2025 ఢిల్లీ కారు పేలుడు
| 2025 ఢిల్లీ కారు పేలుడు | |
|---|---|
| ప్రదేశం | ఎర్రకోట దగ్గర్లోని లాల్ కిల్లా మెట్రో స్టేషను గేట్ నం 1 వద్ద |
| భౌగోళికాంశాలు | 28°39′22.0″N 77°14′09.4″E / 28.656111°N 77.235944°E |
| తేదీ | 2025 నవంబరు 10 06:52 p.m. (UTC+5:30) |
దాడి రకం | కారు బాంబు |
| ఆయుధాలు | అమ్మోనియం నైట్రేట్, తదితర పేలుడు పదార్థాలతో కూడిన కారు |
| మరణాలు | 13 |
ప్రాణాపాయ గాయాలు | 20+ |
| దాడికి కారకులు | దర్యాప్తు జరుగుతోంది |
2025 నవంబరు 10 న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక కారు పేలి, కనీసం 13 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీ పోలీసుల ప్రకారం, పేలుడు జరిగిన సమయంలో కారు లోపల ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
ఈ కేసు దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. పోలీసుల నివేదికల ప్రకారం, కారులోని అమ్మోనియం నైట్రేట్ ఇంధన నూనె, ఇతర పేలుడు పదార్థాల వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీని ఫలితంగా మంటలు చెలరేగి సమీపంలోని అనేక వాహనాలు దెబ్బతిన్నాయి.
ఈ పేలుడు ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక నిర్ధారణలు సూచించాయి. ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉగ్రవాద చర్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవంబరు 12న, భారత ప్రభుత్వం ఈ సంఘటనను ఉగ్రవాద చర్యగా పేర్కొంది. తదుపరి మీడియా నివేదికల ప్రకారం, దర్యాప్తులో భాగంగా నిర్వహించిన DNA విశ్లేషణలో ఫరీదాబాద్‌లోని ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో వైద్యుడు ఉమర్ మహ్మద్ ఈ పేలుడుకు కారణమయ్యాడని తేలింది.
నేపథ్యం
[మార్చు]2025 నవంబరు 9న, జమ్మూ కాశ్మీర్ పోలీసులు హర్యానా పోలీసులతో కలిసి నిర్వహించిన దాడిలో ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఫరీదాబాద్‌లోని ఒక ఇంటి నుండి దాదాపు 350 కిలోల పేలుడు పదార్థాలు, అస్సాల్ట్ రైఫిళ్లు, హ్యాండ్‌గన్‌లు, టైమింగ్ పరికరాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.[1]
మరుసటి రోజు, పోలీసులు అదే నగరంలోని మరొక ఇంటిపై దాడి చేసి సుమారు 2,563 kg (5,650 lb) పేలుడు పదార్థాలు, బాంబుల తయారీకి ఉపయోగించే రసాయనాలు, కారకాలు, మండే పదార్థం, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు వంటి ఇతర పదార్థాలు పట్టుకున్నారు. పోలీసుల ప్రకారం, జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ముజమ్మిల్ షకీల్ అనే వైద్యుడు ఈ ఇళ్లను అద్దెకు తీసుకున్నాడు.[2] పోలీసులు పుల్వామా లో ముజమ్మిల్ అహ్మద్ గనై, ఖాజిగుండ్ లో అదీల్ మజీద్ రాథర్ అనే ఇద్దరు వైద్యులను అరెస్టు చేశారు. వీరిద్దరూ ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులైన జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ లతో సంబంధం ఉన్న రహస్య కణాలలో భాగమని చెబుతున్నారు.[3]
మీడియా నివేదికల ప్రకారం, వసతి గృహాలను అద్దెకు తీసుకున్న వైద్యుడూ పేలుళ్లకు పాల్పడిన నిందితుడూ ఫరీదాబాద్‌లోని ఒకే ఆసుపత్రిలో పనిచేశారు.[4] [5] అయితే, దాడులు, కారు పేలుడుల మధ్య సంబంధాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు.[6]
పేలుడు
[మార్చు]2025 నవంబరు 10 న సాయంత్రం 6:52 గంటలకు, ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక కారు పేలిపోయింది. [7] [8] ఈ సంఘటన జరగడానికి మూడు గంటలకు పైగా ఎర్రకోట సమీపంలో ఈ తెల్లటి హ్యుందాయ్ i20 కారు [9] [10] ఆగి ఉంది. CCTV ఫుటేజ్‌లో కారు మధ్యాహ్నం 3:19 గంటలకు సునేహ్రీ మసీదు పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలోకి ప్రవేశించి సాయంత్రం 6:48 వరకు అక్కడే ఉన్నట్లు కనబడింది. [11] [12] ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా ప్రకారం, పార్కింగ్ నుండి బయటకు వచ్చిన తర్వాత కారు, ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 సమీపంలోని ట్రాఫిక్ లైట్ వద్ద ఆగి, నెమ్మదిగా కదులుతున్న ట్రాఫిక్‌లో పేలిపోయింది. పేలుడు సమయంలో కారు లోపల ఇద్దరు నుండి ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, [13] [14] CCTV ఫుటేజ్‌లో ముసుగు ధరించిన వ్యక్తి పేలుడుకు ముందు కారు నడుపుతున్నట్లు సూచించింది.[15]
పర్యవసానాలు
[మార్చు]పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు ధ్వంసమై, సమీపంలోని దాదాపు డజను వాహనాలు దగ్ధమయ్యాయని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పేలుడు శబ్దం కొన్ని వందల మీటర్ల దూరం వరకు వినిపించింది. సమీపంలోని భవనాల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. [16] సాయంత్రం 6:50, 7:05 గంటల మధ్య తమకు అనేక కాల్స్ వచ్చాయనీ, ఏడు అగ్నిమాపక దళాలను సంఘటనా స్థలానికి పంపామనీ ఢిల్లీ అగ్నిమాపక శాఖ నివేదించింది. 7:29 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు ధృవీకరించారు. [17] [16] పేలుడు లోను, తరువాత జరిగిన మంటల్లోనూ ఆరు కార్లు, రెండు ఇ-రిక్షాలు, ఒక ఆటో రిక్షా కాలిపోయాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. [16]
ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. [18] గాయపడిన వారిని లోక్ నాయక్ ఆసుపత్రిలో చేర్చారు. [19]
తప్పుడు సమాచారం
[మార్చు]పేలుడు తర్వాత, పుట్టగొడుగు మేఘంతో కూడిన పెద్ద అగ్నిగోళాన్ని చూపించే చిత్రం సోషల్ మీడియాలో తిరిగింది. అది సంఘటనకు చెందినదే వచ్చిందని అందులో చెప్పారు. ఆ చిత్రం తప్పు అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది. ఆ చిత్రం 2024 సెప్టెంబరు 27 న బీరూట్‌లో జరిగిన వైమానిక దాడికి సంబంధించినదని వెల్లడించింది[20] CNG పేలుడు వల్ల పేలుడు సంభవించిందని తప్పుగా పేర్కొన్న అనేక సోషల్ మీడియా పోస్ట్‌లను కూడా PIB తోసిపుచ్చింది. ఈ పోస్ట్‌లు కల్పితమైనవని, పోలీసులు అలాంటి నిర్ధారణ చేయలేదనీ తరువాత స్పష్టం చేసింది. [21]
దర్యాప్తు, చర్యలు
[మార్చు]పేలుడు తర్వాత, ఆ ప్రాంతాన్ని మూసేసారు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటన స్థలం నుండి ఆధారాలు సేకరించడానికి వచ్చాయి. దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. [22] [19] [23] పోలీసుల ప్రాథమిక పరిశోధనల ప్రకారం పేలుడు ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని సూచించారు.[24] [25] [26] ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద చర్య జరిపే అవకాశంపై పోలీసుల దర్యాప్తు సాగింది. [27] [28] పోలీసు నివేదికల ప్రకారం, అమ్మోనియం నైట్రేట్ ఇంధన చమురు వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు, దీని వలన సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నాయి. [19] భారత ప్రభుత్వం ఈ పేలుడును ఉగ్రవాద దాడిగా పేర్కొంది. [29] [30]
ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని నిబంధనలను ప్రయోగించి, ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు. [19] [31] [32] మీడియా నివేదికల ప్రకారం, దర్యాప్తు అధికారులు కారు యాజమాన్యాన్ని పుల్వామాకు చెందిన వైద్యుడు ఉమర్ మహ్మద్ అని గుర్తించారు, అతను గతంలో ఫరీదాబాద్‌లో జరిగిన దాడిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలతో దొరికిన వ్యక్తులతో కలిసి పనిచేశాడు.[31] తదుపరి DNA విశ్లేషణలో ఉమర్, పేలుడును ప్రేరేపించాడని నిర్ధారించారు.[5]
నవంబరు 14 న పుల్వామా జిల్లాలోని క్విల్ గ్రామంలో ఉమర్ ఇంటిని భారత ఆర్మీ అధికారులు కూల్చివేసారు . [33] ఈ సంఘటనలో పాల్గొన్న వైద్యుడిని నియమించిన అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి జాతీయ అసెస్‌మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఎందుకంటే దాని ఎక్రెడిటేషన్ ముగిసినప్పటికీ, దాన్ని పునరుద్ధరించుకోలేదు.[34]
