Jump to content

2025 భారత పాక్ ప్రతిష్టంభన

వికీపీడియా నుండి

2025 ఏప్రిల్ 22న పహల్‌గామ్‌లో సందర్శకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి తరువాత భారత, పాకిస్తాన్ల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.[1] జమ్మూ కాశ్మీర్‌లోని బైసారన్ లోయలో జరిగిన ఆ ఉగ్రవాద దాడిలో 25 మంది హిందూ పర్యాటకులు, ఒక క్రైస్తవ పర్యాటకుడు, ఒక స్థానిక ముస్లిం మృతి చెందారు, 20 మందికి పైగా గాయపడ్డారు. మొదట్లో ఈ దాడికి బాధ్యత వహించింది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF). [2] [3] ఏప్రిల్ 24 నుండి నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి భారత, పాకిస్తాన్ మధ్య సాయుధ ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇరుగు పొరుగున ఉన్న రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ తీవ్రతరమవుతుందనే భయాలను పెంచింది.

ఈ ప్రతిష్టంభనల తరువాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంక్షోభం తలెత్తింది, ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందని భారతదేశం ఆరోపించింది. పాకిస్తాన్ దౌత్యవేత్తలను బహిష్కరించడం, సొంత దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవడం, వీసాలను నిలిపివేయడం, సరిహద్దులను మూసివేయడం, సింధు జలాల ఒప్పందం నుండి వైదొలగడం వంటి చర్యలను భారతదేశం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండించింది. వాణిజ్య ఆంక్షలు, గగనతలాన్ని, సరిహద్దు క్రాసింగ్‌లనూ మూసివేయడం, సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి చర్యలతో ప్రతిస్పందించింది.[1]

భారత భద్రతా కేబినెట్ కమిటీ (CCS) కూడా భారత పౌరులు పాకిస్తాన్‌కు ప్రయాణించవద్దని గట్టిగా కోరింది. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్నవారు వీలైనంత త్వరగా తిరిగి రావాలని పిలుపునిచ్చింది. [4]

నేపథ్యం

[మార్చు]

1980 ల చివరలో జమ్మూ కాశ్మీర్‌లో ఇస్లామిస్ట్ ఉగ్రవాదం చెలరేగింది. దీని ఫలితంగా కాశ్మీరీ హిందువులు ఈ ప్రాంతం నుండి వలస వెళ్లారు. అప్పటి నుండి ఉగ్రవాదం కొనసాగుతోంది.[5]

2025 ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్‌, అనంత్‌నాగ్ జిల్లా, పహల్గామ్ సమీపంలోని బైసారన్ లోయ వద్ద జరిగిన ఉగ్రవాద [6] [7] [8] దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు మరణించారు, 20 మందికి పైగా గాయపడ్డారు. [9] [10] భారతీయ మీడియా సంస్థలకు అందిన ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాల ప్రకారం, దుండగులు కాల్పులు జరపడానికి ముందు సంభావ్య బాధితులను వారి మతపరమైన గుర్తింపు గురించి ప్రశ్నించి, ముస్లింలు కాని వారిని లక్ష్యంగా చేసుకున్నారు. [11]

2000 సంవత్సరం తర్వాత ఈ ప్రాంతంలో భారతీయ పౌరులపై జరిగిన అత్యంత ప్రాణాంతక దాడులలో ఈ దాడి ఒకటి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న, ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించబడిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా భావిస్తున్న రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF), [3] [12] [2] మొదట దీనికి బాధ్యత వహించింది. భారత పౌరులు కాశ్మీర్‌లో నివసించడానికీ పని చేయడానికీ అనుమతించే భారత ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ దాడి జరిగిందని, దీని ఫలితంగా ఆ ప్రాంతంలో స్థానికేతర స్థావరాలు ఏర్పడ్డాయనీ వారు పేర్కొన్నారు. [13] [12] నాలుగు రోజుల తరువాత, వారు తమ వాదనను ఉపసంహరించుకున్నారు. [14]

దౌత్య సంక్షోభం

[మార్చు]

