48 కోసుల కురుక్షేత్ర ప్రదక్షిణ యాత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పవిత్ర నగరం కురుక్షేత్ర చుట్టూ 48 కోసుల పరిక్రమ (సుమారు 96 మైళ్ల పరిధి గల వృత్తం) ను చూపించే మ్యాపు. ఈ మ్యాపును బన గంగ/ భీష్మ కుండ్ వద్ద చూడవచ్చు

48 కోసుల ప్రదక్షిణ అంటే హర్యానా లోని పవిత్ర నగరం కురుక్షేత్ర చుట్టూ వివిధ మహాభారత సంబంద ప్రదేశాలకు, ఇతర వేద యుగపు తీర్థాలకూ చేసే తీర్థయాత్ర. [1] [2] [3] [4] హిందీలో దీన్ని 48 కోసుల పరిక్రమ అని అంటారు. కురుక్షేత్ర నగరం చుట్టూ అనేక తీర్థస్థలాలు ఉన్నాయి. ఈ స్థలాలన్నింటినీ సందర్శించడమంటే పూర్తి ప్రదక్షిణ చేసినట్లు అర్థం. ఈ మ్యాపు ఈ స్థలాలను పూర్తిగా చూపిస్తుంది.

ఇది వేద యుగానికి, శ్రీకృష్ణుడికి మహాభారతానికీ సంబంధం ఉన్న ప్రదేశం కాబట్టి, ఇది హిందువుల తీర్థయాత్రల్లో ముఖ్యమైనది. ఇది "శ్రీకృష్ణుడికి" సంబంధించిన 3 ప్రధాన పుణ్యక్షేత్ర యాత్రలలో ఒకటి. అవి హర్యానాలోని "కురుక్షేత్రానికి చెందిన 48 కోసుల పరిక్రమ", ఉత్తర ప్రదేశ్, మధుర లోని " బ్రజ్ పరికర్మ", గుజరాత్, ద్వారకాధీశ ఆలయంలోని "ద్వారక పరిక్రమ " ( ద్వారకాధీశ యాత్ర)

ప్రధాన సైట్లు[మార్చు]

హిందూ, జైన తీర్థయాత్ర[మార్చు]

శ్రీకృష్ణుడు, కౌరవులు, పాండవులు ఈ ప్రాంతంలో సందర్శించారు, నివసించారు. ఇది వారి కర్మభూమిగా భావిస్తారు. దీనికి హిందూ మతం యొక్క ఐదు శాస్త్రీయ అంశాలు పంచ తత్వాలకు కూడా సంబంధం ఉంది. ఈ ప్రదక్షిణ యాత్రకు కేంద్రం బ్రహ్మ సరోవర్.

కురుక్షేత్రంలో, బ్రహ్మ సరోవర్‌తో పాటు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలు జ్యోతిసార్ ( శ్రీకృష్ణుడు "గీతోపదేశం" చేసిన స్థలం) [5] [6] సన్నిహిత్ సరోవర్ (కురుక్షేత్రకు చెందిన హిందూ వంశావళి పత్రాలు ఇక్కడ ఉన్నాయి ). [7] యాత్రికులు భీష్మ కుండ్, సూర్య కుండ్, స్థానేశ్వర మహాదేవుడి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు (ఇక్కడ పాండవులు కృష్ణుడితో కలిసి శివుడిని ప్రార్థించి, మహాభారత యుద్ధంలో విజయం కోసం అనుగ్రహం పొందారు) [8] [9]

వీటితో పాటు యాత్రికులు పెహోవా కూడా సందర్శిస్తారు. ఇదొక పురాతన నగరం. దాని ప్రసక్తి స్కాంద పురాణం, మార్కండేయ పురాణం, వామన పురాణం వంటి పురాణాల్లో ఉంది. [10] ఇక్కడ సరస్వతి తీర్థం, పృథూదకం వంటి పుణ్య తీర్థాలున్నాయి

యమునా జిల్లాలో, కపాల మోచన (శ్రీరాముడు సందర్శించాడు) [11] ఆది బద్రి శ్రీ సరస్వతీ ఉద్గమ తీర్థం ముఖ్యమైన స్థలాలు. సరస్వతీ ఉద్గమ తీర్థం వద్ద సరస్వతీ నది శివాలిక పర్వతాల నుండి మైదాన ప్రాంతం లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇక్కడ సరస్వతీ దేవిని పూజిస్తారు.

