2016 వేసవి ఒలింపిక్ క్రీడలు
2016 వేసవి ఒలింపిక్ క్రీడల చిహ్నం[A] | |
| Host city | రియో డి జనీరో, బ్రెజిల్ |
|---|---|
| Motto | ఒక నూతన ప్రపంచం (Portuguese: Um mundo novo) |
| Nations | 207 [స్వతంత్ర ఒలింపిక్ అథ్లెట్స్(IOA), శరణార్థుల ఒలింపిక్(EOR) జట్లను కలుపుకుని][1] |
| Athletes | 11,180 (6,146 పురుషులు, 5,034 స్త్రీలు)[1] |
| Events | 28 క్రీడల(42 విభాగాల)లో 306 |
| Opening | 5 ఆగస్ట్ 2016 |
| Closing | 21 ఆగస్ట్ 2016 |
| Opened by | మిచెల్ టెమర్, బ్రెజిల్ రాష్ట్రపతి[B] |
| Cauldron | వాండర్లీ కోర్డెరిరో డి లిమా |
| Stadium | మారకానా స్టేడియం |
Summer Winter | |
2016 వేసవి ఒలింపిక్ క్రీడలు (రియో 2016) బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఆగస్టు 5 నుండి 21 వరకు జరిగాయి. దక్షిణ అమెరికాలో[3], ఒక పోర్చుగీస్ మాట్లాడే దేశంలో ఈ క్రీడలు జరగడం ఇదే మొదటిసారి.
ఈ క్రీడలలో 207 దేశాల నుండి 11,238 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో కొసోవో, సౌత్ సుడాన్, శరణార్థుల ఒలింపిక్ జట్టు మొదటిసారిగా ప్రవేశించాయి.[4][5] రగ్బీ సెవెన్స్, గోల్ఫ్‌లతో కలిపి మొత్తం 28 క్రీడల్లో 306 సెట్ల పతకాల కొరకు ఈవెంట్స్ జరిగాయి. అమెరికా (USA) 46 బంగారు పతకాలతో (మొత్తం 121) అగ్రస్థానంలో నిలిచింది. గ్రేట్ బ్రిటన్ రెండో స్థానాన్ని[6], చైనా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆతిథ్య దేశమైన బ్రెజిల్ 7 బంగారు పతకాలతో కలిపి మొత్తం 19 పతకాలు సాధించి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. బహ్రెయిన్, ఫిజీ, జోర్డాన్, కొసోవో, సింగపూర్, వియత్నాం వంటి పలు దేశాలు తమ మొదటి ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాయి.
బిడ్డింగ్ ప్రక్రియ
[మార్చు]
2016 వేసవి ఒలింపిక్ క్రీడల వేలం ప్రక్రియ 16 మే 2007న ప్రారంభమైంది..[7] పలు వడపోతల అనంతరం చికాగో, మాడ్రిడ్, రియో డి జనీరో, టోక్యో నగరాలు తుది రేసులోకి వచ్చాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యులను ప్రభావితం చేయకుండా ఉండేందుకు కఠినమైన నిబంధనలు విధించినప్పటికీ, ఈ నగరాలు మీడియా ద్వారా పరోక్ష మద్దతు కోసం భారీగా ఖర్చు చేశాయి. అక్టోబర్ 2, 2009న డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన తుది ఓటింగ్‌లో మొదటి రౌండులో చికాగో తప్పుకుంది. రెండవ రౌండులో టోక్యో వెనుతిరిగింది (తర్వాత ఈ నగరానికే 2020 ఒలింపిక్స్ దక్కాయి). తుది రౌండులో మాడ్రిడ్‌పై స్పష్టమైన ఆధిక్యత సాధించి, బ్రెజిల్‌కు చెందిన రియో డి జనీరో 2016 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను కైవసం చేసుకుంది.
| నగరం | దేశం | రౌండు | ||
|---|---|---|---|---|
| 1 | 2 | 3 | ||
| రియో డి జనీరో | 26 | 46 | 66 | |
| మాడ్రిడ్ | 28 | 29 | 32 | |
| టోక్యో | 22 | 20 | — | |
| చికాగో | 18 | — | — | |
అభివృద్ధి, సన్నాహాలు
[మార్చు]వేదికలు, మౌలిక వసతులు
[మార్చు]
ఈ పోటీలు 18 ఇప్పటికే ఉన్న వేదికలు, 9 కొత్త వేదికలు, 7 తాత్కాలిక వేదికలలో జరిగాయి. వీటిని బర్రా, కోపకబానా, డియోడోరో, మారకానా అనే నాలుగు ప్రాంతాలుగా విభజించారు.[9]

ఓపెనింగ్, క్లోజింగ్ వేడుకలు, ఫుట్‌బాల్ ఫైనల్స్ 75,000 సీటింగ్ సామర్థ్యం గల 'మారకానా స్టేడియం'లో జరిగాయి.[9] ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ 60,000 సీటింగ్ సామర్థ్యం గల 'నిల్టన్ శాంటోస్ స్టేడియం'లో జరిగాయి.[9]ఒలింపిక్ చరిత్రలోనే ఇది అతిపెద్ద అథ్లెట్ల విలేజ్. ఇందులో దాదాపు 80,000 కుర్చీలు, 70,000 టేబుళ్లు, 29,000 పరుపులు, 10,000 స్మార్ట్‌ఫోన్‌లను ఏర్పాటు చేశారు.