2025 ఏప్రిల్ 23 రాత్రి, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భద్రతపై క్యాబినెట్ కమిటీతో సమావేశం తర్వాత ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించాడు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేవరకు పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత నిర్ణయాన్ని ఆయన ప్రకటించాడు.[15] అట్టారి - వాఘా సరిహద్దులోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను మూసివేస్తున్నట్లు, సార్క్ వీసా మినహాయింపు పథకం కింద భారతదేశానికి వచ్చే పాకిస్తానీ జాతీయుల ప్రయాణాలపై నిషేధాన్ని విధిస్తున్నట్లు, గతంలో జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లూ ఆయన ప్రకటించాడు. అదనంగా, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లోని పాకిస్తాన్ సైనిక సలహాదారులను బహిష్కరించారు. ఇస్లామాబాద్‌లోని ఉన్న భారతీయ అధికారులను ఉపసంహరించుకున్నారు. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బంది సంఖ్యను 55 నుండి కనిష్టంగా 30కి తగ్గించారు. అలాంటి సైనిక సలహాదారుల పదవులు రద్దు చేయబడినట్లు భావించారు.[16] [17]

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. [18] దాని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ దాడిలో తన దేశం ప్రమేయం ఉందనే ఆరోపణలను తోసిపుచ్చాడు. అలాంటి సంఘటనలను విప్లవాలుగా భావించారు. [19] [20] అయితే, స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాద ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ, పాకిస్తాన్ మూడు దశాబ్దాల క్రితం నుండే అమెరికా, బ్రిటన్, పశ్చిమ దేశాల ఆదేశాల మేరకు ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చిందని ఆసిఫ్ అన్నాడు. [21] [22]

సింధు నది ఒప్పందం సస్పెన్షన్‌పై పాకిస్తాన్ ప్రతిస్పందిస్తూ, దీనిని అనుచితమైనదిగాను, సీరియస్‌నెస్ లేని చర్య గానూ అభివర్ణించింది. [23] ఈ సంఘటన తర్వాత భారత ప్రభుత్వం ప్రకటించిన చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారతదేశాపై సమగ్ర ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది, [24] నీటి వనరులను ప్రభావితం చేసే ఏ చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పేర్కొంది. [25] [26] ఏప్రిల్ 24 న పాకిస్తాన్ భారతీయ పౌరులకు జారీ చేసిన వీసాలను నిలిపివేసింది. భారత విమానాలు తమ దేశంపై ప్రయాణించకుండా దాని గగనతలాన్ని మూసివేసింది. భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది. భారత సైనిక సలహాదారులను ఏప్రిల్ 30లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. [27] అయితే, సిక్కు యాత్రికుల కోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరిచే ఉంచింది.[28] పాకిస్తాన్ కూడా భారతదేశంతో అన్ని వాణిజ్య సంబంధాలను తెంచుకుంది.[29] ప్రతీకారంగా పాకిస్తాన్ 2025 ఏప్రిల్ 24న సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది. [30] [31] అట్టారి-వాఘా సరిహద్దు వేడుక కూడా తగ్గించబడింది. సింబాలిక్ హ్యాండ్‌షేక్ జరగలేదు. [32] [33] సరిహద్దు దాటిన కుటుంబాల వారి వీసాలు రద్దు చేయబడ్డాయి.[34] [35] [36] [37] [38]

క్షేత్ర స్థాయిలో ఉద్రిక్తత

[మార్చు]

దాడి తరువాత, భారత సైన్యం, పారామిలిటరీ దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పహల్గాంలో తాత్కాలిక లాక్‌డౌన్ విధించబడింది. పిర్ పంజాల్ శ్రేణి ఎగువ ప్రాంతాలకు పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి భారత ఆర్మీ, హెలికాప్టర్లను మోహరించింది. [39]

ఆ ప్రాంతంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు కూడా జరిగాయి. ఏప్రిల్ 24న, ఉధంపూర్‌లోని బసంత్‌గఢ్ ప్రాంతంలో తిరుగుబాటుదారులతో జరిగిన కాల్పుల్లో ఒక భారతీయ సైనికుడు మరణించగా, మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. అదే ఎన్‌కౌంటర్‌లో సీనియర్ లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లి భద్రతా దళాల చేతిలో హతమయ్యాడు. [40] [41] ఏప్రిల్ 26న, భద్రతా సిబ్బంది నియంత్రిత పేలుళ్ల ద్వారా పుల్వామా, కుల్గాం జిల్లాల్లో అనుమానిత ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశారు. భారత అధికారులు, ఆ ఇద్దరు వ్యక్తులకూ పహల్గామ్ దాడితో సంబంధం ఉందని ఆరోపించారు. [42]

