20వ శతాబ్ది తెలుగు వెలుగులు (Luminaries of 20th Century) 2005 తెలుగులో విడుదలైన పుస్తకం. దీనిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగు ప్రముఖుల జీవితచరిత్రల సంకలనం.
దీనికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం గౌరవ సంపాదకులుగాను, వెలగా వెంకటప్పయ్య, ఎం. ఎల్. నరసింహారావు గారలు సంపాదకులుగా, కో-ఆర్డినేటర్ గా వడ్లా సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. ఇది రెండు భాగాలుగా హైదరాబాదు ముద్రించబడినది. మొదటి భాగం అ నుంచి మ వరకు; రెండవ భాగం య నుంచి హ వరకు కలిగివున్నాయి. ప్రతి భాగంలో సత్వర సంప్రదింపు కోసం విషయ సూచిక, అనుక్రమణిక కలిపిన అకారాద్యనుక్రమణికను చేర్చారు. ఇవికా ప్రత్యేకంగా పరిచయకర్తలు : పరిచయాలు ఒక క్రమంలో వివరించారు. ఈ గ్రంథ నిర్మాణంలో సుమారు వెయ్యిమందికి పైగా వ్యక్తులు వివిధవిభాగాలుగా పనిచేసినట్లు సంపాదకులు తెలియజేసారు.
ఈ పుస్తక గ్రంథావిష్కరణోత్సవం మాన్యమహోదయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో 22 అక్టోబరు 2005 తేదీన నిర్వహించబడింది. ఉత్సవానికి ఉపాధ్యక్షులు ఆవుల మంజులత, రిజిస్ట్రారు ఎ. గురుమూర్తి గారు అలంకరించారు.