ఫుట్‌బాల్
[మార్చు]రియోతో పాటు సావో పాలో, బెలో హారిజోంటే, సాల్వడార్, బ్రసీలియా, మనౌస్ నగరాల్లోని స్టేడియాలలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగాయి.
- మారకానా స్టేడియం
రియో డి జనీరో, RJ - ఒలింపిక్ స్టేడియం
రియో డి జనీరో, RJ - అరేనా డా అమెజోనియా
మనౌస్, AM - అరేనా కొరింథియన్స్
సావో పాలో, SP - అరేనా ఫాంటెనోవా
సాల్వడార్, BA - ఎస్టాడియో నేషనల్
బ్రసీలియా, DF - మినిరావ్
బెలో హారిజోంటే, MG
పట్టణ ఆధునీకరణ
[మార్చు]రియో చారిత్రక రేవు ప్రాంతాన్ని దాదాపు 5 చదరపు కిలోమీటర్ల మేర ఆధునీకరించారు. ఇందులో భాగంగా వందల కిలోమీటర్ల నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరిచారు. కొత్తగా ఒక ట్రామ్ (లైట్ రైల్) వ్యవస్థను కూడా నిర్మించారు.[10]
పతకాలు
[మార్చు]
బ్రెజిల్ నేషనల్ మింట్ తయారు చేసిన ఈ పతకాలలో వెండి, కాంస్య పతకాలను 30% రీసైకిల్ చేసిన పదార్థాలతో చేశారు. బంగారు పతకాలను పాదరసం (Mercury) వాడకుండా, పర్యావరణ నియమాలకు లోబడి సేకరించిన బంగారంతో తయారు చేశారు.
పోడియం
[మార్చు]
విజేతలు నిలబడే పోడియంలను బ్రెజిల్ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల కలయికతో, పూర్తిగా సేంద్రీయ కలపతో తయారు చేశారు. పోటీల అనంతరం వీటిని ఫర్నిచర్‌గా మార్చేలా డిజైన్ చేశారు.[11]
ఒలింపిక్ జ్యోతి
[మార్చు]
21 ఏప్రిల్ 2016న గ్రీస్ దేశంలోని ఒలింపియాలో ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. మే 3న బ్రసీలియాలో ప్రారంభమైన ఈ జ్యోతి యాత్ర, బ్రెజిల్‌లోని 300కు పైగా నగరాల గుండా ప్రయాణించి, ఆగస్టు 5న రియో ప్రారంభ వేడుకలకు చేరుకుంది.[12]
వాలంటీర్లు
[మార్చు]
దాదాపు 240,000 దరఖాస్తులలో 50,000 మందిని వాలంటీర్లుగా ఎంపిక చేశారు. అయితే, ఎక్కువ పని గంటలు, సరైన భోజన వసతి లేకపోవడం వల్ల కొందరు మధ్యలోనే తప్పుకున్నారు.[13]
టికెట్లు
[మార్చు]మొత్తం 75 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచారు. వీటి కనీస ధర 40 బ్రెజిలియన్ రియాల్స్ (BRL) కాగా, గరిష్టంగా ప్రారంభ వేడుకల టికెట్ ధర 4,600 BRL గా ఉంది.
పర్యావరణ పరిరక్షణ
[మార్చు]
ఈ క్రీడలను "బ్లూ ప్లానెట్ కోసం గ్రీన్ గేమ్స్" అనే నినాదంతో నిర్వహించారు.[14] కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఒలింపిక్ జ్యోతి కుండం (Cauldron) పరిమాణాన్ని తగ్గించారు.[15] పతక విజేతలకు సాంప్రదాయకంగా ఇచ్చే పూలగుచ్ఛాలను ఇవ్వలేదు (అవి వృథా అవుతాయనే ఉద్దేశంతో).[16][17] హ్యాండ్‌బాల్ పోటీల కోసం నిర్మించిన 'ఫ్యూచర్ అరేనా'ను తాత్కాలికంగా నిర్మించారు. పోటీల తర్వాత దీనిని విడదీసి పాఠశాలలుగా పునర్నిర్మించేలా ప్లాన్ చేశారు[18](అయితే నిధుల కొరత వల్ల ఆ పనులు ఆలస్యమయ్యాయి).
