2010
Jump to navigation
Jump to search
2010 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
[మార్చు]జనవరి 2010
[మార్చు]- జనవరి 4: కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైనది.
- జనవరి 5: తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 8 రాజకీయ పార్టీల నాయకులతో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
- జనవరి 5: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ జనక్రాంతి పేరిట కొత్త పార్టీని స్థాపించాడు.
- జనవరి 6: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అమర్‌సింగ్ పార్టీ పదవులకు రాజీనామా సమర్పించాడు.
- జనవరి 8: పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్‌గా భారతీయ జనతా పార్టీకు చెందిన గోపీనాథ్ ముండా నియమితుడైనాడు.
- జనవరి 11: క్రోయేషియా అధ్యక్షుడిగా ఇవో జోసిపోలిక్ ఎన్నికయ్యాడు.
- జనవరి 12: హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మృతిచెందారు.
- జనవరి 13: ఉత్తర ప్రదేశ్ విధానమండలి ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది.
- జనవరి 13: భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్యజరిగిన ముక్కోణపు క్రికెట్ టోర్నమెంటు ఫైనల్లో శ్రీలంక భారత్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- జనవరి 16: 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు.
రాష్ట్రము కొత్త గవర్నరు పేరు రాష్ట్రము కొత్త గవర్నరు పేరు ఆంధ్రప్రదేశ్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ చత్తీస్‌గఢ్ శేఖర్ దత్ పశ్చిమ బెంగాల్ ఎం.కె.నారాయణన్ పంజాబ్ శివరాజ్ పాటిల్ హిమాచల్ ప్రదేశ్ ఊర్మిళాసింగ్ రాజస్థాన్ ప్రభారావ్ జార్ఖండ్ ఎం.ఓ.హెచ్.ఫరూఖ్ మహారాష్ట్ర కె.శంకర్ నారాయణన్
- జనవరి 17 - పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్చంతంచేసుకున్న జ్యోతిబసు. (జ. 1914)
- జనవరి 19: ఛాయాగ్రాహకుడు వి.కె.మూర్తికి 2008 సంవత్సరలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
- జనవరి 20: నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతి చెందారు.
- జనవరి 20: అభిప్రాయసేకరణలో అఫ్ఘనిస్తాన్ పౌరులు అభిమానిస్తున్న దేశాల్లో భారతదేశం తొలిస్థానంలో నిలిచింది.
- జనవరి 20: 2008 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.కె.మూర్తికి లభించింది.
- జనవరి 25: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రంలో కూలిపోయి 90 మంది మృతిచెందారు.
- జనవరి 30: ఖమ్మంలో నంది నాటకోత్సవాలు-2009 ప్రారంభమయ్యాయి.
- జనవరి 30: పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిలో పడవ మునిగి 11 మంది మరణించారు.
- జనవరి 31: విశాఖపట్టణం జిల్లాలోని తాండవ రిజర్వాయరులో పుట్టి మునిగి 12గురు మరణించారు.
ఫిబ్రవరి 2010
[మార్చు]- ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలను సమిక్షించడానికి శ్రీకృష్ణ అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
- ఫిబ్రవరి 8: కోస్టారికా అధ్యక్షురాలిగా లారా చిన్‌చిల్లా ఎన్నికైనది.
- ఫిబ్రవరి 10: ఉక్రేయిన్ అధ్యక్ష ఎన్నికలలో విక్టర్ యనుకోవిచ్ విజయం సాధించింది.
- ఫిబ్రవరి 10: జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌గా శరత్ చంద్ర సిన్హా నియమితుడైనాడు.
- ఫిబ్రవరి 11: ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకున్నాడు.
- ఫిబ్రవరి 13: పూణె నగరంలో బాంబుపేలుడు సంభవించి 9మంది మృతి చెందారు.
- ఫిబ్రవరి 15: పశ్చిమ బెంగాల్లో మావోయిస్టుల మెరుపుదాడిలో 24మంది జవాన్లు మృతి చెందారు.
- ఫిబ్రవరి 15: 12 గురు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించాడు.
- ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ ప్రమాణ స్వీకారం చేశాడు.
- ఫిబ్రవరి 22: ఎన్డీఏ కార్యనిర్వాహక చైర్మెన్‌గా లాల్‌కృష్ణ అద్వానీ ఎన్నికయ్యాడు.
- ఫిబ్రవరి 27: చిలీలో కంసెప్స నగరంలో భూకంపం సంభవించి వందలాది ప్రజలు మరణించారు.
మార్చి 2010
[మార్చు]- మార్చి 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
- మార్చి 9: మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదించబడింది.
- మార్చి 9: 82వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా "ది హర్ట్ లాకర్" ఎంపికైనది.
