Jump to content

2028 వేసవి ఒలింపిక్ క్రీడలు

వికీపీడియా నుండి
Games of the XXXIV Olympiad
లోగో రూపాల్లో ఒకటి
Host cityలాస్ ఏంజెలిస్, అమెరికా
Events36 క్రీడల్లో 353
Opening2028 జూలై 14
Closing2028 జూలై 30
Stadium
  • లాస్ ఏంజెలిస్ మెమోరియల్ కొలీజియం
    (ప్రారంభ, ముగింపు వేడుకలు)
  • సోఫీ స్టేడియమ్[a]
    (simultaneous opening ceremony)[2]
Summer
Winter

2028 వేసవి ఒలింపిక్ క్రీడలు, 2028 జూలై 14 నుంచి 30 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జరగనున్న అంతర్జాతీయ బహుళ క్రీడల మహోత్సవం. అధికారికంగా వీటిని XXXIV ఒలింపియాడ్ క్రీడలు అని అంటారు. జనసామాన్యంలో వీటిని లాస్ ఏంజెలెస్ 2028 లేదా ఎల్‌ఏ28 (LA28) అని కూడా అంటారు. ఈ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న ప్రధాన నగరం లాస్ ఏంజెలెస్. అయితే గ్రేటర్ లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో ఉన్న ఇతర నగరాల్లోనూ పలు పోటీలు నిర్వహిస్తారు.[3] అదనంగా, ఓక్లహోమా నగరంలో రెండు ఉపవేదికలు కూడా ఉంటాయి.[4][5]

మొదట్లో లాస్ ఏంజెలెస్, 2024 వేసవి ఒలింపిక్ క్రీడల నిర్వహణ కోసం పోటీ పడింది. అనంతరం పలువురు అభ్యర్థి నగరాలు పోటీ నుంచి వైదొలగడంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ), మిగిలిన రెండు నగరాలైన లాస్ ఏంజెలెస్, పారిస్‌లకు 2024, 2028 ఒలింపిక్స్‌ను ఒకేసారి కేటాయించింది. 2024 క్రీడల ఆతిథ్యానికి పారిస్‌కు ప్రాధాన్యం ఇవ్వగా, లాస్ ఏంజెలెస్ 2028 క్రీడలను నిర్వహించడానికి అంగీకరించింది. 2017 సెప్టెంబరు 13న పెరూలోని లిమాలో జరిగిన ఐఓసీ 131వ సమావేశంలో లాస్ ఏంజెలెస్‌కు అధికారికంగా ఆతిథ్య హక్కులు లభించాయి.

ఈ క్రీడలతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొత్తం తొమ్మిదోసారి ఒలింపిక్ క్రీడలకు, ఐదోసారి వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తోంది. లాస్ ఏంజెలెస్ ఇంతకుముందు 1932, 1984 సంవత్సరాల్లో వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. దీంతో, 1908, 1948, 2012 సంవత్సరాల్లో లండన్, 1900, 1924, 2024 సంవత్సరాల్లో పారిస్ తర్వాత మూడుసార్లు వేసవి ఒలింపిక్స్ నిర్వహించిన ప్రపంచంలోని మూడో నగరంగా, అలాగే యూరప్ వెలుపల ఈ ఘనత సాధించిన తొలి నగరంగా నిలుస్తుంది. అలాగే, కిర్స్టీ కోవెంట్రీ ఐఓసీ అధ్యక్షురాలిగా ఉన్న కాలంలో జరిగే తొలి వేసవి ఒలింపిక్స్ కూడా ఇవే.

2020 ఒలింపిక్స్‌లో ఐచ్ఛిక క్రీడలుగా ప్రవేశించిన స్కేట్‌బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్‌లకు ఇప్పుడు వేసవి ఒలింపిక్స్ ప్రధాన క్రీడల జాబితాలో స్థానం కల్పించారు. 2028 క్రీడల్లో ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్ తొలిసారిగా ఐచ్ఛిక క్రీడలుగా ప్రవేశిస్తున్నాయి. వీటితో పాటు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ మళ్లీ ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోగా, క్రికెట్ 1900 తర్వాత తొలిసారిగా తిరిగి ప్రవేశిస్తోంది. అలాగే, లాక్రోస్‌ను 1908 తర్వాత మళ్లీ పతకాల క్రీడగా నిర్వహిస్తారు.

