2007–2009 ఆర్థిక సంక్షోభం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


మూస:Financial crisis

వరల్డ్ మ్యాప్ 2009కి గాను GDP వాస్తవ వృద్ధిని చూపిస్తోంది.

2007–నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం దివాళా తీసిన అమెరికా సంయుక్త రాష్ట్రాల బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా సంభవించిన సంక్షోభం. దీని ఫలితంగా అతిపెద్ద ఆర్థిక సంస్థలు దివాళా తీశాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకుల కోసం ఉద్దీపన పథకాలను ప్రవేశపెట్టడం మరియు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల కార్యకలాపాలు తిరోగమించడానికి ఇది దారితీసింది. పలు ప్రాంతాల్లో గృహనిర్మాణ మార్కెట్ చావుదెబ్బ తినింది. ఫలితంగా పలు గృహాలు ఖాళీ అవడం, ప్రభుత్వ ఆదేశాలతో జప్తులు మరియు దీర్ఘకాలం పాటు నిరుపయోగంగా ఉండిపోవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. 1930 దశకాల్లో వచ్చిన మహా మాంద్యం తర్వాత ఇదే అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంగా పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.[2] ఫలితంగా కీలక వ్యాపారాలు నష్టాల బారిన పడటం మరియు ట్రిలియన్ల కొద్దీ U.S. డాలర్ల వినియోగదారుల సంపద కరిగిపోయినట్లు అంచనా వేశారు. ప్రభుత్వాలు భారీ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఆర్థిక వ్యవస్థ గణనీయంగా కుంటుపడింది.[3] దీనికి మేధావులు పలు కారణాలను ప్రతిపాదించారు.[4] మార్కెట్ ఆధారిత మరియు నియంత్రణ పరిష్కారాలు రెండూ అమలవుతుండటం లేదా పరిశీలనలో ఉన్నాయి,[5] కాగా 2010-2011 మధ్య కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రధానమైన ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.[6] ఈ ఆర్థిక సంక్షోభం కొన్ని సమయాల్లో "మహా మాంద్యం"గా ప్రస్తావించబడింది.[1]

2006లో U.S.లో బాగా జోరుమీద ఉండిన ప్రపంచ గృహ రంగం దెబ్బతినడం వల్ల రియల్ ఎస్టేట్ ధరతో ముడిపడిన సెక్యూరిటీల విలువలు అప్పటి నుంచి తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలు కుదేలయ్యాయి.[9] బ్యాంకు ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పరపతి సదుపాయం తగ్గుముఖం పట్టడం మరియు పెట్టుబడిదారుడి యొక్క విశ్వాసం నీరుగారిపోయింది. తత్ఫలితంగా ప్రపంచ స్టాక్ మార్కెట్‌లపై విపరీతమైన ప్రభావం పడింది. 2008 ఆఖరు నుంచి 2009 ప్రారంభం వరకు సెక్యూరిటీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఆ సమయంలో క్రెడిట్ క్లిష్టంగా మారడం మరియు అంతర్జాతీయ వాణిజ్యం తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థలు నత్తనడకన ముందుకు సాగాయి.[10] క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు మరియు పెట్టుబడిదారులు తనఖా సంబంధిత ఆర్థికపరమైన ఆస్తులతో ముడిపడిన నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోయారని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అలాగే 21వ శతాబ్దపు ఆర్థిక మార్కెట్లను పట్టించుకునే విధంగా ప్రభుత్వాలు తమ నియంత్రణా విధానాలను సర్దుబాటు చేయలేకపోయాయని కూడా వారు పేర్కొన్నారు.[12] ప్రభుత్వాలు మరియు కేంద్ర బ్యాంకులు ఆర్థిక ఉద్దీపనం, ద్రవ్య విధాన విస్తరణ మరియు సంస్థాగత సహాయక ప్యాకేజీల ద్వారా అనూహ్య రీతిలో స్పందించాయి.

విషయ సూచిక

నేపథ్యం మరియు కారణాలు[మార్చు]

సంక్షోభం దెబ్బకు తొలుత 2005–2006 మధ్య కాలంలో జోరు మీదున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల గృహ రంగం తీవ్రంగా దెబ్బతింది.[14][16] అప్పటినుంచి "సబ్‌ప్రైమ్‌" మరియు సర్దుబాటు రేటు తనఖాల (ARM)కు సంబంధించిన చెల్లింపులు సకాలంలో జరగకపోవడం ఎక్కువైంది. రుణ ప్యాకేజి, మార్కెటింగ్ మరియు సులభ ప్రారంభ నిబంధనలు మరియు దీర్ఘకాలికంగా గృహ ధరలలో పెరుగుతున్న ధోరణి వంటి ప్రోత్సాహకాలు మరింత సానుకూల నిబంధనలతో తాము సులభంగా తిరిగి రుణాలను పొందగలమనే నమ్మకంతో కఠినతరమైన తనఖాలను తీసుకునేలా రుణగ్రహీతలను ప్రోత్సహించాయి. అయితే, అమెరికాలోని పలు ప్రాంతాలలో వడ్డీరేట్లు పెరగటం ప్రారంభమయ్యాక, 2006-2007లో గృహధరలు కొంచెం కొంచెంగా పతనమవడం ప్రారంభమయ్యాక, తిరిగి రుణాలు పొందడం రానురాను మరింత కష్టమైపోయింది. సులభ ప్రాథమిక వాయిదా చెల్లింపులు గడువు తీరిపోవడం, ముందుగా అంచనా వేసిన విధంగా ఇళ్ల ధరలు పెరగకపోవడంతో రుణాల ఎగవేతలు మరియు జప్తులు నాటకీయంగా ఊపందుకున్నాయి. అలాగే ARM వడ్డీ రేట్లు హెచ్చుస్థాయికి చేరాయి.

1860 నుండి U.S. GDPలో ఆర్థిక రంగ వాటా.[2]

తక్కువ వడ్డీరేట్లు మరియు విదేశీ నిధుల భారీ ప్రవాహం సంక్షోభానికి ముందు పలు ఏళ్ల పాటు సులభ రుణ పరిస్థితులను సృష్టించాయి. దాని ఫలితంగా గృహనిర్మాణ రంగం ఊపందుకోవడం మరియు రుణ వినియోగం ఎక్కువైంది. తక్కువ వడ్డీ రేట్లు, విదేశీ నిధుల వెల్లువ అనేవి, సంక్షోభానికి ముందు చాలా సంవత్సరాల పాటు సులభ రుణ పరిస్థితులను కల్పించి, గృహ నిర్మాణ బూమ్‌ను తారాస్థాయికి తీసుకుపోవడమే కాక, రుణ ఫైనాన్స్ వినియోగాన్ని ప్రోత్సహించాయి.[19] సులభ రుణం మరియు ద్రవ్య ప్రవాహం వల్ల అమెరికా సంయుక్త రాష్ట్రాల గృహ రంగం అభివృద్ధి మొదలయింది. అనేక రకాల రుణాలు (ఉదాహరణకు, తనఖా, క్రెడిట్ కార్డు మరియు వాహన) పొందడం సులభతరమైంది. ఫలితంగా వినియోగదారులపై అనూహ్య రుణభారం పడింది.[20][22] గృహ మరియు రుణ పురోగతుల్లో భాగంగా, తనఖా-దన్ను సెక్యూరిటీలు (MBS) మరియు స్పష్టమైన రుణ హామీలు (CDO) అని పిలిచే ఆర్థిక ఒప్పందాలు విపరీతంగా పెరిగాయి. వీటి విలువను తనఖా చెల్లింపులు మరియు గృహాల ధరల ఆధారంగా మదింపు వేస్తారు. అలాంటి ఆర్థికపరమైన నవ్యత ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు మరియు పెట్టుబడిదారులు U.S. గృహ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహించింది. అయితే గృహాల ధరలు తగ్గడంతో భారీగా రుణాలు తీసుకుని, సబ్‌ప్రైమ్ MBSలో పెట్టుబడి పెట్టిన ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూసినట్లు వెల్లడించాయి. ధరలు తగ్గడం వల్ల ఇళ్ల మదింపు తనఖా రుణం కంటే తగ్గిపోయింది. దాంతో జప్తుల తంతును ప్రారంభించడానికి ఆర్థిక రాయితీని కల్పించడం జరిగింది. U.S.లో 2006 చివర్లో మొదలైన ఇళ్ల జప్తులు వినియోగదారుల సంపదను హరించడం మరియు బ్యాంకింగ్ సంస్థల ఆర్థిక పరిపుష్టిని దెబ్బతీసే విధంగా కొనసాగుతున్నాయి. సంక్షోభం గృహ మార్కెట్ నుంచి ఇతర రంగాలకు కూడా వ్యాపించడంతో అనేక రకాల రుణాలపై చెల్లింపుల ఎగవేతలు మరియు నష్టాలు చెప్పుకోదగ్గ రీతిలో పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ల కొద్దీ U.S. డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.[23]

గృహ మరియు రుణ రంగాలు పురోగతి బాట పట్టడంతో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలు అవి మరింత విస్తరించేందుకు దోహదపడ్డాయి. అంతేకాక ఫైనాన్షిలైజేషన్‌ (ఆర్థికీకరణ)గా పిలిచే ఆ ప్రక్రియ అత్యంత సులభతరంగా మారింది. పెట్టుబడి బ్యాంకులు మరియు మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ వ్యవస్థగా కూడా పిలిచే హెడ్జ్ ఫండ్స్ (పరిమిత పెట్టుబడిదారుల నిధి) వంటి ఆర్థిక సంస్థల గణనీయమైన పాత్రను విధానరూపకర్తలు గుర్తించలేదు. ఈ సంస్థలు U.S. ఆర్థిక వ్యవస్థకు రుణాలు సమకూర్చడంలో వాణిజ్య (డిపాజిటరీ) బ్యాంకుల వలే కీలకంగా మారాయని కొందరు ఆర్థిక నిపుణులు భావించారు. అయితే అవి అదే విధమైన నియంత్రణలకు సంబంధించి మాత్రం కాదు.[24] ఈ సంస్థలు మరియు కొన్ని కచ్చితమైన నియంత్రణ బ్యాంకులు కూడా పైన పేర్కొన్న విధంగా రుణాలను సమకూర్చడం ద్వారా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. అయితే భారీ రుణ ఎగవేతలు లేదా MBS నష్టాలను భరించగల ఆర్థిక పరిపుష్టి వీటికి లేదు.[25] ఈ నష్టాలు ఆర్థిక సంస్థల రుణ మంజూరు సామర్థ్యంపై ప్రభావం చూపాయి. తద్వారా ఆర్థిక కార్యకలాపాలు నత్తనడకన సాగాయి. కీలక ఆర్థిక సంస్థల స్థిరత్వంపై నెలకొన్న ఆందోళనలు వ్యాపార కార్యకలాపాలకు నిధులను సమకూర్చడంలో అవినాభావ సంబంధమున్న కమర్షియల్ పేపర్ (ద్రవ్య సమాన) మార్కెట్లలో తిరిగి విశ్వాసాన్ని నింపేలా రుణాలివ్వడానికి అవసరమైన నిధులను కేంద్ర బ్యాంకులు విడుదల చేసే విధంగా ప్రేరేపించాయి. కీలక ఆర్థిక సంస్థలకు ప్రభుత్వాలు సైతం ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించాయి. అంతేకాక విశిష్టమైన అదనపు ఆర్థిక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ఉద్దీపన కార్యక్రమాలను కూడా అమలు చేశాయి.

గృహనిర్మాణ రంగం అభివృద్ధి[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 1963 మరియు 2008 మధ్య అమ్ముడుపోయిన కొత్త ఇళ్ల అమ్మకాల మధ్యస్థ మరియు సగటు ధరలను గ్రాఫ్ చూపిస్తోంది. (గమనిక: ఈ గ్రాఫ్ ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేయబడలేదు.)[3]

1997 మరియు 2006 మధ్యకాలంలో ఒక అమెరికా ఇంటి ధర 124% మేర పెరిగింది.[28] 2001లో ముగిసిన రెండు దశాబ్దాల కాలంలో, జాతీయ మధ్యస్థాయి గృహ ధర మధ్యస్థాయి గృహ ఆదాయంలో 2.9 నుంచి 3.1 రెట్లకు చేరుకుంది. ఈ నిష్పత్తి 2004లో 4.0కు, 2006లో 4.6కు పెరిగింది.[30] గృహ నిర్మాణ రంగం అభివృద్ధి చెందడం ద్వారా కొందరు యజమానులు తక్కువ వడ్డీరేట్లతో తమ ఇళ్లపై తిరిగి పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు లేదా పెట్టుబడి పెట్టే వినియోగదారుడు ధర పెరుగుదల ద్వారా సురక్షితమైన ద్వితీయ తనఖాలను ఉపసంహరించుకోవడం జరిగింది.

"జెయింట్ పూల్ ఆఫ్ మనీ" ($70 ట్రిలియన్ల ప్రపంచవ్యాప్త నిర్దుష్ట ఆదాయ పెట్టుబడుల ద్వారా నిర్వహించబడుతోంది) కార్యక్రమం దశాబ్దం మొదట్లో U.S. ట్రెజరీ బాండ్లు ప్రతిపాదించిన దాని కంటే ఎక్కువ ఫలితాలను ఇవ్వాలని పీబాడీ అవార్డు గెలుపు కార్యక్రమం సందర్భంగా NPR ప్రతినిధులు వాదించారు. తర్వాత ఈ డబ్బు మొత్తం పరిమాణం 2000 నుంచి 2007 వరకు రెండింతలయింది. అయితే ఆదాయాన్ని సమకూర్చి పెట్టే పెట్టుబడులు మాత్రం శరవేగంగా అభివృద్ధి కాలేదు. వాల్ స్ట్రీట్‌లోని పెట్టుబడి బ్యాంకులు ఈ గిరాకీకి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ద్వారా సురక్షిత రేటింగులు పొందిన MBS మరియు CDOల ద్వారా సమాధానమిచ్చాయి. దీని ఫలితంగా, రుణాలను అందజేస్తున్న తనఖా మధ్యవర్తి నుంచి, మధ్యవర్తులకు నిధులు అందిస్తున్న చిన్న బ్యాంకులు, వాటి వెనుక ఉన్న పెద్ద పెట్టుబడి బ్యాంకుల వరకు, ఇలా తనఖా పంపిణీ వ్యవస్థలోని వారందరికీ అసాధారణంగా రుసుములు పెరగడంతో, U.S.లోని వాల్ స్ట్రీట్ నిధులకు తనఖా విఫణి నిధులతో సంబంధం ఏర్పడింది. 2003 కల్లా, సంప్రదాయ రుణ ప్రమాణాల ద్వారా ఏర్పడిన తనఖాల పంపిణీ దాదాపు క్షీణించిపోయింది. అయితే, MBS మరియు CDOలకు డిమాండ్ ఏ మాత్రం తగ్గకపోవడంతో పంపిణీ వ్యవస్థతో పాటు తనఖాలు అమ్ముడయ్యేంత వరకు రుణ మంజూరు ప్రమాణాలు సడలింపుకు గురవడం మొదలైంది. ఈ ఊహాజనిత వృద్ధి చివరకు అస్థిరమైనదిగా నిరూపితమైంది.[31]

ప్రత్యేకించి, సబ్‌ప్రైమ్ మరియు ఇతర రుణాల జారీ, గృహ నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడం లేదా విస్తరించడం మరియు భారీ రుసుములను రాబట్టడానికి పెట్టుబడిదారు నిధులను సమీకరించే సమర్థతను ఆర్థిక సంస్థలకు CDO కల్పించింది. CDO ప్రధానంగా అనేక తనఖాలు లేదా ఇతర రుణ హామీల నుంచి నగదు చెల్లింపులు రాబట్టడంపై దృష్టి సారిస్తుంది. అలా సమకూరిన నగదు మొత్తాన్ని ప్రాధాన్యతను బట్టి ముఖ్యమైన సెక్యూరిటీలకు కేటాయించడం జరుగుతుంది. తొలుత నగదును సమీకరించే అటువంటి సెక్యూరిటీలు రేటింగ్ ఏజెన్సీల నుంచి పెట్టుబడి-స్థాయి రేటింగ్‌లను పొందుతాయి. అప్పటి నుంచి తక్కువ క్రెడిట్ రేటింగ్‌లున్న తక్కువ ప్రాధాన్యత సెక్యూరిటీలు నగదును అందుకుంటాయి. అయితే సిద్ధాంతపరంగా, నగదు మొత్తంపై సమకూరిన అత్యధిక రేటు పెట్టుబడి చేయబడుతుంది.[32][33]