- మార్చి 9: టర్కీలోని ఎలాజిక్ రాష్ట్రంలో భూకంపం సంభవించి 57 మంది మరణించారు.
ఏప్రిల్ 2010
[మార్చు]- ఏప్రిల్ 4: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు 76 సిఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చారు.
- ఏప్రిల్ 5: బెంగుళూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది.
- ఏప్రిల్ 6: దంతెవాడ జిల్లాలో జరిగిన మావోస్టుల హింసాకాండలో 74 సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
- ఏప్రిల్ 7: బ్రెజిల్లో సంభవించిన భారీ వరదలలో 90మందికి పైగా మరణించారు.
- ఏప్రిల్ 8: శ్రీలంక పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి.
- ఏప్రిల్ 10: రష్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో పోలాండ్ అధ్యక్షుడు లెచ్ కజిన్ స్కీతో సహా 97 మంది మృతిచెందారు.
- ఏప్రిల్ 14: చైనాలోని కిఘై ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించి 400 మంది మరణించారు.
- ఏప్రిల్ 20: మేఘాలయ ముఖ్యమంత్రిగా ముకుల్ సంగ్మా నియమితుడైనాడు.
మే 2010
[మార్చు]- మే 9: కోస్టారికా తొలి మహిళా అధ్యక్షురాలిగా లారా చిన్ చిలా ప్రమాణస్వీకారం చేసింది.
- మే 12: బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు.
- మే 12: భారత సుప్రీంకోర్టు 38వ ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎస్.కపాడియా ప్రమాణస్వీకారం చేశాడు.
- మే 15: జి-15 దేశాల నూతన అధ్యక్షుడిగా శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే ఎన్నికయ్యాడు.
- మే 22: మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.
జూన్ 2010
[మార్చు]- జూన్ 1: జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించబడింది.
- జూన్ 2: పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించింది.
- జూన్ 3: జపాన్ ప్రధానమంత్రి యుకియో హతోయామా రాజీనామా చేశాడు.
- జూన్ 4: జపాన్ నూతన ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు.
- జూన్ 4: జర్మనీ అధ్యక్షుడిగా క్రిస్టియన్ ఉల్ప్ నియమించబడ్డాడు.
- జూన్ 7: జాతీయ వెనుకబడిన తరగతుల చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎం.నారాయణరావు పదవి స్వీకరించాడు.
- జూన్ 12: ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధ్యక్షుడిగా జోసెఫ్ డీస్ (స్విట్జర్లాండ్) ఎన్నికయ్యాడు.
జూలై 2010
[మార్చు]- జూలై 3: ఢిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయంలో 9000 కోట్ల రూపాయల్ పెట్టుబడితో నిర్మించిన 3వ టెర్మినల్ (టీ3)ను ప్రారంభించారు.
- జూలై 3: కిర్గిస్తాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఒటుంబయెవా (మధ్య ఆసియాలో అధ్యక్షురాలి హోదా చేపట్టిన తొలి మహిళ).
- జూలై 5: శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేకం జరిగి 500 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా 3 రోజుల పాటు, ఆ ఉత్సవాన్ని జరుపుతుంది. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు.
- జూలై 5: ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు 'భారత్ బంద్'ని నిర్వహించాయి.
- జూలై 27: ఒక్క తిండి గింజ కూడా వృధా చేసినా నేరమే అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసింది. తిండి గింజలను కుళ్ళబెట్టే బదులు పేదలకు ఇవ్వవచ్చుకదా అన్నది. బీదరికంలో లేని వారికి తిండి గింజలలో రాయితీలు ఎందుకు అన్నది.
- జూలై 28: పాకిస్తాన్‌లో ఇస్లామాబాద్ సమీపంలోని కోడప్రంతంలో ఉదయం పది తంటల సమయంలో కోడను ఢీకొని పేలిపోయింది. 155మంది సిబ్బందితో సహా మరణించారు.
- జూలై 28: 22 లేదా 23 ఆగష్టు నెలలో ఇంజినీరింగ్ కౌన్సెలింగు జరుగుతుంది అన్నారు.
- జూలై 28: ప్రధాన ఎన్నికల కమిషనరుగా (సీ.ఈ.సీ)గా షాహాబుద్దీన్ యాకుబ్ ఖురేషీని నియమించారు. ప్రస్తుతమున్న నవీన్ చావ్లా 2010 జూలై 29 గురువారం పదవీ విరమణ చేస్తాడు. 63 సంవత్సరాల వయసు ఉన్న ఖురేషీ రెందు సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతాడు.
