Jump to content

45 (2026 సినిమా)

వికీపీడియా నుండి
45
దర్శకత్వంఅర్జున్ జన్య
రచనఅర్జున్ జన్య
కథఅనిల్ కుమార్
నిర్మాతఎం. రమేష్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంసత్య హెగ్డే
కూర్పుకె. ఎం. ప్రకాష్
సంగీతంఅర్జున్ జన్య
నిర్మాణ
సంస్థ
సూరజ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2026 జనవరి 1 (2026-01-01)
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశంభారతదేశం
భాషకన్నడ
బాక్సాఫీసు₹16 కోట్లు


45 అనేది 2026 జనవరి 1న తెలుగులో డబ్ అయి విడుదల అయిన కన్నడ భాషా ఫాంటసీ యాక్షన్ చిత్రం, ఇది సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వం వహించిన తొలి చిత్రం.[1] సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. రమేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో కన్నడ పవర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి, కౌస్తుభ మణి, జిషు సేన్గుప్తా నటించారు.[2] ఈ చిత్రానికి కథ అనిల్ కుమార్, అర్జున్ జన్యతో కలిపి రాసారు.[3]

ఈ చిత్రం గరుడ పురాణంలోని ఆత్మ ప్రయాణం, కర్మ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. కెనడాకు చెందిన 'మార్జ్ (MARZ) స్టూడియో' ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అందించింది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన వినయ్ (రాజ్ బి శెట్టి) ఓ కుక్క కారణంగా బైక్ యాక్సిడెంట్ అయి మరణించినట్లు కల వస్తుంటుంది. క్రమంగా అతడి కలలోని కొన్ని సన్నివేశాలు నిజమవుతుంటాయి. రోసీ అనే ఆ కుక్క రాయప్ప(ఉపేంద్ర) అనే డాన్‌కు చెందింది. ఆ కుక్కని తన తల్లిలా చూసుకుంటాడు రాయప్ప. తన కుక్క చావుకు కారణమైన వినయ్‌ను 45 రోజుల్లో చంపేస్తానంటూ రాయప్ప వార్నింగ్ ఇస్తాడు. రోజులు లెక్కపెట్టుకుంటున్న వినయ్ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఈ క్రమంలో శివ(శివ రాజ్‌కుమార్) వినయ్ జీవితంలోకి వస్తాడు. వినయ్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు శివ ప్రయత్నిస్తుంటాడు. ఇంతకీ ఈ శివ ఎవరు..? వినయ్‌కు ఎందుకు సాయం చేయాలనుకుంటాడు..? రాయప్ప వినయ్‌ను చంపేస్తాడా..? అనేది సినిమా కథ. [4]

నటీనటులు

[మార్చు]

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతాన్ని అందించారు. ఇందులో మొత్తం మూడు పాటలు ఉన్నాయి.

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: అర్జున్ జన్య.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఆఫ్రో టపాంగ్ (Afro Tapaang)"ఎంసీ బిజ్జుఎంసీ బిజ్జు, నిషాన్ రాయ్3:21
2."శివం శివం సనాతనం"వి. నాగేంద్ర ప్రసాద్విజయ్ ప్రకాష్4:08
3."45 ద అరైవల్ (45 The Arrival)"రాహుల్ డిట్-ఓరాహుల్ డిట్-ఓ, రూసిక్, నిషాన్ రాయ్2:39
మొత్తం నిడివి:10:08

విడుదల

[మార్చు]

ఈ చిత్రం 2025 డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా కన్నడ, హిందీ లలో విడుదలైంది. 2026 జనవరి 1న తెలుగులో విడుదల అయింది. విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, అగ్ర నటుల నటన, వినూత్నమైన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డిజిటల్ - శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ భారీ ధరకు దక్కించుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "ಫಿಲಾಸಫಿಕಲ್ ಎಂಟರ್‌ಟೇನರ್ '45' ಸಿನಿಮಾ; ಶಿವಣ್ಣ, ಉಪ್ಪಿ, ರಾಜ್ ಬಿ ಶೆಟ್ಟಿಗೆ ಅರ್ಜುನ್ ಜನ್ಯ ಡೈರೆಕ್ಷನ್". Vijay Karnataka (in కన్నడ). the original నుండి 2024-07-15 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-18.
  2. Sharadhaa, A. (2022-07-11). "Shivarajkumar and Arjun Janya's film titled '45', says source". The New Indian Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 2024-07-15 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-07-15.
  3. "Arjun Janya's directorial debut '45', starring Shivarajkumar, Upendra, and Raj B Shetty, goes on floors". The Hindu (in Indian English). 2023-04-27. ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-23.
  4. "Raj B. Shetty's 45 The Movie Review in Telugu | Shiva Rajkumar, Upendra" (in అమెరికన్ ఇంగ్లీష్). 2026-01-01. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-08.