పాకిస్తాన్, భారత వైమానిక దళాలు రెండూ నియంత్రణ రేఖ దగ్గర ప్లైట్లు నిర్వహించాయి. [43] BSF యొక్క 182వ బెటాలియన్‌కు చెందిన భారత సరిహద్దు భద్రతా దళ సైనికుడు ఫిరోజ్‌పూర్ సరిహద్దులోని పాకిస్తాన్ వైపు అనుకోకుండా ప్రవేశించినప్పుడు పాకిస్తాన్ రేంజర్లు అతన్ని పట్టుకున్నారు.[44] [45]

ఏప్రిల్ 24, మే 1 మధ్య, భారత పాకిస్తాన్ సైన్యాలు ఘర్షణలకు దిగాయి. చిన్న ఆయుధ కాల్పులు జరిగాయి.[46][47][48] నివేదిక ప్రకారం, పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి వెంబడి వివిధ రంగాలలో చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది, [49] దీనిని భారత మీడియా "ప్రేరేపించనిది" అని అభివర్ణించింది.[50][51][48] భింబర్ జిల్లాలోని సత్వాల్ సెక్టార్, మనవర్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వెంబడి రెండు భారత సైనిక క్వాడ్‌కాప్టర్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది.[52][53][54][55]

ఏప్రిల్ 28 న పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్, భారత సాయుధ దళాల నుండి దాడి "ఆసన్నమైంది" అని ప్రకటించారు.[56] ఏప్రిల్ 30న, పాకిస్తాన్ తనకు "విశ్వసనీయ నిఘా" ఉందని, భారతదేశం కొన్ని గంటల్లో సైనిక చర్య ప్రారంభించబోతోందని పేర్కొంది. [57] ఏప్రిల్ 29 రాత్రి, పాకిస్తాన్ దళాలు కాశ్మీర్ వెంబడి అంతర్జాతీయ సరిహద్దుపై కాల్పులు జరిపాయి. [58] [59] మే 1న, భారత హోం మంత్రి అమిత్ షా ఈ దాడిలో పాల్గొన్న ఏ ఉగ్రవాదిని కూడా భారతదేశం విడిచిపెట్టదని అన్నారు. [60]

మే 3న, పాకిస్తాన్ రేంజర్స్‌కు చెందిన ఒక సైనికుడు సరిహద్దు దాటి భారతదేశానికి వచ్చిన తర్వాత BSF చేత పట్టుబడ్డాడు. [61]

నది నీటి విడుదల

[మార్చు]

1960 నాటి సింధు జలాల ఒప్పందం ఏప్రిల్ 23 న రద్దయ్యాక, ఏప్రిల్ 26, 27 తేదీల్లో పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్ నుండి స్థానిక వార్తలు వెలువడ్డాయి - భారతదేశం ఉరి ఆనకట్ట నుండి జీలం నదిలోకి నీటిని విడుదల చేసిందనీ, దానివల్ల వరదలు వస్తాయని ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయని పేర్కొంది.[62] [63] పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో చీనాబ్ నది నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయని వార్తలు వచ్చాయి. ఉపగ్రహ చిత్రాల ద్వారా నదీ గర్భం గణనీయంగా ఎండిపోయినట్లు చూపబడింది.[64] 2025 మే 4న భారతదేశం చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ ఆనకట్టను మూసివేసిందనీ నీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ఆనకట్ట వద్ద కూడా అదే చేయాలని యోచిస్తోందనీ వార్తలు వచ్చాయి. [65] [66]

ఆపరేషన్ సిందూర్

[మార్చు]

2025 మే 7 న భారతదేశం, పాకిస్తాన్ లోనూ పాక్ ఆక్రమిత కాశ్మీరు లోనూ ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ దాడిలో భారత విమానాలు నియంత్రణ రేఖను గానీ, అంతర్జాతీయ సరిహద్దును గానీ దాటకుండా క్షిపణులతో దాడి చేసాయి.[67]

ప్రతిచర్యలు

[మార్చు]

ఐక్యరాజ్యసమితి రెండు వైపులా "గరిష్ట సంయమనం" పాటించాలనీ, సమస్యలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలనీ కోరింది. [68]

ఏప్రిల్ 25 న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, భారత పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతను తగ్గించే లక్ష్యంతో ఒక పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించింది. [69]