క్రీడలు
[మార్చు]ప్రారంభ వేడుకలు
[మార్చు]
2016 ఆగస్టు 5న మారకానా స్టేడియంలో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు జరిగాయి. దీనికి ఫెర్నాండో మీరైల్స్, డానియెలా థామస్, ఆండ్రూచా వాడింగ్టన్ దర్శకత్వం వహించారు.[19] ఈ వేడుక బ్రెజిల్ చరిత్ర, సంస్కృతిని అద్భుతంగా ప్రతిబింబించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ నివారణను పిలుపునిస్తూ ఫెర్నాండా మోంటెనెగ్రో, జూడీ డెంచ్ వివరించిన ఒక ప్రత్యేక విభాగం ఇందులో హైలైట్‌గా నిలిచింది.[20][21] స్టేడియంలోని 60,000 మంది ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు బిలియన్ల (300 కోట్లు) మంది ఈ వేడుకలను వీక్షించారు.[3]
ఈ వేడుకలో భాగంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) మొదటిసారిగా 'ఒలింపిక్ లారెల్' పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. "క్రీడల ద్వారా విద్య, సంస్కృతి, అభివృద్ధి, శాంతి రంగాలలో గణనీయమైన విజయాలు సాధించిన వారికి" ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డును కెన్యా అథ్లెట్ కిప్‌చోగే కీనోకు బహూకరించారు.[22] బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడు మిచెల్ టెమెర్ ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించాడు.[23]
2004 ఒలింపిక్స్ పురుషుల మారథాన్‌లో కాంస్య పతక విజేత అయిన లాంగ్-డిస్టెన్స్ రన్నర్ వాండర్లీ కోర్డెరిరో డి లిమా ఒలింపిక్ జ్యోతిని వెలిగించాడు.[3] 2004 రేసులో ఒక ప్రేక్షకుడు అతనిపై దాడి చేయడంతో లీడ్‌లో ఉండి కూడా రేసును కోల్పోయినప్పటికీ, ఆయన ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి గాను IOC వారి 'పియరీ డి కౌబెర్టిన్' మెడల్‌ను అందుకున్నాడు.[19][24] నిజానికి ఈ జ్యోతిని బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే వెలిగించాల్సి ఉంది, కానీ ఆరోగ్య సమస్యల వల్ల ఆయన ఈ వేడుకకు హాజరుకాలేకపోయాడు.[21][25][26]
ప్రారంభ వేడుక అనంతరం, పేదరికం నుండి బయటపడి రన్నర్‌గా శిక్షణ పొందుతున్న 14 ఏళ్ల బ్రెజిల్ యువ అథ్లెట్ జార్జ్ గోమ్స్, కాండెలేరియా చర్చి ముందు ప్రజల సందర్శనార్థం ఉంచిన మరొక బహిరంగ ఒలింపిక్ జ్యోతిని వెలిగించాడు.[27][28]
క్రీడలు
[మార్చు]



2016 సమ్మర్ ఒలింపిక్ క్రీడా ప్రణాళికలో 306 పతకాల ఈవెంట్లతో కూడిన 28 క్రీడలను చేర్చారు. ఇందులోని 42 విభాగాలలో జరిగిన ఒక్కో ఈవెంట్ సంఖ్యను బ్రాకెట్లలో పేర్కొనడం జరిగింది.
| 2016 వేసవి ఒలింపిక్స్ క్రీడా ప్రణాళిక | ||||
|---|---|---|---|---|
|
కొత్త క్రీడలు
[మార్చు]ఈ ఒలింపిక్ క్రీడలలో రగ్బీ సెవెన్, గోల్ఫ్ క్రీడలను క్రొత్తగా చేర్చారు.[29][30]
రికార్డులు
[మార్చు]2016 వేసవి ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఇరవై ఏడు ప్రపంచ రికార్డులు, తొంభై ఒక్క ఒలింపిక్ రికార్డులు నమోదయ్యాయి. ఆర్చరీ (విలువిద్య), అథ్లెటిక్స్, కానోయింగ్, సైక్లింగ్ ట్రాక్, మోడరన్ పెంటాథ్లాన్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్ వంటి క్రీడలలో ఈ రికార్డులు సృష్టించబడ్డాయి.
క్రీడా సమయాల ఖరారు
[మార్చు]అక్వాటిక్స్ (ఈత పోటీలు), బీచ్ వాలీబాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ వంటి కొన్ని ముఖ్యమైన క్రీడా ఈవెంట్‌లు రాత్రి 10:00 గంటల నుండి అర్ధరాత్రి 12:00 గంటల (BRT - బ్రెజిల్ ప్రామాణిక సమయం) వరకు జరిగేలా షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ విధమైన సమయాల ఖరారు ముఖ్యంగా అమెరికాకు చెందిన ప్రసార హక్కుల సంస్థ 'ఎన్‌బిసి' ప్రభావం వల్ల జరిగింది.