సెప్టెంబరు, 2008 కల్లా, U.S. గృహాల సగటు ధరలు సుమారు 20% పైగా తగ్గాయి. 2006 మధ్యకాలం వరకు అవి ఎక్కువగా ఉండేవి.[34][36] ధరలు తగ్గుముఖం పట్టడంతో సర్దుబాటు-రేటు తనఖాల రుణగ్రహీతలు వడ్డీరేట్ల పెరుగుదల వల్ల ఏర్పడిన అధిక చెల్లింపుల నుంచి తప్పించుకునే విధంగా వారు తిరిగి పెట్టుబడి పెట్టలేకపోయారు. దాంతో చెల్లింపుల ఎగవేతలకు ఉపక్రమించారు. 2007లో, సుమారు 1.3 మిలియన్ల ఆస్తులను జప్తు చేసుకోవడానికి రుణదాతలు పూనుకున్నారు. అది 2006లో 79% పెరుగుదలగా పేర్కొనబడింది.[38] 2008లో అది కాస్తా 2.3 మిలియన్లకు పెరిగింది. 2007తో పోల్చితే అది 81% అధికం.[40] ఆగస్టు, 2008 కల్లా, మిగిలిపోయిన మొత్తం U.S. తనఖాల్లో 9.2% అపరాధమైనవి లేదా జప్తుకు సిద్ధంగా ఉన్నాయి.[42] సెప్టెంబరు, 2009 కల్లా, ఇది కాస్తా 14.4% పెరిగింది.[43]

సులభ రుణ నిబంధనలు[మార్చు]

తక్కువ వడ్డీ రేట్లు రుణాలు తీసుకునే విధంగా గ్రహీతలను ప్రోత్సహించాయి. 2000 నుంచి 2003 వరకు, ఫెడరల్ రిజర్వ్ ఫెడరల్ రిజర్వ్ రేటు లక్ష్యాన్ని 6.5% నుండి 1.0%కి తగ్గించింది.[4] డాట్‌-కామ్ బబుల్ (ఊహాజనిత వృద్ధి) పతనం మరియు సెప్టెంబరు 2001 తీవ్రవాదుల దాడుల ప్రభావాలను తగ్గించడానికి మరియు ప్రతి ద్రవ్యోల్బణం ప్రమాదాన్ని ఎదుర్కోవడం కోసం లక్ష్యాన్ని కుదించారు.[47]

U.S. కరెంట్ ఎక్కౌంట్ మరియు వాణిజ్య లోటు

USA యొక్క వాడుక ఖాతా (వాణిజ్యం) లోటు పెరగడం ద్వారా వడ్డీరేట్లపై అదనపు ఒత్తిడి పెరిగింది. 2006లో ఈ లోటు గృహ నిర్మాణ రంగం వృద్ధితో పాటు పెరిగింది. వాణిజ్య లోట్లకు అవసరమైన సొమ్మును U.S. బాండు ధరలను మరియు తక్కువ వడ్డీరేట్లను వేలం ద్వారా నిర్ణయించే విదేశాల నుంచి ఏ విధంగా పొందాలనే విషయాన్ని బెన్ బెర్నాంకీ వివరించాడు.[49]

USA కరెంట్ ఎక్కౌంట్ లోటు 1996 నుండి 2004 వరకు $650 మిలియన్ల మేరకు పెరిగి, జీడీపీలో 1.5% నుండి 5.8% చేరుకుందని బెర్నాంకే వివరించారు. ఈ లోటును పూడ్చుకోవడానికి USAకి విదేశాల నుంచి భారీ స్థాయిలో రుణాలు అవసరమయ్యాయి, వీటిలో చాలా భాగం వాణిజ్య మిగులుతో నడుస్తున్న దేశాలనుండి, ప్రధానంగా ఆసియా వర్ధమాన ఆర్థిక వ్యవస్థల నుండి, చమురు ఉత్పత్తి దేశాల నుండి వచ్చింది. చెల్లింపుల నిల్వ గుర్తింపుకు వాడుక ఖాతా లోటును కలిగిన ఒక దేశం (USA వంటిది) అదే మొత్తం కంటే మిగులుగా ఉండే మూలధన ఖాతా (పెట్టుబడి)కూడా కలిగి ఉండాలి. తద్వారా భారీ మరియు విదేశీ నిధుల మొత్తాలు (మూలధనం) USAలోకి ప్రవేశిస్తాయి. వాటిని USA తన దిగుమతులపై వెచ్చిస్తుంది. అనేక రకాల ఆర్థికపరమైన ఆస్తులకు సృష్టించిన ఈ రకమైన గిరాకీ వడ్డేరీట్లు తగ్గడం ద్వారా ఆయా ఆస్తుల ధరలు పెరగడానికి దోహదపడుతుంది. విదేశీ పెట్టుబడిదారులు ఈ నిధులను రుణాలు కింద జారీ చేస్తారు. ఎందుకంటే వారు అత్యధిక వ్యక్తిగత పొదుపు రేట్ల (చైనాలో అత్యధికంగా 40%)ను కలిగి ఉండటం లేదా చమురు ధరలు అధికంగా ఉంటాయి. బెర్నాంకీ దీనిని "అపరిమిత పొదుపు"గా అభివర్ణించాడు.[51] మూలధన నిధుల "వరద" లేదా డబ్బు USA ఆర్థిక మార్కెట్లలోకి ప్రవేశించింది. USA ట్రెజరీ బాండులను కొనుగోలు చేయడం ద్వారా విదేశీ ప్రభుత్వాలు నిధులను అందజేశాయి. తద్వారా సంక్షోభం యొక్క ప్రత్యక్ష ప్రభావాన్ని చాలా వరకు అరికట్టాయి. మరోవైపు USA కుటుంబాలు విదేశీయుల నుంచి తీసుకున్న నిధులను వ్యయాన్ని తగ్గించుకోవడానికి లేదా గృహాల ధరలు మరియు ఆర్థికపరమైన ఆస్తుల వేలానికి ఉపయోగించారు. విదేశీ నిధులను తనఖా-దన్ను సెక్యూరిటీలలో ఆర్థిక సంస్థలు పెట్టుబడి పెట్టా

తర్వాత ఫెడరల్ రిజర్వు ఫెడరల్ నిధులను జూలై, 2004 మరియు జూలై, 2006 మధ్యకాలంలో పెంచింది.[52] 1 ఏడాది మరియు 5-ఏళ్ల సర్దుబాటు-రేటు తనఖా (ARM) రేట్లు పెరగడానికి ఇది దోహదపడింది. ఫలితంగా ARM వడ్డీరేట్లు గృహ యజమానులు తిరిగి అత్యంత ప్రియంగా మారాయి.[53] ఆస్తుల ధరలు వడ్డీరేట్లకు విలోమంగా మారడంతో గృహ నిర్మాణ రంగ వృద్ధి తగ్గడానికి కూడా ఇది కారణమైందని చెప్పొచ్చు. తద్వారా గృహ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఒక విధంగా ఆందోళన కలిగించింది.[54][55] గృహ నిర్మాణ రంగం దెబ్బతిన్న నేపథ్యంలో USA గృహ మరియు ఆర్థికపరమైన ఆస్తులు ధర పరంగా నాటకీయంగా తగ్గింది.[57][59]

సబ్‌ప్రైమ్ రుణాలు[మార్చు]

U.S. సబ్‌ప్రైమ్ రుణం నాటకీయంగా 2004-2006లో విస్తరించింది

సబ్‌ప్రైమ్ అనే పదం రుణగ్రహీతల యొక్క రుణ యోగ్యతను తెలుపుతుంది. అంటే బలహీనమైన ఆర్థిక చరిత్రలు కలిగినవారు మరియు ప్రధాన రుణ గ్రహీతల కంటే రుణాలు సకాలంలో చెల్లించకుండా ఎగవేసే పరిస్థితి ఉన్నవారు.[60] U.S. సబ్‌ప్రైమ్ తనఖాల విలువను మార్చి,[62] 2007 నాటికి $1.3 ట్రిలియన్లుగా అంచనా వేశారు. అందులో 7.5 మిలియన్లకు పైగా తొలి తాత్కాలిక హక్కు కలిగిన సబ్‌ప్రైమ్ తనఖాల సొమ్ము వసూలు కావాల్సి ఉంది.[64]

సులభ రుణ నిబంధనలకు అదనంగా ప్రభుత్వం మరియు పోటీ ఒత్తిళ్లు సంక్షోభం తలెత్తడానికి ముందు సంవత్సరాల్లో సబ్‌ప్రైమ్ రుణాల మంజూరు ఎక్కువైంది. అతిపెద్ద U.S. పెట్టుబడి బ్యాంకులు మరియు ఫాన్నీ మాయి వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యాపారసంస్థలు అధిక నష్టం వాటిల్లే అవకాశమున్న రుణాల విస్తరణలో ముఖ్య భూమిక పోషించాయి.[65][66]

2004 వరకు ఉత్పన్నమైన అన్ని తనఖాలతో పోల్చితే సబ్‌ప్రైమ్ తనఖాలు 10% కంటే తక్కువే. సుమారు 20% వరకు పెరిగిన సదరు తనఖాలు 2005-2006 మధ్యకాలం వరకు అలాగే నిలకడగా ఉన్నాయి. దానిని అమెరికా సంయుక్త రాష్ట్రాల గృహ రంగం వృద్ధి గరిష్ఠ స్థాయిగా చెప్పవచ్చు.[67] ఈ పెరుగుదలకు సత్వర కారణం నికర మూలధన నిబంధన సడలింపుకు U.S. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌ (SEC) ఏప్రిల్, 2004లో తీసుకున్న నిర్ణయమని చెప్పొచ్చు. ఐదు అతిపెద్ద పెట్టుబడి బ్యాంకులు తమ ఆర్థిక స్తోమతను పెంచుకునేందుకు మరియు అవి తమ తనఖా-దన్ను సెక్యూరిటీల జారీని విస్తృతంగా పెంచుకునేందుకు నిబంధన సడలింపు అవకాశం కల్పించింది. దీని వల్ల ఫాన్నీ మాయి మరియు ఫ్రెడ్డీ మాక్‌ సంస్థలు అదనపు పోటీ ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా నష్టాలు వాటిల్లే అవకాశమున్న రుణాల మంజూరును తప్పనిసరిగా పెంచాల్సి వచ్చింది.[68] సబ్‌ప్రైమ్ తనఖా చెల్లింపు అపరాధ రేట్లు 1998-2006,[69] మధ్యకాలంలో 10-15% మధ్య నిలకడగా ఉన్నాయి. అయితే తర్వాత విపరీతంగా పెరిగి, 2008 ప్రారంభానికి 25%కు చేరుకున్నాయి.[70][71]

అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌ సహచరుడు పీటర్ J. వాలిసన్‌,[72] వంటి కొందరు సంక్షోభం యొక్క మూలాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్థిక సంస్థలైన ఫాన్నీ మాయి మరియు ఫ్రెడ్డీ మాక్‌ల చేత సబ్‌ప్రైమ్ రుణాలను నేరుగా మంజూరు చేయడం ద్వారా గుర్తించవచ్చని అభిప్రాయపడ్డారు. 1999 సెప్టెంబరు 30న, ది న్యూయార్క్ టైమ్స్‌ సబ్‍‌ప్రైమ్ రుణాల మంజూరుకు క్లింటన్ ప్రభుత్వ యంత్రాంగం ముందుకు నెట్టబడిందని వివరించింది.[73]

1993-1998 మధ్యకాలంలో 305 నగరాలకు సంబంధించిన రుణ మంజూరు విధానాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాల కోశాగార విభాగం 2000లో ఒక అధ్యయనం నిర్వహించింది. దాని ప్రకారం, CRA-పరిధిలోని రుణదాతల యొక్క $467 బిలియన్ల తనఖా రుణాన్ని చిన్న, మధ్య స్థాయి ఆదాయ రుణగ్రహీతలు మరియు ఇరుగుపొరుగు ప్రాంతాలకు అందించినట్లు వెల్లడైంది.[74] అయితే, సబ్‌ప్రైమ్ రుణాల మొత్తంలో 25% మాత్రమే CRA పరిధిలోని సంస్థల్లోనూ మరియు CRA మినహా మిగిలిన సంస్థల్లో మొత్తం 50% సబ్‌ప్రైమ్ రుణాలు మంజూరయ్యాయి.[75]

అయితే ఈ మాత్రం రుణాలతోనే సంక్షోభం తలెత్తలేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. పోర్ట్‌ఫోలియా మేగజైన్‌లో ప్రచురించిన ఒక కథనంలో మైఖేల్ లెవిస్‌ ఒక వ్యాపారితో ఇలా అన్నాడు, "తుది ఫలితాన్ని ఆశించి, పెట్టుబడిదారులను సంతృప్తిపరచడానికి [పనికిమాలిన] రుణాలను [నిష్ప్రయోజన రుణాలు] తీసుకున్న తగినంత మంది అమెరికన్లు లేరు". ముఖ్యంగా, పెట్టుబడి బ్యాంకులు మరియు హెడ్జ్ ఫండ్స్ (పరిమిత పెట్టుబడిదారుల నిధి) ఉత్పన్నాల సాయంతో మరిన్ని రుణాల సమీకరణకు ఆర్థిక నవ్యతను ఉపయోగించాయి. "అవి [రుణాల]ను ఎక్కువగా సృష్టిస్తున్నాయి. వంద సార్ల కంటే ఎక్కువగా! అందువల్లే రుణాల కంటే నష్టాలే ఎక్కువ."[76]

జనవరి, 2000లో ఆర్థికవేత్త పాల్ క్రుగ్మాన్ ఈ విధంగా అభిప్రాయపడ్డాడు, గృహ మరియు వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్ ధరల పెరగుదల ఏకకాల వృద్ధి ఫాన్నీ మాయి, ఫ్రెడ్డీ మాక్‌ మరియు CRA లేదా అత్యాశ రుణాల మంజూరు సంక్షోభానికి ప్రధాన కారణాలని చెప్పిన వారి వాదనను తక్కువగా అంచనా వేసింది. మరో విధంగా చెప్పాలంటే, ఈ బలమైన కారణాల వల్ల గృహాల మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ, రెండు మార్కెట్లలోనూ (అశాశ్వత లేదా ఊహాజనిత) అభివృద్ధులు పురోగమించాయి.[77]

అత్యాశ రుణాలు[మార్చు]

అత్యాశ రుణాల మంజూరు అనేది నీతినియమాలు లేని రుణదాతల పంధాను తెలుపుతుంది. అసమంజసమైన పనుల కోసం "ప్రమాదకర" లేదా "నిష్ప్రయోజన" రుణాలను పొందడం.[79] శాస్త్రీయమైన వస్తు విక్రయ పద్ధతి జాతీయస్థాయిలో ఉపయోగించబడుతోంది. అంటే ఇళ్లపై తిరిగి పెట్టుబడి చేసే విధంగా తక్కువ వడ్డీరేట్ల గురించి ప్రచారం చేయడం. అలాంటి రుణాల కోసం వివరణాత్మకమైన రీతిలో రాతపూర్వకంగా ఒప్పందాలు చేసుకుంటారు. చివరి రోజున అత్యంత ఖరీదైన రుణ ఉత్పత్తుల కోసం వాటిని సమర్పిస్తారు. మరో విధంగా, 1% లేదా 1.5% వడ్డీ వసూలును వాణిజ్య ప్రకటన సూచించవచ్చు. వినియోగదారుడు సర్దుబాటు రేటు తనఖా (ARM)ను అనుసరించాల్సి ఉంటుంది. అంటే చెల్లించిన వడ్డీ మొత్తం కంటే వసూలు చేసే వడ్డీ అధికంగా ఉంటుంది. ఇది ప్రతికూల రుణవిమోచనానికి దారితీస్తుంది. అంటే రుణ లావాదేవీలు పూర్తయ్యంత వరకు దాని వివరాలు రుణగ్రహీతకు తెలియవు.