యాత్రికులు పెహోవా లోని హిందూ వంశవృక్ష పత్రాల్లో చూసి తమ పూర్వీకులలో ఎవరెవరు ఈ క్షేత్రాలను సందర్శించారో తెలుసుకుంటారు. అలాగే తమ సందర్శనను వాటిలో నమోదు చేసుకుంటారు. పాండాలు (ప్రొఫెషనల్ వంశావళి శాస్త్రవేత్తలు) ఈ పత్రాలను నిర్వహిస్తారు. [12] [13] [14]

అతి ముఖ్యమైన పవిత్ర స్థలాల జాబితా
 • కురుక్షేత్ర: బ్రహ్మ సరోవర్, స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం, సన్నిహిత్ సరోవర్, జ్యోతిసార్, కురుక్షేత్ర హిందూ వంశావళి రిజిస్టర్లు
 • పెహోవా: సరస్వతి తీర్థం పృథూదక తీర్థం
 • యమునానగర్ జిల్లా: కపాల మోచన్, ఆది బద్రి

48 కోస్ పరిక్రమలో తీర్థయాత్రల జాబితా[మార్చు]

కొన్ని తీర్థయాత్రా స్థలాలు క్రింద ఉన్నాయి: [15]

కురుక్షేత్ర జిల్లా లోని క్షేత్రాలు[మార్చు]

జింద్ జిల్లా లోని క్షేత్రాలు[మార్చు]

పానిపట్ జిల్లా లోని క్షేత్రాలు[మార్చు]

50. తరణ్‌తౌక్ యక్ష

కైతల్ జిల్లా లోని క్షేత్రాలు[మార్చు]

కర్నాల్ జిల్లా లోని క్షేత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Kurukshetra map". kurukshetra.nic.in. Archived from the original on 25 June 2016. Retrieved 24 July 2016.
 2. "Haryana Tourism". Retrieved 24 July 2016.
 3. "Development of all pilgrimage sites located within a radius of 48 kos (miles) of Kurukshetra would be carried out". Chief Minister's Office, Haryana. 11 October 2015. Retrieved 24 July 2016.
 4. "The 48 Kos Kurukshetra Region". harekrsna.com. Retrieved 24 July 2016.
 5. Jyotisar Kurukshetra district website.
 6. "Jyotisar". Haryana Tourism Corporation Limited. Retrieved 2014-08-08.
 7. "Tirath in Kurukshetra - Sannehit Sarovar". Kurukshetra district website. Retrieved 2014-08-08.
 8. Dev Prasad (2010). Krishna: A Journey through the Lands & Legends of Krishna. Jaico Publishing House. pp. 216–. ISBN 978-81-8495-170-7.
 9. "Religious Places in Kurukshetra: Sthaneswar Mahadev Mandir". Kurukshetra District website. Retrieved 2014-08-08.
 10. Kurukshetra Development Board can get the responsibility of Saraswati Tirtha, Dainik Jagran, 4 Feb 2019.
 11. yamunanagar.nic.in Archived 2014-08-21 at the Wayback Machine: History of Kapal Mochan
 12. Tracing your Asian roots Archived 26 ఏప్రిల్ 2017 at the Wayback Machine www.overseasindian.in.
 13. Hindu Pilgrimage Marriage Records www.movinghere.org.uk.
 14. 10 Places Across The World That Help You Trace Your Ancestors, India Times, 29 Jan 2016.
 15. "Tirthas of dist. Kurukshetra" (PDF). kurukshetra.nic.in. Archived from the original (PDF) on 5 March 2017. Retrieved 24 July 2016.