పోటీ ప్రతిపాదనలు

[మార్చు]

2015 సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) 2024 వేసవి ఒలింపిక్స్ ఆతిథ్య ఎంపిక ప్రక్రియను ప్రకటించింది. బుడాపెస్ట్, హాంబర్గ్, లాస్ ఏంజెలెస్, పారిస్, రోమ్ అనే ఐదు నగరాలను అభ్యర్థి నగరాలుగా ప్రకటించింది.[6] అనంతరం బుడాపెస్ట్, హాంబర్గ్, రోమ్ తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకోవడంతో పోటీలో లాస్ ఏంజెలెస్, పారిస్ మాత్రమే మిగిలాయి.[7] ఇలాంటి పరిస్థితే అంతకుముందు 2022 శీతాకాల ఒలింపిక్స్ ఎంపిక సమయంలోనూ ఏర్పడింది. అప్పట్లో క్రాకోవ్, ల్వివ్, ఓస్లో, స్టాక్‌హోమ్ పోటీ నుంచి వైదొలగడంతో, చైనాలోని బీజింగ్, కజకిస్థాన్‌లోని అల్మాటీల మధ్య మాత్రమే పోటీ జరిగింది. చివరికి బీజింగ్ ఆతిథ్య నగరంగా ఎంపికైంది. 2017 ఏప్రిల్ 3న డెన్మార్క్‌లో జరిగిన ఐఓసీ సమావేశంలో ఒలింపిక్ అధికారులు లాస్ ఏంజెలెస్, పారిస్ నగరాల ప్రతినిధులతో సమావేశమై, 2024 వేసవి ఒలింపిక్స్ ఆతిథ్యానికి ఒకే పోటీలో రెండు నగరాలను విజేతలుగా ప్రకటించే అవకాశంపై చర్చించారు.

అభ్యర్థి నగరాల ఉపసంహరణల అనంతరం, 2017 జూన్ 9న స్విట్జర్లాండ్‌లోని లాసాన్‌లో ఐఓసీ కార్యనిర్వాహక మండలి సమావేశమై 2024, 2028 ఒలింపిక్స్ ఆతిథ్య ఎంపిక ప్రక్రియలను సమీక్షించింది.[8] 2017లోనే 2024, 2028 ఒలింపిక్స్ ఆతిథ్య నగరాలను ఒకేసారి ఎన్నుకోవాలని ఐఓసీ అధికారికంగా ప్రతిపాదించింది. 2017 జూలై 11న లాసాన్‌లో జరిగిన ఐఓసీ ప్రత్యేక సమావేశం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. అనంతరం, 2017 జూలైలో లాస్ ఏంజెలెస్, పారిస్ నగరాల బిడ్ కమిటీలు, ఐఓసీతో సమావేశాలు నిర్వహించి, ఏ నగరం ఏ సంవత్సరానికి ఆతిథ్యం వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకునే ప్రక్రియను ఏర్పాటు చేసింది.[9]

