28 డిగ్రీల సెల్సియస్
| 28 డిగ్రీల సెల్సియస్ | |
|---|---|
| దర్శకత్వం | డా.అనిల్ విశ్వనాథ్ |
| రచన | డా.అనిల్ విశ్వనాథ్ |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | వంశీ పచ్చిపులుసు |
| కూర్పు | గ్యార్రీ బి.హెచ్ |
| సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 2025 ఏప్రిల్ 4 (థియేటర్) |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
28 డిగ్రీల సెల్సియస్ 2025లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్‌సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించిన ఈ సినిమాకు డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు.[1] నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి, ప్రియదర్శి, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2019 ఏప్రిల్ 27న,[2] ట్రైలర్‌ను మార్చి 24న విడుదల చేసి,[3] సినిమాను ఏప్రిల్ 04న విడుదల చేశారు.[4]
28 డిగ్రీస్ సెల్సియస్ 2025 ఏప్రిల్ 29న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]
కథ
[మార్చు]వైజాగ్ లో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న కార్తీక్ (నవీన్ చంద్ర) , అంజలి (షాలినీ వడ్నికట్టి) ని ప్రేమిస్తాడు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ వివాహం చేసుకొని వారు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకునే సమయంలో అంజలి అనారోగ్యం పాలవుతుంది. ఆమె 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకోగలదని వైద్యులు చెబుతారు. కార్తీక్ ఆమెను కాపాడుకోవడానికి జార్జియా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తరువాత కార్తీక్, అంజలి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[6]
నటీనటులు
[మార్చు]- నవీన్ చంద్ర
- షాలిని వడ్నికట్టి
- ప్రియదర్శి
- వైవా హర్ష
- జయప్రకాశ్
- రాజా రవీంద్ర
- అజయ్ కతుర్వార్
- నవీన్ బేతిగంటి
- దేవియాని శర్మ
- సంతోషి శర్మ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- కో ప్రొడ్యూసర్స్: విక్రమ్ జూపూడి, సంజయ్ జూపూడి
- అసోసియేట్ ప్రొడ్యూసర్: జుంగా పృథ్వి, తేజ వర్మ
- డిఐ: లైట్‌లైన్ స్టూడియోస్
- కాస్ట్యూమ్స్ : అనూష ఇరగవరపు, అభినయ చౌదరి, రేఖ బొగ్గారపు
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "చెలియా చెలియా[7][8]" | కిట్టు విస్సాప్రగడ | రేవంత్ | 4:28 |
| 2. | "తీరు మారుతోందే" | కిట్టు విస్సాప్రగడ | అనురాగ్ కులకర్ణి | 4:09 |
| 3. | "జ్ఞాపకమే" | కిట్టు విస్సాప్రగడ | కాల భైరవ | 4:03 |
మూలాలు
[మార్చు]- ↑ "థ్రిల్లింగ్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో 28 డిగ్రీ సెల్సియస్: అనిల్ విశ్వనాథ్". V6 Velugu. 30 March 2025. Archived from the original on 30 April 2025. Retrieved 30 April 2025.
- ↑ "'చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా?'.. ఆసక్తిగా 28 డిగ్రీల సెల్సియస్ ట్రైలర్". Sakshi. 24 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "థ్రిల్లింగ్ అంశాలతో..." Chitrajyothy. 25 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "ఓటీటీలోకి కొత్త చిత్రం.. నెలలోపే స్ట్రీమింగ్". Eenadu. 29 April 2025. Archived from the original on 30 April 2025. Retrieved 30 April 2025.
- ↑ "'28 డిగ్రీస్ సెల్సియస్' మూవీ రివ్యూ | 28 Degree Celsius Movie Review And Rating In Telugu | Sakshi". Sakshi. 30 April 2025. Archived from the original on 30 April 2025. Retrieved 30 April 2025.
- ↑ "నిన్ను చూడంగ.. కనులు చాలవుగా." NT News. 22 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "విడుదలైన 'చెలియా చెలియా' సాంగ్". Chitrajyothy. 21 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.