పహల్గామ్ దాడి తర్వాత రష్యా, 2025 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌కు ప్రయాణించవద్దని తన పౌరులను హెచ్చరిస్తూ ప్రయాణ సలహా ఇచ్చింది. ఈ ప్రాంతంలో భద్రతా ప్రమాదాలు పెరిగాయని సలహా పేర్కొంది. యునైటెడ్ కింగ్‌డమ్ కూడా దాదాపు అదే సమయంలో ఇలాంటి హెచ్చరికనే, ప్రధానంగా ఎల్‌ఓసిని సూచిస్తూ, జారీ చేసింది. [70] రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కోరారు. [71] బంగ్లాదేశ్, యుఎఇలు శాంతి చర్చలకు మద్దతు ఇచ్చాయి. [72] [73] [74] [75]

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం, పౌర అశాంతి అధిక ప్రమాదాలను పేర్కొంటూ, US స్టేట్ డిపార్ట్‌మెంట్ తన పౌరులకు ప్రయాణ సలహాను తాజాకరిస్తూ, "ప్రయాణం చేయవద్దు" అనే లెవల్ 4 హెచ్చరికను జారీ చేసింది.[76] అదనంగా, న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ధృవీకరించింది. నేరస్థులను శిక్షించాలని పిలుపునిచ్చింది. భారతదేశపు ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలకు తన మద్దతును పునరుద్ఘాటించింది. [77] [78] తరువాత, 2025 ఏప్రిల్ 26 న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్య సంక్షోభం తీవ్రతను తగ్గించి చూపుతూ, రెండు దేశాలు "1,500 సంవత్సరాలుగా ఆ పోరాటం చేసుకుంటున్నాయి" అని చెప్పాడు.[79] [80]

లండన్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ వెలుపల భారతీయ ప్రవాసులు నిరసనలు చేపట్టారు. [81] [82]

తరువాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు చెందిన అనేక యూట్యూబ్ ఛానెళ్ళను నిషేధించింది. అవి రెచ్చగొట్టే అంశాలను, మతపరంగా సున్నితమైన కంటెంట్‌నూ వ్యాప్తి చేస్తున్నాయనీ, భారత సైన్యాన్ని, భద్రతా సంస్థలనూ లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయనీ ఆరోపించింది. అలాగే అనేక మంది పాకిస్తానీ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా నిషేధించింది.[83] [84]