2024, 2028 ఒలింపిక్స్‌ను ఒకేసారి కేటాయించాలని నిర్ణయించిన తర్వాత, 1924 పారిస్ వేసవి ఒలింపిక్స్‌కు వందేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2024 క్రీడలకు పారిస్‌కే ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం ఏర్పడింది.[10] 2017 జూలై 31న ఐఓసీ, 2028 ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెలెస్ ఒక్కటే అభ్యర్థి నగరమని ప్రకటించింది. అలాగే ఐఓసీ నుంచి అదనంగా 180 కోట్ల అమెరికన్ డాలర్ల నిధులు అందజేస్తున్నట్లు ప్రకటించింది.[11] దీంతో 2024 ఒలింపిక్స్ ఆతిథ్య నగరంగా పారిస్ ఎంపిక ఖరారైంది. 2017 ఆగస్టు 11న లాస్ ఏంజెలెస్ నగర మండలి ఏకగ్రీవంగా బిడ్‌కు ఆమోదం తెలిపింది.[12] సెప్టెంబరు 11న ఐఓసీ మూల్యాంకన సంఘం కూడా అధికారిక ఆమోదం ఇచ్చింది. అనంతరం 2017 సెప్టెంబరు 13న ఐఓసీ సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో లాస్ ఏంజెలెస్‌కు 2028 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు అధికారికంగా లభించాయి.[13] ఇప్పటికే ఉన్న శాశ్వత, తాత్కాలిక క్రీడా వేదికలను రికార్డు స్థాయిలో వినియోగించడమే కాకుండా, మొత్తం నిర్వహణను పూర్తిగా ప్రైవేటు నిధుల ద్వారానే చేపట్టాలన్న ప్రతిపాదనను ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ప్రశంసించాడు.[14][15]

2017 అక్టోబరు 16న కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఏ28 ప్రణాళికకు అధికారిక మద్దతు ప్రకటించింది.[16] 2018 ఆగస్టు 29న ఒలింపిక్ అధికారులు రెండు రోజుల పర్యటన కోసం లాస్ ఏంజెలెస్ చేరుకుని, స్థానిక నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు నగరంలోని కొత్త క్రీడా వేదికలను సందర్శించారు.[17] అదే సమయంలో నిర్వహించిన ఎల్‌ఎంయూ, లాస్ ఏంజెలెస్ టైమ్స్ సర్వేల ప్రకారం, లాస్ ఏంజెలెస్ ప్రజల్లో 88 శాతం మందికి పైగా 2028 ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలకు తమ నగరం ఆతిథ్యం ఇవ్వడాన్ని సమర్థించారు.[18] 2023 మార్చిలో సఫ్ఫోక్ విశ్వవిద్యాలయం, లాస్ ఏంజెలెస్ టైమ్స్ సంయుక్తంగా నిర్వహించిన మరో సర్వేలో 57 శాతం మంది ఈ క్రీడలు నగరానికి మేలు చేస్తాయని అభిప్రాయపడగా, 20 శాతం మంది మాత్రం ప్రతికూల ప్రభావం ఉంటుందని భావించారు.[19]

క్రీడలు

[మార్చు]

వేడుకలు

[మార్చు]

2028 జూలై 14న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. వీటికి లాస్ ఏంజెలెస్ మెమోరియల్ కొలిసియం, సోఫై స్టేడియం సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. కొలిసియంలో ముగింపు వేడుకలు కూడా నిర్వహిస్తారు.[20]

చలనచిత్ర నిర్మాత, మీడియా రంగ ప్రముఖుడు పీటర్ రైస్‌ను ఎల్‌ఏ28 సంస్థ వేడుకలు, సృజనాత్మక కార్యక్రమాల విభాగాధిపతిగా నియమించింది. ఒలింపిక్స్, పారాలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల రూపకల్పన, నిర్వహణ బాధ్యతలను అతను పర్యవేక్షిస్తాడు. ఈ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఎంత నిధులు కేటాయిస్తారనే విషయాన్ని ఎల్‌ఏ28 అధ్యక్షుడు కేసీ వాసర్‌మన్ వెల్లడించలేదు. అయితే, పీటర్ రైస్‌కు అవసరమైన అన్ని వనరులూ అందుబాటులో ఉంచుతామని చెప్పాడు. అమెరికా చలనచిత్ర, టెలివిజన్ రంగాల ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, "ప్రపంచం మన నుంచి ఎంతో గొప్పదాన్ని ఆశిస్తోంది. సృజనాత్మకతకు ప్రపంచ రాజధాని మనమే; అందులో హాలీవుడ్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అందరినీ ఆశ్చర్యపరిచే స్థాయిలో ఈ వేడుకలను నిర్వహించాలి" అని వాసర్‌మన్ వ్యాఖ్యానించాడు.[21]

బెన్ విన్‌స్టన్ కార్యనిర్వాహక నిర్మాత, సృజనాత్మక దర్శకుడిగా వ్యవహరిస్తాడు. ఆయనతో పాటు అనుభవజ్ఞుడైన వేడుకల నిర్మాత స్కాట్ గివెన్స్ కూడా ఈ బాధ్యతల్లో భాగస్వామి అవుతాడు. వీరి సంస్థలు ఫుల్‌వెల్ 73 , ఫైవ్‌కరెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫుల్‌ఫైవ్ సంయుక్త సంస్థ మొత్తం నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది.[22]

ప్రారంభోత్సవానికి రెండు స్టేడియాలను ఉపయోగించాలనే ఆలోచనను లాస్ ఏంజెలెస్ బిడ్ కమిటీ 2017 లోనే ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన ప్రకారం, ప్రారంభోత్సవానికి ముందుమాటగా కొలిసియంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, అక్కడి నుంచి ఒలింపిక్ జ్యోతి ర్యాలీ చివరి దశను ఇంగిల్‌వుడ్‌కు పంపాలని భావించారు. అనంతరం ప్రధాన కార్యక్రమాన్ని సోఫై స్టేడియంలో నిర్వహిస్తూ, దానిని కొలిసియంలోని భారీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రణాళిక రూపొందించారు. అలాగే ముగింపు వేడుకలను సోఫై స్టేడియంలో ప్రారంభించి, కొలిసియంలో ముగించేలా కూడా ప్రతిపాదించారు.[2]

ఆటలు

[మార్చు]

క్యాలెండరు

[మార్చు]

2025 జూలై 13 న నిర్వాహక సంఘం, పోటీల షెడ్యూలు తొలి కూర్పును ప్రకటించింది.[23][24][25][26] 2025 నవంబరు 12 న తాజాకరించిన పోటీ షెడ్యూలును ప్రకటించారు.[27][28]

సోఫీ స్టేడియాన్ని ప్రారంభోత్సవం, ఈత పోటీలు రెంటికీ వాడుకునేలాగా ఈత, అథ్లెటిక్స్‌ల షెడ్యూలును పరస్పరం మార్చారు. అథ్లెటిక్స్ పోటీలు తొలి వారంలో జరుగుతాయి. ఈ సమయంలో స్విమ్మింగ్ పూల్‌పై కవర్లను తీసేసి రెండో వారంలో జరిగే ఈత పోటీలకు దాన్ని సిద్ధం చేస్తారు. మెక్సికో నగరంలో జరిగిన 1968 ఒలింపిక్‌ల తరువాత, అథ్లెటిక్స్ పోటీలు మొదటి వారంలో జరగడం ఇదే తొలిసారి.[4][5]