ముగింపు వేడుకలు
[మార్చు]
2016 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలు 2016 ఆగస్టు 21న మారకానా స్టేడియంలో బ్రెజిల్ ప్రామాణిక సమయం (BRT) ప్రకారం రాత్రి 20:00 గంటల నుండి 22:50 గంటల వరకు జరిగాయి..[31] ఒలింపిక్ సాంప్రదాయ నిబంధనల ప్రకారం, ఈ వేడుకలో ప్రస్తుత ఆతిథ్య దేశం (బ్రెజిల్), తదుపరి ఆతిథ్య దేశం (జపాన్) రెండింటి సాంస్కృతిక ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. అలాగే ఐఓసి (IOC) అధ్యక్షుడు థామస్ బాచ్ క్రీడల ముగింపును ప్రకటిస్తూ ప్రసంగించాడు. ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ లీడర్ కార్లోస్ ఆర్థర్ నుజ్మాన్ కూడా ముగింపు వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా రియో డి జనీరో మేయర్ ఎడ్వర్డో పేస్ నుండి 2020 వేసవి ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న టోక్యో నగర గవర్నర్ యురికో కోయికేకు ఒలింపిక్ జెండాను అధికారికంగా అప్పంగించి, ఒలింపిక్ జ్యోతిని ఆర్పివేశాడు.[32]
ఈ ముగింపు వేడుకకు రోసా మగల్హేస్ క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.[33] భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఆతిథ్య నగరంలోని వివిధ చారిత్రక ప్రదేశాలను ప్రతిబింబించేలా కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనతో ఈ వేడుక ప్రారంభమైంది. ఆ తర్వాత మార్టిన్హో డా విలా, పిక్సింగుయిన్హా రాసిన "కరిన్హోసో" గీతాన్ని ఆలపించాడు. అథ్లెట్లను పరిచయం చేసే మరొక విభాగంలో, గాయని రోబెర్టా సా.. తలపై పండ్ల అలంకరణతో మిడ్-సెంచరీ హాలీవుడ్‌లో అందరి అభిమానాన్ని పొందిన దిగ్గజ నటి 'కార్మెన్ మిరాండా' రూపాన్ని గుర్తుచేస్తూ ప్రదర్శన ఇచ్చింది. బ్రెజిల్‌లోని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 27 మంది పిల్లలతో కూడిన కోరస్ బృందం బ్రెజిల్ జాతీయ గీతాన్ని ఆలపించిన వెంటనే ఫ్లాగ్ పరేడ్ (జెండాల ప్రదర్శన) ప్రారంభమైంది.
ఖర్చు
[మార్చు]
ఆక్స్‌ఫర్డ్ ఒలింపిక్స్ స్టడీ 2016 నివేదిక ప్రకారం, రియో 2016 సమ్మర్ ఒలింపిక్స్ యొక్క మొత్తం అంచనా వ్యయం 2015-డాలర్ల విలువ ప్రకారం 4.6 బిలియన్ అమెరికన్ డాలర్లుగా తేలింది. ఈ గణాంకాల్లో క్రీడలకు సంబంధించిన ఖర్చులు మాత్రమే చేర్చబడ్డాయి, అవి (i) క్రీడలను నిర్వహించడానికి ఆర్గనైజింగ్ కమిటీకి అయిన నిర్వహణ ఖర్చులు - ఇందులో సాంకేతికత, రవాణా, సిబ్బంది,పరిపాలన ఖర్చులు ప్రధానమైనవి కాగా.. భద్రత, కేటరింగ్, ప్రారంభ-ముగింపు వేడుకలు, వైద్య సేవలకు అయిన ఖర్చులు కూడా ఉన్నాయి (ii) ప్రత్యక్ష మూలధన ఖర్చులు - క్రీడల నిర్వహణకు అవసరమైన పోటీ వేదికలు, ఒలింపిక్ విలేజ్, అంతర్జాతీయ బ్రాడ్‌కాస్ట్ సెంటర్, మీడియా-ప్రెస్ సెంటర్ల నిర్మాణాల కోసం ఆతిథ్య నగరం, దేశం లేదా ప్రైవేట్ పెట్టుబడిదారులకు అయిన ఖర్చులు.[34]
రోడ్లు, రైల్వేలు లేదా విమానాశ్రయ మౌలిక వసతులు, హోటళ్ల ఆధునీకరణ లేదా ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన ఇతర వ్యాపార పెట్టుబడుల వంటి పరోక్ష మూలధన ఖర్చులను (Indirect capital costs) ఇందులో చేర్చలేదు, ఎందుకంటే ఇవి నేరుగా క్రీడల నిర్వహణతో సంబంధం ఉన్నవి కావు. చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఒలింపిక్స్‌గా నిలిచిన బీజింగ్ 2008 (40-44 బిలియన్ డాలర్లు), సోచి 2014 (51 బిలియన్ డాలర్లు) క్రీడలతో పోలిస్తే రియో ఒలింపిక్స్ ఖర్చు (4.6 బిలియన్ డాలర్లు) చాలా తక్కువ. కాగా, 1960 నుండి జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ క్రీడల సగటు ఖర్చు 5.2 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది..[34]
పాల్గొన్న జాతీయ ఒలింపిక్ కమిటీలు
[మార్చు]