2025 మేలో, అడ్నాన్ సిద్దిఖీ, గులాం మొహియుద్దీన్ వంటి పాకిస్తాన్ నటులు శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. సామరస్యాన్ని పెంపొందించడానికి, సంఘర్షణను పరిష్కరించడానికీ చర్చలు, అవగాహనలు తక్షణ అవసరమని అన్నారు.[85]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • భారతదేశంలో 2025
  • పాకిస్తాన్‌లో 2025
  • భారతదేశం-పాకిస్తాన్ సంబంధాలు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Masood, Salman. "Crisis Deepens for India and Pakistan Over Kashmir Attack". The New York Times. The New York Times. Retrieved 24 April 2025.
  2. 2.0 2.1 "What is The Resistance Front, the militant group linked to Pahalgam attack?". Reuters. Shilpa Jamkhandikar. Archived from the original on 23 April 2025. Retrieved 24 April 2025.
  3. 3.0 3.1 "LASHKAR-E-TAYYIBA". un.org. Archived from the original on 6 November 2024. Retrieved 23 August 2010.
  4. "India suspends visa services to Pakistani nationals with immediate effect". The News Minute. 24 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 25 April 2025.
  5. "Rights Abuses Behind Kashmir Fighting – Human Rights Watch". hrw.org. 16 July 1999. Archived from the original on 19 October 2008. Retrieved 25 June 2015.
  6. "Alert: U. S. Embassy New Delhi, India (April 23, 2025)". in.usembassy.gov. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  7. "No: 89, 22 April 2025, Regarding the Terrorist Attack in Jammu and Kashmir". mfa.gov.tr. Retrieved 22 April 2025.
  8. "Terrorist Attacks in Pahalgam, Jammu and Kashmir on 22 April 2025". mfa.gov.sg. Archived from the original on 24 April 2025. Retrieved 23 April 2025.
  9. "US-based techie, IAF official among 26 killed in attack. Who were the victims?". India Today. 23 April 2025.
  10. ""Said he was a Christian, then they shot him": Family of Sunil Nathaniel recounts Pahalgam terror horror during last rites". The Economic Times. 24 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 25 April 2025.
  11. Hadid, Diaa (25 April 2025). "After deadly Kashmir attack, India reports exchange of fire with Pakistani soldiers" (in ఇంగ్లీష్). NPR. Retrieved 25 April 2025.
  12. 12.0 12.1 "'Act of war': What happened in Kashmir attack that killed 26 tourists?". Al Jazeera English. 23 April 2025. Archived from the original on 23 April 2025. Retrieved 30 April 2025.
  13. Sharma, Yashraj (23 April 2025). "What is The Resistance Front, the group claiming the deadly Kashmir attack?". Al Jazeera. Archived from the original on 25 April 2025. Retrieved 30 April 2025. opposed the granting of residency permits to "outsiders", who critics say could help India change the demography of the disputed region
  14. "'False, hasty & part of an orchestrated campaign': LeT terror proxy TRF backtracks; denies responsibility of Pahalgam attack". The Economic Times. 26 April 2025. ISSN 0013-0389. Archived from the original on 27 April 2025. Retrieved 30 April 2025.
  15. "Indus Waters Treaty paused, no entry to Pakistanis: India responds to J&K attack". India Today. 23 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 23 April 2025.
  16. "Kashmir attack: India downgrades ties with Pakistan". Deutsche Welle. 24 April 2025. Retrieved 24 April 2025.
  17. "India closes main border crossing with Pakistan after Kashmir attack". BBC News. 24 April 2025. Retrieved 24 April 2025.
  18. "Afghan Taliban Condemns Pahalgam Terror Attack, Says It Undermines Regional Security". Deccan Herald (in ఇంగ్లీష్). Archived from the original on 23 April 2025. Retrieved 24 April 2025.
  19. "Pakistans 1st reaction To Pahalgam terror attack, says nothing to do with It". The Tribune. 23 April 2025. Retrieved 23 April 2025.
  20. "Pahalgam massacre: In first reaction, Pakistan defends terrorism in Kashmir, says 'locals acting against govt". Firstpost. 23 April 2025. Retrieved 23 April 2025.
  21. "Pakistan-West Ties: Pak Defence Minister Admits to Backing Terror for 3 Decades". Deccan Herald (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  22. "Been doing US's dirty work…: On live TV, Pak minister's big admission on terror". India Today (in ఇంగ్లీష్). 25 April 2025. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  23. "Pakistan Ministers call India's suspension of Indus Waters Treaty 'cowardly', 'immature' & 'inappropriate'". The Economic Times. 24 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 25 April 2025 – via The Economic Times – The Times of India.
  24. "Pakistan to respond to India's actions comprehensively: Dar". Samaa. 24 April 2025. Retrieved 24 April 2025.
  25. "India will pursue Kashmir attackers to 'the ends of the earth', says PM Modi". BBC News. Retrieved 25 April 2025.
  26. Hassan, Aakash; Beaumont, Peter; MacRae, Penelope (24 April 2025). "India and Pakistan closer to conflict over Kashmir attack as tit-for-tat moves mount". The Guardian. Retrieved 25 April 2025.