- జూలై 30: 12 శాసనసభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి 11 స్థానాలలో, భారతీయ జనతా పార్టీ 1 స్థానం (నిజామాబాద్ అర్బన్ ) గెలుచుకున్నాయి. నియోజక వర్గాలు : 1.సిర్పూరు, 2.చెన్నూరు, 3.మంచిర్యాల, 4.నిజామాబాద్ అర్బన్ (బా.జ.పా), 5.ధర్మపురి, 6.వేములవాడ, 7. సిద్ధిపేట, 8.వరంగల్ (పశ్చిమ), 9. హుజూరాబాద్, 10.సిరిసిల్ల, 11.కోరుట్ల, 12.ఎల్లారెడ్డి.
- జూలై 30 : శ్రీకృష్ణ దేవరాయలు, సింహాచలం అప్పన్నకు ఇచ్చిన 16 బంగారు అభరణాలను, ప్రజలు చూడటానికి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య, ప్రదర్శనకు పెట్టారు.
ఆగష్టు 1
[మార్చు]- పాకిస్తాన్ వాయవ్య ప్రాంతం మొత్తం వర్షాల వలన జలమయం అయ్యి మహా సముద్రంలా కనిపిస్తుంది 800 మంది మరణించారు. 10లక్షల మంది నీడ కొల్పోయారు.
సెప్టెంబర్ 2010
[మార్చు]అక్టొబర్ 2010
[మార్చు]నవంబర్ 2010
[మార్చు]డిసెంబర్ 2010
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 17: జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1914)
- జనవరి 26: గుమ్మడి వెంకటేశ్వరరావు, తెలుగు సినీనటుడు. (జ.1927)
- జనవరి 27: దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు.
- జనవరి 29: రాం నివాస్ మీర్థా, మాజీ కేంద్ర మంత్రి
- జనవరి 29: చోళ లింగయ్య, తెలంగాణ పోరాట యోధుడు.
- ఫిబ్రవరి 10: కె.ఎన్.రాజ్, భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు .
- ఫిబ్రవరి 11: లక్ష్మీదేవమ్మ, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ.
- ఫిబ్రవరి 14: డిక్ ఫ్రాన్సిస్, నవలా రచయిత .
- ఫిబ్రవరి 20: అలెగ్జాండర్ హేగ్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి.
- ఫిబ్రవరి 20: బి.పద్మనాభం , తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931)
- ఫిబ్రవరి 21: చామర్తి కనకయ్య కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933)
- ఫిబ్రవరి 25: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (జ. 1924)
- మార్చి 1: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (జ.1931)
- మార్చి 4: మైకెల్ ఫుట్, భారత్ స్నేహితుడుగా పేరుపొందిన బ్రిటన్ లేబర్ పార్టీ మాజీ నేత.
- మార్చి 15: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజి మంత్రి. (జ.1935)
- మార్చి 20: గిరిజాప్రసాద్ కోయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.
- ఏప్రిల్ 3: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (జ.1925)
- ఏప్రిల్ 6:గౌతమ్ వాఘేలా, భారతీయ కళాకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత (జ.1936)
- ఏప్రిల్ 7: భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (జ. 1932)
- మే 6: అజ్మల్ కసబ్, పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాది. (జ.1987)
- మే 15: బైరాన్ సింగ్ షెకావత్, భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1923)
- మే 22: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సిసిమా పాటల రచయిత. (జ.1936)
- మే 30: బలరాం నందా, భారత చరిత్రకారుడు.
- జూన్ 15: మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (జ.1926)
- ఆగష్టు 1: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (జ.1917)
- ఆగష్టు 8: సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (జ.1914)
- ఆగష్టు 10: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (జ.1932)
- ఆగష్టు 14: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త. (జ.1934)
- సెప్టెంబరు 5: హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (జ.1923)
- సెప్టెంబరు 12: స్వర్ణలత, దక్షిణ భారత గాయని. (జ.1973)
- సెప్టెంబరు 23: కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926)
- సెప్టెంబరు 23: భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (జ.1915)
- సెప్టెంబరు 24: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. (జ.1929)
- అక్టోబరు 20: పాగ పుల్లారెడ్డి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. (జ. 1919)
- అక్టోబరు 24: చెరుకూరి లెనిన్, ధనుర్ విద్యా శిక్షకుడు. (జ. )
- నవంబరు 2: ఎ .హెచ్.వి. సుబ్బారావు, పాత్రికేయుడు. (జ.1934)
- నవంబరు 13: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత. (జ.1928)
- నవంబరు 25: మిద్దె రాములు, ఒగ్గు కథ కళాకారుడు. (జ.1942)
- డిసెంబరు 8: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (జ.1926)
- డిసెంబరు 26: ఏ.వి.సుబ్బారావు, రంగస్థల కళాకారులు, నాటక రచయిత, తెలుగు రంగస్థల నటుడు. (జ.1930)
అవార్డులు
[మార్చు]- మూర్తిదేవి అవార్డు -- ఎం.వీరప్ప మొయిలీ.