Jump to content

2021 మయన్మార్ తిరుగుబాటు

వికీపీడియా నుండి
2021 మయన్మార్ తిరుగుబాటు
మయన్మార్ లో అంతర్గత సంఘర్షణ,రాజకీయ సంక్షోభం భాగములో భాగము

ఎడమవైపు అంగ్ సాన్ సూకీ, కుడి వైపు మిన్ ఆంగ్ హ్లయింగ్
తేదీఫిబ్రవరి 1, 2021; 3 సంవత్సరాల క్రితం (2021-02-01)
ప్రదేశంమయన్మార్
ఫలితం*సైనిక తిరుగుబాటు విజయవంతమైంది.
  • 2020 సాధారణ ఎన్నికల ఫలితాలు రద్దు చేయబడ్డాయి.
  • అత్యవసర పరిస్థితి ఒక సంవత్సరం పాటు ప్రకటించబడింది.
ప్రత్యర్థులు
*మయన్మార్ ప్రభుత్వం
  • నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ
  • బర్మా

    మయన్మార్‌లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది.2020 ఎన్నికలలో అక్రమాలు జరిగాయని మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్‌మెంట్‌ పార్టీ ఆరోపించింది. ఆ దేశ మిలటరీ కూడా అదే ఆరోపణలు చేసింది. దీనితో ఆ దేశ మిలటరీ ఒక సంవత్సరం పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.2020 ఎన్నికలలో ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు తిరుగుబాటు జరిగింది. ప్రెసిడెంట్ విన్ మైంట్, రాష్ట్ర సలహాదారు ఆంగ్ సాన్ సూకీని మంత్రులు, వారి డిప్యూటీలు, పార్లమెంటు సభ్యులతో పాటు నిర్బంధించారు.[1]

    ఎన్నికల వివాదం

    [మార్చు]

    2015 వరకు ఐదు దశాబ్దాల పాటు అక్కడ సైన్యం పాలనయే కొనసాగింది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీకి చెందిన నేష‌‌న‌‌ల్ లీగ్ ఫ‌‌ర్ డెమోక్రసీ పార్టీ(ఎన్ఎల్డీ) ఘన విజ‌‌యం సాధించింది. అంతర్జాతీయ ఒత్తిడిలకు లొంగి 2008లో రూపొందించిన ఆ దేశ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో 25 శాతం సీట్లను తాత్మదాకు రిజర్వు చేశారు. దానితో ప్రజల మద్దతుతో సూకీకి అధికారం చేపట్టరు.2020 న‌‌వంబ‌‌ర్‌‌లో జ‌‌రిగిన ఎన్నిక‌‌ల్లో కూడా ఆమె పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 476 సీట్లు ఉండగా,ఆమె పార్టీ 396 సీట్లు గెలుపొందింది. సైన్యం మద్దతుతో పోటీ చేసిన యూఎస్డీపీ 33 సీట్లనే గెలుపొందింది. అయితే ఎన్నికల ఫలితాలు రాగానే ఆ పార్టీ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేయడం సైన్యం మొదలుపెట్టింది. 2011లో సైనిక పాల‌‌న ముగిసిన త‌‌ర్వాత, రెండోసారి ఎన్నిక‌‌ల‌‌ను నిర్వహించారు. ఎన్నిక‌‌ల ఫ‌‌లితాల‌‌పై సైన్యం అభ్యంత‌‌రం వ్యక్తం చేసింది. దేశాధ్యక్షుడితోపాటు ఎన్నిక‌‌ల సంఘంపై సుప్రీంకోర్టులో సైన్యం కేసు వేసింది. ఎన్నిక‌‌ల సంఘం మాత్రం ఆ ఆరోప‌‌ణ‌‌ల‌‌ను కొట్టిపారేసింది. ఆ దేశంలో 90కి పైగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయగా, 17 పార్టీలే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించాయి.[2] [3][4][5] [6][7][8]

    తిరుగుబాటు

    [మార్చు]