  27. "Pakistan suspends visas for Indians after deadly Kashmir attack on tourists". BBC (in ఇంగ్లీష్). 24 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 24 April 2025.
  28. "Kartarpur Corridor open for visiting gurdwara in Pakistan despite freeze in ties". 24 April 2025. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  29. "Pakistan suspends trade and closes border with India over Kashmir tensions". Al Jazeera. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  30. "Pakistan suspends 1972 Simla Agreement, shuts airspace to Indian airlines". The Economic Times. 24 April 2025. ISSN 0013-0389. Archived from the original on 24 April 2025. Retrieved 24 April 2025.
  31. "Pakistan shuts Wagah border, suspends Simla Accord, expels Indians". Samaa (in ఇంగ్లీష్). 24 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 24 April 2025.
  32. "No handshake, gate opening at Attari border during beating retreat ceremony". India Today. 25 April 2025. Retrieved 25 April 2025.
  33. "Pahalgam terror attack: BSF scales down Beating Retreat ceremony; handshake with Pak. soldiers suspended". The Hindu. 24 April 2025. Retrieved 25 April 2025.
  34. "'We shouldn't have come': The families stranded at the Indian border". ABC News (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). 30 April 2025. Retrieved 1 May 2025.
  35. Asnani, Rajesh (28 April 2025). "Cross-border families crumble as tensions rise". The New Indian Express (in Indian English). Archived from the original on 29 April 2025. Retrieved 1 May 2025.
  36. Mehmood, Asif (27 April 2025). "Cross-border couples face uncertain futures". The Express Tribune (in ఇంగ్లీష్). Retrieved 1 May 2025.
  37. Raj, Suhasini; Mashal, Mujib; K.B, Pragati; Loke, Atul (28 April 2025). "As India and Pakistan Cancel Visas, Parents and Children Are Separated". The New York Times. Archived from the original on 30 April 2025. Retrieved 1 May 2025.
  38. "Pahalgam attack: Families separated at India-Pakistan border". www.bbc.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). 30 April 2025. Archived from the original on 30 April 2025. Retrieved 1 May 2025.
  39. "Pahalgam terror attack LIVE: PM Modi to return to India cutting short Saudi Arabia visit; Navy Officer among 26 killed". The Hindu. 22 April 2025. Archived from the original on 22 April 2025. Retrieved 22 April 2025.
  40. "Who was Havildar Jhantu Ali Shaikh martyred in Udhampur ops?". The Statesman. 24 April 2025.
  41. "Top LeT commander Altaf Lalli killed in Bandipor". The Hindu. Archived from the original on 29 April 2025. Retrieved 26 April 2025.
  42. Ashiq, Peerzada (26 April 2025). "Pahalgam terror attack: Houses of six militants razed in Kashmir; hundreds detained". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 29 April 2025.
  43. Chougule, Pragati (23 April 2025). "Pakistan Air Force Activity Near LoC Sparks Alarm: Is a Major Conflict Brewing?". The Bridge Chronicle. Archived from the original on 23 April 2025. Retrieved 25 April 2025.
  44. "BSF jawan in Pakistan custody after accidental border crossing: Sources". India Today. 24 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 25 April 2025.
  45. "Indian BSF soldier arrested on Pakistani soil". GEO TV. Archived from the original on 25 April 2025. Retrieved 24 April 2025.
  46. "India, Pakistan trade gunfire as tensions rise over deadly Kashmir attack". Al Jazeera. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  47. "Pakistan troops continue unprovoked firing across LoC for 5th night: Army". The Indian Express (in ఇంగ్లీష్). 29 April 2025. Archived from the original on 29 April 2025. Retrieved 29 April 2025.
  48. 48.0 48.1 "Pakistan Violates Ceasefire Along LoC For 7th Consecutive Night". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 1 May 2025.
  49. Hassan, Aakash; Beaumont, Peter; McRae, Penelope (25 April 2025). "Pakistan and India exchange fire as UN calls for 'maximum restraint'". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 26 April 2025.
  50. "Pahalgam Terror Attack Live Updates: Indian Army retaliates to 'unprovoked' firing by Pakistan along LoC". The Times of India (in ఇంగ్లీష్). 26 April 2025. Retrieved 26 April 2025.
  51. "Pakistan violates LoC ceasefire in Kashmir, Army retaliates". India Today (in ఇంగ్లీష్). 26 April 2025. Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.
  52. "India-Pakistan tensions continue to simmer across Kashmir border" (in ఇంగ్లీష్). Al Jazeera English. Archived from the original on 30 April 2025. Retrieved 30 April 2025.
  53. "Another Indian quadcopter shot down by Pakistan Army near LOC". The Express Tribune (in ఇంగ్లీష్). 29 April 2025. Archived from the original on 29 April 2025. Retrieved 30 April 2025.
  54. "Pakistan shoots down 2nd Indian quadcopter over airspace violation". english.news.cn. Retrieved 30 April 2025.