తేదీలు, సమయాలు అన్నీ పసిఫిక్ డేలైట్ టైముకు (UTC-7) చెందినవి.
ప్రాప్రారంభ వేడుక పోటీలు 1స్వర్ణ పతక పోటీలు ముముగింపు వేడుక
2028 జూలై 10
సోమ
11
మంగళ
12
బుధ
13
గురు
14
శుక్ర
15
శని
16
ఆది
17
సోమ
18
మంగళ
19
బుధ
20
గురు
21
శుక్ర
22
శని
23
ఆది
24
సోమ
25
మంగళ
26
బుధ
27
గురు
28
శుక్ర
29
శని
30
ఆది
పోటీలు
వేడుకలుప్రాముN/a
జల క్రీడలు Artistic swimming 1 1 2
డైవింగ్ 1 1 1 1 1 1 1 1 8
Marathon swimming 1 1 2
ఈత 4 5 4 5 4 5 4 5 5 41
వాటర్ పోలో 1 1 2
విలువిద్య 1 1 1 1 1 1 6
అథ్లెటిక్స్ 3 4 4 4 5 4 4 5 5 6 2 1 1 48
బాడ్మింటన్ 1 1 1 2 5
Baseball/Softball బేస్‌బాల్ 1 1
సాఫ్ట్‌బాల్ 1 1
బాస్కెట్‌బాల్ బాస్కెట్‌బాల్ 1 1 2
3×3 బాస్కెట్‌బాల్ 2 2
బాక్సింగ్ 2 2 6 4 14
కానోయింగ్ Slalom 1 1 1 1 2 6
స్ప్రింట్ 3 3 4 10
క్రికెట్ 1 1 2
సైక్లింగ్ Road cycling 2 1 1 4
Track cycling 2 1 3 2 1 3 12
BMX 2 2 4
Mountain biking 1 1 2
గుర్రపు స్వారీ Dressage 1 1 2
Eventing 2 2
Jumping 1 1 2
ఫెన్సింగ్ 2 2 2 1 1 1 1 1 1 12
ఫీల్డ్ హాకీ 1 1 2
Flag football 1 1 2
ఫుట్‌బాల్ 1 1 2
గోల్ఫ్ 1 1 1 3
Gymnastics Artistic 1 1 1 1 3 3 4 1 15
Rhythmic 1 1 2
Trampoline 2 2
హ్యాండ్‌బాల్ 1 1 2
జూడో 2 2 2 2 2 2 2 1 15
లాక్రోస్ 2 2
Modern pentathlon 1 1 2
Rowing రోయింగ్ 2 2 2 2 2 2 12
Coastal rowing 2 1 3
Rugby sevens 1 1 2
సెయిలింగ్ 2 2 2 2 2 10
షూటింగ్ 2 2 2 2 1 1 2 1 1 1 15
Skateboarding 1 1 1 1 4
Sport climbing 2 1 2 1 6
స్క్వాష్ 1 1 2
సర్ఫింగ్ 2 2
టేబుల్ టెన్నిస్ 1 1 1 1 1 1 6
టేక్వోండో 2 2 2 2 8
టెన్నిస్ 1 2 2 5
ట్రయాథ్‌లాన్ 1 1 1 3
వాలీబాల్ బీచ్ వాలీబాల్ 1 1 2
వాలీబాల్ 1 1 2
[[2028 వేసవి ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్|వెయిట్ లిఫ్టింగ్] 2 3 3 2 2 12
రెజిలింగ్ 3 3 3 3 3 3 18
రోజువారీ పతక పోటీలు0000012141822211715302023172529314118353
మొత్తం000001226446687104119149169192209234263294335353

