Jump to content

2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్

వికీపీడియా నుండి
2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్
దస్త్రం:2026 T20 World Cup Final Programme Cover by ICC.jpeg
మ్యాచ్ కార్యక్రమ కవర్
సంఘటన2026 పురుషుల టీ20 ప్రపంచ కప్
న్యూజీలాండ్ భారతదేశం
New Zealand భారతదేశం
తేదీ2026 మార్చి 8 19:00 UTC+5:30
వేదికనరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాదు
అంపైర్లురిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లా)
2024
2028

2026 ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ ఫైనల్ అనేది, 2026 ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ విజేతను నిర్ణయించడానికి 2026 మార్చి 8 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ట్వంటీ 20 అంతర్జాతీయ (టి 20 ఐ) క్రికెట్ మ్యాచ్. ఇది భారతదేశం, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతుంది.

నేపథ్యం

[మార్చు]

2026 ICC పురుషుల T20 ప్రపంచ కప్ అనేది ICC పురుషుల T20 ప్రపంచ కప్ పోటీల్లో పదవది. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించే ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) ఫార్మాట్‌లో జరిగే ద్వైవార్షిక ప్రపంచ కప్ పోటీ.[1] 2024-2031 ICC పురుషుల ఆతిథ్య చక్రంలో భాగంగా, 2026 ICC పురుషుల T20 ప్రపంచ కప్ భారతదేశం, శ్రీలంకలో జరుగుతుందని ఐసిసి, 2021 నవంబరులో ప్రకటించింది. [2]

2025 నవంబరు 6 న ఐసిసి, టోర్నమెంటు కోసం తుది వేదికలను ప్రకటించింది.[3] అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం 2026 మార్చి 8న జరగనున్న ఫైనల్‌కు వేదికగా నిశ్చయించారు.[4] ఫనల్‌కు పాకిస్తాన్ అర్హత సాధించినట్లయితే ఈ మ్యాచ్‌ను శ్రీలంకలోని ఆర్. ప్రేమదాస స్టేడియంకు తరలించి ఉండేవారు.[5] నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే తొలి టి20 ప్రపంచ కప్ ఫైనల్ ఇది.

2021లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత, న్యూజిలాండ్‌కు ఇది రెండవ T20 ప్రపంచ కప్ ఫైనల్ అవుతుంది.[6] భారతదేశానికి ఇది నాల్గవ ఫైనల్. భారత్ 2007, 2024 లో ఛాంపియన్లుగాను, 2014 లో రన్నరప్‌గానూ నిలిచింది. [7] ఈ మ్యాచ్‌కు ముందు, భారతదేశం, న్యూజిలాండ్‌లు టీ20 ప్రపంచ కప్‌లో మూడుసార్లు తలపడగా, ఆ మూడు సందర్భాలలోనూ (2007, 2016, 2021) న్యూజిలాండే గెలిచింది. [8]

ఫైనల్‌కు ప్రయాణం

[మార్చు]

అవలోకనం

[మార్చు]
New Zealand  vs  భారతదేశం
ప్రత్యర్థి తేదీ ఫలితం పాయింట్లు మ్యాచ్ ప్రత్యర్థి తేదీ ఫలితం పాయింట్లు
గ్రూప్ D గ్రూప్ దశ గ్రూప్ A
 ఆఫ్ఘనిస్తాన్ 8 February 2026 గెలుపు 2 1  అమెరికా సంయుక్త రాష్ట్రాలు 7 February 2026 గెలుపు 2
 United Arab Emirates 10 February 2026 గెలుపు 4 2  నమీబియా 12 February 2026 గెలుపు 4
 South Africa 14 February 2026 ఓటమి 4 3  Pakistan 15 February 2026 గెలుపు 6
 Canada 17 February 2026 గెలుపు 6 4  Netherlands 18 February 2026 గెలుపు 8
Group 2 Super 8 stage Group 1
 Pakistan 21 February 2026 ఫలితం తేలలేదు 1 5  South Africa 22 February 2026 ఓటమి 0
 శ్రీలంక 25 February 2026 గెలుపు 3 6  జింబాబ్వే 26 February 2026 గెలుపు 2
 ఇంగ్లాండు 27 February 2026 ఓటమి 3 7  వెస్ట్ ఇండీస్ 1 March 2026 గెలుపు 4
సెమీఫైనల్ 1 నాకౌట్ దశ సెమీఫైనల్ 2
 South Africa 4 March 2026 గెలుపు SF  ఇంగ్లాండు 5 March 2026 గెలుపు
2026 ఐసిసి పురుషుల టీ20 ప్రపంస కప్ ఫైనల్

