404 దోషం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

404 లేదా నాట్ ఫౌండ్ (గుర్తించబడలేదు) దోష సందేశం (404 Error) అనేది ఒక HTTP ప్రామాణిక స్పందన సంకేతం. సర్వర్‌తో ఉపయోక్త (క్లయింట్) యొక్క అనుసంధాన సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. అయితే అవసరమైన దానిని సర్వర్ మాత్రం గుర్తంచలేదు. 404 దోషంపై "సర్వర్ నాట్ ఫౌండ్" లేదా గమ్య సర్వర్‌తో ఒక కనెక్షన్ అనేది ఎప్పటికీ సాధ్యపడని అదే విధమైన ఇతర దోషాల పరంగా అయోమయం చెందకూడదు. 404 దోషం అభ్యర్థించిన వనరు (సమాచారం) భవిష్యత్తులో లభించవచ్చనే విషయాన్ని సూచిస్తుంది.

పర్యావలోకనం[మార్చు]

HTTP ద్వారా సమాచార ప్రసారానికి ఉపక్రమించినప్పుడు, సర్వర్ వెబ్ బ్రౌజర్‌ల యొక్క HTML డాక్యుమెంట్ (వెబ్ పేజీ) వంటి ఒక విజ్ఞప్తికి సంఖ్యాపరమైన స్పందన సంకేతం మరియు ఐచ్ఛిక, తప్పనిసరి లేదా తిరస్కృత (స్థితి సంకేతంపై ఆధారపడి) సందేశం ద్వారా స్పందించాల్సి ఉంటుంది. 404 సంకేతంలో మొదటి "4" తప్పుగా టైపు చేసిన URL వంటి ఒక ఉపయోక్త దోషాన్ని సూచిస్తుంది. మిగిలిన రెండు అంకెలు తలెత్తిన ప్రత్యేక దోషాన్ని తెలుపుతాయి. HTTP యొక్క మూడంకెల సంకేతాల వినియోగం అనేది FTP మరియు NNTP వంటి అంతకుముందు ప్రొటోకాల్స్‌లోని అలాంటి సంకేతాల వినియోగాన్ని సూచిస్తాయి.

HTTP స్థాయి వద్ద ఒక 404 స్పందన సంకేతం తదనంతరం ఒక మానవ-పఠన "కారణ వాక్యం" ఉంటుంది. HTTP వివరణ "నాట్ ఫౌండ్"[1] అనే వాక్యాన్ని సూచిస్తుంది. అలాగే పలు వెబ్ సర్వర్లు యధాపూర్వస్థితిగా ఒక HTML పేజీని అందిస్తాయి. అందులో 404 సంకేతం మరియు "నాట్ ఫౌండ్" వాక్యం రెండూ ఉంటాయి.

పేజీల బదిలీ లేదా తొలగింపు జరిగినప్పుడు ఒక 404 దోషం తరచూ తిరిగి సంభవిస్తుంటుంది. మొదటి సందర్భంలో, ఒక ఉత్తమ స్పందనగా 301 మూవ్డ్ పర్మినెంట్‌లీ స్పందనకు తిరిగి వెళ్లడం. ఇది అత్యధిక సర్వర్ సంస్థితి దస్త్రాల్లో లేదా ఒక URL పునఃరచన ద్వారా ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇక రెండో సందర్భం విషయానికొస్తే, ఒక 410 గాన్ అనేది తప్పక తిరిగి పొందబడాలి. ఎందుకంటే ఈ రెండు ఐచ్ఛికాలకు (ప్రత్యామ్నాయాలు) ప్రత్యేక సర్వర్ సంస్థితి (విన్యాసం) అవసరమవుతుంది. అనేక వెబ్‌సైటులు వాటిని వినియోగించుకోవు.

404 దోషాలు DNS దోషాల చేత అయోమయానికి గురికాకూడదు. ఇలాంటి దోషం ఇవ్వబడిన URL ఉనికిలో లేని ఒక సర్వర్ పేరును సూచించినప్పుడు కన్పిస్తుంది. ఒక 404 దోషం అనేది సర్వర్ గుర్తించబడినట్లు సూచిస్తుంది. అయితే ఆ సర్వర్ మాత్రం అభ్యర్థించిన పేజీని తిరిగి పొందలేదు.