"అన్యాయమైన వ్యాపార విధానాలు" మరియు "తప్పుడు ప్రచారం" కారణంగా "బలహీనమైన ఆర్థిక స్థోమత మరియు సర్దుబాటు రేటు తనఖాలు(ARMs) కలిగిన గృహ యజమానులు అధిక తనఖాలకు ఉపక్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వారు వడ్డీలను మాత్రమే చెల్లించగలిగే పరిస్థితి నెలకొంది" అంటూ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జెర్రీ బ్రౌన్ జాతీయస్థాయిలో దావా వేశాడు.[81] ఇళ్ల ధరలు తగ్గినప్పటి నుంచి ARMలకు చెందిన గృహ యజమానులు తమ నెలవారీ చెల్లింపులకు కొంత రాయితీ పొందారు. అయితే దీని వల్ల జాతీయస్థాయి ఆర్థిక పరిస్థితి దెబ్బతినే విధంగా తయారయింది. ఫలితంగా చివరకు రుణదాతను పట్టుకునే విధంగా ఆఫీస్ ఆఫ్ థ్రిఫ్ట్ సూపర్‌విజన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ప్రముఖ టోకు రుణదాత,[82] అమెరిక్వెస్ట్‌ మాజీ ఉద్యోగులు ఇలా వివరించారు, ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా తనఖా పత్రాలను తప్పుగా రూపొందించాం. తర్వాత సత్వర లాభార్జన కోసం తనఖాలను వాల్‌స్ట్రీట్ బ్యాంకులకు విక్రయించాం.[83] సంక్షోభం తలెత్తడానికి తనఖా మోసాలు కూడా కారణమై ఉండొచ్చనే దానికి ఆధారాలు కూడా ఉన్నాయి.[84]

నియంత్రణ సడలింపు[మార్చు]

నియంత్రణ ముసాయిదా మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను పెంచడం, ఉత్పన్నాలు మరియు సాధారణంగా కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో లేని ఆస్తి (లేదా అప్పు) వంటి పరంగా ఆర్థిక నవ్యతతో అనుగుణంగా లేదనేది విమర్శకుల వాదన. ఇతర కేసులను పరిశీలిస్తే, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని విభాగాల్లో చట్టాలు మారడం లేదా చట్టపరమైన అమలు బలహీనమవుతుండటం జరుగుతోంది. కీలక ఉదాహరణలు:

 • అక్టోబరు, 1982లో బ్యాంకింగ్ నియంత్రణ సడలింపు ప్రక్రియకు ఉద్దేశించిన గార్న్‌-సెయింట్. జర్మన్ డిపాజిటరీ ఇన్‌స్టిట్యూషన్స్ చట్టంపై అధ్యక్షుడు రోనాల్డ్ రీగాన్ సంతకం చేశాడు. అది 80 దశకాల చివర్లో/90 దశకాల ప్రారంభంలో పొదుపులు మరియు రుణ సంక్షోభాలు మరియు 2007-2008 ఆర్థిక సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషించింది.
 • నవంబరు, 1999లో అధ్యక్షుడు బిల్ క్లింటన్ గ్రామ్‌-లీచ్‌-బ్లిలీ చట్టంపై సంతకం చేశాడు. అది 1993 నాటి గ్లాస్‌-స్టీగాల్ చట్టంలోని కొంత భాగాన్ని రద్దు చేసింది. ఈ రద్దు ద్వారా వాణిజ్య బ్యాంకులు (సంప్రదాయకంగా సంరక్షించే సంస్కృతిని కలిగి ఉంటాయి) మరియు పెట్టుబడి బ్యాంకులు (వీటిది నష్టాలను ఎక్కువగా భరించే సంస్కృతి) మధ్య వేర్పాటును తగ్గించడం పలు విమర్శలకు తావిచ్చింది.[86][88]
 • 2004లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌ నికర మూలధన నిబంధనను సడలించింది. ఇది పెట్టుబడి బ్యాంకులు తాము తీసుకుంటున్న రుణాల స్థాయిని సాధ్యమైనంత ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ కారణంగా సబ్‌ప్రైమ్ తనఖాలకు మద్దతు తెలిపే తనఖా దన్ను సెక్యూరిటీలు పెరిగాయి. పెట్టుబడి బ్యాంకుల స్వీయ నియంత్రణ సంక్షోభానికి దారితీసిందన్న విషయాన్ని SEC అంగీకరించింది.[90][92]
 • మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ వ్యవస్థ లోని ఆర్థిక సంస్థలు డిపాజిటరీ బ్యాంకుల మాదిరిగా ఒకే విధమైన నియంత్రణకు కట్టుబడి ఉండాల్సిన పనిలేదు. తద్వారా అవి తమ ఆర్థిక పరిపుష్టి లేదా మూలధనానికి సంబంధించి అదనపు రుణ హామీలను వహించే అనుమతి పొందాయి.[94] 1998లో దీర్ఘకాల మూలధన నిర్వహణ పతనమైనప్పటికీ, ఈ విధమైన పరిణామం చోటు చేసుకుంది. అప్పట్లో దైహిక చిక్కుల ద్వారా అత్యంత పరపతి కలిగిన మధ్యవర్తిత్వ సంస్థ విఫలమైంది.
 • నియంత్రణ సంస్థలు మరియు గణాంక ప్రమాణాల రూపకర్తలు సిటీగ్రూప్‌ వంటి డిపాజిటరీ బ్యాంకులు ఆఫ్-బ్యాలెన్స్ షీట్‌ (కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో లేని ఆస్తి లేదా రుణం)లోని తమ ఆస్తులు మరియు అప్పులను సమగ్ర పెట్టుబడి యంత్రాలు అని పిలిచే క్లిష్టమైన చట్టపర సంస్థల్లోకి బదిలీ చేయడానికి అనుమతించారు. సంస్థ యొక్క మూలధన బలహీనత లేదా పరపతి (అధికార) స్థాయి లేదా నష్టాలను భరించడాన్ని కప్పిపుచ్చడం జరిగింది. 2009లో తమ బ్యాలెన్స్ షీట్లకు సంబంధించి, నాలుగు అగ్రశ్రేణి అమెరికన్ బ్యాంకులు $500 నుంచి $1 ట్రిలియన్ డాలర్ల మేరకు లెక్క చూపించవలసి ఉంటుందని ఒక వార్తా సంస్థ అంచనా వేసింది.[95] సంక్షోభం సమయంలో అతిపెద్ద బ్యాంకుల ఆర్థిక స్థితి స్థిరత్వంపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది.[96] తమ మోసంలో భాగంగా ఎన్రాన్ కంపెనీ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆస్తులను కూడా ఉపయోగించుకుంది. అందుకు ప్రతిఫలంగా అది 2001లో అపకీర్తిపాలైంది.[97]
 • 1997 ప్రారంభంలో ఫెడరల్ రిజర్వు ఛైర్మన్ అలాన్ గ్రీన్‌స్పాన్ ఉత్పన్నాల మార్కెట్‌ను నియంత్రించకుండా ఉండటానికి పోరాడాడు.[99] ఆర్థిక మార్కెట్లపై అధ్యక్షుడి కార్యవర్గం[101] సలహా మేరకు, U.S. కాంగ్రెస్ మరియు అధ్యక్షుడు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో క్రయవిక్రయాలు జరపని ఉత్పన్నాల మార్కెట్ యొక్క స్వీయ నియంత్రణకు అనుమతించారు. దీనికి సంబంధించి వాణిజ్య వస్తువుల ఆధునికీకరణ చట్టం 2000ను ఆమోదించారు. భద్రత కలిగిన కొనుగోలుదారుడు మరియు విక్రయదారుడి మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు (CDS) వంటి ఉత్పన్నాలను ప్రత్యేకమైన ద్రవ్య నష్టాలను నివారించడానికి లేదా మదింపు వేయడానికి వాడుకోవచ్చు. CDS ఒప్పందాల ద్వారా తీర్చిన అప్పు నవంబరు, 2008 నాటికి US$33 నుంచి $47 ట్రిలియన్ల వరకు ఉంటుందని అంచనా వేయడం ద్వారా CDS మిగులు యొక్క పరిమాణం 1998-2008 మధ్యకాలంలో 100-రెట్లు పెరిగింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో క్రయవిక్రయాలు జరపని (OTC) మొత్తం ఉత్పన్నాల దేశీయ విలువ జూన్, 2008 నాటికి $683 ట్రిలియన్లకు పెరిగింది.[102] 2003 ప్రారంభంలో వారెన్ బఫెట్ ఉత్పన్నాలు "ప్రజల నాశనానికి ఆర్థిక ఆయుధాలు" అని వ్యాఖ్యానించాడు.[103][104]

అప్పులు బాధ పెరగడం లేదా అధిక పరపతి[మార్చు]

మదుపు బ్యాంకుల లెవరేజ్ నిష్పత్తులు 2003-2007లో గణనీయంగా పెరిగాయి

U.S. కుటుంబాలు మరియు ఆర్థిక సంస్థలు సంక్షోభానికి ముందు సంవత్సరాల్లో అత్యధికంగా రుణపడటం లేదా అధిక పరపతిని కలిగి ఉన్నాయి. తద్వారా గృహ రంగం బుడగ (తాత్కాలిక వృద్ధి) నాశనమై, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. ప్రధాన గణాంకాలు :

 • గృహ ఈక్విటీ నుంచి స్వీకరించడం ద్వారా వినియోగదారులు ఉపయోగించిన స్వతంత్ర డబ్బు 2001లో $627 బిలియన్లుండగా అది 2005లో $1,428 బిలియన్లకు చేరుకుంది. దానికి ప్రధాన కారణం గృహ రంగం అభివృద్ధి చెందటం. తద్వారా అదే సమయంలో మొత్తం సుమారు $5 ట్రిలియన్ల మేర ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి సాధ్యపడింది.[105][106][107] GDPకి సంబంధించిన U.S. గృహ తనఖా రుణం 1990 దశకాల్లో సగటున 46% నుంచి 2008లో 73%కి పెరిగి, $10.5 ట్రిలియన్లకు చేరుకుంది.[108]
 • వార్షిక వాడిపారేసే వ్యక్తిగత ఆదాయం శాతంగా USA గృహ నిర్మాణ రుణం 2007 నాటికి 127% శాతానికి చేరుకుంది. 1990లో ఇది 77%గా ఉండింది.[5]
 • 1981లో U.S. ప్రైవేట్ రుణం GDPలో 123%గా ఉండేది, 2008 నాటికి ఇది 290%కి పెరిగింది[6]
 • 2004-07 నుంచి ఐదు అగ్రశ్రేణి U.S. పెట్టుబడి బ్యాంకులు ఒక్కోక్కటి తమ యొక్క ఆర్థిక పరపతి (రేఖాచిత్రం చూడండి)ని గణనీయంగా పెంచుకున్నాయి. తద్వారా ఆర్థిక ఒడిదుడుకుల నుంచి తట్టుకునే విధంగా వాటి సామర్థ్యం పెరిగింది. ఈ ఐదు సంస్థలు 2007 ఆర్థిక సంవత్సరంలో సుమారు $4.1 ట్రిలియన్ల అప్పులను నివేదించాయి. అంటే 2007లో USA నామమాత్రపు GDPలో దాదాపు 30%. లేమన్ బ్రదర్స్‌ కుప్పకూలింది. బీర్ స్టీర్న్స్‌ మరియు మెరిల్ లించ్ సంస్థలు దివాళా కారణంగా తక్కువ రేటుకు అమ్ముడయ్యాయి. ఇక గోల్డ్‌మన్ సాచెస్ మరియు మోర్గాన్ స్టాన్లీ సంస్థలు మరింత కఠినమైన క్రమబద్ధీకరణ ద్వారా వాణిజ్య బ్యాంకులుగా అవతరించాయి. లేమన్‌ మినహాయించబడగా, ఈ సంస్థలు ప్రభుత్వం సాయమందించింది.[113]
 • U.S.ప్రభుత్వ మద్దతు సంస్థలు ఫానీ మాయి మరియు ఫ్రెడ్డీ మాక్‌‌‌లను సెప్టెంబరు, 2008లో U.S. ప్రభుత్వం వాటిని కన్సర్వేటర్‌షిప్‌ (మరొక సంస్థచే చట్టపరమైన నియంత్రణ కలిగి ఉండటం) కింద చేర్చినప్పుడు తనఖా భారాల కింద అవి సుమారు $5 ట్రిలియన్లు హామీ పొందాయి.[115][117]

ఈ ఏడు సంస్థలు అధిక పరపతిని కలిగి ఉన్నాయి. విపరీతమైన నష్టాలను పొందే అవకాశం ఉన్నందున రుణం లేదా హామీ భారాల కింద ఇవి $9 ట్రిలియన్లు పొందాయి. అయితే డిపాజిటరీ బ్యాంకుల మాదిరిగా ఇవి ఒకే విధమైన క్రమబద్ధీకరణను అనుసరించలేదు.

ఆర్థిక నవ్యత మరియు సంక్లిష్టత[మార్చు]

ఆర్థిక నవ్యత అనే మాట నష్ట పరిస్థితులను (అంటే రుణగ్రహీతల ఎగవేత వంటివి) అధిగమించడం లేదా రుణాల సమీకరణకు సాయపడటం వంటి క్లయింట్ లక్ష్యాలను సాధించే విధంగా రూపొందించిన ఆర్థిక ఉత్పత్తుల వర్థమాన అభివృద్ధిని తెలుపుతుంది. ఈ సంక్షోభానికి సందర్భోచితమైన ఉదాహరణలు: సర్దుబాటు-రేటు తనఖా, సబ్‍‌ప్రైమ్ తనఖాల సముదాయాన్ని తనఖా-దన్ను సెక్యూరిటీల (MBS)లోకి చేర్చడం లేదా పెట్టుబడిదారులకు విక్రయించడానికి స్పష్టమైన రుణ హామీలు (CDO). దీనిని ఒక రకమైన సెక్యూరిటైజేషన్‌ (ఒక విధమైన నిర్మిత ఆర్థిక ప్రక్రియ)గా చెప్పొచ్చు. అలాగే రుణ బీమాగా పిలిచే భద్రత కలిగిన కొనుగోలుదారుడు మరియు విక్రయదారుడి మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు (CDS). ఈ ఉత్పత్తుల వినియోగాన్ని సంక్షోభం తలెత్తేంత వరకు నాటకీయంగా విస్తరించడం జరిగింది. ఈ ఉత్పత్తులు సంక్లిష్టత పరంగా మారినప్పటికీ, ఆర్థిక సంస్థల పుస్తకాల్లో లెక్కించేటప్పుడు సరళత కలిగి ఉంటాయి.

కొన్ని ఆర్థిక ఆవిష్కరణలు, ప్రముఖ బ్యాంకులు నివేదించిన సమాన స్థాయి లేదా పెట్టుబడి సామర్థ్య స్థితిని ప్రభావితం చేసే అస్తవ్యస్థ బ్యాలెన్స్ షీట్ ఫైనాన్సింగ్ వంటి వంచనాత్మక నియంత్రణలను ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు, మార్టిన్ వోల్ఫ్ 2009లో ఇలా రాశాడు: "... ఈ దశాబ్ది ప్రథమార్థంలో బ్యాంకులు అధిక భాగం చేసిన పని - అస్తవ్యస్థ బ్యాలెన్స్ -షీట్ వాహనాలు, డిరైవేటివ్స్ మరియు 'ప్రచ్ఛన్న బ్యాంకింగ్ వ్యవస్థ'- ని క్రమబద్ధీకరించడానికి మార్గం వెతకాల్సి ఉంది."[7]

నష్టం పట్ల అపసవ్య ధర[మార్చు]

AIG బోనస్ చెల్లింపుల వివాదం నేపథ్యంలో ఓ వాల్‌స్ట్రీట్‌ వ్యతిరేకిని న్యూస్ మీడియా ఇంటర్‌వ్యూ చేసింది.

