Coordinates: 27°14′0″N 94°42′0″E / 27.23333°N 94.70000°E / 27.23333; 94.70000

డిహింగ్ నది

వికీపీడియా నుండి
(Dihing River నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
డిహింగ్ నది
బుర్హి డిహింగ్ నది
అరుణాచల్ ప్రదేశ్ లోని నంసాయి వద్ద దిహింగ్ నది
డిహింగ్ నది is located in Assam
డిహింగ్ నది
అసోంలో నది ప్రాంతం
డిహింగ్ నది is located in India
డిహింగ్ నది
డిహింగ్ నది (India)
స్థానం
దేశంభారతదేశం
భౌతిక లక్షణాలు
మూలంపట్కాయ్ హిల్స్
 • ఎత్తు2,375 m (7,792 ft)
సముద్రాన్ని చేరే ప్రదేశంబ్రహ్మపుత్ర నది
 • అక్షాంశరేఖాంశాలు
27°14′0″N 94°42′0″E / 27.23333°N 94.70000°E / 27.23333; 94.70000[1]
పొడవు380 km (240 mi)
పరీవాహక ప్రాంతం6,000 km2 (2,300 sq mi)

డిహింగ్ నది (బుర్హి డిహింగ్) అనేది బ్రహ్మపుత్ర నదికి ఉపనది.[2] ఈశాన్య భారతదేశంలోని ఎగువ అస్సాంలో దాదాపు 380 kilometres (240 mi) ) పొడవుతో ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు హిమాలయాల్లో (పట్కాయ్ కొండలు) సముద్ర మట్టానికి 2,375 metres (7,792 ft) వద్ద ఉద్భవించి, అస్సాంలోని టిన్సుకియా (తినికుకీయా), దిబ్రూగర్ జిల్లాల గుండా ప్రవహించి దిహింగ్‌ముఖ్ వద్ద బ్రహ్మపుత్ర నదిలో కలుస్తోంది. దీని సుమారు 6,000 square kilometres (2,300 sq mi) పరిధిలో విస్తరించి ఉంది. డిహింగ్ ఈ ప్రాంతంలో అనేక ఆక్స్‌బో సరస్సులను ఏర్పాటుచేసింది

డిమింగ్ నదికి దక్షిణ ఒడ్డున దిసాంగ్ అనే ఉపనది ఉంది. జైపూర్-డిహింగ్ రెయిన్‌ఫారెస్ట్, అనేక పెట్రోలియం క్షేత్రాలు, వరి పొలాలు, వెదురు తోటలు, తేయాకు తోటలతో కూడి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. లెడో, మార్గరీటా, దిగ్బోయి, దులియాజన్, నహర్కాటియా (నహోర్కోటియా) వంటి చిన్నచిన్న పట్టణాలు కూడా ఉన్నాయి. బ్రహ్మపుత్ర నదికి డిహింగ్ అత్యంత ముఖ్యమైనది. డిహింగ్ లోయలోని మైదానాలు అనేక రకాల వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ తమలపాకులు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.[2]

చరిత్ర[మార్చు]

చారిత్రక, భౌగోళిక రికార్డుల ప్రకారం, గిహింగ్ ఒకప్పుడు మొత్తం ఎగువ అస్సాం గుండా ప్రవహించి బోకాఖత్‌లోని మహురాముఖ్ వద్ద బ్రహ్మపుత్ర నదిలో కలిసేది. అప్పుడు డిహింగ్‌ నదికికు దిసాంగ్, దిఖౌ, దిసాయి, ధన్‌సిరి నదులన్నీ ఉపనదులుగా ఉండేవి. 17వ శతాబ్దంలో ఈ నది ఎండిపోయి, దిహింగ్‌ముఖ్ వద్ద బ్రహ్మపుత్రలో కలుస్తోంది.[2]

అంతకంటేముందు సుబంసిరి నది సంగమం దగ్గర కూడా బ్రహ్మపుత్ర నదిని కలుస్తుంది. ఆ సమయంలో దిఖౌ నది వేరే మార్గంలో, కొలాంగ్‌గా ప్రవహించి నాగాన్ జిల్లాలోని కాజలిముఖ్ వద్ద బ్రహ్మపుత్రలో కలుస్తుంది.[3]

వంతెనలు, క్రాసింగ్‌లు[మార్చు]

  1. కుతుహ కచారి గ్రామంలో 41.480 కిలోమీటర్ల పొడవున్న రైలు వంతెన పొడవు 288.20 మీటర్లు, వెడల్పు 6.30 మీటర్లు.
  2. 236.30 మీటర్ల పొడవు, 8.18 మీటర్ల వెడల్పుతో కుతుహ కచారి గ్రామంలో 41.610 కిలోమీటర్ల పొడవున్న ఆర్.సి.సి. వంతెన.
  3. కోవార్ ఖరోని గ్రామంలో 504.20 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో 54.586 కిలోమీటర్ల పొడవున్న రైలు వంతెన.
  4. 616.6 మీటర్ల పొడవు, 3.13 మీటర్ల వెడల్పు కలిగిన చీరిక బీల్ విలేజ్ వద్ద 102.625 కిలోమీటర్ల పొడవు గల స్టీల్ వంతెన.
  5. కోవార్ ఖరోని గ్రామంలో 108.730 కిలోమీటర్ల పొడవు గల ఆర్.సి.సి. వంతెన పొడవు 273.93 మీటర్లు, వెడల్పు 8.25 మీటర్లు.
  6. కోవార్ ఖరోని గ్రామంలో 339.30 మీటర్ల పొడవు, 5.89 మీటర్ల వెడల్పుతో 109.136 కిలోమీటర్ల పొడవున్న రైలు వంతెన.

మూలాలు[మార్చు]

  1. National Geospatial-Intelligence Agency. "Burhi Dihing River". Geographical Names. ITA. Retrieved 2022-11-17.
  2. 2.0 2.1 2.2 Ehtesham, Ansari. "Dihing River - Tributaries Maps Bridges History". Rivers Of India. Archived from the original on 2022-11-17. Retrieved 2022-11-17.
  3. Prakash, Col. Ved (2007). Encyclopedia of Northeast India Volume 1. Atlantic Publishers. p. 98. ISBN 978-81-269-0703-8.

బయటి లింకులు[మార్చు]