సాధారణ దోష పేజీలు[మార్చు]

క్యామినో బ్రౌజర్‌లోని వికీపీడియాపై తీసిన ఒక 404 దోష పేజీ యొక్క స్క్రీన్‌షాట్

అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఒక దోష పేజీని ప్రదర్శించే విధంగా వెబ్‌సర్వర్లు సాధారణంగా తయారు చేయబడి ఉంటాయి. వాటిలో ఒక అత్యంత సహజమైన వివరణ, మాతృక సైటు బ్రాండింగ్ లేదా కొన్నిసార్లు ఒక శోధన రూపం ఉంటాయి. యూజర్‌కు కన్పించని ప్రొటోకాల్ స్థాయి వాక్యం అనేది అరుదుగా అభిరుచులుగా తగ్గట్టుగా రూపొందించబడుతుంది.

ఏదేమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 7 ముందు) కస్టమ్ పేజీలు 512 బైట్ల కంటే పెద్దవిగా ఉంటే తప్ప వాటిని ప్రదర్శించదు. అందుకు బదులుగా ఒక "స్నేహపూరిత" దోష పేజీని ప్రదర్శిస్తుంది. గూగుల్ క్రోమ్ అదే విధమైన ప్రయోజకత్వాన్ని కలిగి ఉంది. అంటే ఒక పేజీ యొక్క పరిమాణం 512 బైట్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు గూగుల్ యాంత్రిక పద్ధతులు (ఆల్గోరిథమ్స్) విడుదల చేసే ప్రత్యామ్నాయ సూచనల ద్వారా 404 అనేది తొలగించబడుతుంది.

తప్పుడు 404 దోషాలు[మార్చు]

కొన్ని వెబ్‌సైట్‌లు సాఫ్ట్ 404 గా తెలిసిన ఒక "200 OK" స్పందన సంకేతంతో ఒక ప్రామాణిక వెబ్‌పేజీని ప్రదర్శించడం ద్వారా "నాట్ ఫౌండ్" దోషాన్ని నివేదిస్తున్నాయి. సాఫ్ట్ 404లు అనేవి ఏదైనా ఒక లింకు దెబ్బతిన్నదా అనే విషయాన్ని గుర్తించే స్వచలిత పద్ధతులకు సమస్యాత్మకంగా ఉంటాయి. యాహూ వంటి కొన్ని సెర్చ్ ఇంజిన్‌లు సాఫ్ట్ 404లను గుర్తించడానికి స్వచలిత ప్రక్రియలను ఉపయోగిస్తాయి.[2] ఏదైనా HTTP సర్వర్ సాఫ్ట్‌వేర్‌ను, ఉదాహరణకు అపాచీ సాఫ్ట్‌వేర్‌ను ఒక ఎర్రర్ డాక్యుమెంట్ (దోష పత్రం) 404 (.htaccess దస్త్రంలో గుర్తించినట్లుగా) అనేది ఒక సాపేక్ష మార్గం (/error.html) కంటే ఒక కచ్చితమైన మార్గం (ఉదాహరణ, http://example.com/error.html)గా గుర్తించబడినప్పుడు సంస్థితి దోషాల ఫలితంగా సాఫ్ట్ 404లు సంభవిస్తుంటాయి.[3]

కొన్ని ప్రాక్సీ సర్వర్లు (ప్రతినిధి సర్వర్లు) పరోక్ష అతిథేయి లేనప్పుడు అతిథేయి నామ పరిష్కార వైఫల్యాలు లేదా తిరస్కృత TCP కనెక్షన్లు ప్రతినిధి సర్వర్‌ను అభ్యర్థనను నెరవేర్చకుండా అడ్డుకోవడం వంటి దోషాలు తలెత్తినప్పుడు సరైన 500-శ్రేణి సంకేతంను ప్రదర్శించడం కంటే 404 దోషాన్ని ప్రదర్శిస్తాయి. ఇది ప్రత్యేక స్పందనలను ఆశించడం మరియు వాటిపై పనిచేసే ప్రోగ్రామ్‌లను అయోమయానికి గురిచేగలదు. అందువల్ల అవి గైర్హాజరు వెబ్ సర్వర్ మరియు ఉనికిలో ఉన్న ఒక వెబ్ సర్వర్‌పై కనిపించని ఒక వెబ్ పేజీ మధ్య తేడాను ఎంతమాత్రమూ గుర్తించలేవు.