న్యూజిలాండ్

[మార్చు]

న్యూజిలాండ్ తమ T20 ప్రపంచ కప్ ప్రచారాన్ని చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయంతో ప్రారంభించింది.[10] అదే వేదికపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను [11] ఓడించింది. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయారు.[12] చెన్నైలో కెనడాను ఓడించి గ్రూప్ D లో రన్నరప్‌గా గ్రూప్ దశను ముగించారు.[13] సూపర్ 8 దశలో, పాకిస్తాన్‌తో జరగాల్సిన మొదటి ఆట కొలంబోలోని R. ప్రేమదాస స్టేడియంలో వర్షం కారణంగా రద్దైంది.[14] అదే వేదికపై సహ-ఆతిథ్య శ్రీలంకను ఓడించారు.[15] కానీ కాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయారు.[16] పాకిస్తాన్‌ కంటే ఎక్కువగా ఉన్న నికర రన్ రేటు కారణంగా న్యూజిలాండ్, గ్రూప్ 2 లో రన్నరప్‌గా నిలిచింది. [17] ఆ తర్వాత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సెమీ-ఫైనల్ 1 లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్, రెండవసారి T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.[18]

భారతదేశం

[మార్చు]

ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాపై విజయంతో భారతదేశం తన T20 ప్రపంచ కప్ ప్రచారాన్ని ప్రారంభించింది.[19] ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాను,[20] కొలంబోలో పాకిస్తాన్‌ను,[21] అహ్మదాబాద్‌లోని నెదర్లాండ్స్‌నూ ఓడించి గ్రూప్ A విజేతలుగా గ్రూప్ దశను ముగించింది.[22] సూపర్ 8 దశలో వారు, అహ్మదాబాద్‌లో తమ మొదటి ఆటలో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయారు. ఆ విధంగా భారత వరుస విజయాలకు తెరపడింది (టీ20 ప్రపంచ కప్‌లలో 12, ICC పరిమిత ఓవర్ల టోర్నమెంట్‌లలో 17 వరుస విజయాల తరువాత). [23] ఆ తరువాత భారత్, చెన్నైలో జింబాబ్వేను,[24] కోల్‌కతాలో వెస్టిండీస్‌నూ ఓడించి గ్రూప్ 1 లో రన్నరప్‌గా నిలిచారు.[25] ఆ తర్వాత ముంబైలో జరిగిన సెమీ-ఫైనల్ 2 లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్, నాల్గవసారి T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్హత సాధించి, రికార్డు స్థాపించింది. [26]

మ్యాచ్

[మార్చు]

మ్యాచ్ అధికారులు

[మార్చు]

2026 మార్చి 6 న ఐసిసి, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్‌లను ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా, దక్షిణాఫ్రికాకు చెందిన అల్లాహుడియన్ పాలేకర్‌ను థర్డ్ అంపైర్‌గా, అడ్రియన్ హోల్డ్‌స్టాక్‌ను రిజర్వ్ అంపైర్‌గా, జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్‌ను మ్యాచ్ రిఫరీగా నియమించింది.[27]

జట్టు, టాస్

[మార్చు]

న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డీంగు ఎంచుకుంది. సెమీఫైనల్ గెలిచిన న్యూజీలాండ్ జట్టుకూర్పులో, కోల్ మెక్‌కాంచీ స్థానంలో జాకబ్ డఫీ ని తీసుకున్నారు. భారత జట్టులో మార్పులేమీ చెయ్యలేదు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్

[మార్చు]

భారత ఇన్నింగ్స్

[మార్చు]

మ్యాచ్ వివరాలు

[మార్చు]
2026 మార్చి 8 (2026-03-08)
19:00 UTC+5:30 (N)
Scorecard
భారతదేశం 
255/5 (20 ఓవర్లు)
v
 న్యూజిలాండ్
159 (19 ఓవర్లు)
భారత్ 96 పరుగులతో గెలిచింది[29][30]
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్‌ప్రీత్ బుమ్రా (భా)
  • న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • భారత్‌కు ఇది నాలుగవ టీ20 ప్రపంచ కప్ ఫైనల్; అన్ని దేశాల్లోకీ ఇది అత్యధికం.[31]
  • ఐసిసి నిర్వహించే పరిమిత ఓవర్ల టోర్నమెంట్ల ఫైనల్లో ఆడడం భారతదేశానికి ఇది 15 వ సారి; దేశాలన్నిటి లోకీ ఇది అత్యధికం.
  • ఈ మ్యాచ్‌లో భారత్ సాధించిన 255, టీ20 ప్రపంచ కప్ ఫైనళ్ళన్నిటి లోకీ అత్యధికం. 2024 లో తామే నెలకొల్పిన 176 పరుగుల రికార్డును ఛేదించింది.[32]
  • సంజు శాంసన్ (భా) టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోటీల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.[33]
  • టీ20 ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలిచిన తొలి దేశంగా భారతదేశం ఘనత సాధించింది. వరుసగా రెండుసార్లు కప్పు గెలిచిన దేశంగా, కప్ గెలిచిన తొలి ఆతిథ్య దేశంగా కూడా నిలిచింది.


ప్రసారం

[మార్చు]

ఫైనల్ మ్యాచ్‌ను భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్, ఫ్రీ-టు-ఎయిర్ బ్రాడ్‌కాస్టర్ DD స్పోర్ట్స్, OTT ప్లాట్‌ఫామ్ JioHotstar లో ఉచితంగా ప్రసారం చేస్తారు. న్యూజిలాండ్‌లో ఈ మ్యాచ్‌ను స్కై స్పోర్ట్, స్కై స్పోర్ట్ నౌలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.[35]

మూలాలు

[మార్చు]
  1. "T20 World Cup winners: India, West Indies and England tied on two titles each – full list of champions". Olympics.com. 29 June 2024. Archived from the original on 16 August 2024. Retrieved 29 November 2025.
  2. "USA to stage T20 World Cup: 2024–2031 ICC Men's tournament hosts confirmed". International Cricket Council. 16 November 2021. Archived from the original on 5 December 2021. Retrieved 20 February 2025.
  3. "ICC shortlists venues for 2026 T20 World Cup in India and Sri Lanka". ESPNcricinfo. 6 November 2025. Archived from the original on 6 November 2025. Retrieved 9 November 2025.
  4. "Fixtures, groups released for ICC Men's T20 World Cup 2026". International Cricket Council. 25 November 2025. Archived from the original on 13 December 2025. Retrieved 27 November 2025.
  5. "Narendra Modi Stadium to host T20 World Cup final, R Premadasa Stadium announced as alternative for Pakistan". ESPNcricinfo. 9 September 2025. Archived from the original on 10 September 2025. Retrieved 10 September 2025.
  6. "Record ton by Allen powers New Zealand to final". International Cricket Council. Retrieved 4 March 2026.
  7. "499 runs and 34 sixes later, India beat England to enter T20 World Cup final". The Times of India. Retrieved 5 March 2026.
  8. Beswick, Daniel. "Looking back: Previous India v New Zealand T20 World Cup matches". International Cricket Council. Retrieved 7 March 2026.
  9. "ICC Men's T20 World Cup 2026 - Cricket Schedule & Results". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 7 March 2026.
  10. "Seifert half-century helps NZ beat Afghanistan". BBC. Retrieved 8 February 2026.
  11. "Seifert, Allen fifties help New Zealand gallop to record-breaking win against UAE". ESPNCricinfo. Retrieved 10 February 2026.
  12. "South Africa ease to victory over New Zealand in Ahmedabad to close in on Super 8 spot". Sky Sports. Retrieved 14 February 2026.
  13. "Canadian, 19, makes historic century but NZ reach Super 8s". BBC. Retrieved 17 February 2026.
  14. "Incessant rain washes out opening Super Eight fixture between New Zealand and Pakistan". ESPNCricinfo. Retrieved 21 February 2026.
  15. "New Zealand's all-round brilliance knocks Sri Lanka out of T20WC". International Cricket Council. Retrieved 25 February 2026.
  16. "New Zealand await semi-final fate after England's thrilling win". International Cricket Council. Retrieved 27 February 2026.
  17. "New Zealand reach semis after Pakistan eliminated from T20 World Cup". Reuters. 28 February 2026. Retrieved 1 March 2026.
  18. "Allen's 33-ball century steamrollers South Africa - as it happened". BBC. Retrieved 4 March 2026.
  19. "Suryakumar's 84* helps India overcome USA scare". ESPNCricinfo. Retrieved 7 February 2026.
  20. "All-round India crush Namibia to register biggest win in T20 WCs". Cricbuzz. Retrieved 12 February 2026.
  21. "India beats Pakistan by 61 runs, enters super 8s". The Hindu. Retrieved 16 February 2026.
  22. "India beat Netherlands to complete perfect group stage as Shivam Dube shines with bat and ball". Sky Sports. Retrieved 19 February 2026.
  23. "India Outplayed By South Africa In Super Eight, Suffer Their Biggest Defeat In T20 World Cup". NDTV Sports. Retrieved 23 February 2026.[permanent dead link]
  24. "India beat Zimbabwe to keep title defence alive". BBC. Retrieved 26 February 2026.
  25. "Sanju Samson smashes unbeaten 97 as IND enter semifinal in style". Hindustan Times. Retrieved 1 March 2026.
  26. "India edge past England in high-scoring thriller to enter Final". International Cricket Council. Retrieved 5 March 2026.
  27. "Match Officials for Men's T20 World Cup 2026 Final announced". International Cricket Council. Retrieved 6 March 2026.
  28. 1 2 "Playing XI - IND vs NZ Final | ICC Men's T20 World Cup Squad". ESPNcricinfo. 8 March 2026. Retrieved 8 March 2026.
  29. "అభిమానకోటికి.. ఇంకోటి". Eenadu. 9 March 2026. Archived from the original on 9 March 2026. Retrieved 9 March 2026.
  30. "మరో ప్రపంచం.. మురిసె భారతం". Andhrajyothy. 9 March 2026. Archived from the original on 9 March 2026. Retrieved 9 March 2026.
  31. "India becomes first team to qualify for four men's T20 World Cup finals". Sportstar (in ఇంగ్లీష్). 2026-03-05. Retrieved 2026-03-06.
  32. "Record alert in final! India rewrite T20 World Cup history vs New Zealand". The Times of India. Retrieved 8 March 2026.
  33. "List of records broken as India smash 255 runs batting first in T20 World Cup final vs New Zealand". India Today (in ఇంగ్లీష్). 2026-03-08. Retrieved 2026-03-08.
  34. 1 2 3 4 5 "IND vs NZ Live score – ICC Men's T20 World Cup 2026 March 08, 2026 Final in Ahmedabad" (in ఇంగ్లీష్). ESPNcricinfo. 8 March 2026. Retrieved 8 March 2026.
  35. "All the Broadcast details for ICC Men's T20 World Cup 2026". International Cricket Council. 5 February 2026. Archived from the original on 6 February 2026. Retrieved 5 February 2026.