మొత్తం 205 జాతీయ ఒలింపిక్ కమిటీలకు చెందిన కనీసం ఒక్క అథ్లెట్ అయినా ఈ క్రీడలకు అర్హత సాధించారు. 2014 FEI వరల్డ్ ఈక్వెస్ట్రియన్ గేమ్స్ టీమ్ ఈవెంట్‌లో పతకాలు సాధించడం ద్వారా జర్మనీ, గ్రేట్ బ్రిటన్, నెదర్లాండ్స్ దేశాలు 'టీమ్ డ్రెస్సేజ్' (గుర్రపు స్వారీ) విభాగంలో తమ నలుగురేసి అథ్లెట్ల చొప్పున ఈ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి మూడు దేశాలుగా నిలిచాయి.[35]
ఆతిథ్య దేశంగా బ్రెజిల్ అన్ని సైక్లింగ్ విభాగాలు, వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లలో ఆరు స్థానాలతో సహా కొన్ని క్రీడలలో నేరుగా పాల్గొనే అవకాశాన్ని పొందింది.[36][37]
2016 వేసవి ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి కొసోవో, సౌత్ సుడాన్ దేశాలకు మొదటిసారిగా అర్హత లభించింది. అయితే, అనేక యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా బల్గేరియా, రష్యా వెయిట్‌లిఫ్టర్లపై రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు.[38][39]
దేశంలోని ఒలింపిక్ కమిటీలో ప్రభుత్వ జోక్యం కారణంగా కువైట్‌పై ఐదేళ్లలో రెండోసారి అక్టోబర్ 2015లో నిషేధం విధించబడింది. దీంతో కువైట్ అథ్లెట్లు తమ దేశం తరపున కాకుండా, "ఇండిపెండెంట్ ఒలింపిక్ అథ్లెట్లు"గా ఈ పోటీలలో పాల్గొన్నారు.[40]


నీలం = 2016లో మొదటిసారి పాల్గొన్న దేశాలు.
ఆకుపచ్చ = ఇదివరకు పాల్గొన్న దేశారు.
పసుపపచ్చ వృత్తం ఆతిథ్య నగరం (రియో డి జనీరో)
పతకాల పట్టిక
[మార్చు]అత్యధిక సంఖ్యలో బంగారు పతకాలను సాధించిన మొదటి పది జాతీయ ఒలింపిక్ కమిటీల (NOCs) జాబితా క్రింద ఇవ్వబడింది. ఆతిథ్య దేశమైన బ్రెజిల్ మొత్తం 19 పతకాలతో (7 బంగారం, 6 వెండి, 6 కాంస్యం) 13వ స్థానంలో నిలిచింది.
| ర్యాంకు | దేశం | స్వర్ణం | రజతం | కాంస్యం | మొత్తం పతకాలు |
|---|---|---|---|---|---|
| 1 | 46 | 37 | 38 | 121 | |
| 2 | 27 | 23 | 17 | 67 | |
| 3 | 26 | 18 | 26 | 70 | |
| 4 | 19 | 17 | 20 | 56 | |
| 5 | 17 | 10 | 15 | 42 | |
| 6 | 12 | 8 | 21 | 41 | |
| 7 | 10 | 18 | 14 | 42 | |
| 8 | 9 | 3 | 9 | 21 | |
| 9 | 8 | 12 | 8 | 28 | |
| 10 | 8 | 11 | 10 | 29 | |
| 11-86 | మిగిలిన దేశాలు | 124 | 150 | 181 | 455 |
| మొత్తం | 306 | 307 | 359 | 972 |
ఆందోళనలు, వివాదాలు
[మార్చు]2016 రియో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు పలు అంతర్జాతీయ వివాదాలు ముసురుకున్నాయి. అయితే, ఎలాంటి పెద్ద అవాంతరాలు లేకుండా క్రీడలు విజయవంతంగా ముగిశాయి.[41][42][43]
రాజకీయ, ఆర్థిక సంక్షోభం
[మార్చు]బ్రెజిల్ ప్రభుత్వ రంగ చమురు సంస్థ 'పెట్రోబ్రాస్'లో జరిగిన భారీ అవినీతి, మనీలాండరింగ్ (ఆపరేషన్ కార్ వాష్) దేశంలో పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసింది. దీనివల్ల అప్పటి బ్రెజిల్ ప్రెసిడెంట్ దిల్మా రౌసెఫ్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది.[44] 1990ల తర్వాత బ్రెజిల్ అత్యంత ఘోరమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. దీనికి తోడు, ఒలింపిక్స్ ఆతిథ్య ఓట్లను కొనడానికి $2 మిలియన్ల లంచం ఇచ్చారనే ఆరోపణలపై బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ చీఫ్ కార్లోస్ నుజ్మాన్, పలువురు అధికారులపై కేసులు నమోదయ్యాయి (అయితే 2024లో కోర్టు వీరి శిక్షను రద్దు చేసింది).[45]
జికా వైరస్
[మార్చు]దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ అప్పట్లో బ్రెజిల్‌లో తీవ్రంగా వ్యాపించడంతో అథ్లెట్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొందరు క్రీడాకారులు దీనివల్ల పోటీలకు దూరంగా ఉన్నారు.[46]
అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒలింపిక్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గేమ్స్ ముగిశాక, క్రీడాకారులకు లేదా సందర్శకులకు ఎవరికీ జికా సోకలేదని WHO ధృవీకరించింది.[47]
పర్యావరణ సమస్యలు
[మార్చు]సెయిలింగ్, విండ్‌సర్ఫింగ్ పోటీలు జరగాల్సిన 'గుయానబారా బే' సముద్ర తీరం మురికివాడల వ్యర్థాలు, మురుగునీటి వల్ల తీవ్రంగా కలుషితమైంది. ఒలింపిక్స్ నాటికి కనీసం 80% మురుగునీటిని శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ,[48] బడ్జెట్ లోపాల వల్ల దాదాపు 60-65% మాత్రమే శుద్ధి చేయగలిగారు.[49]
భద్రత
[మార్చు]రియో నగరంలో నేరాల రేటు ఎక్కువగా ఉండటంతో భద్రత పెద్ద సవాలుగా మారింది. దీనికోసం బ్రెజిల్ సైన్యం, వైమానిక, నౌకాదళాలకు చెందిన సుమారు 22,000 మంది సైనికులను, 5,000 మంది జాతీయ భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. గేమ్స్ ప్రారంభానికి రెండు వారాల ముందు ఒక ఉగ్రవాద ముఠాను బ్రెజిల్ పోలీసులు పట్టుకున్నారు.[50]
రష్యా డోపింగ్ స్కాండల్
[మార్చు]రష్యా ప్రభుత్వం అధికారికంగా తన అథ్లెట్లకు డోపింగ్ (ఉద్దీపన మందులు) ప్రోత్సహిస్తోందని అంతర్జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నివేదికలో తేలింది.[51]
రష్యాను ఒలింపిక్స్ నుండి పూర్తిగా నిషేధించాలని WADA సిఫార్సు చేసినప్పటికీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఆ నిర్ణయాన్ని ఆయా క్రీడా సమాఖ్యల వ్యక్తిగత పరిశీలనకు వదిలేసింది. దీనివల్ల 111 మంది రష్యన్ అథ్లెట్లపై నిషేధం పడగా, మిగిలిన 278 మంది రష్యా జెండా కింద పోటీ పడటానికి అనుమతి పొందారు.[52] అయితే, పారాలింపిక్స్ కమిటీ మాత్రం రష్యా పారాలింపిక్ జట్టుపై పూర్తి నిషేధం విధించింది.
నోట్స్
[మార్చు]- ↑ The official logo of the 2016 Summer Olympics was made in 3D design, made by Brazilian design company Tàtil Design; it was inspired by Brazil's rich history of festivals and its colorful people; it also symbolizes energy, passion and unity. The selected colours derived from the city's environment, symbolises the sun and Brazil's happy warm and nature.
- ↑ Incumbent president Dilma Rousseff suspended from duties due to impeachment.[2]
మూలాలు
[మార్చు]- 1 2 "Rio 2016 Summer Olympics – Results and Video Highlights". Rio2016.com. Rio 2016 Organising Committee for the Olympic and Paralympic Games. 17 April 2018. the original నుండి 1 August 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 August 2017.
- ↑ Gallas, Daniel (12 May 2016). "Michel Temer: The man who now leads Brazil". BBC. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 July 2024.
- 1 2 3 "Rio Olympics 2016: Opening ceremony celebrates Brazil to open Games". BBC Sport. 6 August 2016. ఒరిజినల్ నుండి 8 November 2020 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 October 2020.
- ↑ "Olympic Athletes". Rio2016.com. Rio 2016 Organising Committee for the Olympic and Paralympic Games. the original నుండి 21 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2017.
- ↑ "About Rio 2016 Summer Olympics". Rio 2016 Olympics Wiki. ఒరిజినల్ నుండి 8 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2015.
- ↑ Herbert, Ian (21 August 2016). "How many millions each Olympic medal has really cost Britain". The Independent. ఒరిజినల్ నుండి 21 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 August 2021.
