
v  శ్రీలంక
184/8 (50 ఓవర్లు)
పాకిస్తాన్ 113 పరుగులతో గెలిచింది
Iqbal Stadium, Faisalabad, Pakistan
1987 అక్టోబరు 26
స్కోరు
ఇంగ్లాండు 
269/5 (50 ఓవర్లు)
v  వెస్ట్ ఇండీస్
235 (48.1 ఓవర్లు)
ఇంగ్లాండ్ 34 పరుగులతో గెలిచింది
Sawai Mansingh Stadium, Jaipur, India
1987 అక్టోబరు 30
స్కోరు
శ్రీలంక 
218/7 (50 ఓవర్లు)
v  ఇంగ్లాండు
219/2 (41.2 ఓవర్లు)
ఇంగ్లాండ్ 8 వికెట్లతో గెలిచింది
Nehru Stadium, Poona, India
1987 అక్టోబరు 30
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
258/7 (50 ఓవర్లు)
v  పాకిస్తాన్
230/9 (50 ఓవర్లు)
వెస్టిండీస్ 28 పరుగులతో గెలిచింది]]
National Stadium, Karachi, Pakistan
  • గమనిక 1: ఈ మ్యాచ్ అక్టోబరు 12న షెడ్యూల్ చేయబడింది, అయితే వర్షం కారణంగా రద్దు చేయబడింది. బదులుగా రిజర్వ్ డే ఉపయోగించబడింది.
  • గమనిక 2: శ్రీలంక ఇన్నింగ్స్‌కు వర్షం వలన అంతరాయం కలిగింది; సగటు రన్ రేట్ పద్ధతి ప్రకారం వారి లక్ష్యాన్ని 45 ఓవర్లలో 267 పరుగులకు తగ్గించారు.

నాకౌట్ దశ

[మార్చు]
  Semi-finals Final
4 November – Lahore, Pakistan
  ఆస్ట్రేలియా 267/8  
  పాకిస్తాన్ 249  
 
8 November – Calcutta, India
      ఆస్ట్రేలియా 253/5
    ఇంగ్లాండు 246/8
5 November – Bombay, India
  ఇంగ్లాండు 254/6
  భారతదేశం 219  

సెమీ ఫైనల్స్

[మార్చు]

ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ చాలా మంచి ఆరంభాన్ని పొందారు. డేవిడ్ బూన్ (91 బంతుల్లో 65, 4 ఫోర్లు) టాప్ స్కోరింగ్‌తో, DM జోన్స్‌తో కలిసి 82 పరుగుల రెండవ వికెట్ భాగస్వామ్యాన్ని చేయడంతో వారు సునాయాసంగా స్కోరు చేశారు. ఇమ్రాన్ ఖాన్ 5 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బలమైన బ్యాటింగ్‌తో 300 పరుగులకు చేరుకోవాలని చూస్తోంది. ఆస్ట్రేలియా 4/31 స్కోరుకు పతనమైనప్పటికీ, పాక్ బౌలర్లు ఇచ్చిన అధిక ఎక్స్‌ట్రాలు (34), అలాగే పటిష్టమైన బ్యాటింగ్, ఆస్ట్రేలియాను 267 (6 వికెట్లు, 50 ఓవర్లు) కు చేర్చింది. పాకిస్థాన్ పేలవంగా ప్రారంభించి 3/38కి పడిపోయింది. ఇమ్రాన్ ఖాన్ (84 బంతుల్లో 58, 4 ఫోర్లు), జావేద్ మియాందాద్ (103 బంతుల్లో 70, 4 ఫోర్లు) 26 ఓవర్లలో 112 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, మియాందాద్ పడిపోయినప్పుడు అవసరమైన రన్ రేట్ 7.87 పరుగులు. రాబోయే బ్యాట్స్‌మెన్ చేయాల్సిన పని చాలా ఉంది. పాకిస్తాన్ 249 పరుగులకు ఆలౌట్ అయి, 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా బ్యాటింగు చేసేటపుడు, సలీమ్ జాఫర్ వేసిన 50వ ఓవర్‌లో స్టీవ్ వా 18 పరుగులు చేయడం గమనించదగ్గ సంగతి.

4 November 1987
Scorecard
ఆస్ట్రేలియా 
267/8 (50 overs)
v  పాకిస్తాన్
249 (49 overs)
Australia won by 18 runs
Gaddafi Stadium, Lahore, Pakistan

భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 2/79 కి చేరుకున్న తర్వాత, గ్రాహం గూచ్ (136 బంతుల్లో 115, 11 ఫోర్లు), కెప్టెన్ మైక్ గాటింగ్ (62 బంతుల్లో 56, 5 ఫోర్లు) 19 ఓవర్లలో 117 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఎట్టకేలకు గూచ్ స్టంపౌట్ అయిన తర్వాత, మరో 51 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ 254 (6 వికెట్లు, 50 ఓవర్లు) చేరుకుంది. భారత ఇన్నింగ్సు పేలవంగా మొదలై 3/73కి పడిపోయింది. మహ్మద్ అజారుద్దీన్ (74 బంతుల్లో 64, 7 ఫోర్లు) టాప్ స్కోరింగ్‌తో మిడిల్ ఆర్డర్ సునాయాసంగా స్కోర్ చేసింది. భారత్ 5/204 వద్ద అజారుద్దీన్‌ను ఎడ్డీ హెమ్మింగ్స్ ఎల్‌బిడబ్ల్యుగా తొలగించాడు. చివరి 10 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి ఉంది, చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. అయితే, భారత్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ ఓడిపోయింది. భారత్ 219 పరుగులకు ఆలౌట్ అయి, ఇంగ్లండ్‌కు ఫైనల్‌లో స్థానం దక్కింది. నాలుగేళ్ల క్రితం ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో భారత్‌పై తన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

