36వ విజయవాడ పుస్తక మహోత్సవం

36వ విజయవాడ పుస్తక మహోత్సవం విజయవాడలో 2026 జనవరి 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగుతున్నది. ఇది విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆద్వర్యంలో నిర్వహించబడుతుంది.[1][2] ప్రాంగణాన్ని వడ్లమూడి విమలా దేవి పేరుతో ఇందిరా గాంధీ స్టేడియంలో ఎర్పాటు చేసారు. ప్రధాన వేదికకు బి.వి. పట్టాభిరామ్ పేరును, పిల్లల కార్యక్రమాల వేదికకు శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్ పేరు పెట్టారు.[3][4][5][6]
వివరాలు
[మార్చు]దేశంలోని సుమారు 250 ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. తెలుగు, ఆగ్లం, హిందీ, సంస్కృత భాషలోని పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్, తెలుగు అకాడమీ, పబ్లికేషన్ డివిజన్, విశాలాంధ్ర, ప్రజాశక్తి, తెలంగాణ పబ్లికేషన్స్ లాంటి ప్రచురణ సంస్థలతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలుగు వికీపీడియా స్టాల్ సందర్శకులను ఆకర్షిస్తుంది.[7]
ప్రాంగణంలో ఉన్న వేదికలపై ప్రతీ రోజు పలు పుస్తక ఆవిష్కరణలు, ప్రతిభ వేదికపై బాలలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో టెలీస్కోప్, సైన్స్ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.[8][9]
తెలుగు వికీపీడియా స్టాల్
[మార్చు]ఈ పుస్తక మహోత్సవంలో తెలుగు వికీపీడియా స్టాల్ను ఏర్పాటుచేసారు. ఇక్కడ తెలుగు వికీపీడియా లో స్వచ్ఛందంగా రాసే ఆసక్తి కలిగిన కవులకు, రచయితలకు, విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు. తెలుగు వికీపీడియాలో వ్యాసాలను సంఖ్యను, నాణ్యతను మెరుగు పరచడానికి పుస్తక మహోత్సవ వేదికను వినియోగించుకొని నెటిజన్లకు అవగాహన కల్పిస్తున్నారు.
పాల్గొన్న ప్రముఖులు
[మార్చు]ఈ పుస్తక మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖులలో ఏ.పి. శాసన సభ ఉప సభాపతి రఘురామ కృష్ణ రాజు, మాజీ ఉప రాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు, ఉండవల్లి అరుణ్ కుమార్, మండలి బుద్ధ ప్రసాద్, తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్, ప్రముఖ రచయితలు యండమూరి వీరేంద్ర నాథ్, కొప్పర్తి రాంబాబు, మోదుగుల రవికృష్ణ, గుమ్మా సాంబశివరావు, పాపినేని శివశంకర్, వెన్నా వల్లభరావు, రావెళ్ల శ్రీనివాసరావు, చలపాక ప్రకాష్, పెద్ది సాంబశివరావు, పారా అశోక్, రెంటాల జయదేవ్, కిరణ్ ప్రభ, మందరపు హైమవతి, కడలి సత్యనారాయణ, బండ్ల మాధవరావు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బి.వి.రాఘవులు, తెలకపల్లి రవి, పెనుగొండ లక్ష్మీనారాయణఎం.వి.ఎస్.శర్మ, అనిల్ డ్యానీ, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, బొమ్మన్ కార్టూనిస్ట్, కార్టూనిస్ట్ నాగిశెట్టి, చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్, సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తదితరులున్నారు.[10]
మూలాలు
[మార్చు]- ↑ ABN (2026-01-03). "Book Festival: పుస్తక పండగ ఆరంభం". Andhrajyothy Telugu News. Retrieved 2026-01-11.
- ↑ "ఉత్సహంగా విజయవాడ పుస్తక మహోత్సవం". ప్రజాశక్తి. 2026-01-08.[permanent dead link]
- ↑ Service, Express News (2025-12-14). "Vijayawada Book festival from January 2". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2026-01-11.
- ↑ Bureau, The Hindu (2025-12-13). "Vijayawada book festival from January 2 to 12". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2026-01-11.
{{cite news}}:|last=has generic name (help) - ↑ Service, Express News (2026-01-02). "36th Vijayawada Book Festival set for inauguration". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2026-01-11.
- ↑ India, The Hans (2026-01-02). "Vijayawada Book Festival begins today". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2026-01-11.
- ↑ "అడుగులన్నీ... అక్షరం వైపే". EENADU. Retrieved 2026-01-11.
- ↑ Bharat, E. T. V. (2026-01-06). "పాఠకులను ఆకట్టుకుంటున్న 36వ పుస్తక మహోత్సవం - 240కి పైగా స్టాళ్లలో లక్షలాది పుస్తకాలు". ETV Bharat News. Retrieved 2026-01-11.
- ↑ "నేటి నుంచి విజయవాడ 36వ పుస్తక మహోత్సవం". ప్రజాశక్తి. 2026-01-02.[permanent dead link]
- ↑ "నేటి నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం". EENADU. Retrieved 2026-01-11.