నష్ట భయం యొక్క ధర, అదనపు నష్టాన్ని చేపట్టడానికి మదుపుదారులకు అవసరమైన ప్రోత్సాహక పరిహారంని ప్రతిపాదిస్తుంది, ఇది వడ్డీరేట్లు లేదా రుసుముల ద్వారా కొలువబడుతుంది. వైవిధ్యమైన కారణాల వల్ల MBS మరియు CDOలు వంటి ఆర్థిక నవ్యతతో ముడిపడిన నష్టాన్ని మార్కెట్ భాగస్వాములు కచ్చితంగా లెక్కించలేదు. లేదా ఆర్థిక వ్యవస్థ యొక్క సంపూర్ణ స్థిరత్వంపై దాని ప్రభావాన్ని అవగతం చేసుకోలేకపోయారు.[119] ఉదారణకు, CDOల మదింపు నమూనా వ్యవస్థలో వారు పొందుపరిచిన నష్ట స్థాయిని స్పష్టంగా ప్రతిబింబించే విధంగా లేదు. అత్యధిక యోగ్యత CDOల యొక్క సరాసరి వసూలు రేటు సుమారుగా డాలరులో 32 సెంట్లు. అదే విధంగా సహాయక CDOల సరాసరి రేటు ప్రతి డాలరులో ఐదు సెంట్లు. ప్రయోగాత్మకంగా ఊహాతీతమైన ఈ భారీ నష్టాలు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లపై మాత్రం నాటకీయ ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా అవి తమ కార్యకలాపాలను కొనసాగించడానికి కొద్ది మూలధనాన్ని మాత్రమే పొందాయి.[121]

మరో ఉదాహరణగా భద్రత కలిగిన కొనుగోలుదారుడు మరియు విక్రయదారుడి మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల (CDS) వినియోగం ద్వారా అనేక ఆర్థిక సంస్థల రుణ భారాలను బీమా చేసిన AIGకి సంబంధించిన దానిని చెప్పుకోవచ్చు. AIGకి సంబంధించిన CDS స్థూల లావాదేవీ అనేది పార్టీ B ఎగవేతకు పాల్పడితే పార్టీ Aకి చెల్లిస్తామన్న హామీకి ప్రతిగా పొందిన ప్రయోజనం. అయితే AIG తన యొక్క పలు CDS కార్యక్రమాలను సాయమందించడానికి తగిన ఆర్థిక పరిపుష్టిని కలిగిలేదు. అందుకు కారణం సంక్షోభం ముదరడం. ఫలితంగా దానిని సెప్టెంబరు, 2008లో ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. 2008లో మరియు 2009 ప్రారంభంలోనూ AIGని ఆదుకోవడానికి U.S. పన్నుచెల్లింపుదారులు సుమారు $180 బిలియన్లు ప్రభుత్వానికి చెల్లించారు. ఈ మొత్తం ప్రపంచంలోని పలు అతిపెద్ద ఆర్థిక సంస్థలు సహా CDS లావాదేవీలు జరిపే అనేక చట్టపరమైన సంస్థలకు అందజేయబడింది.[123][124]

విస్తృత వినియోగిత ఆర్థిక-నమూనా పరిమితులు కూడా సరిగా అర్థం చేసుకోబడలేదు.[126][128] CDS మదింపు అనేది తనతో సహసంబంధం కలిగి ఉంటుందని మరియు తనఖా దన్ను సెక్యూరిటీల కచ్చితమైన మదింపును ఊహించగలదని సదరు నియమం అభిప్రాయపడింది. ఎందుకంటే అది అత్యంత సులభతరమైంది. దానిని CDO మరియు CDS పెట్టుబడిదారులు, జారీకర్తలు మరియు రేటింగ్ సంస్థలు విరివిగా ఉపయోగించాయి.[129] wired.com అనే వెబ్‌సైటు యొక్క కథనం ప్రకారం: [130]

ఆర్థికపరమైన ఆస్తులు క్లిష్టతరమైనప్పుడు మరియు మదింపు వేయడం కష్టమైనప్పుడు పెట్టుబడిదారులకు వారిపై పూర్తిగా ఆధారపడిన అంతర్జాతీయ బాండ్ రేటింగ్ ఏజెన్సీలు మరియు బ్యాంకు నియంత్రణ సంస్థలు రెండూ విశ్వసించదగిన కొన్ని క్లిష్టమైన గణితశాస్త్ర నమూనాలను అనుసరిస్తాయి. నిజానికి పెట్టుబడిదారులకు ఈ విధంగా తిరిగి భరోసా ఇవ్వబడుతుంది. ప్రయోగాత్మకంగా నిరూపితమైన నష్టాలు సిద్ధాంతపరంగా తక్కువగా ఉంటాయని అవి చూపిస్తాయి.[131] జార్జ్ సోరోస్‌ ఈ విధంగా వ్యాఖ్యానించాడు, "కొత్త ఉత్పత్తులు చాలా క్లిష్టంగా మారడంతో గణనీయ అభివృద్ధి చేయి దాటిపోయింది. నష్టాలను గణించడం సంస్థల వల్ల కాలేదు. ఫలితంగా బ్యాంకులు నష్ట నిర్వహణ విధానాలపై ఆధారపడటం మొదలుపెట్టాయి. అదే విధంగా, రేటింగ్ ఏజెన్సీలు కృత్రిమ ఉత్పత్తుల తయారీ సంస్థలు అందించే సమాచారంపై ఆధారపడ్డాయి. ఇది దిగ్భ్రాంతిని కలిగించే విధంగా బాధ్యతను విస్మరించడం." [8]

మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ వ్యవస్థ జోరు మరియు పతనం[మార్చు]

2009లో అమెరికా సంయుక్త రాష్ట్రాల కోశాగార కార్యదర్శి[135]గా కూడా బాధ్యతలు చేపట్టిన NY ఫెడరల్ రిజర్వు బ్యాంక్‌ అధ్యక్షుడు మరియు CEO టిమోతీ గీత్నర్‌[134] జూన్, 2008 నాటి ప్రసంగంలో మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ వ్యవస్థగా కూడా పిలిచే "సమాంతర" బ్యాంకింగ్ వ్యవస్థలోని ద్రవ్య మార్కెట్లు "పోటీ" ద్వారా స్తంభించిపోవడాన్ని తీవ్రంగా దుయ్యబట్టాడు. ఈ సంస్థలు (ఎంటిటీలు) ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ద్రవ్య మార్కెట్లకు అత్యంత కీలకమైనవిగా అవతరించాయి. అయితే అవి ఒకే విధమైన క్రమబద్ధీకరణ నియంత్రణలను అనుసరించి లేవు. అంతేకాక ఇవి దుర్లబమైనవి. ఎందుకంటే దీర్ఘకాల, ద్రవ్యేతర మరియు నష్టాలకు అవకాశమున్న ఆస్తులను కొనుగోలు చేయడానికి అవి ద్రవ్య మార్కెట్ల నుంచి స్వల్పకాలిక రుణాలను తీసుకుంటాయి. అంటే ద్రవ్య మార్కెట్లలో ఏర్పడిన అంతరాయాల వల్ల అవి (ఎంటిటీలు) తమ దీర్ఘకాల ఆస్తులను నిరాశాజనక ధరలకు విక్రయించడం ద్వారా పరపతిని కోల్పోతాయి. ఈ సంస్థల విశిష్టతను అతను ఈ విధంగా అభివర్ణించాడు: [136]

ఆర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజును గెలుచుకున్న పాల్ క్రుగ్మాన్‌ ఈ విధంగా అన్నాడు, మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ వ్యవస్థలోని పోటీ సంక్షోభం తలెత్తడానికి "ప్రధాన కారణం". సరైన నియంత్రణలు లేకపోవడాన్ని "నిర్లక్ష్యమే కారణం" అని అతను దూషించాడు.[137]

As the shadow banking system expanded to rival or even surpass conventional banking in importance, politicians and government officials should have realized that they were re-creating the kind of financial vulnerability that made the Great Depression possible—and they should have responded by extending regulations and the financial safety net to cover these new institutions. Influential figures should have proclaimed a simple rule: anything that does what a bank does, anything that has to be rescued in crises the way banks are, should be regulated like a bank.

వాణిజ్య సరకుల బుడగ (తాత్కాలిక వృద్ధి)[మార్చు]

గృహ రంగంలో ఏర్పడిన తిరోగమనం ద్వారా వాణిజ్య సరకుల ధరల పెరగుదల మొదలయింది. 2007 ప్రారంభం నుంచి 2008 వరకు చమురు ధర $50 నుంచి $147 వరకు అంటే సుమారు మూడు రెట్లు పెరిగింది. 2008 చివర్లో ఆర్థిక మాంద్యం మరింత తీవ్ర రూపం దాల్చింది.[140] సంక్షోభ కారణాలపై నిపుణులు చర్చించారు. డబ్బు గృహ మరియు ఇతర పెట్టుబడుల ద్వారా వాణిజ్య సరకుల రంగంలోకి ప్రవేశించడం ఊహాకల్పన మరియు ద్రవ్య విధానం[141]కు దారితీయడం లేదా శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముడి పదార్థాల కొరత ఏర్పడవచ్చన్న ఆందోళన పెరగడం మరియు ఆఫ్రికాలో చైనా ఉనికి పెరగడం వంటి ఆయా మార్కెట్లపై ఆక్రమిత స్థానాలు వంటి ప్రధాన విషయాలపై వారు చర్చించారు. చమురు ధరల్లో పెరుగుదల కారణంగా వినియోగదారుల వ్యయంలో ఎక్కువ వాటా చమురుపై కేటాయించబడింది. దీనివల్ల సంపద చమురు ఉత్పత్తి దేశాలకు తరలిపోవడంతో, చమురు దిగుమతి దేశాల ఆర్థికాభివృద్ధి తిరోముఖ ఒత్తిడికి గురయింది.[142]

2008 జూన్ 3లో కామర్స్, సైన్స్, రవాణాపై సెనేట్ కమిటీ ముందు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం, CFTC ట్రేడింగ్ & మార్కెట్ల విభాగం మాజీ డైరెక్టర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ బాధ్యత) మైఖేల్ గ్రీన్ బెర్గర్, ప్రత్యేకించి గోల్డ్‌మన్ సాచెస్, మోర్గాన్ స్టాన్లీ మరియు బ్రిటిష్ పెట్రోలియం స్థాపించిన అట్లాంటా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఎక్చేంజ్ లండన్, న్యూయార్క్‌లలో క్రమబద్ధీకృత ఫ్యూచర్స్ ఎక్చేంజీలలో ట్రేడ్ అయ్యే స్పెక్యులేటివ్ చమురు భవిష్యత్ ధరలలో ముఖ్యపాత్ర వహించిందని పేర్కొన్నాడు.[9].

ప్రపంచ రాగి ధరలు.

చమురు బబుల్ చెలరేగిన సమయంలోనే రాగి ధరల బబుల్ కూడా సంభవించడం గమనించాలి. 1990 నుండి రాగి టన్నుకు $2,500 వద్ద ట్రేడ్ అయ్యేది, 1999లో ఇది $1,600కి పడిపోయింది. ధరల తగ్గుదల 2004 వరకు కొనసాగింది, తర్వాత రాగి ధర పెరిగి 2008లో టన్ను ధర $7,040కు చేరింది. 2010 ఫిబ్రవరి నాటికి రాగి ధర టన్నుకు $6,500 పలికి, తర్వాత మెల్లగా పతనమయింది.[10][11][12][13].

నికెల్ ధరలు 1990లలో పతాక స్థాయికి చేరాయి. తర్వాత నికెల్ ధర 2007 మే నాటికి మెట్రిక్ టన్నుకు $51,000 /£36,700 నుండి 2009 జనవరికి మెట్రిక్ టన్నుకు $11,550/£8,300కు పడిపోయింది. 2010 జనవరి నాటికి ధరలు కోలుకోవడం ప్రారంభించాయి కాని అప్పటికే ఆస్ట్రేలియా నికెల్ గనుల్లో చాలా భాగం దివాళా తీసేశాయి[14]. హై గ్రేడ్ నికెల్ సల్ఫేట్ ఓర్ ధర 2010లో కోలుకున్నందున, ఆస్ట్రేలియన్ గని పరిశ్రమ కూడా కోలుకుంది[15].

వ్యవస్థాగత సంక్షోభం[మార్చు]

మరొక విశ్లేషణ, ప్రధానస్రవంతి వివరణకు భిన్నంగా చెబుతున్నదాని ప్రకారం, ఆర్థిక సంక్షోభం అనేది పెట్టుబడిదారీ విధానంలో తనకు తానుగా పుట్టుకొచ్చే వ్యవస్థాపక సంక్షోభంలో భాగమైన మరొక సంక్షోభపు చిహ్నం మాత్రమే. ఈజిఫ్ట్ మార్క్సిస్ట్ ఆర్థికవేత్త సమీర్ అమీన్ ప్రకారం, 1970ల మొదటి నుంచి పాశ్చాత్య దేశాలలోని జీడీపీ పెరుగుదల రేట్లలో కలుగుతూ వచ్చిన స్థిర పతనం పెట్టుబడి మిగులు పెరుగుదలను సృష్టించింది, ఇది నిజ ఆర్థిక వ్యవస్థలో తగినంత సంఖ్యలో లాభదాయక మదుపు సంస్థలను లేకుండా చేసింది. దీనికి ప్రత్యామ్నాయమేదంటే ఈ మిగులును ద్రవ్యమార్కెట్‌లో ఉంచడం, దీనివల్ల ప్రత్యేకించి తదనంతరం నియంత్రణల సడలింపు కారణంగా ఉత్పాదక పెట్టుబడి మదుపు కంటే మరింత లాభదాయకంగా ఉంటుంది.[16] సమీర్ అమీన్ ప్రకారం, ఈ దృగంశం పదే పదే (ఇంటర్నెట్ బుడగ) వంటి ద్రవ్య బుడగలకు దారితీసింది మరియు ఇది 2007-2010 ద్రవ్య సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలిచింది.[17]

రాజకీయ అర్థశాస్త్ర విశ్లేషకుడు, మంత్లీ రివ్యూ సంపాదకుడు అయిన జాన్ బెల్లామీ ఫాస్టర్, 1970ల మొదటి నుంచి జీడీపీ పెరుగుదల రేట్లలో పతనానికి మార్కెట్ సంతృప్తీకరణం కారణమని విశ్వసిస్తున్నారు.[18]

పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొన్న అపరిష్కృత సవాళ్ల వెల్లువ గతంలో ద్రవ్య సంక్షోభాలకు దోహదం చేసిందని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిందని జాన్ సి. బోగ్లే 2005లో రాశారు.

Corporate America went astray largely because the power of managers went virtually unchecked by our gatekeepers for far too long...They failed to 'keep an eye on these geniuses' to whom they had entrusted the responsibility of the management of America's great corporations.

అతడు [19][20]తో పాటుగా నిర్దిష్ట సమస్యలను పేర్కొన్నాడు.

 • అతడు వాదిస్తున్న "మేనేజర్ల పెట్టుబడిదారీ విధానం అనేది "యాజమాన్య పెట్టుబడిదారీ విధానం" స్థానంలో వచ్చింది, వాటాదారులకు బదులుగా తన ప్రయోజనం కోసమే యాజమాన్యం సంస్థను నడుపుతూ ఉంటుందని దీనర్థం, ఇది ప్రధాన-ఏజెంట్ సమస్యకు భిన్నమైంది.
 • బూర్జువా కార్యనిర్వాహక పరిహారం;
 • నిర్వాహక ఆదాయాలు అనేవి నిజమైన విలువను సృష్టించడం కంటే షేర్ ధరపై దృష్టి సారిస్తాయి, మరియు
 • ఆడిటర్లు, డైరెక్టర్ బోర్డులు, వాల్‌స్ట్రీట్ విశ్లేషకులు మరియు కెరీర్ రాజకీయనేతలతో పాటుగా ఇది గేట్‌కీపర్ల వైఫల్యం.