మూలాలు

[మార్చు]
  1. "2028 Stadium". la28.org. Los Angeles Organizing Committee for the 2028 Olympic and Paralympic Games. Archived from the original on July 25, 2025. Retrieved July 23, 2025.
  2. 1 2
  3. Tapp, Tom (July 18, 2022). "2028 L.A. Olympics: Dates Announced For Los Angeles-Hosted Games". Deadline Hollywood. Archived from the original on July 18, 2022. Retrieved July 19, 2022.
  4. 1 2 Merola, Lauren; Cooper, Mark. "LA28 unveils venue plan: Swimming in SoFi, softball in Oklahoma City". The Athletic (in అమెరికన్ ఇంగ్లీష్). లాస్ ఏంజలెస్: The New York Times. ISSN 0362-4331. Archived from the original on June 21, 2024. Retrieved June 21, 2024.
  5. 1 2 Carpenter, Les. "Why Part of the 2028 Los Angeles Olympics will be held in... Oklahoma". The Washington Post (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on June 21, 2024. Retrieved June 21, 2024.
  6. "Candidature Process Olympic Games 2024" (PDF). Archived (PDF) from the original on December 22, 2015. Retrieved March 1, 2017.
  7. Butler, Nick (February 24, 2017). "Exclusive: IOC vow to "further adjust" candidature process after Budapest 2024 withdrawal". Inside the Games. Archived from the original on August 1, 2017. Retrieved August 1, 2017.
  8. "Meeting of the IOC Executive Board in Lausanne – Information for the media". Olympic.org. May 19, 2017. Archived from the original on June 22, 2017.
  9. "Bach Says Paris and LA Mayors Are 'Optimistic' About Agreement After Initial Discussions - GamesBids.com". gamesbids.com. July 12, 2017. Archived from the original on August 1, 2017. Retrieved August 1, 2017.
  10. Wharton, David (July 31, 2017). "Details emerge in deal to bring 2028 Summer Olympics to Los Angeles". Los Angeles Times. Archived from the original on September 22, 2017. Retrieved July 31, 2017.
  11. "Los Angeles Declares Candidature for Olympic Games 2028- IOC to Contribute USD 1.8Billion to the Local Organizing Committee". IOC. Archived from the original on August 1, 2017. Retrieved August 1, 2017.
  12. "L.A. City Council endorses 2028 Olympics bid, accepting responsibility for any cost overruns". Los Angeles Times. August 2017. Archived from the original on February 28, 2020. Retrieved August 11, 2017.
  13. "Los Angeles gets official go-ahead to host 2028 Olympics". Chicago Tribune. September 2017. Archived from the original on July 15, 2018. Retrieved September 11, 2017.
  14. "IOC makes historic decision by simultaneously awarding Olympic Games 2024 to Paris and 2028 to Los Angeles". అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం. September 13, 2017. Archived from the original on July 17, 2019. Retrieved October 4, 2019.
  15. "Los Angeles 2028 releases "privately funded, balanced budget" for Olympic and Paralympic Games". www.insidethegames.biz. April 30, 2019. Archived from the original on October 15, 2021. Retrieved January 5, 2021.
  16. "State taxpayers will back LA Olympics bid if it goes over budget". Los Angeles Times. October 2017. Archived from the original on October 18, 2017. Retrieved October 17, 2017.
  17. "Olympic officials visit L.A. for the first time since awarding the bid and are impressed so far with what's to come". Los Angeles Times. August 2018. Archived from the original on August 29, 2018. Retrieved August 29, 2018.
  18. "LA 2024 Olympic bid receives wide public support in new poll". Los Angeles Times (in అమెరికన్ ఇంగ్లీష్). February 23, 2016. Archived from the original on November 17, 2021. Retrieved February 23, 2016.
  19. Wharton, David (March 21, 2023). "Poll: Is L.A. ready for the 2028 Olympics? Some residents express concern". Los Angeles Times (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on August 19, 2023. Retrieved May 2, 2023.
  20. "LA28: Los Angeles to host 2028 Olympic Games opening ceremony in two stadiums". BBC Sport. May 8, 2025. Archived from the original on May 13, 2025. Retrieved May 22, 2025.
  21. "LA28 OLYMPIC GAMES Daily Competition Schedule" (PDF). la28.org. Los Angeles Organizing Committee for the 2028 Olympic and Paralympic Games. July 13, 2025. Archived (PDF) from the original on July 16, 2025. Retrieved July 14, 2025.
  22. "Olympic Competition Schedule by Session Version 3" (PDF). la28.org. Los Angeles Organizing Committee for the 2028 Olympic and Paralympic Games. Retrieved March 16, 2026.
  23. "LA28: Full competition plan revealed". Inside the Games. July 15, 2025. Archived from the original on July 16, 2025. Retrieved July 16, 2025.
  24. "LA28 releases first look at competition schedule in celebration of marking three years out from the 2028 Olympic Games". లాస్ ఏంజలెస్: Los Angeles Organizing Committee for the 2028 Olympic Games. Archived from the original on July 16, 2025. Retrieved July 16, 2025.
  25. "LA28 reveals comprehensive Olympic Competition Schedule". la28.org. Los Angeles Organizing Committee for the 2028 Olympic and Paralympic Games. November 12, 2025. Archived from the original on November 21, 2025. Retrieved November 21, 2025.
  26. "LA28 reveals startling Olympic timeline". Inside the Games. November 13, 2025. Retrieved November 21, 2025.
  1. క్రీడల సమయంలో దీనికి "2028 స్టేడియం" అని పేరుపెట్టారు.[1]
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు