2004
స్వరూపం
గ్రెగేరియను క్యాలాండరు లేదా గ్రెగేరియను కాలనిర్ణయ పట్టిక (లేదా గ్రెగేరియను పంచాంగము)లో 2004అనునది గురువారంతో మొదలవు లీపు సంవత్సరం.
సంవత్సరాలు: | 2001 - 2002 - 2003 - 2004 - 2005 - 2006 - 2007 |
దశాబ్దాలు: | 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మే 14: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.యస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు.
- మే 22: భారతప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పదవిని చేపట్టినాడు.
- జూన్ 4: భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.
- ఆగష్టు 13: 28వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 12: రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి (జ.1926).
- ఫిబ్రవరి 26: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1912).
- ఫిబ్రవరి 26: శంకర్రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (జ.1920)..
- మార్చి 5: కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928)
- ఏప్రిల్ 17: సౌందర్య, సినీనటి. (జ.1972)
- ఏప్రిల్ 27: జె.వి. సోమయాజులు, రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. ( జ.1928)
- జూన్ 3: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)
- జూలై 23: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (జ.1932)
- జూలై 31: అల్లు రామలింగయ్య, హాస్యనటుడు. (జ.1922)
- ఆగష్టు 8: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (జ.1925)
- ఆగష్టు 15: అమర్‌సిన్హ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జ.1941).
- ఆగష్టు 16: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (జ.1937)
- సెప్టెంబర్ 7: కృష్ణాజిరావు సింధే, తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాద లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (జ.1923)
- సెప్టెంబర్ 22: బొడ్డు గోపాలం, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1927)
- సెప్టెంబర్ 23: రాజా రామన్న, భారత శాస్త్రవేత్త . (జ.1929)
- సెప్టెంబర్ 24: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (జ.1929)
- సెప్టెంబరు 28: ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత (జ.1905)
- అక్టోబరు 14: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (జ.1920)
- అక్టోబరు 31: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు రచయిత. (జ.1935)
- డిసెంబరు 8: చిత్తజల్లు శ్రీనివాసరావు, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ.1924)
- డిసెంబరు 11: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (జ.1916)
- డిసెంబర్ 23: పి.వి.నరసింహారావు, పూర్వ భారత ప్రధానమంత్రి. (జ.1921)
- డిసెంబర్ 31: గెరాల్డ్ డిబ్రూ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1921).
- : ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (జ.1920)