ఆర్థిక అంచనా పాత్ర[మార్చు]

ద్రవ్య సంక్షోభాన్ని ప్రధానస్రవంతి ఆర్థికవేత్తలు పెద్దగా ఊహించలేకపోయారు, దీనికి బదులుగా వారు మహా ఆధునికీకరణ గురించి మాట్లాడేవారు. అనేకమంది సాంప్రదాయ వ్యతిరేక ఆర్థికవేత్తలు పలు వాదనలతో సంక్షోభాన్ని ఊహించారు. డిర్క్ బెజెమెర్ తన పరిశోధన[21]లో (బలం చేకూర్చే వాదన మరియు సమయ అంచనాలతో) సంక్షోభాన్ని ఊహించిన 12 మంది ఆర్థికవేత్తలకు ప్రశంసలందించారు: డీన్ బాకర్ (యుఎస్), విన్నీ గోడ్లీ (యుఎస్), ప్రెడ్ హారిసన్ (యుకె), మైఖేల్ హడ్సన్ (యుఎస్), ఎరిక్ జాంఝెన్ (యుఎస్), స్టీవ్ కీన్ (ఆస్ట్రేలియా), జాకబ్ బ్రోక్‌నర్ మాడ్సన్ & జెన్స్ క్జీర్ సొరెన్‌సెన్ (డెన్మార్క్), కుర్ట్ రిచ్‌బాచెర్ (యుఎస్), నౌరియల్ రౌబిని (యుఎస్), పీటర్ స్కిఫ్ (యుఎస్), మరియు రాబర్ట్ షిల్లర్ (యుఎస్). ద్రవ్య సంక్షోభ సంకేతాలను అందించిన ఇతర నిపుణుల ఉదాహరణలు కూడా ఇవ్వబడినాయి.[22][23][24]

1930లలోని మహామాంద్యం తర్వాత అత్యంత ఘోరమైన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభాన్ని అంచనా వేయడంలో ఆర్థికవేత్తలు దాదాపుగా విఫలమయ్యారని బిజినెస్‌వీక్ పత్రికలో వచ్చిన ఓ ముఖ్య కథనం తెలిపింది.[25] ప్రధానమైన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అంచనా వేయడంలో ఆర్థికవేత్తలు ఎందుకు విఫలమయ్యారో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ వార్టన్ స్కూల్ యొక్క ఆన్‌లైన్ వాణిజ్య పత్రిక పరిశీలించింది.[26] వార్తా ప్రసార సాధనాల్లో ప్రచురించబడిన ప్రముఖ కథనాలు, ద్రవ్య సంక్షోభాన్ని అంచనా వేయవలసిన కర్యవ్య నిర్వహణలో అధికశాతం ఆర్థికవేత్తలు విఫలమయ్యారని సాధారణ ప్రజానీకం నమ్మేలా చేశాయి. ఉదాహరణకు, ఆర్థికవేత్త నౌరియెల్ రౌబిని ఎంతో ముందుగా అంటే 2006 సెప్టెంబరులోనే అలాంటి సంక్షోభం గురించి హెచ్చరించారని న్యూయార్క్ టైమ్స్ తెలియచేసింది, సంక్షోభాలను అంచనా వేయడంలో అర్థశాస్త్ర వృత్తి చెడుగా వ్యవహరించిందని కూడా ఆ కథనం తెలిపింది.[27] గార్డియన్ పత్రిక ప్రకారం గృహ రుణాల మార్కెట్ కుప్పగూలడాన్ని, ప్రపంచ వ్యాప్త మాంద్యాన్ని ఊహించినందుకు గాను రౌబిని అవమానాల పాలయ్యాడు, కాగా ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక అతడిపై "డాక్టర్ డూమ్" అని ముద్రవేసింది.[28]

ప్రధాన స్రవంతి ద్రవ్య ఆర్థశాస్త్ర పత్రికలలో, చాలావరకు, ఆర్థిక సంక్షోభాలను అంచనా వేయలేమని నమ్ముతుంటాయి,[29] ఈ కింది యూజిన్ ఫామా'యొక్క సమర్థ-మార్కెట్ పరికల్పన మరియు సంబంధిత యాదృచ్ఛిక పరికల్పనలు రెండూ భవిష్యత్ చలనాలకు సంబంధించిన సమాచారాన్ని మార్కెట్లు కలిగి ఉంటాయని, ఆర్థిక ధరవరలు నియమ రహితంగా, అంచనాలకు అతీతంగా ఉంటాయని చెబుతుంటాయి.

ద్రవ్య మార్కెట్ల ప్రభావాలు[మార్చు]

ద్రవ్య సంస్థలపై ప్రభావాలు[మార్చు]

2007లో యుకె బ్యాంక్ అయిన నార్తర్న్ రాక్ దివాళా తీసింది

అతిపెద్ద అమెరికా, యూరోపియన్ బ్యాంకులు వ్యర్థ ఆస్తులు మరియు మొండి రుణాలపై జనవరి 2007 నుంచి సెప్టెంబరు 2009 వరకు 1 ట్రిలియన్ డాలర్లను నష్టపోయాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. ఈ నష్టాలు 2007-10 మధ్యకాలంలో 2.8 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానం చేరుకుంటాయని భావిస్తున్నారు. అమెరికా బ్యాంకుల నష్టాలు 1 ట్రిలియన్ డాలర్లను, యూరోపియన్ బ్యాంక్ నష్టాలు 1.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. అమెరికా బ్యాంకులు 60 శాతం నష్టాలు చవిచూస్తాయని, అయితే బ్రిటిష్ మరియు యూరోజోన్ బ్యాంకులు కేవలం 40 శాతం నష్టాల బారిన మాత్రమే పడతాయని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది.[30]

వీటిలో మొట్టమొదట బలయ్యింది నార్త్‌రన్ రాక్, ఇది మధ్య తరహా బ్రిటిష్ బ్యాంకు[31] దాని వ్యాపారపు అత్యున్నత స్థాయి స్వభావం బ్యాంకును బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి సెక్యూరిటీని అభ్యర్థించేలా చేసింది. ఇది మదుపుదారులో భయాందోళలను రేకెత్తించి 2007 సెప్టెంబరు మధ్యలో బ్యాంకు కుప్పకూలడానికి దారితీసింది సంస్థను జాతీయం చేయాలంటూ లిబరల్ డెమోక్రటిక్ షాడో ఛాన్సలర్ విన్స్ కేబుల్ ఇచ్చిన పిలుపును మొదట్లో నిర్లక్ష్యం చేసినప్పటికీ, బ్రిటిష్ ప్రభుత్వం (ప్రైవేట్ సెక్టర్ కొనుగోలుదారును వెతకడంలో విఫలమైన కారణంగా) 2008 ఫిబ్రవరిలో బ్యాంకును తన హస్తగతం చేసుకుంది. నార్త్‌రన్ రాక్ సమస్యలు ముంచుకొస్తున్న సమస్యలకు తొలి సంకేతాలుగా రుజువయ్యాయి, అవి త్వరలోనో ఇతర బ్యాంకులు, ద్రవ్య సంస్థలపై విరుచుకుపడ్డాయి.

నార్తర్న్ రాక్ మరియు కంట్రీవైడ్ ఫైనాన్షియల్, వంటి గృహనిర్మాణం మరియు తనఖా రుణాలతో పనిచేస్తున్న కంపెనీలే ప్రారంభంలో దెబ్బతిన్నాయి. ఎందుకంటే పరపతి మార్కెట్ల ద్వారా అవి రుణాలను పొందలేకపోయాయి. 2007 మరియు 2008 మధ్యకాలంలో దాదాపు 100 తనఖా రుణసంస్థలు దివాళా తీశాయి. మదుపు బ్యాంక్ బియర్ స్టీర్న్స్ 2008 మార్చిలో కుప్పగూలుతుందన్న భీతి నేపథ్యంలో దాన్ని జెపి మోర్గాన్ చేస్ కొనివేసింది. సంక్షోభం 2008 సెప్టెంబరు అక్టోబరు నెలల మధ్య కాలంలో పతాక స్థాయిని చేరుకుంది. విఫలమయిన పలు ప్రముఖ సంస్థలు నిర్బంధంగా స్వాధీనం చేసుకోబడ్డాయి లేదా ప్రభుత్వ విలీనం బారిన పడ్డాయి. వీటిలో లేమన్ బ్రదర్స్, మెరిల్ లించ్, ఫాన్ని మేయ్, ఫ్రెడ్డీ మాక్, వాషింగ్టన్ మ్యూచువల్, వాకోవియా, మరియు AIG వంటి సంస్థలు కూడా ఉన్నాయి.[174]

పరపతి మార్కెట్లు మరియు ప్రచ్ఛన్న బ్యాంకింగ్ వ్యవస్థ[మార్చు]

2008లో TED స్ప్రెడ్ మరియు విడిభాగాలు

2008 సెప్టెంబరులో సంక్షోభం అత్యంత సంక్లిష్ట దశకు చేరుకుంది. మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్‌లు కూడా సరిసమానంగా దివాళా తీశాయి, కార్పొరేషన్లు తమ కార్యకలాపాలకు మరియు వేతనాలకు గాను జారీచేసే వాణిజ్య నగదులో ఇవితరచుగా మదుపు చేసేవి. కేవలం ఒక్క వారంలోపే మనీ మార్కెట్ల నుంచి $144.5 బిలియన్‌లను ఉపసంహరించుకోవడం జరిగిపోయింది, అంతకు ముందు వారంలో ఇది $7.1 డాలర్లుగా మాత్రమే ఉండేది. ఇది తమ స్వల్పకాలిక రుణాల చెల్లింపులో (భర్తీ) కార్పొరేషన్ల సామర్థ్యాన్ని అడ్డుకుంది. బ్యాంక్ డిపాజిట్ బీమాకు సమానమైన మనీ మార్కెట్ ఖాతాలకు తాత్కాలిక హామీ[176] ద్వారా బీమాను పొడిగించడం, మరియు వాణిజ్య నగదు కొనుగోలుకు ఫెడరల్ రిజర్వ్ ప్రోగ్రాంతో అమెరికా ప్రభుత్వం ప్రతిస్పందించింది. సాధారణ ఆర్థిక వ్యవస్థలో రుణ ప్రమాదాన్ని పసిగట్టే టిఇడి స్ప్రెడ్ సూచిక 2007లో పెరగడం మొదలై సంవత్సర కాలంపాటు అనిశ్చితంగా ఉండింది, తర్వాత 2008,[32] సెప్టెంబరు నెలలో మరింత పైకి పెరిగి 2008 అక్టోబరు 10 నాటికి 4.65% రికార్డు స్థాయికి చేరుకుంది.

2008 సెప్టెంబరు 18న నాటకీయంగా జరిగిన ఓ సమావేశంలో $700 బిలియన్‌ల అత్యవసర సహాయాన్ని ప్రతిపాదించడానికి ట్రెజరీ సెక్రటరీ హెన్రీ పాల్సన్ మరియు ఫెడరల్ ఛైర్మన్ బెన్ బెర్నాంకెలు ముఖ్యమైన శాసన సభ్యులను కలుసుకున్నారు. బెర్నాంకే వారితో ఇలా చెప్పాడని తెలిసింది: "మనం ఈ పని చేయకపోయినట్లయితే సోమవారం నాటికి మన ఆర్థిక వ్యవస్థ ."[33] ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆస్థుల పునరావాస కార్యక్రమం (TARP) ను అమలుపర్చిన అత్యవసర ఆర్థిక స్థిరీకరణ చట్టం, 2008, అక్టోబరు 3న చట్ట రూపంలో అమలులోకి వచ్చింది.

ఆర్థికవేత్త పాల్ క్రూమన్ మరియు అమెరికా ఆర్థిక మంత్రి తిమోతీ గైనర్లు ప్రచ్ఛన్న బ్యాంకింగ్ వ్యవస్థను ఆకస్మికంగా పెరుగుదల రూపంలో పరపతి సంక్షోభాన్ని వివరించారు. ఇది పైన వివరించిన ప్రకారం సాంప్రదాయక బ్యాంకింగ్ రంగం ప్రాముఖ్యతకు దాదాపు సమానంగా పెరిగింది. దివాళా ఆధారిత సెక్యూరిటీలు లేదా సంపద ఆధారిత వాణిజ్య నగదు, యొక్క పలు రూపాలతో మదుపుదారు నిధులను పొందగల సామర్థ్యం లేకుండానే, మదుపు బ్యాంకులు మరియు ప్రచ్ఛన్న బ్యాంకింగ్ వ్యవస్థ లోని ఇతర సంస్థలు దివాళా సంస్థలు మరియు ఇతర కార్పొరేషన్లకు నిధులు అందించలేకపోయాయి.[34][35]

అంటే దాదాపు అమెరికా పరపతి యంత్రాంగం స్తంభించిపోవడమే గాక, 2009 జూన్ వరకు ఆ స్తంభన కొనసాగింది.[36] బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ ప్రకారం, ఈ అంతరాన్ని పూరించడానికి సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ వద్ద 2009 జూన్ వరకు తగినన్ని నిధులు లేకుండా పోయాయి. "అదనపు రుణమొత్తాన్ని అందించడానికి అవసరమైనంత పెట్టుబడిని సమీకరించడానికి ఘన లాభాలకు సంవత్సరాల సమయం తీసుకుంటుంది" కొన్ని రకాల సెక్యూరిటీకరణ "పరపతి పరిస్థితులు బాగా క్షీణించిపోయిన నేపధ్యంలో శాశ్వతంగానే కనుమరుగు కానున్నాయి" అని ఈ రచయితలు సూచించారు. సాంప్రదాయిక బ్యాంకులు తమ రుణ ప్రమాణాలను పెంచివేయగా, రుణాలు చేయడానికి అందుబాటులో ఉన్న నిధులు తరిగిపోవడానికి ప్రధాన కారణమైన ప్రచ్ఛన్న బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంగా కుప్పకూలిపోయింది.[37]

సంపద ప్రభావాలు[మార్చు]

లేమన్ బ్రదర్స్ యొక్క న్యూయార్క్ సిటీ ప్రధాన కార్యాలయం.

సంపద క్షీణించిపోవడం, వినియోగం మరియు వ్యాపార మదుపు క్షీణించిపోవడం, ఆర్థిక వ్యవస్థ రథాన్ని ప్రతిబింబించే ప్రభుత్వం వ్యయం కూడా క్షీణించిపోవడం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. 2007 జూన్ మరియు 2008 నవంబరు మధ్య, అమెరికా ప్రజలు ఊహించిన సగటును మించి తమ సామూహిక సంపదలో పాతిక వంతు కంటే ఎక్కువగానే కోల్పోయారు. 2008 ప్రారంభంలో, యుఎస్‌లో అతి పెద్ద స్టాక్ సూచి ఎస్&P 500 తన 2007 గరిష్ఠ ప్రమాణంలో 45 శాతాన్ని కోల్పోయింది. గృహ ధరలు 2006లో అత్యధిక స్థాయినుంచి 20%కి పడిపోయాయి, దీంతో ప్యూచర్ మార్కెట్లు తమ సామర్థ్యంలో 30-35% కోల్పోనున్నట్లు సంకేతాలు వెలువరించాయి. 2006లో $13 ట్రిలియన్ల గరిష్ఠ విలువకు చేరుకున్న అమెరికాలోని మొత్తం గృహ ఈక్విటీ, 2008 మధ్యనాటికి $8.8 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది, 2008 చివరకు ఇది మరింతగా పడిపోయింది. అమెరికన్ల రెండో అతిపెద్ద గృహ సంపద అయిన మొత్తం పదవీవిరమణ ఆస్తులు 22 శాతం క్షీణించి 2006లోని $10.3 ట్రిలియన్‌ల నుంచి 2008 మధ్యనాటికి $8ట్రిలియన్ లకు పడిపోయాయి. అదే కాలంలో పొదుపులు, మదువు ఆస్తులు (పదవీవిరమణ పొదుపులతో పాటు) $1.2ట్రిలియన్‌లు కోల్పోయాయి మరియు ఫించన్ ఆస్తులు $1.3 ట్రిలియన్‌ల మేరకు కోల్పోయాయి. వీటన్నిటికీ కలిపితే, ఈ నష్టాలు $8.3 ట్రిలియన్ల భారీ స్థాయికి చేరుకున్నాయి.[38] 2007 ద్వితీయార్థంలో తారాస్థాయికి చేరిన గృహ సంపద $14 ట్రిలియన్‌లకు పడిపోయింది.[39]

పైగా, సంక్షోభానికి దారితీసిన సంవత్సరాల్లో అమెరికా గృహ యజమానులు తమ ఇళ్లకు సంబంధించిన ఈక్విటీలో గణనీయ భాగాన్ని వెనక్కు తీసుకున్నారు. అంటే గృహధరలు కుప్పగూలిపోగానే వారు ఇక వాటిని భరించలేరని అర్థం. గృహ ఈక్విటీ నుంచి స్వీకరించడం ద్వారా వినియోగదారులు ఉపయోగించిన స్వతంత్ర డబ్బు 2001లో $627 బిలియన్లుండగా అది 2005లో $1,428 బిలియన్లకు చేరుకుంది. దానికి ప్రధాన కారణం గృహ రంగం అభివృద్ధి చెందటం. తద్వారా అదే సమయంలో మొత్తం సుమారు $5 ట్రిలియన్ల మేర ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి సాధ్యపడింది.[105][106][107] GDPకి సంబంధించిన U.S. గృహ తనఖా రుణం 1990 దశకాల్లో సగటున 46% నుంచి 2008లో 73%కి పెరిగి, $10.5 ట్రిలియన్లకు చేరుకుంది.[108]

వినియోగం మరియు రుణ సామర్థ్యంలోని ఈ క్షీణతను నివారించడానికి, అమెరికా ప్రభుత్వం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ $13.9 ట్రిలియన్ డాలర్లను సమకూర్చాయి, వీటిలో $6.8 ట్రిలియన్ డాలర్లను 2009 జూన్ నెలలోనే మదుపుగా పెట్టారు లేదా ఖర్చు చేశారు.[40] దీని ఫలితంగా, ఫెడరల్ ఆర్థిక వ్యవస్థలోని గణనీయ భాగం విషయంలో "చివరి నిమిషంలో రుణదాత" నుంచి "చిట్టచివరి రుణదాత"కు తన స్థితిని కోల్పోయింది. కొన్ని సందర్భాలలో ఫెడరల్ "చిట్టచివరి కొనుగోలుదారు"గా మాత్రమే పరగిణించబడుతూ వచ్చింది.

