420 (సినిమా)
'420' (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఈ.వి.వి.సత్యనారాయణ |
---|---|
నిర్మాణం | ఎం.సత్యకుమార్ |
చిత్రానువాదం | ఈ.వి.వి.సత్యనారాయణ |
తారాగణం | నాగేంద్రబాబు |
సంగీతం | విద్యాసాగర్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం , మనో , ఎల్.ఆర్. ఈశ్వరి |
గీతరచన | వేటూరి |
సంభాషణలు | సత్యానంద్ |
ఛాయాగ్రహణం | శ్రీనివాస రెడ్డి |
కూర్పు | సుబ్బారావు , కే.రాము |
నిర్మాణ సంస్థ | పద్మసత్య మూవీస్ |
నిడివి | 2 గంటల 18 నిముషాలు |
భాష | తెలుగు |
420 (ఫోర్ ట్వంటీ), 1992 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకుడు.[1] 1992 లో ఆ ఒక్కటి అడక్కు లాంటి సంచలన విజయం నమోదు చేసిన ఈ.వీ.వీ అదే ఏడాదిలో ఈ చిత్రాన్ని విడుదల చేశాడు. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో లాగే ఈ సినిమా టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి,
సంగీత దర్శకుడు - మోతగాడు
ఛాయాగ్రహణం - తీతగాడు
రచయిత - రాతగాడు
లాంటిది.
ఈ చిత్ర షూటింగ్ కి నందమూరి బాలకృష్ణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిరంజీవి గారు ముహూర్తం సీన్ కు క్లాప్ కొట్టారు.
ఈ చిత్రాన్ని చాలా వరకు విశాఖపట్నంలో చిత్రీకరించారు.
కథ
[మార్చు]ఈ చిత్ర కథ ఒక దొంగ (నాగేంద్ర బాబు) గురించి. ఇతడు విలువైన చారిత్రక వస్తువులు దొంగిలిస్తూ ఉంటాడు. అలా ఒక రోజు ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఇతడి చరిత్ర తెలుసుకున్న అమ్మాయి దొంగతనం మానుకోమని చెప్తుంది. కానీ హీరో చివరి దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోతానని చెప్తాడు.
నటులు
[మార్చు]- నాగేంద్ర బాబు
- బ్రహ్మానందం
- కోట శ్రీనివాసరావు
- మల్లిఖార్జున రావు
- శుభలేఖ సుధాకర్
- చంద్రమోహన్
- జయలలిత
- రామిరెడ్డి
- గిరిబాబు
- మధురిమ
- సుధాకర్
- ప్రసాద్ బాబు
- చంద్రమోహన్
- రాళ్ళపల్లి
- జయప్రకాశ్ రెడ్డి
- చిడతల అప్పారావు
- ఆలీ
- జయలలిత
- డిస్కో శాంతి
- రాజు (ఫైట్ మాస్టర్)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం - ఈ.వి.వి.సత్యనారాయణ
- నిర్మాత - పద్మసత్య మూవీస్
- సంగీతం - విద్యాసాగర్
- ఛాయాగ్రహణం - శ్రీనివాస రెడ్డి
- రచయత - సత్యానంద్
- గేయం - వేటూరి
- కూర్పు - సుబ్బారావు, కే.రాము
మూలాలు
[మార్చు]- ↑ "E.V.V.SATYANARAYANA". Archived from the original on 2016-08-28. Retrieved 2016-06-16.