5 November 1987
Scorecard
ఇంగ్లాండు 
254/6 (50 overs)
v  భారతదేశం
219 (45.3 overs)
England won by 35 runs
Wankhede Stadium, Bombay, India

ఫైనల్

[మార్చు]

ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ బూన్ (125 బంతుల్లో 75, 7 ఫోర్లు) అత్యధిక స్కోరు చేసాడు. వీరి బ్యాట్స్‌మెన్ సునాయాసంగా స్కోరు చేశారు. ఆస్ట్రేలియా 253 (5 వికెట్లు, 50 ఓవర్లు) చేసింది. మైక్ వెలెట్టా (31 బంతుల్లో 45, 6 ఫోర్లు) ఇన్నింగ్స్ చివరిలో బాదడంతో ఆస్ట్రేలియా తమ ఇన్నింగ్స్ చివరి ఆరు ఓవర్లలో 65 పరుగులు చేసింది. ఇంగ్లాండు ఇన్నింగ్సులో ఓపెనర్ టిమ్ రాబిన్సన్ తొలి బంతికే డకౌటయ్యాడు. బిల్ అథీ (103 బంతుల్లో 58, 2 ఫోర్లు) టాప్ స్కోరుతో ఇంగ్లండ్, దాదాపు లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ మైక్ గ్యాటింగ్ (45 బంతుల్లో 41, 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోవడంతో జట్టు వెనక్కి తగ్గింది. అతనికి అథీకీ భాగస్వామ్యంలో 13 ఓవర్లలో 69 పరుగులు వచ్చాయి. అలన్ లాంబ్ (55 బంతుల్లో 45, 4 ఫోర్లు) కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు, అయితే ఇంగ్లండ్‌కు అవసరమైన రన్-రేట్ పెరగడం ప్రారంభించడంతో అది ఫలించలేదు. చివరి ఓవరులో 17 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ అందులో విఫలమవడంతో, కప్ ఆస్ట్రేలియా దక్కించుకుంది.

8 November 1987
Scorecard
ఆస్ట్రేలియా 
253/5 (50 overs)
v  ఇంగ్లాండు
246/8 (50 overs)
Australia won by 7 runs
Eden Gardens, Calcutta, India

గణాంకాలు

[మార్చు]
అత్యధిక పరుగులు[2]
మ్యాచ్‌లు ఆటగాడు జట్టు పరుగులు
8 గ్రాహం గూచ్  ఇంగ్లాండు 471
8 డేవిడ్ బూన్  ఆస్ట్రేలియా 447
8 జెఫ్ మార్ష్  ఆస్ట్రేలియా 428
6 వివ్ రిచర్డ్స్  వెస్ట్ ఇండీస్ 391
8 మైక్ గాటింగ్  ఇంగ్లాండు 354


అత్యధిక వికెట్లు[3]
మ్యాచ్‌లు ఆటగాడు జట్టు వికెట్లు
8 క్రేగ్ మెక్‌డెర్మాట్  ఆస్ట్రేలియా 18
7 ఇమ్రాన్ ఖాన్  పాకిస్తాన్ 17
6 పాట్రిక్ ప్యాటర్సన్  వెస్ట్ ఇండీస్ 14
7 మనిందర్ సింగ్  భారతదేశం 14
6 ఎడ్డీ హెమ్మింగ్స్  ఇంగ్లాండు 13

రికార్డులు

[మార్చు]
  • క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత ఆటగాడు చేతన్ శర్మ మొదటి హ్యాట్రిక్ సాధించాడు. అతను 42వ ఓవర్ చివరి మూడు బంతుల్లో కెన్ రూథర్‌ఫోర్డ్, ఇయాన్ స్మిత్, ఎవెన్ చాట్‌ఫీల్డ్‌లను క్లీన్ బౌల్డ్ చేశాడు. [4]

అధికారులు

[మార్చు]

ఎంపిక చేసిన 12 మంది అంపైర్లలో 4 మంది పాకిస్థాన్‌కు చెందినవారు కాగా, ఇద్దరు ఇంగ్లాండ్, భారత్‌కు చెందినవారు కాగా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, వెస్టిండీస్, శ్రీలంక దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మొదటి సెమీఫైనల్‌ను డిక్కీ బర్డ్ - డేవిడ్ షెపర్డ్ పర్యవేక్షించగా, టోనీ క్రాఫ్టర్ - స్టీవ్ వుడ్‌వర్డ్ రెండవ సెమీఫైనల్‌ను పర్యవేక్షించారు. 1987 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ను రామ్ గుప్తా, మహబూబ్ షా పర్యవేక్షించారు.

మూలాలు

[మార్చు]
  1. "The gracious Mr Walsh". ESPNcricinfo. 5 April 2011. Archived from the original on 18 March 2011. Retrieved 5 April 2011.
  2. "RECORDS / RELIANCE WORLD CUP, 1987/88 / MOST RUNS". ESPNcricinfo. Retrieved 11 April 2022.
  3. "RECORDS / RELIANCE WORLD CUP, 1987/88 / MOST WICKETS". ESPNcricinfo. Retrieved 11 April 2022.
  4. "24th Match: India v New Zealand at Nagpur, Oct 31, 1987". Cricinfo. Archived from the original on 5 July 2009. Retrieved 11 July 2009.