ఆర్థికవేత్త డీన్ బేకర్ రుణపరపతి లభ్యతలో క్షీణతను ఇలా వివరించారు:

Yes, consumers and businesses can't get credit as easily as they could a year ago. There is a really good reason for tighter credit. Tens of millions of homeowners who had substantial equity in their homes two years ago have little or nothing today. Businesses are facing the worst downturn since the Great Depression. This matters for credit decisions. A homeowner with equity in her home is very unlikely to default on a car loan or credit card debt. They will draw on this equity rather than lose their car and/or have a default placed on their credit record. On the other hand, a homeowner who has no equity is a serious default risk. In the case of businesses, their creditworthiness depends on their future profits. Profit prospects look much worse in November 2008 than they did in November 2007 (of course, to clear-eyed analysts, they didn't look too good a year ago either). While many banks are obviously at the brink, consumers and businesses would be facing a much harder time getting credit right now even if the financial system were rock solid. The problem with the economy is the loss of close to $6 trillion in housing wealth and an even larger amount of stock wealth. Economists, economic policy makers and economic reporters virtually all missed the housing bubble on the way up. If they still can't notice its impact as the collapse of the bubble throws into the worst recession in the post-war era, then they are in the wrong profession.[41]

ఈ సంస్థలకు చెందిన పోర్ట్‌ఫోలియోలలో చాలావరకు చాపచుట్టగా చుట్టేసిన గృహ దివాళాల నుంచి తీసుకున్న సంపదలే కావడం గమనార్హం. ఈ దివాళా ఆధారిత సెక్యూరిటీలను లేదా వాటిని విఫలమైనట్లుగా చూపకుండా ఉండేందుకు ఉపయోగించిన పరపతి డెరివేటివ్‌లను బహిర్గతం చేయడం వల్ల లేమన్ బ్రదర్శ్, ఏఐజీ, మెరిల్ లించ్, మరియు హెచ్‌బీఓఎస్ వంటి ప్రముఖ సంస్థలు కుప్పకూలిపోయాయి లేదా కొనుగోలు చేయబడ్డాయి.[42][43][44]

ప్రపంచ అంటువ్యాధి[మార్చు]

సంక్షోభం శరవేగంగా ప్రపంచ ఆర్థిక ప్రకంపనగా వృద్ధి చెంది, వ్యాపించింది, దీని ఫలితంగా అనేక యూరోపియన్ బ్యాంక్ వైఫల్యాలు, పలు స్టాక్ సూచీలు పతనమైపోవడం, మార్కెట్ ఈక్విటీ[45] మరియు సరకుల మొత్తం భారీగా తగ్గిపోవడానికి దారితీసింది.[46]

ఎంబీస్ మరియు సీడీఓలు రెండింటినీ కార్పొరేట్ మరియు సంస్థాగత మదుపుదారులు ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేశారు. క్రెడిట్ డీఫాల్ట్ స్వాప్‌లు వంటి డిరైవేటివ్‌లు కూడా భారీ ద్రవ్య సంస్థల మధ్య బంధాన్ని పెంచాయి. పైగా, స్తంభించిన రుణ మార్కెట్‌లకు తిరిగి ఫైనాన్స్ చేయలేనివిధంగా తప్పనిసరి చెల్లింపుకోసం ఆస్తులను అమ్మినందువలన జరిగిన ఆర్థిక సంస్థల స్థాయి కుదింపు వల్ల పరపతి సంక్షోభాన్ని మరింతగా పెంచి అంతర్జాతీయ వాణిజ్య పతనానికి దారితీసింది.

ప్రపంచ రాజకీయ నాయకులు, జాతీయ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు డైరెక్టర్లు భయాలను తగ్గించడానికి గాను తమ ప్రయత్నాలు[47] సమన్యయం చేశారు కాని, సంక్షోభం కొనసాగింది. మదుపుదారులు అపారమైన పెట్టుబడి వనరులను ఎన్, డాలర్, స్విస్ ఫ్రాంకు వంటి బలమైన కరెన్సీలలోకి మార్చడంతో, 2008 చివరలో కరెన్సీ సంక్షోభం ఏర్పడింది, దీనివల్ల పలు వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సహాయంకోసం చూశాయి.[48][49]

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాలు[మార్చు]

ప్రపంచ ప్రభావాలు[మార్చు]

ద్రవ్య సంక్షోభం కొనసాగినట్లయితే పొడిగించబడిన మాంద్యం లేదా అంతకు మించిన ఘోర పరిస్థితులు నెలకొంటాయని అనేకమంది వ్యాఖ్యాతలు సూచించారు.[50] సంక్షోభం నిరంతరం పెరుగుతుండటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం గురించి కొన్ని వర్గాలు భీతిచెందాయి. ఆశావహ అంచనాదారులు చాలామంది ఉన్నప్పటికీ, కొంతమంది ప్రముఖులు పరిస్థితిపై వ్యతిరేక దృక్పధాన్ని కొనసాగించారు.[51] పొదుపులు మరియు రుణాలు కరిగిపోయినప్పటినుంచి అతి గొప్ప బ్యాంకింగ్ ప్రకంపనలను ఈ ద్రవ్య సంక్షోభం సృష్టించింది.[52] ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ యుబిఎస్ అక్టోబరు 6న ప్రకటన చేస్తూ, 2008లో స్పష్టమైన ప్రపంచ ఆర్థిక మాంద్యం కనిపిస్తోందని, కనీసం రెండేళ్ల కాలం పాటు కోలుకునే పరిస్థితి లేదని పేర్కొంది.[53] సంక్షోభాన్ని చక్కదిద్దడానికి అవసరమైన చర్యలను ప్రపంచం ప్రారంభించడంతో మూడు రోజుల తర్వాత యుబిఎస్ ఆర్థికవేత్తలు, సంక్షోభం "అంతం ప్రారంభం" అయిందని ప్రకటించారు. అవి: ప్రభుత్వంచే పెట్టుబడి చొప్పించడం, చొప్పించే రీతి వ్యవస్థాగత పొత్తు; రుణగ్రహీతలకు సాయపడడానికి వడ్డీరేట్ల కోత. యునైటెడ్ కింగ్‌డమ్ వ్యవస్థాగత పెట్టుబడి కల్పనను ప్రారంభించింది. ప్రపంచ కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించసాగాయి. అమెరికాకు వ్యవస్థాగత పెట్టుబడి కల్పన అవసరమని యుబిఎస్ నొక్కి చెప్పింది. ఇది ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దుతుందే కాని ఆర్థిక పరిభాషలో "మరింత ఘోరమైనది రానుంది" అని యుబిఎస్ నొక్కి చెప్పింది..[54] తాను ఊహిస్తున్న మాంద్యం స్థాయిని యుబిఎస్ అక్టోబరు 16న మరింతగా పెంచి చెప్పింది: యూరోజోన్ రెండు త్రైమాసికాలను, అమెరికా మూడు త్రైమాసికాలను, యునైటెడ్ కింగ్‌డమ్ నాలుగు త్రైమాసికాలను కోల్పోనుంది[55] ఐర్లండులో ఆర్థిక సంక్షోభం దేశంలోని మూడు ప్రముఖ బ్యాంకులను ముగ్గులోకి దింపింది. ఆర్థిక వ్యవస్థ పరిమాణానికి అనుబంధంగా ఉన్న ఐర్లండు బ్యాంకింగ్ పతనం ఆర్థిక చరిత్రలో ఏ దేశం కూడా చవిచూడనంత ఘోరపతనంగా నమోదైంది.[56]

అక్టోబరు చివరలో యుబిఎస్ తన అంచనాను మరింత అథోముఖం వైపు సవరించింది; దీని ప్రకారం, యుఎస్ పెరుగుదల 2009లో రుణాత్మకంగా ఉండటంతో, రానున్న మాంద్యం అనేది 1981 మరియు 1982 నాటి రీగన్ హయాంలోని మాంద్యం కంటే ఘోరమైనదిగా ఉండబోతోంది. యూరోజోన్, బ్రిటన్ 2010లో చాలా తక్కువగానే కోలుకుంటాయి; అయితే మహా మాంద్యం అంత పెద్దది కాకపోవచ్చు.[57]

అమెరికా వినియోగం 2000 మరియు 2007 మధ్యకాలంలో ప్రపంచ వినియోగం వృద్ధిలో మూడో వంతు కంటే ఎక్కువగా జరిగిందని బ్రూకింగ్స్ సంస్థ 2009 జూన్‌లో నివేదించింది. "సంవత్సరాలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ విపరీతంగా ఖర్చుపెట్టడం, అప్పుచేయడం చేస్తూ వచ్చిందని ప్రపంచ డిమాండుకు వనరుగా అమెరికా వినియోగదారుపై తక్కిన ప్రపంచం ఆధారపడుతూ వచ్చింది." అమెరికాలో మాంద్యం, మరియు అమెరికా వినియోగదారుల పొదుపు రేటు పెరగడంతో, ఆర్థిక వృద్ధి క్షీణత ప్రతిచోటా నాటకీయంగా పొడసూపుతూ వచ్చింది. 2009లో తొలి త్రైమాసికంకోసం జీడీపీలో క్షీణత యొక్క వార్షిక రేటు జర్మనీలో 14.4%, జపాన్‌లో15.2%, బ్రిటన్‌లో 7.4%, లాత్వియాలో 18%,[58] యూరో ప్రాంతంలో 9.8%, మెక్సికోలో 21.5% మేరకు నమోదైంది.[59]

బలమైన ఆర్థిక పురోగతితో కనిపిస్తూ వచ్చిన కొన్ని వర్ధమాన దేశాలు గణనీయంగా పతనాన్ని చవిచూశాయి. ఉదాహరణకు, కాంబోడియాలో వృద్ధి అంచనాలు 2007లో 10 శాతం పైగా పతనం కాగా, 2009లో అది సున్నాకు పడిపోయింది. మరియు కెన్యా 2007లోని 7 శాతం నుంచి పతనమై, 2009లో 3-4% పెరుగుదలను మాత్రమే సాధించింది. ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన ప్రకారం, వృద్ధిలో క్షీణతలు అనేవి వాణిజ్యంలో, సరకుల ధరల్లో, మదుపు మరియు వలస కార్మికులు పంపిన చెల్లింపులులలో (2007లో ఈ మొత్తం $251 బిలియన్లకు చేరుకుంది కాని, అప్పటినుంచి పలు దేశాలలో పతనమవుతూ వచ్చింది) పతనానికి దారితీయగలవు.[60]

2009 మార్చి నాటికి, అరబ్ ప్రపంచం సంక్షోభం కారణంగా $3 ట్రిలియన్లను కోల్పోయింది.[61] 2009 ఏప్రిల్‌లో, అరబ్ ప్రపంచంలో నిరుద్యోగత 'టైమ్ బాంబు' లాగా ఉందని చెప్పబడింది'.[62] 2009లో, చమురుకు డిమాండ్ కాస్త తగ్గిన కారణంగా మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థలలో విదేశీ మదుపులు తగ్గిపోయాయని ఐక్యరాజ్యసమితి నివేదించింది.[63] 2009 జూన్‌లో, అరబ్ దేశాలకు ఇది గడ్డు సంవత్సరంగా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.[64] ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభించినప్పటినుంచి దాదాపుగా $4 బిలియన్లను కోల్పోయినట్లు 2009 సెప్టెంబరులో, అరబ్ బ్యాంకులు నివేదించాయి.

అమెరికా ఆర్థిక ప్రభావాలు[మార్చు]

వాస్తవ నికర దేశీయ ఉత్పత్తి — కార్మికులు ఉత్పత్తిచేసిన సరకులు, సేవల మొత్తం మరియు అమెరికాలో గుర్తించిన సంపద — 2008 నాలుగో త్రైమాసికం, 2009 తొలి త్రైమాసికంలో దాదాపుగా 6 శాతం వార్షిక రేటుతో పడిపోయాయి..[65] అమెరికా నిరుద్యోగిత రేటు 2009 అక్టోబరు నాటికి 10.2% నికి పెరిగింది, ఇది 1983 తర్వాత అత్యంత అధిక రేటు మరియు సంక్షోభానికి ముందుతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు పెరుగుదల. వారం పనిదినాల సగటు గంటలు 33కు పడిపోయాయి, 1964లో ప్రభుత్వం డేటా సేకరణ ప్రారంభించినప్పటినుంచి ఇది అత్యంత తక్కువ.[66][67]

అధికారిక ఆర్థిక అంచనాలు[మార్చు]

2008 నవంబరు 3న బ్రస్సెల్స్ లోని ఇయు-కమిషన్ 2009కి గాను, యూరోజోన్ (ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, వగైరా.) దేశాలకు సంబంధించి జీడీపీని 0.1 శాతంతో అత్యంత బలహీన వృద్ధిని అంచనా వేసింది. ఇకపోతే బ్రిటన్ (-1.0 శాతం), ఐర్లండ్ మరియు స్పెయిన్ లకు రుణాత్మక సంఖ్యను సూచించింది. నవంబరు 6న వాషింగ్టన్, D.C.లోని ఐఎమ్ఎఫ్ 2009కి గాను అభివృద్ధి చెందిన దేశాలలో సగటున ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం -0.3 శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తూ సంఖ్యలను కేటాయించడం ప్రారంభించింది. అదే రోజున, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మరియు యూరోజోన్ సెంట్రల్ బ్యాంక్ తమ వడ్డీరేట్లను వరుసగా 4.5 శాతం నుంచి 3 శాతానికి, 3.75 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించి వేశాయి. దీని ఫలితంగా, 2008 ప్రారంభంనుండి, పలు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలకు భారీ 'సహాయ పథకాలు' ప్రారంభించాయి.

2009 జూన్‌లో యు.ఎస్ ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటనలో ఇలా తెలిపింది:

...the pace of economic contraction is slowing. Conditions in financial markets have generally improved in recent months. Household spending has shown further signs of stabilizing but remains constrained by ongoing job losses, lower housing wealth, and tight credit. Businesses are cutting back on fixed investment and staffing but appear to be making progress in bringing inventory stocks into better alignment with sales. Although economic activity is likely to remain weak for a time, the Committee continues to anticipate that policy actions to stabilize financial markets and institutions, fiscal and monetary stimulus, and market forces will contribute to a gradual resumption of sustainable economic growth in a context of price stability.[68] Economic projections from the Federal Reserve and Reserve Bank Presidents include a return to typical growth levels (GDP) of 2-3% in 2010; an unemployment plateau in 2009 and 2010 around 10% with moderation in 2011; and inflation that remains at typical levels around 1-2%.[69]

ఆర్థిక సంక్షోభంపై స్పందనలు[మార్చు]

అత్యవసర మరియు స్వల్ప-కాలిక స్పందనలు[మార్చు]

అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరియు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, తక్కువ వేతనాలు, అధిక నిరుద్యోగిత అనేవి ప్రపంచ వినియోగంలో స్వయంప్రకటిత పతనానికి దారితీసే ద్రవ్యోల్బణ వృత్తం ప్రమాదాన్నుంచి తప్పించుకోవడానికి గాను డబ్బు చలామణీని విస్తరించే చర్యలు చేపట్టాయి. అదనంగా, ప్రభుత్వాలు, సంక్షోభం కారణంగా ప్రైవేట్ రంగంలో డిమాండ్ క్షీణతను అడ్డుకోవడానికి గాను అప్పులివ్వడం, వ్యయం చేయడం ద్వారా భారీ ఆర్థిక ఉద్దీపన పథకాలు అమలుపర్చాయి. అమెరికా 2008 మరియు 2009 మధ్య కాలంలో దాదాపు $1 ట్రిలియన్ల మొత్తంలో రెండు ఉద్దీపన పథకాలు అమలుచేసింది.[70]

ఈ రుణ స్తంభన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పతనం అంచుల్లోకి నెట్టివేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, ఇతర కేంద్ర బ్యాంకుల యొక్క స్పందన తక్షణ స్వభావంతోనూ, నాటకీయంగానూ ఉండింది. 2008 చివరి త్రైమాసికంలో, ఈ కేంద్ర బ్యాంకులు $2.5 ట్రిలియన్ల ప్రభుత్వ రుణాన్ని మరియు బ్యాంకులలో ఉన్న వివాదాస్పద ప్రైవేట్ ఆస్తులను కొనుగోలు చేశాయి. ఇది రుణ మార్కెట్ లోకి చొప్పించిన అతి పెద్ద ద్రవ్య మొత్తం, ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత ద్రవ్య కార్యాచరణ పథకం కూడా. యూరోపియన్ దేశాల ప్రభుత్వాలు మరియు అమెరికా తమ బ్యాంకులలో కొత్తగా జారీ చేసిన ప్రాతినిధ్య స్టాక్ను కొనుగోలు చేయడం ద్వారా వాటి జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థల పెట్టుబడిని $1.5 ట్రిలియన్లకు పెంచాయి..[71]

ప్రభుత్వాలు కూడా పైన చర్చించిన వివిధ సంస్థలకు భారీ ఆర్థిక చెల్లింపుల ద్వారలా బెయిల్ అవుట్ ఇచ్చాయి. ఈనాటికి పలు అమెరికా ప్రభుత్వ సంస్థలు రుణాలు, ఆస్తి కొనుగోళ్లు, హామీలు, మరియు ప్రత్యక్ష వ్యయం రూపంలో ట్రలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు పెట్టాయి. సంక్షోభానికి సంబంధించి అమెరికా ప్రభుత్వ ఆర్థిక చెల్లింపులు మరియు మదుపుల సారాంశం కోసం చూడండి సిఎన్ఎన్ - బెయిలవుట్ స్కోర్ బోర్డ్.

