2022 భారత-పాక్ క్షిపణి ఘటన
2022 మార్చి 9 న భారతదేశం, హర్యానాలోని అంబాలా నుండి అనుకోకుండా బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. అది పాకిస్తాన్ పంజాబ్, ఖానేవాల్ జిల్లాలోని మియాన్ చన్నుపైకి దూసుకెళ్లింది.
సంఘటన
[మార్చు]2022 మార్చి 9 న, సాయంత్రం 6:43 గంటలకు, పాకిస్తాన్ వైమానిక దళానికి (PAF) చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్, భారత భూభాగంలో వేగంగా ఎగురుతున్న వస్తువును చూసింది. "ప్రారంభ దిశ నుండి, ఆ వస్తువు అకస్మాత్తుగా పాకిస్తాన్ భూభాగం వైపు దూసుకుపోయి పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించి, చివరికి సాయంత్రం 6:50 గంటలకు మియాన్ చన్ను సమీపంలో పడిపోయింది" అని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ తెలిపాడు.[1]
పాకిస్తాన్ పంజాబ్‌లోని ఖానేవాల్ జిల్లాలోని మియాన్ చన్ను సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పౌర ఆస్తులకు నష్టం వాటిల్లింది కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.[2] ఈ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలో మూడు నిమిషాల, 44 సెకండ్ల పాటు 124 కిలోమీటర్లు ప్రయాణించిందని పిఎఎఫ్ ఎయిర్ వైస్ మార్షల్ తారిక్ జియా తెలిపాడు. హర్యానాలోని అంబాలా సమీపం నుండి ఈ క్షిపణి బయలుదేరిందని పాకిస్తాన్ వైమానిక దళం గుర్తించింది.[1] అది రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ మీదుగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించింది.[3]
ఆ ప్రాంతంలో ఒక విమానం కూలిపోయిందని తొలి మీడియా నివేదికలు సూచించాయి.[4][5]
స్పందన
[మార్చు]పాకిస్తాన్
[మార్చు]పాకిస్తాన్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. భారతదేశంలో క్షిపణి ఉద్భవించిన ప్రదేశం నుండి దాని ఢీకొన్న స్థానం వరకు దానిని ట్రాక్ చేయడంతో పాకిస్తాన్ వైమానిక దళం "అవసరమైన వ్యూహాత్మక చర్యలను ప్రారంభించింది" అని సైనిక ప్రతినిధి అన్నారు.[1] భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారతదేశాన్ని హెచ్చరిస్తూ, ప్రమాదానికి గల కారణాలను అది వివరించాలని డిమాండ్ చేసింది.[3] క్షిపణి ప్రమాదవశాత్తూ పేలడం "వారి [భారతీయుల] సాంకేతిక నైపుణ్యాన్నీ, విధానపరమైన సామర్థ్యాన్నీ ప్రతిబింబిస్తుంది" అని సైనిక ప్రతినిధి తెలిపారు. క్షిపణి సంఘటన అనేక అంతర్జాతీయ, దేశీయ ప్రయాణీకుల విమానాల భద్రతకు కలిగించే ముప్పు గురించి కూడా పాకిస్తాన్ విచారం వ్యక్తం చేసింది.[1][3]
2022 మార్చి 11 న, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం భారత రాయబారిని పిలిపించి, ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు లేకపోయినా భారతదేశానికి చెందిన "సూపర్-సోనిక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్" తమ గగనతలాన్ని ఉల్లంఘించడంపై పాకిస్తాన్ తన నిరసనను తెలిపింది. ఇటువంటి "బాధ్యతారాహిత్య సంఘటనలు" భారతదేశపు "వైమానిక భద్రత పట్ల నిర్లక్ష్యం, ప్రాంతీయ శాంతీ స్థిరత్వాల పట్ల దాని లెక్కలేనిఅతనాన్నీ" ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది.[6]
2022 మార్చి 12 న, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం "సంఘటన చుట్టూ ఉన్న వాస్తవాలను ఖచ్చితంగా నిర్ధారించడానికి ఉమ్మడి దర్యాప్తు" కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది, అదే సమయంలో అంతర్గత విచారణ నిర్వహించాలనే న్యూఢిల్లీ నిర్ణయాన్ని తిరస్కరించింది.[7]
భారతదేశం
[మార్చు]ప్రమాదవశాత్తు క్షిపణి ప్రయోగం జరిగిందని సంఘటన జరిగిన 48 గంటల తర్వాత అంగీకరిస్తూ భారత రక్షణ మంత్రిత్వ శాఖ, "సాంకేతిక లోపం కారణంగా క్షిపణి ప్రమాదవశాత్తు పేలింద"నీ,[8] అది "తీవ్ర విచారకరం" అనీ 2022 మార్చి 11 న పేర్కొంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ఉన్నత స్థాయి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు కూడా భారతదేశం తెలిపింది. భారత, పాకిస్తాన్ అధికారులు ఇంకా ధృవీకరించనప్పటికీ, ప్రమాదవశాత్తూ ప్రయోగించబడిన ఆ క్షిపణి, బ్రహ్మోస్ అని కొన్ని వర్గాలు తెలిపాయి.[9][10][11] బ్రహ్మోస్ వంటి సాంప్రదాయిక ఆయుధాలు మోసుకెళ్ళే క్షిపణులకు, వ్యూహాత్మక లేదా అణు క్షిపణులలో ఉండే "స్వీయ-విధ్వంసక వ్యవస్థలు" లేవని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే, అలాంటి ప్రకటనలు భారత అధికారుల నుండి కాకుండా మీడియా నుండి వచ్చాయి.[12]
2022 ఆగస్టు 23 న, "ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల నుండి విచలనం" జరిగిన సంఘటనకు భారత ప్రభుత్వం ముగ్గురు భారత వైమానిక దళ అధికారులను ప్రాథమికంగా బాధ్యులుగా నిర్ధారించి, వారి సేవలను తక్షణమే రద్దు చేసింది.[13][14]
తరువాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత దర్యాప్తులను తిరస్కరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. "వ్యూహాత్మక ఆయుధాల నిర్వహణలో వ్యవస్థాగత లొసుగులు, తీవ్రమైన సాంకేతిక లోపాలను వ్యక్తిగత మానవ తప్పిదం అనే ముసుగు కింద కప్పిపుచ్చలేము" అని పేర్కొంటూ, పారదర్శకత స్ఫూర్తి పేరుతో ఈ సంఘటనపై సంయుక్త దర్యాప్తు చెయ్యాలంటూ పాకిస్తాన్ తన డిమాండును కొనసాగించింది.[15]
చైనా
[మార్చు]చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ ఈ సంఘటనపై "సమగ్ర దర్యాప్తు" జరపాలని పిలుపునిచ్చాడు. భారతదేశం, పాకిస్తాన్ "సమాచారం ఇచ్చిపుచ్చుకోవడాన్ని బలోపేతం చేసుకోవాలనీ", "ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండానూ, పొరపాటు అంచనాలను నివారించడానికీ సకాలంలో నోటిఫికేషన్ యంత్రాంగాన్ని" ఏర్పాటు చేసుకోవాలనీ కోరాడు.[16]
అమెరికా
[మార్చు]ఈ సంఘటన గురించి అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ సమాధానమిస్తూ, భారతదేశం పాకిస్తాన్‌లోకి క్షిపణి ప్రయోగం, "ప్రమాదం తప్ప మరేమీ కాదు" అని చెబుతూ అది ప్రమాదం కాదని చెప్పే "సూచనలేమీ లేవు" అని అన్నాడు.[17]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "'India to explain what happened in Mian Channu,' says DG ISPR after Indian projectile falls in Pakistan". Dawn News. 10 March 2022. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "ISPR" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Pakistan seeks joint probe into Indian missile fiasco". Express Tribune. 12 March 2022.
- ↑ 3.0 3.1 3.2 "Pakistan registers strong protest over unprovoked violation of its airspace by a 'super-sonic flying object' of Indian origin". mofa.gov.pk. 10 March 2022. Retrieved 15 May 2023. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "mofa" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Trainer crashes in Mian Channu". Dawn. 10 March 2022.
- ↑ "Fighter jet crashes in Mian Channu". Dunya News. 9 March 2022.
- ↑ "FO summons Indian envoy, registers strong protest over unprovoked violation of airspace". Dawn. 11 March 2022.
- ↑ "Pakistan demands joint probe into 'accidental' India missile fire". Reuters. 13 March 2022.
- ↑ "India Accidentally Fires a Missile at Pakistan. Calm Ensues". The New York Times. 12 March 2022.
- ↑ "India accidentally fires missile into Pakistan". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 11 March 2022. Retrieved 12 March 2022.
- ↑ "India accidentally fired missile into Pakistan because of 'technical malfunction'". France 24 (in ఇంగ్లీష్). 11 March 2022. Retrieved 12 March 2022.
- ↑ "Accidentally fired missile into Pakistan due to tech glitch, says India. 'It was BrahMos'". The Print (in ఇంగ్లీష్). 11 March 2022. Retrieved 11 March 2022.
- ↑ "Missile firing: IAF inquiry on, but Pak seeks joint probe". Times of India. 13 March 2022.
- ↑ "3 Air Force Officers Sacked For Missile Accidentally Fired Into Pakistan". Retrieved 23 August 2022.
- ↑ "India sacks 3 for accidentally launching missile into Pakistan in March". Dawn. 23 August 2022.
- ↑ "Pakistan rejects India's purported closure of the incident of the firing of a supersonic Missile into Pakistani territory on 9 March, 2022 and reiterates demand for joint probe". Ministry of Foreign Affairs Government of Pakistan. 24 August 2022.
- ↑ "US, China call for direct Pakistan-India talks". Dawn. March 15, 2022.
- ↑ "No indication India's missile launch into Pakistan was anything other than accident:US". Dawn. 15 March 2022.