2025 పహల్గామ్ దాడి
22 ఏప్రిల్ 2025న భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ పచ్చిక మైదానంలో, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు హిందూ పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు, కనీసం 28 మంది మరణించాగా 20 మందికి పైగా గాయపడ్డారు. 2019 పుల్వామా బాంబు దాడి తరువాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రాణాంతకమైన ఈ దాడి, పౌరులను లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్ లోయలో జనాభా మార్పులను నిరోధించడమే లక్ష్యంగా జరిగినట్లు సమాచారం. [1]
ఈ దాడిలో పర్యాటకులు, అధికారులతో సహా కనీసం 28 మంది మరణించారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు. భారత పాలనను వ్యతిరేకించే ఉగ్రవాదులను నిందిస్తూ భారత అధికారులు ఈ సంఘటనను ఉగ్రవాద దాడిగా ప్రకటించారు.[2] పాకిస్తాన్ ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది.[3][4]
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. 2025 మే 7 తెల్లవారుజామున 1 గంట సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని బహవల్‌పుర్‌లో ఉన్న జైషే ఈ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, ముర్దికేలోని లష్కరే తోయిబా బేస్ క్యాంపు, శిక్షణ కేంద్రం, కోట్లీలోని సూసైడ్ బాంబర్ ట్రైనింగ్, టెర్రర్ లాంచ్ బేస్, గుల్‌పూర్‌లోని ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్, సవాయిలోని లష్కరే శిబిరం, సర్జల్, బర్నాలాలోని ఉగ్రవాదుల చొరబాటు కేంద్రాలు, మెహమూనాలోని హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్రవాద శిబిరం, బిలాల్‌లోని జేషే మహమ్మద్‌కు చెందిన మరో ల్యాంచ్‌ప్యాడ్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "యూట్యూబర్ జ్యోతి నుంచి విద్యార్థి దేవేంద్ర వరకు.. 11 మందిపై దేశ ద్రోహం కేసు." Andhrajyothy. 19 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ Zargar, Arshad R. (2025-04-22). "Terror attack on tourists in Indian-controlled Kashmir leaves at least 20 dead, reports say - CBS News". www.cbsnews.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-04-22.
- ↑ "Pahalgam Attack: పహల్గాం ఉగ్ర దాడి: సౌదీ పర్యటనను మధ్యలోనే విరమించుకున్న ప్రధాని మోదీ". EENADU. Retrieved 2025-04-23.
- ↑ "JK: ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచ నేతలు - Prajasakti" (in అమెరికన్ ఇంగ్లీష్). 2025-04-23. Retrieved 2025-04-23.