Jump to content

2026 పురుషుల టీ20 ప్రపంచ కప్

వికీపీడియా నుండి
2026 పురుషుల టీ20 ప్రపంచ కప్
తేదీలు2026 ఫిబ్రవరి 7 – మార్చి 8
నిర్వాహకులుఅంతర్జాతీయ క్రికెట్ సంఘం
క్రికెట్ రకంట్వంటీ20
టోర్నమెంటు ఫార్మాట్లుGroup stage, Super 8s and Knockout stage
ఆతిథ్యం ఇచ్చేవారు
  • భారతదేశం
  • శ్రీలంక
పాల్గొన్నవారు20
ఆడిన మ్యాచ్‌లు55
అధికారిక వెబ్‌సైటుicc-cricket.com
2024
2028

2026 ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్, ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ పోటీల్లో పదవది. దీనిని భారత క్రికెట్ నియంత్రణ మండలి, శ్రీలంక క్రికెట్ లు సంయుక్తంగా 2026 ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు నిర్వహిస్తున్నాయి. గతంలో శ్రీలంక 2012 లోను, భారతదేశం 2016 లోనూ ఈ పోటీని నిర్వహించాయి. భారతదేశంలో ఐదు వేదికలు, శ్రీలంకలో మూడు వేదికలలో మొత్తం ఇరవై జట్లు 55 మ్యాచ్‌లలో పోటీపడతాయి.

పాల్గొనేవారి సంఖ్య గత ప్రపంచ కప్‌లో ఉన్నట్లే, ఇరవై జట్లు. ఇందులో రెండు ఆతిథ్య దేశాల జట్లు, 2024 పోటీల్లో పాల్గొన్నజట్లలో అగ్రస్థానంలో నిలిచిన ఏడు జట్లు, ICC పురుషుల T20I టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇప్పటికి ఇంకా అర్హత సాధించని మూడు అత్యున్నత ర్యాంక్ పొందిన జట్లు, ప్రాంతీయ అర్హత పోటీల ద్వారా ఎంపైకైన ఎనిమిది ఇతర జట్లు ఉన్నాయి. ఇటలీ మొదటిసారి పురుషుల T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.

గత కప్‌ గెలిచిన భారతదేశం, ఈ ఏటి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతోంది.

నేపథ్యం

[మార్చు]

ICC పురుషుల T20 ప్రపంచ కప్ అనేది ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) ఫార్మాట్‌లో క్రికెట్ కోసం రెండేళ్ళకు ఒకసారి జరిగే ప్రపంచ కప్ పోటీ. దీనిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహిస్తుంది. ఇది మొదట 2007 లో దక్షిణాఫ్రికాలో జరిగింది. 2026 టోర్నమెంటు పదవది.[1] 2024 లో వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్‌లలో జరిగిన తొమ్మిదవ ఎడిషన్‌లో 20 జట్లు పోటీ పడ్డాయి. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారతదేశం కప్పు సాధించింది.[2]

హోస్ట్ ఎంపిక

[మార్చు]

2024–2031 ICC పురుషుల ఆతిథ్య చక్రంలో భాగంగా, 2026 పురుషుల T20 ప్రపంచ కప్‌ను భారతదేశం, శ్రీలంకలలో నిర్వహించనున్నట్లు 2021 నవంబరులో ICC ప్రకటించింది.[3] ప్రారంభంలో శ్రీలంక క్రికెట్ మాత్రమే మొత్తం టోర్నమెంట్‌ను నిర్వహించాలని ప్రతిపాదించబడింది. కానీ టోర్నమెంటును విస్తరించడం, శ్రీలంకలో తగినన్ని స్టేడియంలు లేకపోవడం వల్ల దీనిని భారతదేశంలో క్రికెట్ నియంత్రణ బోర్డుతో కలిసి నిర్వహించాలని నిర్ణయించారు. [4] శ్రీలంక గతంలో 2012 లోను, భారతదేశం 2016 లోనూ ఈ పోటీని నిర్వహించాయి.[5]2024 డిసెంబరులో భారతదేశంలో క్రికెట్ నియంత్రణ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, 2024–2027 ICC ఈవెంట్స్ చక్రంలో భారతదేశం లేదా పాకిస్తాన్ నిర్వహించే ICC ఈవెంట్‌లలో భారతదేశం, పాకిస్తాన్‌లు పాల్గొనే మ్యాచ్‌లు తటస్థ వేదికలో జరుగుతాయని ICC నిర్ధారించింది. [6] ఫలితంగా, 2026 పురుషుల T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పాల్గొనే మ్యాచ్‌లు శ్రీలంకలో మాత్రమే జరుగుతాయి.[7]

