HIV
HIV (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) అనేది మానవులకు సంక్రమించే లెంటివైరస్ జాతికి చెందిన వైరస్. ఈ వైరస్ సోకిన వారు కాలక్రమంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడతారు.[1][2] దీనివల్ల రోగనిరోధక శక్తి క్రమంగా విఫలమవుతూ క్యాన్సర్, ఇంకా ఇతర ప్రాణాంతక అవకాశవాద సంక్రమణలను కలిగిస్తుంది.[3] ఎటువంటి చికిత్స చేయకపోతే, సోకినవారు వైరస్ ఉపవర్గాన్ని బట్టి, సగటున 9 నుంచి 11 సంవత్సరాలు జీవిస్తారు.[4]
చాలా కేసుల్లో ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా సంక్రమిస్తుంది. రక్త మార్పిడి, జననేంద్రియాల స్రావాల మార్పిడి సంక్రమణకు ప్రధాన కారణాలు.[5][6] లైంగిక సంబంధం కాకుండా గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ ఉంటే అది, జనన సమయంలో తల్లి రక్తం, ఉమ్మనీరు, తల్లి పాల ద్వారా కడుపులోని బిడ్డకు కూడా సోకే అవకాశం ఉంటుంది.[7][8][9][10]
వైరాలజీ
[మార్చు]వర్గీకరణ
[మార్చు]హెచ్.ఐ.వి వైరస్ రెట్రోవైరస్ కుటుంబానికి చెందిన లెంటివైరస్ అనే జాతికి చెందినది. HIV-1, HIV-2 అనే రెండు రకాల వైరస్‌లు ఉన్నాయి. HIV-1 అనేది మొదట కనిపెట్టబడింది. HIV-1 అనేది HIV-2 తో పోలిస్తే ఎక్కువ సాంక్రమిక శక్తి, తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.[11] ప్రపంచ వ్యాప్తంగా HIV ఇన్‌ఫెక్షన్లు ఈ రకం ద్వారానే సోకుతున్నాయి.
నిర్మాణం
[మార్చు]HIV నిర్మాణంలో ఇతర రెట్రో వైరస్‌లను పోలి ఉంటుంది. ఇది దాదాపు గోళాకారంలో ఉంటుంది. దీని వ్యాసం సుమారు 120 నానోమీటర్లు. ఇది ఎర్ర రక్త కణం కన్నా సుమారు లక్ష రెట్లు చిన్నది.
మూలాలు
[మార్చు]- ↑ Weiss RA (May 1993). "How does HIV cause AIDS?". Science. 260 (5112): 1273–9. Bibcode:1993Sci...260.1273W. doi:10.1126/science.8493571. PMID 8493571.
- ↑ Douek DC, Roederer M, Koup RA (2009). "Emerging Concepts in the Immunopathogenesis of AIDS". Annual Review of Medicine. 60: 471–84. doi:10.1146/annurev.med.60.041807.123549. PMC 2716400. PMID 18947296.
- ↑ Powell MK, Benková K, Selinger P, Dogoši M, Kinkorová Luňáčková I, Koutníková H, Laštíková J, Roubíčková A, Špůrková Z, Laclová L, Eis V, Šach J, Heneberg P (2016). "Opportunistic Infections in HIV-Infected Patients Differ Strongly in Frequencies and Spectra between Patients with Low CD4+ Cell Counts Examined Postmortem and Compensated Patients Examined Antemortem Irrespective of the HAART Era". PLOS ONE. 11 (9): e0162704. Bibcode:2016PLoSO..1162704P. doi:10.1371/journal.pone.0162704. PMC 5017746. PMID 27611681.
- ↑ UNAIDS; WHO (December 2007). "2007 AIDS epidemic update" (PDF). p. 16.
- ↑ Rodger AJ, Cambiano V, Bruun T, Vernazza P, Collins S, Degen O, et al. (June 2019). "Risk of HIV transmission through condomless sex in serodifferent gay couples with the HIV-positive partner taking suppressive antiretroviral therapy (PARTNER): final results of a multicentre, prospective, observational study". Lancet. 393 (10189): 2428–2438. doi:10.1016/S0140-6736(19)30418-0. PMC 6584382. PMID 31056293.
- ↑ Eisinger RW, Dieffenbach CW, Fauci AS (February 2019). "HIV Viral Load and Transmissibility of HIV Infection: Undetectable Equals Untransmittable". JAMA. 321 (5): 451–452. doi:10.1001/jama.2018.21167. PMID 30629090. S2CID 58599661.
- ↑ Mabuka J, Nduati R, Odem-Davis K, Peterson D, Overbaugh J (2012). Desrosiers RC (ed.). "HIV-Specific Antibodies Capable of ADCC Are Common in Breastmilk and Are Associated with Reduced Risk of Transmission in Women with High Viral Loads". PLOS Pathogens. 8 (6): e1002739. doi:10.1371/journal.ppat.1002739. PMC 3375288. PMID 22719248.
- ↑ Hahn RA, Inhorn MC, eds. (2009). Anthropology and public health : bridging differences in culture and society (2nd ed.). Oxford: Oxford University Press. pp. 449. ISBN 978-0-19-537464-3. OCLC 192042314.
- ↑ Mead MN (2008). "Contaminants in human milk: weighing the risks against the benefits of breastfeeding". Environmental Health Perspectives. 116 (10): A426–34. doi:10.1289/ehp.116-a426. PMC 2569122. PMID 18941560. Archived from the original on 6 నవంబరు 2008.
- ↑ మూస:Citation-attribution
- ↑ Gilbert PB, McKeague IW, Eisen G, Mullins C, Guéye-NDiaye A, Mboup S, Kanki PJ (February 28, 2003). "Comparison of HIV-1 and HIV-2 infectivity from a prospective cohort study in Senegal". Statistics in Medicine. 22 (4): 573–593. doi:10.1002/sim.1342. PMID 12590415. S2CID 28523977.