ప్రతిస్పందనలు
[మార్చు]దేశీయంగా
[మార్చు]ఈ సంఘటన తర్వాత, ఢిల్లీ తదితర ప్రధాన నగరాల్లో భద్రతా స్థాయిలను పెంచారు.[35] ప్రధాన దేవాలయాలు, ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలలో భద్రత పెంచారు.[36][37] [38] అంగోలా అధికారిక పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షాతో సంఘటన గురించి మాట్లాడింది.[39] భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సంతాపాన్ని వ్యక్తం చేశాడు. ఈ సంఘటన గురించి షాతో మాట్లాడినట్లు చెప్పాడు.[40] [41] భూటాన్ అధికారిక పర్యటనలో ఉన్న మోడీ, [42] [43] ఈ సంఘటన వెనకున్న కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు.[44] నవంబరు 12 న, ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమై సంఘటనను సమీక్షించింది.[45]
ఈ సంఘటనకు సంబంధించి అమిత్ షా, ఢిల్లీ పోలీస్ కమిషనరు, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో మాట్లాడారు. పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించి, గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించాడు. తరువాత చట్ట సంస్థల అధికారులతో క్లుప్త సమీక్షా సమావేశం నిర్వహించాడు. "అన్ని అవకాశాలను" పరిశీలిస్తున్నామని, "సమగ్ర దర్యాప్తు" నిర్వహిస్తామనీ ఆయన చెప్పాడు.[46][47][48]
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ పేలుడును "చాలా హృదయ విదారకమైనది, ఆందోళనకరమైనది" అని అభివర్ణించాడు.[49] ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ సంఘటన "చాలా ఆందోళనకరమైనది" అని వ్యాఖ్యానించాడు.[50] [51]
అంతర్జాతీయంగా
[మార్చు]పేలుడు తర్వాత అనేక దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తమ సంతాపాన్ని, సంఘీభావాన్నీ వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ రాయబారి ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, యూరప్ భారత ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నాడు. [52] అమెరికా, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, ఢిల్లీలోని తన పౌరులు ప్రభావిత ప్రాంతాన్ని నివారించాలని అమెరికా రాయబారి అన్నారు. [53] రష్యన్ వార్తా సంస్థ TASS ప్రకారం, రష్యన్ రాయబార కార్యాలయం తమ జాతీయులలో ఎవరైనా ప్రభావితమయ్యారా అని తనిఖీ చేస్తున్నట్లు తెలిసింది.[54] ఆఫ్ఘనిస్తాన్, [55] అర్జెంటీనా, [56] ఫ్రాన్స్, [57] ఇరాన్, [58] జపాన్, [59] మాల్దీవులు,[60] యునైటెడ్ కింగ్‌డమ్ లు బాధితులకు సానుభూతి, భారతదేశానికి మద్దతు సందేశాలను అందించాయి.[59]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "2,900 kg Explosives Found At 2 Houses Of J&K Doctor In Faridabad". NDTV. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "2,900 kg Explosives Found At 2 Houses Of J&K Doctor In Faridabad". NDTV. 10 November 2025. Retrieved 11 November 2025."2,900 kg Explosives Found At 2 Houses Of J&K Doctor In Faridabad". NDTV. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ Bashaarat, Masoo; Hazarika, Abhimanyu (11 November 2025). "350 kg explosives, AK-47: J&K cops recover arms cache from doctor's rented home in Faridabad". The Indian Express. Retrieved 11 November 2025.
- ↑ "Delhi blast: Pulwama doctor believed to be behind the wheels of exploded car; investigators probing 'suicide bomb' angle". Deccan Herald. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ 5.0 5.1 "DNA Test Confirms Dr Umar Drove i20 That Exploded Near Red Fort". NDTV. 13 November 2025. Retrieved 13 November 2025.
- ↑ "Indian police invoke 'terrorism' law after Delhi blast kills nine people". Al Jazeera English. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Delhi explosion: Several reported killed after blast near metro station". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 10 November 2025. Retrieved 10 November 2025.
- ↑ "India: At least eight people killed in car explosion in New Delhi, police say". Sky News. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Red Fort blast: Explosion occurred in Hyundai i20 car, team reached within 10 minutes - what we know so far". The Times of India. 11 November 2025. ISSN 0971-8257. Retrieved 11 November 2025.
- ↑ ""Thorough Probe": Home Minister Amit Shah Heads To Delhi Red Fort Blast Site". NDTV. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ Manral, Mahendar Singh; Chand, Sakshi (11 November 2025). "Red Fort blast: i20 was at nearby parking lot for over 3 hours". The Indian Express. Retrieved 11 November 2025.
- ↑ Kathju, Junaid (11 November 2025). "Deadly New Delhi car blast triggers terrorism probe in India's capital". South China Morning Post. Retrieved 11 November 2025.
- ↑ "Hyundai i20 In Delhi Blast Was Sold To A Man From Kashmir's Pulwama". NDTV. 10 November 2025. Retrieved 10 November 2025.
- ↑ "9 killed, many injured in car blast near Red Fort, Amit Shah says probing all angles". The Indian Express. 11 November 2025. Retrieved 12 November 2025.
- ↑ "Masked man seen driving Hyundai i20 minutes before blast near Red Fort". The Hindustan Times. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ 16.0 16.1 16.2 "Red Fort blast highlights: Delhi Police file case under UAPA, Explosives Act sections". The Hindustan Times. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Eight killed after explosion near major Delhi landmark, police say". BBC. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Delhi Blast Live Updates: Death Count In Delhi Blast Near Red Fort Rises To 13, Say Police". NDTV. 13 November 2025. Retrieved 13 November 2025.
- ↑ 19.0 19.1 19.2 19.3 "Delhi Red Fort blast: Pulwama doctor was occupant of car that exploded, forensic report awaited". The Hindu (in Indian English). 11 November 2025. Retrieved 11 November 2025."Delhi Red Fort blast: Pulwama doctor was occupant of car that exploded, forensic report awaited". The Hindu. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Government Debunks Fake Delhi Blast Image Circulated By 'Propaganda Accounts'". NDTV. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Fact Check: No, Delhi Blast Wasn't A CNG Explosion, Old Lebanon Image Shared Falsely". Times Now. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Eight killed after explosion near major Delhi landmark, police say". BBC. 11 November 2025. Retrieved 11 November 2025."Eight killed after explosion near major Delhi landmark, police say". BBC. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Delhi Blast A 'Terror Incident': PM Modi Chairs Security Meet, NIA Takes Over Probe". India Today. 12 November 2025. Retrieved 12 November 2025.
- ↑ "Red Fort explosion: Initial probe points to possible 'fidayeen' attack". The Economic Times. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ Chatterjee, Arvind OjhaSreya (11 November 2025). "Dr Umar panicked after Faridabad arrests, acted in haste: Sources on Delhi blast". India Today. Retrieved 11 November 2025.
- ↑ "Red Fort blast: Delhi Police initial probe points to possible fidayeen attack". Asian News International. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "New Delhi car blast investigated as possible terrorism, Indian police say". The Washington Post. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ Mujib Mashal. "Police Investigate Deadly New Delhi Blast as Possible Terrorist Attack". The New York Times. Retrieved 11 November 2025.
- ↑ "Govt finally spells it out, calls Delhi car blast a 'terrorist incident'; PM chairs high-level meet". Telegraph. Retrieved 12 November 2025.
- ↑ "Centre calls blast near Red Fort a 'terrorist incident', passes resolution". The Hindu (in Indian English). 12 November 2025. ISSN 0971-751X. Retrieved 12 November 2025.
- ↑ 31.0 31.1 Taskin, Bismee (11 November 2025). "Car in Red Fort blast linked to Pulwama doctor, same terror module as Faridabad raid accused". ThePrint. Retrieved 11 November 2025.
- ↑ "Two men detained for link to car that exploded, killed 8 near Delhi's Red Fort". The Hindustan Times. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ Wani, Fayaz (14 November 2025). "Delhi blast: Security forces demolish accused Dr Umar Nabi's house in Pulwama". The New Indian Express. Retrieved 14 November 2025.
- ↑ "Al Falah University, under scanner for Delhi Red Fort blast, gets show-cause from NAAC over false accreditation claim". The Hindu (in Indian English). 13 November 2025. ISSN 0971-751X. Retrieved 14 November 2025.
- ↑ "Delhi placed on high alert after explosion near Red Fort metro station; multiple casualties feared". The Economic Times. 10 November 2025. ISSN 0013-0389. Retrieved 10 November 2025.
- ↑ Parmar, Jinit (11 November 2025). "Vaishno Devi, Uttarakhand, Himachal On High Alert After Red Fort Blast; Delhi Police Invoke UAPA, Explosives Act". Outlook. Retrieved 11 November 2025.
- ↑ "Suresh Gopi condemns Delhi blasts, calls it 'wound to India's integrity'". Manorama News. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Delhi blast a wound to the integrity of the nation, says Suresh Gopi". Press Trust Of India. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "President Droupadi Murmu Calls Minister Amit Shah About Red Fort Blast". All India Radio. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "'Condolences to those who have lost their loved ones': PM Modi on Delhi blast, briefed by Amit Shah". The Times of India. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ Basu, Sayak (10 November 2025). "Delhi Red Fort Blast Live Updates: Owner of car that exploded detained by Delhi Police; NSG team arrives at blast site". Live Mint. Retrieved 10 November 2025.
- ↑ "PM Modi arrives in Bhutan for two day visit". The Hindu. Press Trust of India. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Delhi Blast: PM Modi issues strong warning for perpetrators, says no one involved will be spared". The Economic Times. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "In Bhutan, PM Modi vows action over Delhi blast: 'Those who plotted this...'". The Hindustan Times. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ Sinha, Jignasa; Singh, Karn Pratap; Dhankhar, Leena (2025-11-13). "Centre calls Delhi blast 'terror incident' as probe net widens". The Hindustan Times. Retrieved 12 November 2025.
- ↑ "Red Fort Blast Live: 8 Dead After Explosion In Car Near Red Fort In Delhi, Amit Shah At Blast Site". NDTV. 10 November 2025. Retrieved 10 November 2025.
- ↑ "'Taking all possibilities into account': Amit Shah on Delhi blast that killed 8; investigation on". The Times of India. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ Shwenk, Martin; Murthy, Narayana; Poonawalla, Adar; Jain, Manu; Kamath, Nitin (10 November 2025). "Delhi blast: Amit Shah confirms blast in Hyundai i20 car near Red Fort, Home Ministry to meet senior probing officials tomorrow". The Economic Times. Retrieved 10 November 2025.
- ↑ "Vaishno Devi, Uttarakhand, Himachal On High Alert After Red Fort Blast; Delhi Police Invoke UAPA, Explosives Act". The Times of India. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Delhi Red Fort blast: Kejriwal calls for immediate investigation, Rahul Gandhi say, 'extremely heartbreaking'". The Times of India. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Arvind Kejriwal calls explosion near Red Fort "extremely alarming," seeks thorough investigation". Asian News International. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ ""We stand by Indian people in this moment of shock and grief": EU Ambassador on Delhi Blast". The Tribune. Asian News International. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Delhi blast: US says 'closely monitoring' situation after deadly explosion". The Times of India. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Eight people killed, at least 24 injured in car explosion in New Delhi". TASS. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "Taliban Condemn Delhi Blast But Remain Silent On Islamabad Attack". Afghanistan International. 12 November 2025. Retrieved 12 November 2025.
- ↑ "Argentine expresses condolences on blast near Red Fort in Delhi". Miniapp. 10 November 2025. Archived from the original on 13 నవంబర్ 2025. Retrieved 11 November 2025.
{{cite news}}: Check date values in:|archive-date=(help) - ↑ "Delhi car blast: Iran expresses 'deep sorrow', prays for speedy recovery of those injured". ABP Live. 10 November 2025. Retrieved 11 November 2025.
- ↑ Bhaumik, Anirban (11 November 2025). "Delhi car blast: Iran expresses 'deep sorrow', prays for speedy recovery of those injured". Deccan Herald. Retrieved 11 November 2025.
- ↑ 59.0 59.1 "Japanese, British, Argentine envoys extend condolences on Delhi Blast". Asian News International. 11 November 2025. Retrieved 11 November 2025.
- ↑ "President expresses condolences following blast in Delhi, India" (Press release). 11 November 2025. Retrieved 11 November 2025.