ఫార్మాట్

[మార్చు]

ఈ టోర్నమెంట్ ఫార్మాట్ మునుపటి ఎడిషన్ మాదిరిగానే ఉంటుంది. అర్హత సాధించిన 20 జట్లను ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశలో, ప్రతి జట్టు రౌండ్-రాబిన్ పద్ధతిలో ఒకదానితో ఒకటి నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది; ప్రతి గ్రూప్‌లోని అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి, అక్కడ వారు నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా నిలిచి, ఒకదానితో ఒకటి మూడు మ్యాచ్‌లు ఆడతారు. ప్రతి గ్రూప్‌లోని అగ్ర రెండు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.[8]

టోర్నమెంట్‌కు ముందు, ఐసిసి సూపర్ 8 దశకు ఎనిమిది సీడెడ్ జట్లను వారి T20I ర్యాంకింగ్‌ల ఆధారంగా ప్రకటించింది. గ్రూప్ దశ నుండి ముందుకు సాగిన తర్వాత, జట్లు గ్రూప్ దశలో ఏ స్థానం సాధించాయన్న దానితో సంబంధం లేకుండా, సూపర్ 8 దశలో ముందుగా నిర్ణయించిన స్థానాల్లో ఉంటాయి. సీడింగు లేని జట్టు సీడింగు సాధించిన జట్టును ఓడించి అర్హత సాధిస్తే, అది విఫలమైన సీడెడ్ జట్టు స్థానాన్ని తీసుకుంటుంది.[8]

షెడ్యూల్

[మార్చు]

2023–2027 ఐసిసి పురుషుల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో 2026 ఫిబ్రవరి నుండి మార్చి వరకు ఈ టోర్నమెంటుకు కేటాయించారు. 2025 నవంబరు 25 న తుది షెడ్యూల్‌ను ప్రకటించారు. దాని ప్రకారం ఈ టోర్నమెంటు ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంకలోని మూడు వేదికలు కనీసం 20 మ్యాచ్‌లను నిర్వహిస్తాయి. మిగిలిన మ్యాచ్‌లు భారతదేశంలోని ఐదు వేదికలలో నిర్వహిస్తారు.[5][9] వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూలు 2025 నవంబరు నాటికి ఇంకా వెల్లడి కాలేదు.

అర్హత

[మార్చు]

ఆతిథ్య శ్రీలంక, భారతదేశం, 2024 టోర్నమెంట్ నుండి మొదటి ఏడు జట్లతో పాటు, టోర్నమెంట్‌కు స్వయంచాలకంగా అర్హత సాధించాయి. మిగిలిన మూడు ఆటోమేటిక్ అర్హత స్థానాలను ICC పురుషుల T20I టీమ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంక్ పొందిన జట్లు ఆక్రమించాయి. ఈ మూడు జట్లూ 2024 జూన్ 30 నాటికి వేరే మార్గంలో అర్హత సాధించలేదు. మిగిలిన ఎనిమిది స్థానాలను ICC యొక్క ప్రాంతీయ క్వాలిఫైయర్‌ల ద్వారా భర్తీ చేశారు, వీటిలో ఆఫ్రికా, యూరప్ నుండి రెండు జట్లు, ఆసియా, తూర్పు ఆసియా -పసిఫిక్ నుండి మూడు జట్లు, అమెరికాస్ నుండి ఒక జట్టు ఉన్నాయి.[10] [11] [12] 2025 జూన్‌లో కెనడా, అమెరికాల నుండి అర్హత సాధించింది, [13] జూలైలో జరిగిన యూరప్ ఫైనల్ నుండి ఇటలీ, నెదర్లాండ్స్ వచ్చాయి. [14] 2025 అక్టోబరులో నమీబియా, జింబాబ్వేలు ఆఫ్రికానుండి అర్హత సాధించాయి, [15] ఆ తర్వాత నేపాల్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసియా నుండి అర్హత సాధించాయి. [16] ఇటలీ మొదటిసారి పురుషుల T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. [17]