    2020 ఫిబ్రవరి 1 నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలను సైన్యం గృహనిర్బంధం చేసింది.పాలన పగ్గాలను తమ చేతిలోకి తీసుకుంటున్నట్లు సైన్యం తమ సొంత మీడియా ద్వారా ప్రకటించింది. దేశంలో ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని విధించింది. ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలను నిలిపివేసింది. మయన్మార్‌ పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, ఒక ఏడాది పాటు దేశం తమ అదుపులోనే ఉంటుందని, ఏడాది తర్వాత ఎన్నికలు నిర్వహించి విజేతకు అధికారాన్ని అప్పగిస్తామని సైన్యం వెల్లడించింది. అప్పటి వరకూ కమాండర్‌-ఇన్‌-చీ్‌ఫ మిన్‌ ఆంగ్‌ హ్లింగ్‌ దేశానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని, ఉపాధ్యక్షుడు మైంట్‌ స్వే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారని స్పష్టం చేసింది.ఎన్నికల అనంతరం తొలి పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు సభ్యులను తెల్లవారు జామునే సైన్యం నిర్బంధంలోకి తీసుకుంది.8ఫిబ్రవరి న సైనిక ప్రభుత్వం యాంగోన్ ఇతర ప్రధాన నగరాల్లో రాత్రి 8:00 నుండి తెల్లవారుజామున 4:00 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.బహిరంగ ప్రదేశాల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమావేశాలను పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

    ప్రజలు నిరసన

    [మార్చు]

    మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసన తెలుపుతున్నారు.ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, నిర్బంధంలోని ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి ఆందోళనలు చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఆందోళనలను అణచివేసేందుకు సైన్యం నిషేధం విధించింది.పరిశ్రమల కార్మికులు, పౌర సేవకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ట్రాన్స్జెండర్లు, బౌద్ధ మత గురువులు, ప్రచారకులు, క్రైస్తవులు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

    వివిధ దేశాల స్పందన

    [మార్చు]

    భారత్,అమెరికా,బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌, ఆస్ట్రేలియా సహా పలుదేశాలు మియన్మార్‌లో సైనిక తిరుగుబాటును ఖండించాయి. ప్రజాస్వామ్య సంస్కరణలకు ఇది పెద్ద విఘాతం అని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరి జనరల్‌ ఆంటోనియో గుటెర్రాస్‌ వ్యాఖ్యానించారు.

    మూలాలు

    [మార్చు]
    1. "Second Myanmar official dies after arrest, junta steps up media crackdown". 9 March 2021. Archived from the original on 17 March 2021. Retrieved 10 March 2021.
    2. "On This Day | The Day Myanmar's Elected Prime Minister Handed Over Power". The Irrawaddy (in అమెరికన్ ఇంగ్లీష్). 26 September 2020. Archived from the original on 1 February 2021. Retrieved 1 February 2021.
    3. Butwell, Richard; von der Mehden, Fred (1960). "The 1960 Election in Burma". Pacific Affairs. 33 (2). Pacific Affairs, University of British Columbia: 144–157. doi:10.2307/2752941. JSTOR 2752941.
    4. Taylor, Robert (25 May 2015). General Ne Win. ISEAS Publishing. doi:10.1355/9789814620147. ISBN 978-981-4620-14-7. Archived from the original on 3 February 2021. Retrieved 1 February 2021.
    5. "How A Failed Uprising Set The Stage For Myanmar's Future". Time. Archived from the original on 19 September 2020. Retrieved 1 February 2021.
    6. "Burma: 20 Years After 1990 Elections, Democracy Still Denied". Human Rights Watch. Archived from the original on 26 September 2020. Retrieved 1 February 2021.
    7. Nohlen, Dieter; Grotz, Florian; Hartmann, Christof (2001). Elections in Asia: A data handbook, Volume I. Oxford University Press. pp. 599, 611. ISBN 0-19-924958-X.
    8. Yan Aung, Wei (7 October 2020). "Myanmar's 1990 Election: Born of a Democratic Uprising, Ignored by the Military". The Irrawaddy. Archived from the original on 31 January 2021. Retrieved 1 February 2021.

    వెలుపలి లింకులు

    [మార్చు]