క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు మరియు దీర్ఘకాలిక స్పందనలు[మార్చు]

యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు బారక్ ఒబామా మరియు ప్రధాన సలహాదారులు 2009 జూన్‌లో వరుస క్రమబద్ధీకరణ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనలు వినియోగదారు రక్షణ, కార్యనిర్వాహక అధికారుల వేతనాలు, బ్యాంకు ఆర్థిక శక్తులు లేదా పెట్టుబడి అవసరాలు, విస్తరించిన ప్రచ్ఛన్న బ్యాంకింగ్ వ్యవస్థ క్రమబద్ధీకరణ మరియు డెరివేటివ్‌లు మరియు ముఖ్యమైన సంస్థలను క్రమానుగతంగా కాపాడడానికి గాను విస్తరింపజేసిన ఫెడరల్ రిజర్వ్ అధికారంతోపాటుగా మరిన్ని విషయాలను నొక్కి చెప్పాయి.[72][73][74] 2010 జనవరిలో ఒబామా ప్రొప్రైటరీ ట్రేడింగ్లో పాల్గొనడానికి బ్యాంకుల సామర్థ్యాన్ని పరిమితం చేసే అదనపు క్రమబద్ధీకరణలను ప్రతిపాదించారు. ప్రతిపాదిత మార్పుల కోసం బహిరంగంగా వాదించిన పాల్ వోల్కర్ గౌరవార్థం ఈ ప్రతిపాదనలకు వోల్కర్ రూల్ అని పేరు పెట్టారు.[75][76]

ప్రస్తుత సంక్షోభం ప్రభావాన్ని పరిమితం చేయడానికి మరియు మరోసారి రాకుండా అడ్డుకోవడం కోసం ఆర్థికవేత్తలు, రాజకీయనేతలు, విలేకరులు, వాణిజ్య అధిపతులు పలురకాల క్రమబద్ధీకరణ మార్పులను ప్రతిపాదించారు. అయితే 2009 నవంబరు వరకు ప్రతిపాదించిన పరిష్కారాలలో చాలావరకు అమలు చేయబడలేదు. వాటిలో:

 • బెన్ బెర్నాంకే: ప్రచ్ఛన్న బ్యాంకింగ్ వ్యవస్థలో మదుపు బ్యాంకులు మరియు పరిరక్షణ నిధులు వంటి, చిక్కుల్లో మునిగిన ఆర్థిక సంస్థలను మూసివేయడానికి తీర్మాన విధివిధానాలను నెలకొల్పాలి.[77]
 • జోసెఫ్ స్టిగ్లిట్జ్: ఆర్థిక సంస్థలు బాధ్యతపడగల పరపతిస్థాయిని నియంత్రించాలి. కార్యనిర్వహక పరిహారం దీర్ఘకాలిక సామర్థ్యానికి సంబంధించినదై ఉండాలి.[78] గ్రామ్-లీచ్-బ్లిలే చట్టం రావడంతో 1999లో అధికారికంగా రద్దు చేయబడిన, 1933లో గ్లాస్-స్టీగాల్ చట్టంచేత జరిగిన వాణిజ్య (నగదు నిల్వల) మరియు పెట్టుబడి బ్యాంకింగ్ విభజనను పునరుద్ధరించాలి.[413]
 • సిమోన్ జాన్సన్: వ్యవస్థాగత ప్రమాదాన్ని పరిమితం చేయడానికి గాను, కుప్పకూలడానికి అవకాశమున్న పెద్ద సంస్థలను విభజించాలి.[79]
 • పాల్ క్రూగ్మన్: బ్యాంకులకు సరిసమానంగా "బ్యాంకుల వలే పనిచేసే" సంస్థలను క్రమబద్ధీకరించాలి.[35]
 • అలాన్ గ్రీన్‌స్పాన్: బ్యాంకులు "మరీ పెద్దవి కాకుండా నిరుత్సాహపరచటానికి, వారి పోటీపడగల సౌకర్యాన్ని అడ్డుకునేందుకు" క్రమానుగత క్రమబద్ధీకరణ పెట్టుబడి అవసరాలతో (అంటే బ్యాంక్ పరిమాణంతో పాటు పెరిగే పెట్టుబడి నిష్పత్తులు) బలమైన పెట్టుబడి సామర్థ్య శక్తిని కలిగి ఉండాలి.[80]
 • వారెన్ బఫెట్: కనీసం 10% గృహ తనఖా మరియు ఆదాయ నిర్ధారణ కోసం కనీసం చెల్లింపులు అవసరం.[81]
 • ఎరిక్ డినాల్లో: ఏ ఆర్థిక సంస్థ అయినా దాని ఆర్థిక కార్యక్రమాలకు అవసరమైన పెట్టుబడిని కలిగి ఉండేలా చేయాలి. రుణ డిరైవేటివ్‌లను క్రమబద్ధీకరించాలి మరియు అవి సమస్థాయి సంస్థ ప్రమాదా న్ని పరిమితం చేయడానికి మంచి పెట్టుబడీకరణ మార్పిడులపై ట్రేడ్ అయ్యేలా చూడాలి.[82]
 • రఘురామ్ రాజన్: తగినంత "ఆగంతుక పెట్టుబడి"ని (అంటే పతనదశలో చెల్లింపుల మార్పిడికి గాను, పురోగమన సమయాల్లో ప్రభుత్వానికి బీమా ప్రీమియంలను చెల్లించడం,) నిర్వహించడానికి గాను ఆర్థిక సంస్థలు అవసరం.[83]
 • హెచ్ఎమ్ ట్రెజరీ: ప్రైవేట్ సెక్టర్ చేత నిర్వహించబడే ఆగంతుక పెట్టుబడి లేదా పెట్టుబడి బీమా, సంక్షేభ సమయాల్లో సాధారణ ఈక్విటీని అందించగలగాలి. బ్యాంక్ నిర్దేశిత (క్రమబద్దీకరణ పెట్టుబడి స్థాయిలకు సంబంధించి) లేదా సంక్షోభం యొక్క మరింత సాధారణ చర్య ద్వారా ముందే నిర్దేశించబడిన యంత్రాంగానికి అనుగుణంగా పెట్టుబడిగా మార్చదగిన స్థిర పెట్టుబడి రుణాన్ని బ్యాంకులు జారీ చేయగలిగేందుకు గాను అనేక ప్రతిపాదనలు (ఉదా. రేవివ్ 2004, ఫ్లానరీ 2009) ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా, పెట్టుబడి బీమా కింద, సంస్థాగత సంక్షోభ సందర్భంగా బ్యాంకుకు పెట్టుబడిని అందించడానికి అంగీకరించే బీమాదారు ప్రీమియం అందుకుంటారు. కింది రేవివ్ (2004) ప్రతిపాదనలను అనుసరించి, ప్రస్తుతం ఉన్న రుణాన్ని £7.5 బిలియన్ ($12.3 బిలియన్) ల ఆగంతుక కోర్ టయర్-1 పెట్టుబడిగా (డబ్‌డ్ కోకోస్) మార్చగలనని బ్రటన్‌లో అతిపెద్ద రిటైల్ బ్యాంక్ అయిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ (ఎల్‌బిజి), నవంబరు 3న తెలిపింది. బ్యాంక్ ఈక్విటీ పెట్టుబడి సామర్థ్య శక్తి 5% కంటే దిగువకు పడిపోయినట్లయితే ఈ తరహా పెట్టుబడి దానికదే షేర్లలోకి మార్పు చెందుతుంది.[84][85]
 • A. మైఖైల్ స్పెన్స్ మరియు గార్డన్ బ్రౌన్: సంస్థాగత ప్రమాదాన్ని కనుగొనడంలో సహాయపడటానికి ముందస్తు ప్రమాద హెచ్చరిక వ్యవస్థను నెలకొల్పాలి.[86]
 • నియాల్ ఫెర్గూసన్ మరియు జెఫరీ సాచెస్: బెయిలవుట్‌లకు గాను పన్ను చెల్లింపుదారు డబ్బును ఉపయోగించడానికి ముందుగా బాండ్ హోల్డర్లు మరియు వారి సమస్థాయి వ్యక్తులపై విభిన్నస్థాయిల ధరలు మోపాలి. మరో మాటలో చెప్పాలంటే, $100 క్లెయిమ్ కలిగిన బాండ్ హోల్డర్లు ఈక్విటీలో $20 పెట్టడం ద్వారా, తమ క్లెయిమ్‌ను $80కు తగ్గించుకోగలరు. ఇది ఈక్విటీ మార్పిడి కోసం రుణంగా కూడా పిలవబడుతుంది. ప్రస్తుత షేర్ హోల్డర్లు తుడిచిపెట్టుకుపోయి, బాండ్ హోల్డర్లు కొత్త స్టాక్‌హోల్డర్లుగా మారి, కంపెనీ రుణ సమస్యను క్రమంలో తగ్గించడానికి అంగీకరించే దివాళా సందర్భాల్లో ఇది తరచుగా జరుగుతుంటుంది. ఉదాహరణకు, జనరల్ మోటార్స్‌ విషయంలో ఇది జరిగింది.[87][88]
 • నౌరిల్ రౌబుని: దివాళా బ్యాంకులను జాతీయం చేయాలి.[89] భవిష్యత్తులో గృహ దరఖాస్తులో రుణగ్రహీతకు వాటా ఇవ్వడం ద్వారా గృహ యజమానులకు సహాయం చేయడానికి గాను తనఖా మిగుళ్లను తగ్గించాలి.[90]
 • అడైర్ టర్నర్: 2009 ఆగస్టులో, ప్రాస్పెక్ట్ మేగజైన్కు ఇచ్చిన ఓ రౌండ్ టేబుల్ ఇంటర్‌వ్యూలో, అడైర్ టర్నర్, అధిక వేతనాలు చెల్లిస్తూ కుహనా గౌరవంతో బతుకుతున్న ఆర్థిక రంగం సమాజానికి భారమయ్యేంత భారీగా పెరగటాన్ని హెచ్చరిస్తూ, కొత్త గ్లోబల్ ఆర్థిక వ్యవహారాలపై పన్నులు గురించిన భావనకు మద్దతు పలికారు[91]. ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తున్న ఆర్థిక చెల్లింపులకోసం ఆర్థికవేత్త జేమ్స్ టాబిన్ – పేరుతో పిలుస్తున్న “టాబిన్ టాక్స్” –ను గుర్తించాలని లార్ట్ టర్నర్ సూచించారు.[92][93][94]
 • అమెరికాలో మాత్రమే ఉన్న (అంతర్జాతీయంగా లేని) డెఫాజియో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ టాక్స్ - ప్రతిపాదిత చట్టం 2009 డిసెంబరు 3న ప్రతిపాదించబడింది, ఇది "H.R. 4191 పేరిట అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రతినిధుల సభ వద్ద ఉంది. 2009 మెయిన్ స్ట్రీట్ యాక్ట్ పునరుద్ధరణకు గాను వాల్ స్ట్రీట్‌ను చెల్లించనివ్వండి. [95][96] ఇది ప్రతిపాదిత శాసనం, దీన్ని యుఎస్ ద్రవ్య మార్కెట్ ("వాల్ స్ట్రీట్") సెక్యూరిటీస్ చెల్లింపులపై సూక్ష్మ పన్ను గురించి మదింపు చేయడానికి గాను అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఆమోదం పొందితే, అది రూపొందించే డబ్బు "మెయిన్ స్ట్రీట్." ను పునర్నిర్మించడానికి ఉపయోగించబడుతుంది. దాన్ని ప్రవేశపెట్టిన రోజు, దానికి 22 మంది ప్రతినిధులు మద్దతు పలికారు.[97]
 • వోల్కర్ రూల్ - (అమెరికాలో) - అధ్యక్షుడు బారక్ ఒబామా చే 2010 జనవరి 21న ఆమోదించబడింది. దాని పతాక దశలో, యుఎస్ ఆర్థికవేత్త పాల్ వోల్కర్ తమ కస్టమర్లకు ప్రయోజనం కలిగించని స్పెక్యులేటివ్ పెట్టుబడులను రూపొందించకుండా బ్యాంకులను నియంత్రించవలసిందిగా ప్రతిపాదించారు.[76] అలాంటి స్పెక్యులేటివ్ కార్యాచరణే 2007–2010 ఆర్థిక సంక్షోభంలో ముఖ్య పాత్ర పోషించిందని వోల్కర్ వాదించారు.

ప్రజల ఆగ్రహం: "బుడగ యంత్రాలు" మరియు "వాంపైర్ స్క్వాడ్"[మార్చు]

మేధావుల మరియు ఆర్థిక విషయాల ప్రెస్‌కు వెలుపల ఈ ఆర్థిక సంక్షోభం అనేది అనేక రెచ్చగొట్టే కథనాలను, పుస్తకాలను ప్రచురించడానికి దారితీసింది. వీటిలో అత్యంత ప్రసిద్ధమైన వ్యాసాలు, పుస్తకాలను వీరు రాశారు. రచయిత విలియం గ్రైడర్, ఆర్థికవేత్త మైఖేల్ హడ్సన్, రచయిత మరియు మాజీ బాండ్ అమ్మకందారు మైఖేల్ లెవిస్, కాంగ్రెస్ సభ్యుడు పాన్ పాల్, రచయిత కెవిన్ ఫిలిప్స్, మరియు రోలింగ్ స్టోన్ జాతీయ విలేఖరి మాట్ టైబీ. అదనంగా, అనేక బ్లాగ్ కథనాలు కూడా అసాధారణ పెరుగుదలను సాధించాయి, వీటిలో ది బేస్‌లైన్ సినేరియో జేమ్స్ క్వాక్ మరియు సైమన్ జాన్సన్, ది బిగ్ పిక్చర్ బ్యారీ రితోల్జ్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ రాసిన బిల్ మెక్‌బ్రైడ్, మరియు జీరో హెడ్గె రాసిన "టైలర్ డర్డన్."

ప్రత్యేకించి 2009 జూలైలో రాసిన "ది గ్రేట్ అమెరికన్ బబుల్ మెషిన్: హౌ గోల్డ్‌మన్-సాచెస్ బ్ల్యూ అప్ ది ఎకానమీ" వ్యాసంలో మాట్ టైబీ సంక్షోభంపై పలు ప్రజామోద అభిప్రాయాలను కలిపి ఒక చక్కటి అంశాన్ని తీసుకువచ్చాడు. ఈ వ్యాసంలో ఇతడు గోల్డెన్ సాచెస్ని "మానవజాతికి వ్యతిరేకంగా, డబ్బు వాసన ఎక్కడ తగిలితే అక్కడకి తన రక్తకోరలు చాచే భయంకర రక్తపిశాచ దళంగా అభివర్ణించాడు." [98]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3565: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 2. కాన్ఫర్ థామస్ ఫిలిప్టెలిఫోన్: "ద్రవ్య పరిశ్రమ భవిష్యత్తు", న్యూయార్క్ యూనివర్శిటీలో న్యూయార్క్ యూనివర్శిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యొక్క ఫైనాన్స్ విభాగం, బ్లాగుకు లింకు [17]
 3. http://www.census.gov/const/uspriceann.pdf
 4. "Federal Reserve Board: Monetary Policy and Open Market Operations". Retrieved 2008-05-19. 
 5. "The End of the Affair". Economist. 2008-10-30. Retrieved 2009-02-27. 
 6. FT-వోల్ఫ్ జపాన్ పాఠాలు
 7. FT మార్టిన్ వోల్ఫ్ - క్రమబద్దీకరణ మరియు ప్రోత్సాహకాల సంస్కరణ
 8. Soros, George (January 22, 2008). "The worst market crisis in 60 years". Financial Times. London, UK. Retrieved 2009-03-08. 
 9. ఇంధన మార్కెట్ మానిప్యులేషన్ మరియు ఫెడరల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పాలనలు
 10. http://web.archive.org/20061115035115/ddo.typepad.com/ddo/2006/10/the_relation_be.html
 11. http://web.archive.org/web/20041108173731/http://www.pincock.com/Perspectives/Issue1-Copper.pdf
 12. http://investinmetal.com/copper-price/
 13. http://dow-futures.net/historical-copper-prices-history/
 14. http://news.bbc.co.uk/1/hi/business/7841417.stm
 15. http://www.proactiveinvestors.com.au/companies/news/5032/mincors-result-reflects-a-return-to-better-days-for-sulphide-nickel-5032.html
 16. "Samir AMIN". Ismea.org. 1996-08-22. Retrieved 2009-11-11. 
 17. Amin, Samir (2008-11-23). "Financial Collapse, Systemic Crisis?". Globalresearch.ca. Retrieved 2009-11-11. 
 18. "The Financialization of Capital and the Crisis". Monthly Review. Retrieved 2009-11-11. 
 19. Bogle, John (2005). The Battle for the Soul of Capitalism. Yale University Press. ISBN 978-0-300-11971-8. 
 20. పెట్టుబడిదారీ విధానం ఆత్మ కోసం యుద్ధం
 21. Bezemer, Dirk J (June 2009). "“No One Saw This Coming”: Understanding Financial Crisis Through Accounting Models". Munich Personal RePEc Archive. Retrieved 2009-10-23. 
 22. "అమెరికాలో మాంద్యం," ది ఎకనమిస్ట్, నవంబర్ 15, 2007.
 23. రిచ్చర్డ్ బెర్నర్, "అమెరికన్ వినియోగదారుకు సరైన తుఫాను," మోర్గన్ స్టాన్లీ గ్లోబల్ ఎకనమిక్ ఫోరమ్, నవంబర్ 12, 2007.
 24. కబీర్ చిబ్బర్, "గోల్డ్‌మెన్ సబ్‌ప్రైమ్ రుణాలలో $2 ట్రిలియన్‌లను కోతపెట్టాలని చూస్తోంది," Bloomberg.com, నవంబర్ 16, 2007.
 25. బిజినెస్‌వీక్ మేగజైన్
 26. "Why Economists Failed to Predict the Financial Crisis - Knowledge@Wharton". Knowledge.wharton.upenn.edu. Retrieved 2009-11-11. 
 27. "డాక్టర్. డూమ్", స్టీఫెన్ మిహ్మ్, ఆగస్ట్ 15, 2008, న్యూయార్క్ టైమ్స్ మేగజైన్
 28. ఎమ్మా బ్రూక్స్, "అతడు అలా చెప్పాడు మరి," ది గార్డియన్, జనవరి 24, 2009.
 29. http://modeledbehavior.com/2009/09/11/john-cochrane-responds-to-paul-krugman-full-text/
 30. బ్లూమ్‌బెర్గ్-యు.ఎస్. యూరోపియన్ బ్యాంక్ నష్టాలను& అంచనావేస్తోంది-నవంబర్ 5, 2009
 31. HM Treasury, Bank of England and Financial Services Authority (September 14, 2007). "News Release: Liquidity Support Facility for Northern Rock plc". 
 32. "3 సంవత్సరాల చార్ట్" ను TED Bloomberg.com "మదుపు ఉపకరణాలు" వ్యాపింపజేస్తోంది
 33. NYT సమస్య పరిష్కారం- సంక్షోభం పెరుగుతున్నందున, ప్రమాద ఘంటిక కార్యాచరణకు దారితీస్తోంది
 34. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; newyorkfed.org అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 35. 35.0 35.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Krugman 2009 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 36. Search Site. "Nicole Gelinas-Can the Fed's Uncrunch Credit?". City-journal.org. Retrieved 2009-02-27. 
 37. బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్- యు.ఎస్. ద్రవ్య మరియు ఆర్థిక సంక్షోభం జూన్ 2009 PDF పేజీ 14
 38. Roger C. Altman. "The Great Crash, 2008 - Roger C. Altman". Foreign Affairs. Retrieved 2009-02-27. 
 39. అమెరికన్ల' సంపద $1.3 ట్రిలియన్ల మేరకు పడిపోయింది. CNNMoney.com. జూన్ 1, 2009
 40. ప్రభుత్వం 2008లో ప్రకటించిన ఆర్థిక ఆస్తులు మరియు రుణాలకు మద్దతు ఇస్తున్నది, త్వరలోనే ($ బిలియన్లలో). పేజీ 32 FDIC సూపర్వైజరీ ఇన్‌సైట్ పబ్లికేషన్. వేసవి 2009.
 41. Baker, Dean (November 29, 2008). "It's Not the Credit Crisis, Damn It!". Retrieved 2009-03-08. 
 42. Uchitelle, Louis (September 18, 2008). "Pain Spreads as Credit Vise Grows Tighter". The New York Times. pp. A1. Retrieved 2009-03-08. 
 43. "లేమన్ దివాళా తీసినట్లు ప్రకటించనుంది; మెరిల్ అమ్మివేయబడింది" ఆండ్రూ రాస్ సోర్కిన్ ది న్యూయార్క్ టైమ్స్‌లో రాసిన కథనం సెప్టెంబర్ 14, 2008
 44. "లాయిడ్స్ బ్యాంక్ బ్రిటిష్ రుణదాత కొనుగోలుపై చర్చిస్తోంది" జూలియా వెర్డిగియర్ ది న్యూ యార్క్ టైమ్స్ లో రాసిన కథనం సెప్టెంబర్ 17, 2008
 45. Norris, Floyd (2008-10-24). "United Panic". The New York Times. Retrieved 2008-10-24. 
 46. Evans-Pritchard, Ambrose (2007-07-25). "Dollar tumbles as huge credit crunch looms". Telegraph.co.uk. Telegraph Media Group Limited. Retrieved 2008-10-15. 
 47. మార్కెట్లను ప్రశాంత పర్చేందుకు కేంద్ర బ్యాంకులు పనిచేస్తాయి, ది ఫైనాన్షియల్ టైమ్స్ , సెప్టెంబర్ 18, 2008
 48. Landler, Mark (2008-10-23). "West Is in Talks on Credit to Aid Poorer Nations". The New York Times. Retrieved 2008-10-24. 
 49. Fackler, Martin (2008-10-23). "Trouble Without Borders". The New York Times. Retrieved 2008-10-24. 
 50. Goodman, Peter S. (September 26, 2008). "Credit Enters a Lockdown". The New York Times. pp. A1. Retrieved 2009-03-08. 
 51. Cho, David; Appelbaum, Binyamin (2008-10-07). "Unfolding Worldwide Turmoil Could Reverse Years of Prosperity". The Washington Post. pp. A01. Retrieved 2009-03-08. 
 52. 1934 నుండి, FDIC 3,500 బ్యాంకులను మూసివేసింది. పొదుపు-మరియు రుణ సంక్షోభ కాలంలో 82% కంటే ఎక్కువగా విఫలమయ్యాయి(చార్ట్)."Bank on this: bank failures will rise in next year". Associated Press. 2008-10-05. 
 53. UBS AG. "తిరోగమనం ప్రత్యామ్నాయం ఏదీ లేదు. 2008-10-06 కోసం డైలీ రౌండప్. 2008-10-12. 'గ్లోబల్ వృద్ది 2.2% yoy వద్ద కోలుకున్నది (మునుపు 2.8%). IMF 2.5% yoyని "మాంద్యం"గా ముద్రవేసింది, 'ప్రపంచవ్యాప్త పతనం అనివార్యం' ... 'ఆర్థిక కార్యాచరణ తిరిగి యధాస్థాయికి రావడంపై మనం మాట్లాడటానికి ముందు రెండు సంవత్సరాలు ఇది కొనసాగుతుంది'
 54. UBS AG. ప్రపంచాన్ని కాపాడటానికి ఓ పథకం. 2008-10-09 కోసం డైలీ రౌండప్. 2008-12-13న సేకరించబడింది. "నిన్న చేపట్టిన చర్యలు ముంచుకొస్తున్న ఆర్థిక పతనాన్ని ఆపలేవు."
 55. UBS AG. మాంద్య భయాలు అలుముకుంటున్నాయి. 2008-10-09 కోసం డైలీ రౌండప్. 2008-10-17న కోలుకున్నది. "చారిత్రక ప్రమాణాల ప్రాకారం ఇది చాలా తక్కువ సమయమే మరి"
 56. "Cracks in the crust". The Economist. Retrieved 2009-11-11. 
 57. UBS AG.2009 మార్చిలో IMF అంచనా వేస్తూ, మహామాంద్య కాలం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా మాంద్యానికి గురైన మొదటి సంఘటన ఇదేనని తెలిపింది. భయపడండి. చాలా చాలా భయపడండి. 2008-10-31 కోసం డైలీ రౌండప్. 2008-12-13న తిరిగి కోలుకుంది. "2009లో US, UK, యూరో ప్రాంతాల్లో రుణాత్మక పెరుగుదల. జపాన్ 0.1% వృద్ధితో G7లో చాలా వేగంగా పెరుగుతున్నఆర్థిక వ్యవస్థగా ఉంది, ఇది .098% వృద్ధి సాధించిన కెనడాకు కాస్త వెనుకగా ఉంది. 2009 లో ప్రపంచ వృద్ధి 1.3% మేరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు."
 58. "Untold Stories: Latvia: Sobering Lessons in Unregulated Lending". Pulitzercenter.typepad.com. 2009-05-18. Archived from the original on 2009-05-21. Retrieved 2009-11-11. 
 59. బ్రూకింగ్స్-బెయిలీ మరియు ఇలియట్-ది U.S. ద్రవ్య మరియు ఆర్థిక సంక్షోభం -జూన్ 2009
 60. డిర్క్ విల్లెమ్ టె వెల్డె(2009) బ్రీఫింగ్ పేపర్ 54 - ప్రపంచ ద్రవ్య సంక్షోభం మరియు వర్ధమాన దేశాలు: తీవ్రంగా తీసుకోండి, తగిన చర్య చేపట్టండి. లండన్: ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్
 61. సంక్షోభం నేపధ్యంలో అరబ్ ప్రపంచం 3 ట్రిలియన్‌లను కోల్పోయింది
 62. అరబ్ ప్రపంచంలో నిరుద్యోగిత 'టైం బాంబ్' లాగా ఉంది
 63. మధ్యప్రాచ్యంలో -2008లో విదేశీ మదుపు పడిపోయిందని UN నివేదించింది
 64. అరబ్ దేశాలకు ఇది చాలా కఠినమైన సంవత్సరమని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది
 65. BEA ప్రెస్ ప్రకటన
 66. BLS-చారిత్రక నిరుద్యోగితా రేటు పట్టిక
 67. బిజినెస్ వీక్-పనిగంటలు, వేతనాల కోతలతో ఉద్యోగులు నష్టపోయారు
 68. FOMC Statement June 24, 2009
 69. Minutes of the FOMC April 2009
 70. "BBC - Stimulus Package 2009". BBC News. 2009-02-14. Retrieved 2009-02-27. 
 71. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; foreignaffairs1 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 72. "Remarks of the President on Regulatory Reform | The White House". Whitehouse.gov. 2009-06-17. Retrieved 2009-11-11. 
 73. వాషింగ్టన్ పోస్ట్ - గైత్నర్ & సమ్మర్స్ - ఓ కొత్త ద్రవ్య సంస్థ
 74. ట్రెజరీ మంత్రిత్వ విభాగం నివేదిక- ద్రవ్య క్రమబద్ధీకరణ సంస్కరణ
 75. Glass-Steagall vs. the Volcker Rule, retrieved 2010-01-27 
 76. 76.0 76.1 David Cho, and Binyamin Appelbaum (January 22). "Obama's 'Volcker Rule' shifts power away from Geithner". The Washington Post. Retrieved 13 February 2010.  Check date values in: |date= (help)
 77. "Bernanke Remarks". Federalreserve.gov. 2008-12-01. Retrieved 2009-02-27. 
 78. "Stigliz Recommendations". 
 79. WSJ-ఆర్థికవేత్తలు పెద్ద బ్యాంకులను విడగొట్టాలని చూస్తున్నారు
 80. గ్రీన్‌స్పాన్-ప్రమాదానికి వ్యతిరేకంగా మనకు మంచి మదుపు కావాలి
 81. వారెన్ బఫెట్-2008 వాటాదారులకు ఉత్తరం సారాంశం
 82. డినాల్లో-మనం ఈ ఐస్ ఏజ్ లోకి మనకు మనమే ఆధునికీకరించబడ్డాము
 83. ది ఎకనమిస్ట్-రాజన్-సైకిల్ ప్రూఫ్ క్రమబద్ధీకరణ
 84. VOX-పోర్టెస్-రిస్క్, బహుమతి మరియు బాధ్యత: ఆర్థిక రంగం మరియు సమాజం
 85. అలోన్ రేవివ్, బ్యాంక్ స్థిరత్వం మరియు మార్కెట్ క్రమశిక్షణ: ఈక్విటీలను తీసేసుకోవడానికి డెబిట్ వెర్సెస్ సబార్డినేట్ సూచనలు
 86. "PIMCO-Lessons from the Crisis". Pimco.com. 2008-11-26. Retrieved 2009-02-27. 
 87. జెఫరీ సాస్-మన వాల్ స్ట్రీట్ పబ్లిక్ పాలసీని మోసగించింది
 88. FT-ఫెర్గూసన్-సమస్థాయి యుగానికి వెనుక
 89. రౌబిని-చార్లీ ఇంటర్‌వ్యూ
 90. ప్రపంచ వృద్ధికి ప్రమాదాలు
 91. "How to tame global finance". Prospect Magazine. 
 92. Daniel Pimlott (2009-11-08). "Q & A on Tobin tax". The Financial Times. Retrieved 2009-12-11. 
 93. George Parker, Daniel Pimlott, Kate Burgess, Lina Saigol and Jim Pickard (August 28, 2009). "Turner relishes role on City front line". Financial Times. Retrieved 2009-12-31. 
 94. ఫైనాన్షియల్ టైమ్స్ 27/08/2009 (www.ft.com)
 95. Matt Cover (December 7, 2009). "Pelosi Endorses ‘Global’ Tax on Stocks, Bonds, and other Financial Transactions". CNSNews.com. Retrieved 13 February 2010. 
 96. GovTrack - A civic project to track Congress (December 3, 2009). "Text of H.R. 4191: Let Wall Street Pay for the Restoration of Main Street Act of 2009". GovTrack. Retrieved 13 February 2010. 
 97. "DEFAZIO INTRODUCES LEGISLATION INVOKING WALL STREET 'TRANSACTION TAX'". Website of Peter DeFazio. Retrieved 13 February 2010. 
 98. ది గ్రేట్ అమెరికన్ బబుల్ మెషిన్: గోల్డ్‌మన్-సాచెస్ ఆర్థిక వ్యవస్థను ఎలా పేల్చి వేసింది, రోలింగ్ స్టోన్, జూలై 13, 2009

ప్రారంభ కథనాలు మరియు తదనంతర సమాచారం వికిఇన్ఫో కథనం "ఫైనాన్షియల్ క్రైసిస్ of 2007-2008" http://www.wikinfo.org/index.php?title=Financial_crisis_of_2007-2008 నుంచి తీసుకోవడం జరిగింది, ఇది GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్స్ వెర్షన్ 1.2 లో విడుదలయింది.

బాహ్య లింకులు మరియు తదుపరి పఠనం[మార్చు]

మూస:2008 economic crisis మూస:Subprime mortgage crisis మూస:BankPanicUSA మూస:Stock market crashes