2026 కామన్‌వెల్త్ క్రీడలు
| Host | గ్లాస్గో, స్కాట్లాండ్ |
|---|---|
| Nations | 74 కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్లు (అంచనా) |
| Athletes | 3,000 (అంచనా) |
| Events | 10 క్రీడల్లో 215 ఈవెంట్లు[1] |
| Opening | 23 జూలై 2026[2] |
| Closing | 2 ఆగస్టు 2026 |
| Main venue | స్కాట్స్‌టౌన్ స్టేడియం |
| Website | గ్లాస్గో 2026 |
| Part of a series on |
| 2026 Commonwealth Games |
|---|
2026 కామన్వెల్త్ గేమ్స్, అధికారికంగా XXIII కామన్వెల్ట్ గేమ్స్ అని పిలుస్తారు. గ్లాస్గో 2026 అని వీటికి మరో పేరు. ఇవి జూలై 23 నుండి ఆగస్టు 2, 2026 వరకు కామన్వెల్త్ సభ్య దేశాల క్రీడాకారులతో స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో జరుగుతాయి.[3][4] 1970,1986 లలో ఎడిన్బర్గ్ లో, 2014 లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల తరువాత స్కాట్లాండ్లో నిర్వహించబడుతున్న నాల్గవ కామన్వెల్త్ క్రీడలు ఇవి. క్వీన్ ఎలిజబెత్ II మరణం, కామన్వెల్త్ అధిపతి కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం తరువాత 2026 కామన్వెల్ట్ గేమ్స్ జరగడం ఇదే మొదటిసారి.
వీటి తర్వాత 2030 కామన్‌వెల్త్ క్రీడలు భారతదేశంలోని అహ్మదాబాద్ లో జరుగుతాయి.
ఏప్రిల్ 2022లో ఆస్ట్రేలియా రాష్ట్రమైన విక్టోరియా ఆతిథ్యమిస్తుందని ప్రకటించినప్పటికీ, వారు ఉపసంహరించుకోవడంతో కొంతకాలం పాటు గేమ్స్‌కు ఆతిథ్య దేశం లేకుండా పోయింది.[5] పెరుగుతున్న వ్యయ అంచనాల కారణంగా 2023 జూలై 18న విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రణాళికలను రద్దు చేసుకుంది. గోల్డ్ కోస్ట్, క్వీన్స్‌లాండ్ నగరం క్లుప్తంగా సహ-ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికీ, తరువాత అదే కారణాలతో వెనక్కి తగ్గింది. ఆతిథ్య దేశం లేకపోవడంతో, గేమ్స్ 2027కి వాయిదా పడటం లేదా పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది.[6][7][8] 2024 ఆగస్టు 11న, గ్లాస్గో ఆతిథ్య హక్కులను చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదికలు వచ్చాయి,[9] అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని మరుసటి రోజే స్పష్టత వచ్చింది. స్కాట్లాండ్ ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ, 10 నుండి 13 క్రీడలతో కుదించిన ఈవెంట్‌ను ప్రతిపాదించింది. దీనికి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ నుండి £100 మిలియన్ల నిధులు, వాణిజ్య వనరుల నుండి అదనంగా £30 నుండి 50 మిలియన్ల నిధులు లభిస్తాయి, దీనివల్ల ప్రజాధనం అవసరం ఉండదు.[10]
విక్టోరియన్ ప్రభుత్వం ఉపసంహరణకు పరిహారంగా చెల్లించిన AU$200 మిలియన్లతో ఈ గేమ్స్ నిర్వహించబడుతాయని 2024 ఆగస్టు 30న ధృవీకరించారు.[11][12] 2024 సెప్టెంబర్ 17న, కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియా ఆర్థిక సహకారంతో గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి స్కాట్లండు ప్రభుత్వం అంగీకరించింది.[4] ఈ కుదించిన, తక్కువ ఖర్చుతో కూడిన గేమ్స్ నాలుగు వేదికలపై 11 క్రీడలను కలిగి ఉంటుంది, ఇక క్రీడా గ్రామం ఉండదు.[4]
వేదికలు
[మార్చు]2026 కామన్వెల్త్ గేమ్స్ కోసం కింది వేదికలను ఉపయోగించనున్నారు:[2][13]
| వేదిక | ఈవెంట్స్ | సామర్థ్యం | స్థితి |
|---|---|---|---|
| నిర్ణయించాల్సి ఉంది | ప్రారంభ,/లేదా ముగింపు వేడుకలు | నిర్ణయించాల్సి ఉంది | నిర్ణయించాల్సి ఉంది |
| స్కాట్స్‌టౌన్ స్టేడియం | అథ్లెటిక్స్ | 10,000-11,000 | ప్రస్తుతం ఉంది, పునరుద్ధరించబడింది |
| టోల్‌క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్ | ఈత (స్విమ్మింగ్) | 2,000 | ప్రస్తుతం ఉంది |
| కామన్వెల్త్ అరేనా | ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ | 5,000 | |
| సర్ క్రిస్ హోయ్ వెలోడ్రోమ్ | ట్రాక్ సైక్లింగ్ | 2,000 | |
| SEC ఆర్మడిల్లో | వెయిట్‌లిఫ్టింగ్ | 3,000 | |
| SEC సెంటర్ | 3x3 బాస్కెట్‌బాల్ | నిర్ణయించాల్సి ఉంది | తాత్కాలిక స్టాండ్లతో ప్రస్తుతం ఉంది |
| బౌల్స్ | నిర్ణయించాల్సి ఉంది | ||
| బాక్సింగ్ | నిర్ణయించాల్సి ఉంది | ||
| జూడో | నిర్ణయించాల్సి ఉంది | ||
| ది హైడ్రో | నెట్‌బాల్ | 12,306 | ప్రస్తుతం ఉంది |
- స్కాట్స్‌టౌన్ స్టేడియం
- టోల్‌క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్
- కామన్వెల్త్ అరేనా
- సర్ క్రిస్ హోయ్ వెలోడ్రోమ్
- SEC ఆర్మడిల్లో
- SEC సెంటర్
- ది హైడ్రో
వేడుకలు
[మార్చు]కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్ ప్రతిపాదించిన ప్రణాళికలో భాగంగా, గత గేమ్స్‌తో పోలిస్తే ప్రారంభ, ముగింపు వేడుకలు సాదా సీదా ఉంటాయని భావిస్తున్నారు.[14]
ప్రారంభ వేడుక
[మార్చు]ప్రారంభ వేడుక 2026 జూలై 23న జరుగుతుంది.
ముగింపు వేడుక
[మార్చు]ముగింపు వేడుక 2026 ఆగస్టు 2న జరుగుతుంది. ఇందులో తదుపరి కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరమైన అమ్దాబాద్ కు అధికారికంగా బాధ్యతలు అప్పగిస్తారు.
పాల్గొనే దేశాలు
[మార్చు]2026 కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం 74 కామన్వెల్త్ దేశాలు పాల్గొంటాయని భావిస్తున్నారు. జూన్ 2022లో కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్‌లో చేరిన తర్వాత గబాన్, టోగో తమ అరంగేట్రం చేయనున్నాయి.
సమయం తక్కువగా ఉన్నందున, 1994 కామన్వెల్త్ క్రీడల తర్వాత కేవలం 10 క్రీడలతో నిర్వహించడం ఇదే మొదటిసారి:[15]
పతకాల పట్టిక
[మార్చు]| ర్యాంకు | దేశం (CGA) | మొత్తం | |||
|---|---|---|---|---|---|
| 1 | 55 | 30 | 43 | 128 | |
| 2 | 17 | 34 | 29 | 80 | |
| 3 | 17 | 15 | 21 | 53 | |
| 4 | 10 | 8 | 16 | 34 | |
| 5 | 9 | 6 | 3 | 18 | |
| 6 | 7 | 10 | 8 | 25 | |
| 7 | 7 | 9 | 9 | 25 | |
| 8 | 7 | 3 | 3 | 13 | |
| 9 | 5 | 12 | 6 | 23 | |
| 10 | 5 | 6 | 12 | 23 | |
| 11 | 5 | 2 | 5 | 12 | |
| 12 | 2 | 4 | 2 | 8 | |
| 13 | ఉత్తర ఐర్లాండ్ (NIR) | 1 | 2 | 7 | 10 |
| 14 | జెర్సీ (JEY) | 1 | 1 | 0 | 2 |
| 14 | 1 | 1 | 0 | 2 | |
| 14 | 1 | 1 | 0 | 2 | |
| 17 | 1 | 0 | 1 | 2 | |
| 17 | 1 | 0 | 1 | 2 | |
| 19 | 1 | 0 | 0 | 1 | |
| 19 | 1 | 0 | 0 | 1 | |
| 19 | 1 | 0 | 0 | 1 | |
| 19 | 1 | 0 | 0 | 1 | |
| 23 | 0 | 5 | 3 | 8 | |
| 24 | 0 | 2 | 1 | 3 | |
| 25 | 0 | 2 | 0 | 2 | |
| 26 | 0 | 1 | 2 | 3 | |
| 27 | 0 | 1 | 1 | 2 | |
| 27 | 0 | 1 | 1 | 2 | |
| 29 | 0 | 0 | 2 | 2 | |
| 29 | 0 | 0 | 2 | 2 | |
| 29 | 0 | 0 | 2 | 2 | |
| 29 | 0 | 0 | 2 | 2 | |
| 33 | 0 | 0 | 1 | 1 | |
| 33 | 0 | 0 | 1 | 1 | |
| 33 | 0 | 0 | 1 | 1 | |
| 33 | 0 | 0 | 1 | 1 | |
| 33 | 0 | 0 | 1 | 1 | |
| 33 | 0 | 0 | 1 | 1 | |
| మొత్తం | 156 | 156 | 188 | 500 | |
* ఆతిథ్య దేశం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Ten Days. 215 Gold Medals. 3,000 Athletes: Glasgow 2026 Sport Schedule Released". Glasgow 2026. 14 అక్టోబరు 2025. Archived from the original on 15 అక్టోబరు 2025.
- 1 2 "Dates for Glasgow 2026 Commonwealth Games confirmed". BBC Sport. 18 అక్టోబరు 2024. Archived from the original on 22 అక్టోబరు 2024.
- ↑ Brooks, Libby (17 సెప్టెంబరు 2024). "Glasgow to host 2026 Commonwealth Games after rescue deal agreed". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Archived from the original on 17 సెప్టెంబరు 2024. Retrieved 17 సెప్టెంబరు 2024.
- 1 2 3 "Scotland agrees to host Commonwealth Games in 2026, after Bangkok bid withdrawal". BBC News (in British English). 17 జూలై 2023. Archived from the original on 17 సెప్టెంబరు 2024. Retrieved 17 జూలై 2023.
- ↑ "Games-Australian state to be confirmed 2026 Commonwealth Games host -report". Devdiscourse. 12 ఏప్రిల్ 2022. Archived from the original on 11 ఏప్రిల్ 2022.
- ↑ "Commonwealth Games: 2026 event in doubt after Victoria cancels". BBC News (in British English). 17 జూలై 2023. Archived from the original on 18 జూలై 2023. Retrieved 17 జూలై 2023.
- ↑ "Commonwealth Games Costs Too High At Over $6 Billion | Premier of Victoria". www.premier.vic.gov.au (in ఇంగ్లీష్). Archived from the original on 18 జూలై 2023. Retrieved 18 జూలై 2023.
- ↑ Karp, Paul; Kelly, Cait; Ore, Adeshola (18 జూలై 2023). "Australia Commonwealth Games 2026: Victoria cancels event after costs blow out to $7bn". The Guardian. Archived from the original on 17 జూలై 2023. Retrieved 17 జూలై 2023.
- ↑ Trainer, Paul (11 ఆగస్టు 2024). "Reports: Glasgow set to be announced as host city for Commonwealth Games 2026". GlasgowWorld. Archived from the original on 11 ఆగస్టు 2024. Retrieved 12 ఆగస్టు 2024.
- ↑ Dewar, Heather (12 ఆగస్టు 2024). "No decision as yet on host nation for troubled 2026 Commonwealth Games despite offer from Glasgow". Daily Mail. Archived from the original on 12 ఆగస్టు 2024. Retrieved 12 ఆగస్టు 2024.
- ↑ "Victorian taxpayers would pay for Scotland's $220m Commonwealth Games under new proposal". The Guardian. 1 సెప్టెంబరు 2024. Archived from the original on 1 సెప్టెంబరు 2024. Retrieved 1 సెప్టెంబరు 2024.
- ↑ "Commonwealth Games Scotland Update on Glasgow 2026 Commonwealth Games". Team Scotland. 30 ఆగస్టు 2024. Archived from the original on 1 సెప్టెంబరు 2024. Retrieved 1 సెప్టెంబరు 2024.
- ↑ "Event Delivery Partners' Information Pack" (PDF). నవంబరు 2024. Archived (PDF) from the original on 12 మార్చి 2025.
- ↑ "Glasgow to host 2026 Commonwealth Games". BBC Newsround (in బ్రిటిష్ ఇంగ్లీష్). 17 సెప్టెంబరు 2024. Archived from the original on 21 సెప్టెంబరు 2024. Retrieved 18 సెప్టెంబరు 2024.
- ↑ Bonar, Megan; Geddes, Jonathan (22 అక్టోబరు 2024). "Sports announced for Glasgow 2026 Commonwealth Games". BBC Sport. Archived from the original on 17 నవంబరు 2024.