జులై, 2004లో UK టెలికాం ప్రొవైడర్ BT గ్రూప్ క్లీన్‌ఫీడ్ సమాచార నిషిద్ధ వ్యవస్థను అమలు చేసింది. ఇది ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ సంభవనీయంగా చట్టవిరుద్ధమైనదిగా గుర్తించిన ఏదేని సమాచారానికి చేసే ఏదేని అభ్యర్థనకు ఒక 404 దోషాన్ని ప్రదర్శిస్తుంది.[4] ఇతర ISPలు అదే విధమైన పరిస్థితుల్లో HTTP 403 "నిషిద్ధ" దోషాన్ని ప్రదర్శిస్తాయి.[5] భద్రతా సమీక్ష (సెన్సార్‌షిప్)ను రహస్యంగా ఉంచే దిశగా నకిలీ 404 దోషాల అమలు విధానం కూడా థాయ్‌లాండ్[6] మరియు ట్యునీషియాలలో గుర్తించబడింది.[7] భద్రతా సమీక్ష అనేది తీవ్రమైన ట్యునీషియాలో ప్రజలకు నకిలీ 404 దోషాల స్వభావంపై అవగాహన ఉంది. తద్వారా వారు "అగోచర నిషేధం"ను తెలిపే "అమ్మార్ 404" పేరు గల ఒక వ్యూహాత్మక పాత్రను సృష్టించారు.[8]

యాస వాడకం[మార్చు]

2008లో తపాలా కార్యాలయం[9] యొక్క టెలీకమ్యూనికేషన్స్ విభాగం చేపట్టిన ఒక అధ్యయనం 404 అనేది UK/ఐర్లాండ్ ప్రాంతాల్లో "ఆధారరహితం"కు ఒక యాస పర్యాయపదంగా మారిందని గుర్తించింది. యాస నిఘంటుకారుడు జొనాథన్ గ్రీన్ ఈ విధంగా అన్నారు, "404" ఒక యాస పదంగా "సాంకేతిక పరిజ్ఞాన ఆధిపత్యం" మరియు యువకుల చేత ఏలబడుతోంది. అయితే అలాంటి వాడకం ప్రస్తుత పరిస్థితుల్లో లండన్ మరియు ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయింది.[9]

404 పేజీ పరికరాలు[మార్చు]

పలు వెబ్‌సైటులు ఒక వెబ్‌సైటు లేదా ఒక శోధన పెట్టె యొక్క ప్రధాన పేజీ (హోమ్‌పేజీ)కి ఒక లింకు వంటి 404 దోష సందేశంలో అదనపు సమాచారం పంపిస్తుండటంతో పరికరాల మాదిరిగా అత్యంత పురోగామి విస్తృతులు కూడా ఉన్నాయి. అవి యూజర్ కోరిన కచ్చితమైన వెబ్ పేజీని గుర్తించడానికి సాయపడుతాయి.[10]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • లింక్ రాట్

సూచనలు[మార్చు]

 1. "6.1.1 Status Code and Reason Phrase". Retrieved 22 June 2008. 
 2. "Why is your crawler asking for strange URLs that have never existed on my site?". Yahoo Web Crawler Help page. Retrieved 4 October 2009. 
 3. "Farewell to soft 404s,". Google Official Blog. Retrieved 20 September 2008. 
 4. LINX పబ్లిక్ ఎఫైర్స్ » క్లీన్‌ఫీడ్: ది ఫ్యాక్ట్స్
 5. "DEMON - ఎర్రర్ 403"
 6. "The old fake '404 Not Found' routine". Bangkok Post. 2009-02-18. Retrieved 2010-09-12. 
 7. Noman, Helmi (12 September 2008). "Tunisian journalist sues government agency for blocking Facebook, claims damage for the use of 404 error message instead of 403". opennet.net. Retrieved 21 November 2010. 
 8. "Anti-censorship movement in Tunisia: creativity, courage and hope!". Advox.globalvoices.org. 2010-05-27. Retrieved 2010-08-28. 
 9. 9.0 9.1 "Don't be 404, know the tech slang". BBC News. 2008-12-10. Retrieved 2008-12-13. 
 10. Swenson, Sahala (August 19, 2008). "Make your 404 pages more useful". Official Google Webmaster Central Blog. Google, Inc. Retrieved August 28, 2009. 

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=404_దోషం&oldid=1742518" నుండి వెలికితీశారు