Teams qualified for the tournament[18]
అర్హత సాధించిన పద్ధతి జట్ల సంఖ్య జట్లు 0I [a]ర్యాంకు
ఆతిథ్యం ఇచ్చే దేశాలు 2  భారతదేశం 1
 శ్రీలంక 8
2024 పురుషుల T20 ప్రపంచకప్

(అగ్ర 7 జట్లు)
7  ఆఫ్ఘనిస్తాన్ 10
 Australia 2
 బంగ్లాదేశ్ 9
 ఇంగ్లాండు 3
 South Africa 5
 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 18
 వెస్ట్ ఇండీస్ 6
ఐసిసి పురుషుల టి20 జట్ల ర్యాంకులు 3  Ireland 11
 New Zealand 4
 Pakistan 7
అమెరికాల నుండి అర్హత 1  Canada 19
ఐరోపా నుండి అర్హత 2  Italy 28
 Netherlands 13
ఆఫ్రికా నుండి అర్హత 2  నమీబియా 15
 జింబాబ్వే 12
ఆసియా నుండి అర్హత 3  నేపాల్ 17
 ఒమన్ 20
 United Arab Emirates 16
Total 20

వేదికలు

[మార్చు]

2025 నవంబరు 6 న ఐసిసి, T20 ప్రపంచ కప్ కోసం తుది వేదికలను ప్రకటించింది. వాటిలో భారతదేశంలో ఐదు: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం, చెన్నైలోని MA చిదంబరం స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే స్టేడియం ; శ్రీలంకలో మూడు: కొలంబోలోని R. ప్రేమదాస స్టేడియం, SSC క్రికెట్ గ్రౌండ్, కాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియం లు ఉన్నాయి. [19] [5]

స్క్వాడ్‌లు

[మార్చు]

ప్రతి జట్టు 15 మంది ఆటగాళ్లతో కూడిన స్క్వాడ్‌ను పంపించవచ్చు. 2026 జనవరి 8 నాటికి తాత్కాలిక జట్టును ఐసిసికి సమర్పించాల్సి ఉంది. జట్లు తమ స్క్వాడ్‌లో మార్పులు చేసుకోవడానికి 2026 జనవరి 31 వరకు అనుమతి ఉంది.[20]

గ్రూప్ దశ

[మార్చు]

2025 నవంబరు 25 న ఐసిసి, గ్రూప్‌లు, మ్యాచ్‌లను ప్రకటించింది. గ్రూప్ దశ ఫిబ్రవరి 7 నుండి 20 వరకు జరుగుతుంది.[5][9] మొత్తం 20 జట్లను, ఐదేసి జట్లతో కూడిన నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు, గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒకసారి తలపడుతుంది. మొత్తం అన్ని గ్రూపుల్లోనూ కలిపి 40 మ్యాచ్‌లు ఆడతారు.[8] ప్రారంభ మ్యాచ్ ఫిబ్రవరి 7న SSC క్రికెట్ గ్రౌండ్‌లో నెదర్లాండ్స్, పాకిస్తాన్‌ల మధ్య జరుగుతుంది. [21] కింది పట్టికలో, గ్రూప్‌ వారీగా జట్లను వాటి సీడింగుల క్రమంలో చూడవచ్చు.[22]

గ్రూప్ ఎ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి
Pos Team Pld W L NR Pts NRR Qualification
1  భారతదేశం (H) 0 0 0 0 0 సూపర్ 8 దశకు వెళ్తారు
2  నమీబియా 0 0 0 0 0
3  Netherlands 0 0 0 0 0
4  Pakistan 0 0 0 0 0
5  అమెరికా సంయుక్త రాష్ట్రాలు 0 0 0 0 0
First match(es) will be played: 2026 ఫిబ్రవరి 7. Source: ESPNcricinfo[23]
Rules for classification: 1) పాయింట్లు; 2) గెలుపులు;; 3) నెట్ రన్ రేట్; 4) టై అయిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు; 5) గ్రూప్ దశ సీడింగులు
(H) ఆతిథేయి










Pos Team Pld W L NR Pts NRR Qualification
1  Australia 0 0 0 0 0 సూపర్ 8 దశకు వెళ్తారు
2  Ireland 0 0 0 0 0
3  ఒమన్ 0 0 0 0 0
4  శ్రీలంక (H) 0 0 0 0 0
5  జింబాబ్వే 0 0 0 0 0
First match(es) will be played: 8 ఫిబ్రవరి 2026. Source: ESPNcricinfo[23]
Rules for classification: 1) పాయింట్లు; 2) గెలుపులు;; 3) నెట్ రన్ రేట్; 4) టై అయిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు; 5) గ్రూప్ దశ సీడింగులు
(H) ఆతిథేయి










Pos Team Pld W L NR Pts NRR Qualification
1  బంగ్లాదేశ్ 0 0 0 0 0 సూపర్ 8 దశకు వెళ్తారు
2  ఇంగ్లాండు 0 0 0 0 0
3  Italy 0 0 0 0 0
4  నేపాల్ 0 0 0 0 0
5  వెస్ట్ ఇండీస్ 0 0 0 0 0
First match(es) will be played: 7 ఫిబ్రవరి 2026. Source: ESPNcricinfo[23]
Rules for classification: 1) పాయింట్లు; 2) గెలుపులు;; 3) నెట్ రన్ రేట్; 4) టై అయిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు; 5) గ్రూప్ దశ సీడింగులు





మ్యాచ్ 17
12 ఫిబ్రవరి 2026 (2026-02-12)
15:00 UTC+5:30 (D/N)
స్కోర్‌కార్డు
v





Pos Team Pld W L NR Pts NRR Qualification
1  ఆఫ్ఘనిస్తాన్ 0 0 0 0 0 సూపర్ 8 దశకు వెళ్తారు
2  Canada 0 0 0 0 0
3  New Zealand 0 0 0 0 0
4  South Africa 0 0 0 0 0
5  United Arab Emirates 0 0 0 0 0
First match(es) will be played: 8 ఫిబ్రవరి 2026. Source: ESPNcricinfo[23]
Rules for classification: 1) పాయింట్లు; 2) గెలుపులు;; 3) నెట్ రన్ రేట్; 4) టై అయిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు; 5) గ్రూప్ దశ సీడింగులు










సూపర్ 8

[మార్చు]

ప్రతి గ్రూపు లోను అగ్రస్థానంలో ఉన్న తొలి రెండు జట్లు సూపర్ 8 దశకు వెళ్తాయి. ఈ ఎనిమిది జట్లను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా చేస్తారు. సూపర్ 8 దశలో ప్రతి జట్టు తన గ్రూపులో ఉన్న ఇతర జట్లతో రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు ఆడతాయి. ఒక్కో గ్రూపు నుండి రెండు చొప్పున మొత్తం నాలుగు జట్లు నాకౌట్ దశకు చేరతాయి.[8] గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ 8 దశకు రావు. టోర్నమెంటుకు ముందు, అప్పటి టి20 ర్యాంకుల ప్రకారం, సూపర్ 8 దశ కోసం 8 జట్లకు సీడింగు ఇచ్చారు. ఆ జట్లు: గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా, ఇండియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్; గ్రూప్ 2 లో ఇంగ్లాండ్, న్యూజీలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.[5][9]

క్వాలిఫికేషను సూపర్ 8 దశ
గ్రూప్ 1 గ్రూప్ 2
గ్రూప్ దశ నుండి వచ్చిన జట్లు
(ఒక్కో గ్రూపు నుండి 2 జట్ల చొప్పున)
A
X1 Y3
B
X2 Y4
C
X3 Y1
D
X4 Y2

గ్రూప్ 1

[మార్చు]
Pos Team Pld W L NR Pts NRR Qualification
1 X1 0 0 0 0 0 Advance to the నాకౌట్ దశ
2 X2 0 0 0 0 0
3 X3 0 0 0 0 0
4 X4 0 0 0 0 0
First match(es) will be played: 2026 ఫిబ్రవరి 22. Source: ESPNcricinfo[23]
Rules for classification: 1) పాయింట్లు; 2) గెలుపులు; 3) నెట్ రన్ రేట్; 4) టై అయిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు; 5) టోర్నమెంటుకు ముందు టి20ఐ ర్యాంకులు

మ్యాచ్ 43
22 ఫిబ్రవరి 2026 (2026-02-22)
19:00 UTC+5:30 (N)
స్కోర్‌కార్డు
X1
v
X4

మ్యాచ్ 44
23 ఫిబ్రవరి 2026 (2026-02-23)
19:00 UTC+5:30 (N)
స్కోర్‌కార్డు
X2
v
X3

మ్యాచ్ 47
26 ఫిబ్రవరి 2026 (2026-02-26)
15:00 UTC+5:30 (D/N)
స్కోర్‌కార్డు
X3
v
X4

మ్యాచ్ 48
26 ఫిబ్రవరి 2026 (2026-02-26)
19:00 UTC+5:30 (N)
స్కోర్‌కార్డు
X1
v
X2


మ్యాచ్ 52
1 మార్చి 2026 (2026-03-01)
19:00 UTC+5:30 (N)
స్కోర్‌కార్డు
X1
v
X3

గ్రూప్ 2

[మార్చు]
Pos Team Pld W L NR Pts NRR Qualification
1 Y1 0 0 0 0 0 Advance to the నాకౌట్ దశ
2 Y2 0 0 0 0 0
3 Y3 0 0 0 0 0
4 Y4 0 0 0 0 0
First match(es) will be played: 2026 ఫిబ్రవరి 21. Source: ESPNcricinfo[23]
Rules for classification: 1) పాయింట్లు; 2) గెలుపులు; 3) neT ran rET; 4) టై అయిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు; 5) టోర్నమెంటుకు ముందు టి20ఐ ర్యాంకులు

మ్యాచ్ 41
21 ఫిబ్రవరి 2026 (2026-02-21)
19:00 UTC+5:30 (N)
స్కోర్‌కార్డు
Y2
v
Y3



మ్యాచ్ 46
25 ఫిబ్రవరి 2026 (2026-02-25)
19:00 UTC+5:30 (N)
స్కోర్‌కార్డు
Y2
v
Y4

మ్యాచ్ 49
27 ఫిబ్రవరి 2026 (2026-02-27)
19:00 UTC+5:30 (N)
స్కోర్‌కార్డు
Y1
v
Y2

నాకౌట్ దశ

[మార్చు]

నాకౌట్ దశలో మార్చి 4, 5 తేదీల్లో రెండూ సెమీ ఫైనళ్ళు, మార్చి 8 న ఫైనల్ పోటీ జరుగుతాయి.[8] రెండవ సెమీ ఫైనల్ ముంబై లోని వాంఖెడే స్టేడియంలో జరుగుతుంది. మొదటి సెమీ ఫైనల్ కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్‌లోనూ జరుగుతాయి. ఫైనల్ పోటీ అహ్మదాబాదులో నరేంద్ర మోడీ స్టేడీయంలో జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ అర్హత సాధిస్తే సెమీఫైనల్, ఫైనల్ రెండూ కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి.[24]

బ్రాకెట్

[మార్చు]
సెమీ ఫైనల్స్ ఫైనల్
               
   
   
    SF1W  
  SF2W  
 
   

సెమీ ఫైనల్స్

[మార్చు]
సెమీ ఫైనల్ 1
4 మార్చి 2026 (2026-03-04)
19:00 UTC+5:30 (N)
స్కోర్‌కార్డు
TBA
v
TBA

సెమీ ఫైనల్ 2
5 మార్చి 2026 (2026-03-05)
19:00 UTC+5:30 (N)
స్కోర్‌కార్డు
TBA
v
TBA

ఫైనల్

[మార్చు]
ఫైనల్
8 మార్చి 2026 (2026-03-08)
19:00 UTC+5:30 (N)
స్కోర్‌కార్డు
SF1 విజేత
v
SF2 విజేత

గమనికలు

[మార్చు]
  1. The ICC Men's T20I Team Rankings of the respective team in November 2025.

మూలాలు

[మార్చు]
  1. "T20 World Cup winners: India, West Indies and England tied on two titles each - full list of champions". Olympics.com. 29 June 2024.
  2. "India win T20 World Cup 2024, stun South Africa by 7 runs in final as Bumrah, Hardik nail finish". The Indian Express. 29 June 2024. Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  3. "USA to stage T20 World Cup: 2024–2031 ICC Men's tournament hosts confirmed" (in ఇంగ్లీష్). International Cricket Council. 16 November 2021. Archived from the original on 5 December 2021. Retrieved 20 February 2025.
  4. "T20 World Cup winners: India, West Indies and England tied on two titles each - full list of champions". Olympics.com. 29 June 2024.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. 25 November 2025. Retrieved 27 November 2025.
  6. "India win T20 World Cup 2024, stun South Africa by 7 runs in final as Bumrah, Hardik nail finish". The Indian Express. 29 June 2024. Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  7. Ridley, Rob (2025-11-28). "Venues confirmed for Men's T20 World Cup". The Stadium Business (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2025-11-29.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 "T20 World Cup 2026 schedule: India grouped with Pakistan, England with West Indies" (in ఇంగ్లీష్). ESPNcricinfo. 25 November 2025. Retrieved 20 ఫిబ్రవరి 2025.
  9. 9.0 9.1 9.2 "Fixtures, groups released for ICC Men's T20 World Cup 2026". International Cricket Council. 25 November 2025. Retrieved 27 November 2025.
  10. "T20 World Cup winners: India, West Indies and England tied on two titles each - full list of champions". Olympics.com. 29 June 2024.
  11. "India win T20 World Cup 2024, stun South Africa by 7 runs in final as Bumrah, Hardik nail finish". The Indian Express. 29 June 2024. Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  12. "T20 World Cup winners: India, West Indies and England tied on two titles each - full list of champions". Olympics.com. 29 June 2024.
  13. "Canada qualify for Men's T20 World Cup 2026" (in ఇంగ్లీష్). International Cricket Council. 2025-06-22. Retrieved 2025-11-29.
  14. "Italy and Netherlands qualify for the Men's T20 World Cup 2026" (in ఇంగ్లీష్). International Cricket Council. 2025-07-11. Retrieved 2025-11-29.
  15. "Namibia and Zimbabwe qualify for ICC Men's T20 World Cup 2026" (in ఇంగ్లీష్). International Cricket Council. 2025-10-03. Retrieved 2025-11-29.
  16. "UAE claim final T20 World Cup 2026 ticket in Oman" (in ఇంగ్లీష్). International Cricket Council. 2025-10-16. Retrieved 2025-11-29.
  17. "India win T20 World Cup 2024, stun South Africa by 7 runs in final as Bumrah, Hardik nail finish". The Indian Express. 29 June 2024. Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  18. "T20 World Cup winners: India, West Indies and England tied on two titles each - full list of champions". Olympics.com. 29 June 2024.
  19. "T20 World Cup winners: India, West Indies and England tied on two titles each - full list of champions". Olympics.com. 29 June 2024.
  20. "What is the deadline to announce squad for T20 World Cup 2026?". Inside Sport. 19 December 2025. Retrieved 19 December 2025.
  21. "T20 World Cup winners: India, West Indies and England tied on two titles each - full list of champions". Olympics.com. 29 June 2024.
  22. 22.0 22.1 "T20 WC 2026: An explainer on ICC's pre-assigned seedings". Cricbuzz. Retrieved 25 November 2025.
  23. 23.0 23.1 23.2 23.3 23.4 23.5 మూస:ESPNcricinfo 2
  24. "నరేంద్ర మోడీ స్టేడియం to host T20 World Cup final, R Premadasa Stadium announced as alternative for Pakistan". ESPNcricinfo. 9 September 2025. Retrieved 10 September 2025.
  25. మూస:ESPNcricinfo 2