Jump to content

8 వసంతాలు

వికీపీడియా నుండి
8 వసంతాలు
దర్శకత్వంఫణీంద్ర నర్సెట్టి
రచనఫణీంద్ర నర్సెట్టి
నిర్మాత
  • నవీన్ యెర్నేని
  • వై రవి శంకర్
తారాగణం
ఛాయాగ్రహణంవిశ్వనాధ్ రెడ్డి
కూర్పుశశాంక్ మాలి
సంగీతంహేశం అబ్దుల్ వహాబ్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
2025 జూన్ 20 (2025-06-20)(థియేటర్)
2025 జులై 11 (2025-07-11)(నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు.[1] అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా,[2] సినిమా జూన్ 20న విడుదలైంది.

8 వసంతాలు సినిమా జులై 11 నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం భాష‌ల్లో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[3][4]

శుద్ధి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) ఓ యువ రచయిత్రి. రచనలే కాకుండా మార్షల్ ఆర్ట్స్, బ్లాక్ బెల్ట్‌లో ఆరి తేరిన వ్యక్తి. వ‌రుణ్ (హ‌నురెడ్డి) శుద్ది ర‌చ‌న‌ల్ని, ఆమె వ్య‌క్తిత్వాన్ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ప్రేమిస్తున్నా అంటూ వెంట ప‌డ‌తాడు. వరుణ్ తన స్వార్థాన్ని చూసుకుని శుద్ధిని వదిలేసి విదేశాలకు వెళతాడు. స్వాభిమానం, ఆత్మ గౌరవం ఉన్న శుద్ధి ఆ తరువాత ఏం చేస్తుంది? ఆ తర్వాత ఊటీలో తెలుగు రచయిత సంజయ్ (రవి దుగ్గిరాల) శుద్ధికి పరిచయం అవుతాడు. అనుకోకుండా శుద్ధికి ఫ్యామిలీ ఎస్టేట్ బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[5][6][7]

నటీనటులు

[మార్చు]
  • శుద్ధి అయోధ్యగా అనంతిక సనిల్‌కుమార్[8]
  • సంజయ్ గా రవి దుగ్గిరాల
  • వరుణ్ గా హను రెడ్డి
  • కార్తీక్ గా కన్నా పసునూరి
  • అనితగా సంజన హర్దగేరి
  • యశోదగా సమీర కిషోర్
  • మాస్టర్ గా స్వరాజ్ రెబ్బాప్రగడ
  • రాహుల్‌గా సుమంత్ విలాస్ నిట్టూర్కర్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."పరిచయమిలా పరిమళములా[9]"వనమాలిచిత్ర3:25
2."అందమా అందమా"వనమాలిహేశం అబ్దుల్ వహాబ్, ఆవని మల్హర్4:39

మూలాలు

[మార్చు]
  1. "అనంతిక‌కు.. 13 కళల్లో ప్రవేశం ఉంది". Chitrajyothy. 17 June 2025. Archived from the original on 22 June 2025. Retrieved 22 June 2025.
  2. "ప్రాణం పోసిన వాళ్లం.. మోక్షం ఇప్పించలేమా?". NT News. 16 June 2025. Archived from the original on 22 June 2025. Retrieved 22 June 2025.
  3. "ఈ వారం ఓటీటీలో 20కి పైగా చిత్రాలు/సిరీస్‌లు.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Eenadu. 11 July 2025. Archived from the original on 11 July 2025. Retrieved 11 July 2025.
  4. "ఓటీటీలోకి '8 వసంతాలు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!". NT News. 8 July 2025. Archived from the original on 11 July 2025. Retrieved 11 July 2025.
  5. "'8 Vasantalu' movie review: Phanindra Narsetti's romance drama is ambitious but lacks soul" (in Indian English). The Hindu. 20 June 2025. Archived from the original on 22 జూన్ 2025. Retrieved 22 June 2025.
  6. "8 వసంతాలు మూవీ రివ్యూ". Chitrajyothy. 20 June 2025. Archived from the original on 22 June 2025. Retrieved 22 June 2025.
  7. "రివ్యూ: 8 వసంతాలు.. న్యూఏజ్‌ రొమాంటిక్‌ డ్రామా ఎలా ఉంది?". Eenadu. 20 June 2025. Archived from the original on 22 June 2025. Retrieved 22 June 2025.
  8. "మార్ష‌ల్ ఆర్ట్స్‌తో వ‌స్తున్న 'మ్యాడ్' హీరోయిన్.. ఇంట్రెస్టింగ్‌గా '8 వసంతాలు' ఫ‌స్ట్ గ్లింప్స్". NT News. 12 October 2024. Archived from the original on 22 June 2025. Retrieved 22 June 2025.
  9. "'8 వసంతాలు' నుంచి చిత్ర పాడిన పాట రిలీజ్!". Chitrajyothy. 11 June 2025. Archived from the original on 22 June 2025. Retrieved 22 June 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=8_వసంతాలు&oldid=4619159" నుండి వెలికితీశారు