  55. Naqash, Tariq (30 April 2025). "Two Indian drones shot down near LoC". Dawn (in ఇంగ్లీష్). Retrieved 30 April 2025.
  56. "Pakistan defence minister says military incursion by India is imminent". reuters.
  57. "Pakistan says intelligence suggests Indian military action likely soon". 2025. Archived from the original on 29 April 2025. Retrieved 30 April 2025.
  58. "Major Escalation By Pakistan, Firing At International Border, India Responds". NDTV (in ఇంగ్లీష్). Archived from the original on 30 April 2025. Retrieved 30 April 2025.
  59. "Pak fires along International Border for first time, Army retaliates: Sources". India Today (in ఇంగ్లీష్). 30 April 2025. Archived from the original on 30 April 2025. Retrieved 30 April 2025.
  60. "Amit Shah's stern warning terrorists". Business Standard. Retrieved 1 May 2024.
  61. "Pakistani Ranger captured by BSF along India-Pakistan border in Rajasthan". Times of India. Retrieved 3 May 2025.
  62. "POK flood alert after Pakistan accuses India of Jhelum water release: Report". India Today (in ఇంగ్లీష్). 27 April 2025. Archived from the original on 27 April 2025. Retrieved 27 April 2025.
  63. "Pahalgam: Panic in PoK after India releases Jhelum water". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). 27 April 2025. Archived from the original on 27 April 2025. Retrieved 27 April 2025.
  64. "Chenab River Flow Drops Near Sialkot After Indus Waters Treaty Suspension, Satellite Images Surface: Reports". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 30 April 2025.
  65. "India stops water flow through Baglihar dam Indus Treaty suspension". Kashmir Media Service (in అమెరికన్ ఇంగ్లీష్). 4 May 2025. Retrieved 4 May 2025.
  66. "India cuts water flow through Baglihar Dam after suspending Indus Treaty: Source". CNBC TV18 (in ఇంగ్లీష్). 4 May 2025. Retrieved 4 May 2025.
  67. Tyagi, Yuvraj (7 May 2025). "Why Was It Named Operation Sindoor: A Calibrated Indian Strike Without Military Escalation". Republic TV. New Delhi. Retrieved 7 May 2025.
  68. "UN urges India and Pakistan to show 'maximum restraint' following Kashmir attack". France 24. 25 April 2025. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  69. "Iran offers to play mediator between India, Pak as ties nosedive after J&K attack". India Today (in ఇంగ్లీష్). 25 April 2025. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  70. "Pahalgam attack: UK, Russia issue travel advisories for Pakistan". The Express Tribune. 23 April 2025. Retrieved 23 April 2025.
  71. Bukahi, Farayz; Patal, Shivam. "India, Pakistan exchange small arms fire, China urges restraint". Reuters (in ఇంగ్లీష్). Archived from the original on 29 April 2025. Retrieved 29 April 2025.
  72. Rushali Saha. "Pahalgam Attack Tests West Asian Countries' Neutrality". thediplomat.com. Retrieved 30 April 2025.
  73. "Bangladesh for peaceful resolution of India-Pakistan tensions: Touhid". New Age. 27 April 2025. Retrieved 30 April 2025.
  74. "U.S. urges India, Pakistan to 'de-escalate' tensions; Rubio talks to Pakistan PM Shehbaz Sharif, EAM Jaishankar". The Hindu (in Indian English). 30 April 2025. Retrieved 1 May 2025.
  75. "Pahalgam: US urges India and Pakistan to defuse tensions after Kashmir attack". www.bbc.com. 1 May 2025.
  76. "'Do Not Travel': US issues advisory for J&K in wake of Pahalgam attack". The Times of India. 24 April 2025. ISSN 0971-8257. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  77. ""This was terrorist attack": US House Foreign Affairs Committee condemns NYT's 'militants' label for Pahalgam attack". The Economic Times. 25 April 2025. ISSN 0013-0389. Retrieved 25 April 2025.
  78. Sophia Saifi; Rhea Mogul (24 April 2025). "A tourist massacre in Kashmir is escalating tensions between India and Pakistan. Here's what we know". CNN (in ఇంగ్లీష్). Retrieved 25 April 2025.
  79. "'They've had that fight for 1,000 years… both will figure out one way or other': Trump on India-Pakistan tension". The Indian Express (in ఇంగ్లీష్). 26 April 2025. Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.
  80. Masood, Salman (2 May 2025). "Pakistan's Leaders May Talk Tough, but War With India Is the Last Thing Pakistanis Want". The New York Times. Retrieved 2 May 2025.
  81. "Pahalgam attack: Indians in UK protest outside Pak High Commission in London". India Today (in ఇంగ్లీష్). 26 April 2025. Retrieved 26 April 2025.
  82. "Indian community protests outside Pakistan High Commission in London over Pahalgam attack". The Tribune (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.
  83. "Instagram accounts of several Pak actors including Hania Aamir's blocked in India".
  84. "Hania Aamir rubbishes 'entirely fabricated' statement circulating in her name on Pahalgam attack". Images (in ఇంగ్లీష్). 2 May 2025.
  85. "Pakistani stars fire back at India's war talk, call for peace with strength". www.thenews.com.pk (in ఇంగ్లీష్). Retrieved 4 May 2025.