2025 తెలంగాణలో ఎన్నికలు
తెలంగాణలో 2025 ఎన్నికలలో రాష్ట్రంలోని శాసనమండలి, పంచాయతీలకు, పట్టణ స్థానిక సంస్థలకు జరగవలసిన ఎన్నికల వివరాలు ఈ వ్యాసంలో వివరించబడ్డాయి.
ఫిబ్రవరి
[మార్చు]తెలంగాణ రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ & నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానాలకు, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నియోజకవర్గ స్థానానికి ఫిబ్రవరి 3న ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.[1][2][3][4][5]
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 93.55శాతం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 91.90శాతం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 70.42 శాతం ఓటింగ్ జరిగింది.[6] కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఐఎన్‌సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సి. అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణల మధ్య ముక్కోణపు పోటీ జరిగింది.[7]
ఈవెంట్ | తేదీ |
నోటిఫికేషన్ తేదీ | 2025 ఫిబ్రవరి 3 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | 2025 ఫిబ్రవరి 10 |
నామినేషన్ల పరిశీలన తేదీ | 2025 ఫిబ్రవరి 11 |
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 2025 ఫిబ్రవరి 13 |
ఎన్నికల తేదీ | 2025 ఫిబ్రవరి 27 |
ఓట్ల లెక్కింపు తేదీ | 2025 మార్చి 3 |
ఎన్నికలు ప్రక్రియ ముగిసే తేదీ | 2025 మార్చి 8 |
మార్చి
[మార్చు]రాష్ట్రంలోని 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఫిబ్రవరి 24న ప్రకటించింది. తెలంగాణలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది.[8][9][10]
కాంగ్రెస్ పార్టీ నుండి విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్‌లను అభ్యర్థులుగా ఖరారు చేస్తూ మార్చి 9న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశాడు.[11][12][13]
ఈవెంట్ | తేదీ |
నోటిఫికేషన్ తేదీ | 2025 మార్చి 3 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | 2025 మార్చి 10 |
నామినేషన్ల పరిశీలన తేదీ | 2025 మార్చి 11 |
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 2025 మార్చి 13 |
ఎన్నికల తేదీ | 2025 మార్చి 20 |
ఓట్ల లెక్కింపు తేదీ | 2025 మార్చి 20 |
ఎన్నికలు ప్రక్రియ ముగిసే తేదీ | 2025 మార్చి 24 |
ఏప్రిల్
[మార్చు]హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న విడుదల చేసింది. మార్చి 28వ తేదీన ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.[14][15] హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు నామినేషన్లు దాఖలు చేశారు.[16][17]
ఈ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధి నుంచి 81 మంది కార్పొరేటర్లతో పాటు 29 ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 112మంది ఓటర్లున్నారు. హైదరాబాద్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏప్రిల్ 23న జరగగా, 78% పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓటర్లలో 88 మంది పోలింగ్‌లో పాల్గొనగా, బీఆర్ఎస్ పార్టీ ఎవరూ ఓటు వేయలేదు. మజ్లిస్ నుండి 50 మంది, బీజేపీ నుండి 24 మంది, కాంగ్రెస్ నుండి 14 మంది, 31 మంది ఎక్స్అఫీషియో సభ్యులకు గాను 22 మంది, 81 మంది కార్పొరేటర్లకుగాను 66 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.[18][19]
ఈవెంట్ | తేదీ |
నోటిఫికేషన్ తేదీ | 2025 మార్చి 28 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | 2025 ఏప్రిల్ 4 |
నామినేషన్ల పరిశీలన తేదీ | 2025 ఏప్రిల్ 7 |
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 2025 ఏప్రిల్ 9 |
ఎన్నికల తేదీ | 2025 ఏప్రిల్ 23 |
ఓట్ల లెక్కింపు తేదీ | 2025 ఏప్రిల్ 25 |
ఎన్నికలు ప్రక్రియ ముగిసే తేదీ | 2025 మే 2 |
పార్టీల బలాబలాలు
ఎంఐఎంకు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 50 ఓట్లు
బీజేపీకి 18 కార్పొరేటర్లు, 6 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 24 ఓట్లు
కాంగ్రెస్‌కు ఏడుగురు కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 14 ఓట్లు
బీఆర్ఎస్కు 15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 24 ఓట్లు
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్లో జరగగా ఎంఐఎం అభ్యర్ది మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై గెలిచాడు. మీర్జా రియాజ్ ఉల్ హాసన్ కు 63 ఓట్లు వచ్చాయి, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి.[20]
మూలాలు
[మార్చు]- ↑ "ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న". Eenadu. 31 January 2025. Archived from the original on 31 January 2025. Retrieved 25 February 2025.
- ↑ "ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు". Andhrajyothy. 30 January 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "మోగిన నగారా.. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల". NT News. 30 January 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "ఉమ్మడి నాలుగు జిల్లాలో ఎంత మంది పట్టభద్రులు ఉన్నారో తెలుసా..!". News18 Telugu. 20 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "Karimnagar graduates constituency throws up surprise with large number of invalid votes" (in Indian English). The Hindu. 3 March 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.
- ↑ "ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం". Eenadu. 28 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "పోలింగ్ ప్రశాంతం." Andhrajyothy. 28 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "మండలి.. మరో నగారా". Eenadu. 25 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు". Andhrajyothy. 25 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్". Eenadu. 24 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. జాబితా విడుదల చేసిన కాంగ్రెస్". Eenadu. 9 March 2025. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
- ↑ "తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్.. క్యాండెట్స్ వీరే." 10TV Telugu. 9 March 2025. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
- ↑ "తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం". Eenadu. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
- ↑ "హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏప్రిల్ 23న". Eenadu. 24 March 2025. Archived from the original on 26 March 2025. Retrieved 26 March 2025.
- ↑ "మరో ఎమ్మెల్సీ ఎన్నిక". Andhrajyothy. 25 March 2025. Archived from the original on 26 March 2025. Retrieved 26 March 2025.
- ↑ "స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఎంఐఎం, బీజేపీ". Andhrajyothy. 5 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు భాజపా, ఎంఐఎం అభ్యర్థుల నామినేషన్". Eenadu. 5 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు". Andhrajyothy. 24 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 24 April 2025.
- ↑ "Polling peaceful for Hyderabad local body MLC election" (in Indian English). The Hindu. 23 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 24 April 2025.
- ↑ "హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం గెలుపు". Eenadu. 25 April 2025. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.