- ↑ "2016 Bid Process Launched". olympic.org (Press release). International Olympic Committee. 16 May 2007. ఒరిజినల్ నుండి 15 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 February 2017.
- ↑ "Past Bid Results". GamesBids.com. the original నుండి 24 January 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2015.
- 1 2 3 "Sports and Venues" (PDF), Rio de Janeiro 2016 Candidate File (PDF), vol. 2, BOC, 16 February 2009, pp. 10–11, the original (PDF) నుండి 23 May 2013 న ఆర్కైవు చెయ్యబడింది, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 June 2015.
- ↑ "Rio tram starts test running". Railway Gazette. 26 November 2015. the original నుండి 6 March 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 January 2016.
- ↑ "Rio-2016 apresenta medalhas e pódio da Olimpíada". O Globo (in బ్రెజీలియన్ పోర్చుగీస్). 2016-06-14. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-05-18.
- ↑ "Goiás will be the first state to receive the Rio 2016 Olympic Flame". Diário Mercantil. 16 April 2015. the original నుండి 18 April 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 April 2015.
- ↑ Sims, Alexandra (17 August 2016). "Thousands of Olympic volunteers quit over 'long hours and lack of food'". The Independent. ఒరిజినల్ నుండి 1 May 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 December 2016.
- ↑ "Brazil Made Big Environmental Promises for Its Rio Olympics. Here's Why It Won't Keep Them". The Atlantic. 2 July 2014. ఒరిజినల్ నుండి 30 June 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2016.
- ↑ "Diminutive Rio 2016 cauldron complemented by massive kinetic sculpture". Dezeen. 8 August 2016. ఒరిజినల్ నుండి 10 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 August 2016.
- ↑ Busbee, Jay (10 August 2016). "Rio mystery solved: Why don't Olympic medal winners get flowers?". Yahoo! Sports. the original నుండి 10 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 August 2016.
- ↑ "Here's why Olympic medalists don't get flowers at the Summer Games in Rio". Mashable. 12 August 2016. ఒరిజినల్ నుండి 13 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 August 2016.
- ↑ "Rio 2016 handball arena will dismantle to become four schools". Dezeen. 25 July 2016. ఒరిజినల్ నుండి 12 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2016.
- 1 2 Gibson, Owen; Watts, Jonathan (6 August 2016). "Rio 2016 opening ceremony a mix of pared patriotism and climate concern". The Guardian. ఒరిజినల్ నుండి 12 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 October 2020.
- ↑ "The Rio Opening Ceremony Put Climate Change Front And Center". The Huffington Post. 6 August 2016. ఒరిజినల్ నుండి 7 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 August 2016.
- 1 2 Levinson King, Robin (5 August 2016). "Highlights from Rio 2016 Olympic opening ceremony". Toronto Star. ఒరిజినల్ నుండి 6 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 August 2016.
- ↑ "Kip Keino to receive Olympic Laurel distinction". olympic.org. IOC. 4 August 2016. ఒరిజినల్ నుండి 25 August 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 August 2016.
- ↑ Axon, Rachel (6 August 2016). "No introduction for Brazil's president at start of opening ceremony". USA Today. ఒరిజినల్ నుండి 24 December 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 August 2016.
- ↑ "Protester ruins marathon". BBC Sport. 29 August 2004. ఒరిజినల్ నుండి 8 May 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 October 2020.
- ↑ "Emanuel surpreende e oferece sua medalha de ouro para Vanderlei Cordeiro" [Emanuel surprises and offers his gold medal to Vanderlei Cordeiro]. Folha Online (in పోర్చుగీస్). 1 September 2004. ఒరిజినల్ నుండి 5 October 2013 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 August 2012.
- ↑ "Mystery Solved: Why Rio Olympics' cauldron is so tiny". Yahoo! Sports. 6 August 2016. ఒరిజినల్ నుండి 10 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 August 2016.
- ↑ Brunhuber, Kim (12 August 2016). "Formerly homeless boy who lit Olympic cauldron now has 'beautiful life'". CBC.ca. ఒరిజినల్ నుండి 10 October 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 August 2016.
- ↑ Klotz, Fabio (6 August 2016). "Vanderlei Cordeiro de Lima se eterniza como herói e ganha a medalha de ouro" [Vanderlei Cordeiro de Lima immortalizes himself as an Olympic hero and 'wins' gold]. O Dia. ఒరిజినల్ నుండి 10 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2016..
- ↑ "Olympic Leaders Approve Golf and Rugby for 2016 Summer Games". Fox News Channel. 13 August 2009. ఒరిజినల్ నుండి 19 September 2009 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 October 2009.
- ↑ "Olympics 2016: IOC Approves Golf And Rugby Sevens To Be Included In Rio De Janeiro Games". Sky (United Kingdom). the original నుండి 22 May 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2010.
- ↑ "Rio 2016 Ingressos – Compre seu ingresso para as Olímpiadas". ingressos.rio2016.com (in పోర్చుగీస్). Rio 2016 Organising Committee for the Olympic and Paralympic Games. the original నుండి 24 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2016.
- ↑ "Rio Olympics 2016: Spectacular closing ceremony as Olympic flag goes to Tokyo". BBC Sport. 22 August 2016. ఒరిజినల్ నుండి 27 December 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 August 2016.
- ↑ "Rio 2016: Rosa Magalhães deve comandar encerramento". Rio 2016 (in పోర్చుగీస్). 19 September 2015. ఒరిజినల్ నుండి 21 September 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2016.
- 1 2 Flyvbjerg, Bent; Stewart, Allison; Budzier, Alexander (2016). The Oxford Olympics Study 2016: Cost and Cost Overrun at the Games. Oxford: Saïd Business School Working Papers (Oxford: University of Oxford). pp. 18–20. arXiv:1607.04484. doi:10.2139/ssrn.2804554. SSRN 2804554.
- ↑ "Rio Olympics gets 1st qualified athletes". USA Today. Associated Press. 26 August 2014. ఒరిజినల్ నుండి 27 August 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2014.
- ↑ Hann, Michael (2014-05-07). "UCI and IOC agree qualification quotas for Rio 2016". Reuters. ఒరిజినల్ నుండి 2014-09-03 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2014.
- ↑ Anderson, Gary (2 February 2014). "Weightlifting qualification criteria for Rio 2016 approved by IOC". insidethegames.biz. ఒరిజినల్ నుండి 12 September 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2014.
- ↑ "Bulgarian weightlifters banned from Rio Olympics after CAS rejects appeal against ban for doping violations". abc.net.au. Reuters. 29 January 2016. ఒరిజినల్ నుండి 6 January 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2016.
- ↑ "Strong statement by the IWF Executive Board". IWF. 22 June 2016. ఒరిజినల్ నుండి 10 September 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 August 2016.
- ↑ "Olympics-Kuwait ban remains in force as ties with IOC deteriorate". Yahoo Sports. 9 December 2015. ఒరిజినల్ నుండి 8 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2016.
- ↑ Watts, Jonathan (21 August 2016). "Have the Olympics been worth it for Rio?". The Guardian. ఒరిజినల్ నుండి 11 April 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2019.
For politicians and administrators who have staked their careers on these Games, there were no shortage of reasons to declare them a success: tourist numbers were reasonably high (in excess of the 500,000 target, according to the government), sales goals were reached, the infrastructure remained standing, Zika fears proved unfounded and Brazil won more medals than at any previous Games.
- ↑ Davies, Wyre (20 August 2016). "Has the Olympics been a success for Brazil?". BBC News. ఒరిజినల్ నుండి 11 April 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2019.
Indeed, for the second time in two years, Brazil has shown it can successfully stage a major international sporting jamboree.
- ↑ "How do we know that Rio 2016 was a success". olympic.org. IOC. 6 December 2016. ఒరిజినల్ నుండి 11 April 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2019.
- ↑ Flynn, Daniel; Soto, Alonso (14 March 2016). "Record Brazil protests put Rousseff's future in doubt". Reuters. ఒరిజినల్ నుండి 6 November 2020 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 March 2016.
- ↑ "Rio Olympics head Carlos Nuzman charged with corruption". BBC News. 19 October 2017. ఒరిజినల్ నుండి 7 January 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 December 2017.
- ↑ "Zika virus: Olympic venues to be inspected daily before and during Games". BBC Sport. 29 January 2016. ఒరిజినల్ నుండి 29 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 January 2016.
- ↑ "No Zika cases from Olympics, says WHO". BBC News. 2 September 2016. ఒరిజినల్ నుండి 3 September 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 September 2016.
- ↑ "'Super bacteria' found in Rio waters where sailors and windsurfers are supposed to compete in the Olympics". The Washington Post. ఒరిజినల్ నుండి 2016-06-09 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 May 2016.
- ↑ "USOC, athletes navigate questions swirling around Rio's contaminated water". The Washington Post. 2016-03-09. ఒరిజినల్ నుండి 2016-06-19 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 June 2016.
- ↑ Jelmayer, Rogerio; Magalhaes, Luciana (25 July 2016). "Brazil Authorities Arrest 12th Suspect in Alleged Olympics Terror Plot". The Wall Street Journal. ఒరిజినల్ నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 February 2017.
- ↑ "WADA Statement: Independent Investigation confirms Russian State manipulation of the doping control process". wada-ama.org. World Anti-Doping Agency. 18 July 2016. ఒరిజినల్ నుండి 3 December 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 December 2017.
- ↑ "Rio 2016: 270 Russians cleared to compete at Olympic Games". BBC Sport. 4 August 2016. ఒరిజినల్ నుండి 4 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది.