HL7

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హెల్త్ లెవల్ సెవెన్ (HL7 ), ఒక సంపూర్ణ వాలంటీర్, లాభాపేక్ష లేని సంస్థ, ఇది అంతర్జాతీయ [[ఆరోగ్య

సంరక్షణ]] ప్రమాణాల అభివృద్ధిలో పాలుపంచుకున్నది.[1] HL7, సంస్థ ద్వారా రూపొందించబడిన నిర్దిష్ట ప్రమాణాలలో కొన్నింటిని ప్రస్తావించడానికి ఉపయోగించబడింది (ఉదా, HL7 v2.x, v3.0, HL7 RIM).[ఆధారం కోరబడింది]

HL7 దాని సభ్యులు ఎలక్ట్రానిక్ హెల్త్ సమాచార మార్పిడి, సమగ్రత, భాగస్వామ్యం మరియు పునఃసంపాదన, v2.x ప్రమాణాలు వంటి వాటిపై ఒక చట్రాన్ని (సంబంధింత ప్రమాణాలను) అందిస్తారు, వీరు క్లినికల్ ప్రాక్టీస్‌ని మరియు నిర్వహణ, డెలివరీ మరియు ఆరోగ్య సేవల మదింపులను బలపరుస్తారు, వీటిని సర్వసాధారణంగా ప్రపంచమంతటా ఉపయోగిస్తున్నారు.

సంస్థ[మార్చు]

HL7 ఎలెక్ట్రానికి ఆరోగ్యసంరక్షణ సమాచార పంపిణీ, నిర్వహణ మరియు సమగ్రతలకు ప్రమాణాలను సృష్టించడానికి ఆరోగ్య సంరక్షణ విషయాలపై నిపుణులు మరియు సమాచార శాస్త్రజ్ఞులతో పొత్తు కలిపిన ఒక అంతర్జాతీయ కమ్యూనిటీ.[2]

అందరి ప్రయోజనాల కోసం ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థవంతంగా అందించడానికి, సమర్థతను పెంచడానికి ఆరోగ్య సంరక్షణ సంస్థల లోపల అటువంటి ప్రమాణాలను ఉపయోగించడాన్ని HL7 ప్రోత్సహిస్తుంది.[ఆధారం కోరబడింది]

HL7 కమ్యూనిటీ ఒక గ్లోబల్ సంస్థ (హెల్త్ లెవల్ సెవెన్, ఇంక్.) రూపంలో మరియు దేశంతో నిర్దిష్టంగా ముడిపడి ఉన్న సంస్థలతో నిర్వహించబడుతోంది:

HL7.ఇంక్. సంస్థాగత నిర్మాణం కింది విధంగా ఉంటుంది:[ఆధారం కోరబడింది]

  • సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా నిర్వహించబడుతోంది, బోర్డులో 10మంది ఎన్నుకున్న సభ్యులు మరియు ముగ్గురు నియమించబడిన సభ్యులు ఉంటారు.
  • ప్రధాన కార్యనిర్వాహక అధికారి (ప్రస్తుతం చార్లెస్ జఫె, MD, PhD) డైరెక్టర్ల బోర్డుకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా సేవలందిస్తాడు. ప్రధాన సాంకేతిక అధికారి (ప్రస్తుతం జాన్ క్విన్) మరియు ఛీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ (ప్రస్తుతం మార్క్ మెక్‌డౌగల్) CEOకి నివేదిస్తారు మరియు డైరెక్టర్ల బోర్డుకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా సేవలందిస్తారు.
  • HL7 సభ్యులు ఉమ్మడిగా "వర్కింగ్ గ్రూప్"గా వ్యవహరించబడతారు. వర్కింగ్ గ్రూప్ HL7 ప్రామాణిక ప్రొటోకాల్‌ని నిర్వచించి, స్టాండింగ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీలు మరియు వర్కింగ్ గ్రూప్‌లుగా ఏర్పడి ఉంటారు.
    • స్టాండింగ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీలు సంస్థాగతమైన లేక విద్య, అమలు, మార్కెటింగ్, క్లినికల్ రీసెర్చ్ కోసం అవుట్‌రీచ్ కమిటీ, పబ్లిషింగ్ మరియు ప్రాసెస్ అభివృద్ధి, మరియు టూలింగ్ వంటి ప్రమోషనల్ కార్యకలాపాలపై దృష్టి సారిస్తారు.
    • కార్యాచరణ బృందాలు ప్రమాణాల విషయానికి, విధుల నిర్దేశం యొక్క వాస్తవ భాష రూపకల్పనకు నేరుగా బాధ్యత పడతారు.

మూలాలు[మార్చు]

ఆసుపత్రి సమాచార వ్యవస్థలకు ప్రామాణికతను అందించడం కోసం HL7 1987లో స్థాపించబడింది. HL7, ఇంక్. ఒక ప్రమాణాల సంస్థ దీనికి అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇనిస్టిట్ట్యూట్ (ANSI) చే 1994లో గుర్తింపు లభించింది.[4]

HL7 ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేస్తూ అమెరికన్ జాతీయ ప్రమాణాల సంస్థ (ANSI) ఆమోదించిన పలు ప్రమాణాల అభివృద్ధి సంస్థల (SDOల)లో ఒకటిగా ఉంటోంది. ఫార్మసీ, వైద్య పరికరాలు, ఇమేజింగ్ లేదా ఇన్సూరెన్స్ (క్లెయిమ్స్ ప్రాసెసింగ్) లావాదేవీలు వంటి నిర్దిష్ట ఆరోగ్యసంరక్షణ డొమైన్‌ల కోసం, అనేక SDOలు ప్రమాణాలను (కొన్ని సందర్భాలలో విధుల నిర్దేశం లేదా ప్రోటొకాల్స్ అని పిలువబడతాయి) అందిస్తాయి. హెల్త్ లెవల్ సెవెన్ డొమైన్, క్లినిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ డేటా.[ఆధారం కోరబడింది]

ఈరోజు HL7ని యు.ఎస్ వెలుపల పలు జాతీయ SDOలు చేపడుతున్నాయి. ఈ SDOలు పర్యవసానంగా ANSI ద్వారా గుర్తింపు పొందలేదు. అయితే ఇప్పుడు HL7 అంతర్జాతీయ ప్రామాణికీకరణ మరియు గుర్తింపు ISO చే స్వీకరించబడింది మరియు ప్రమాణాల పరస్పర జారీకోసం భాగస్వామ్య సంస్థగా గుర్తింపు పొందింది. మొట్టమొదటి పరస్పర సహకారంతో ప్రచురించబడిన ప్రమాణం ISO/HL7 21731:2006 హెల్త్ ఇన్ఫర్మాటిక్స్- HL7 వెర్షన్ 3- రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ మోడల్-విడుదల 1.[ఆధారం కోరబడింది]

పేరు "హెల్త్ లెవెల్-7"[మార్చు]

"హెల్త్ లెవెల్-7" పేరు ISO OSI ప్రస్తావన మోడల్. యొక్క సెవెంత్ అప్లికేషన్ లేయర్‌ని ప్రస్తావిస్తుంది. HL7 హెల్త్ కేర్ డొమెయిన్‌ కోసం ఒక అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్‌పై చూపు సారిస్తున్నదని దాని పేరే తనంతట తానుగా, సూచిస్తోంది. HL7 అన్ని దిగువ పొరలను కేవలం ఉపకరణాలుగా మాత్రమే గుర్తిస్తుంది.

పరస్పర సహకారం[మార్చు]

బాసటగా నిలిచే మరియు సానుకూల ప్రమాణాలను ప్రోత్సహించడానికి ఆరోగ్య సంరక్షణ మరియు సమాచార సౌకర్యాల కల్పన డొమైన్‌లు రెండింటిలోనూ HL7 ఇతర ప్రమాణాల అభివృద్ధి సంస్థలు మరియు జాతీయ, అంతర్జాతీయ మంజూరీ సంస్థలతో (ఉదా. ANSI మరియు ISO) పొత్తు కుదుర్చుకుంటుంది. HL7 ప్రమాణాలు నిజమైన ప్రపంచ అవసరాలను తీరుస్తాయని రూఢి పర్చుకునేందుకోసం HL7 ఆరోగ్య సంరక్షణ సమాచార టెక్నాలజీ యూజర్లతో పొత్తు కుదుర్చుకుంటుంది మరియు కొత్తగా పుట్టుకొస్తున్న అవసరాలను నెరవేర్చడానికి సముచితమైన ప్రమాణాల అభివృద్ధి ప్రయత్నాలను కూడా HL7 ప్రారంభిస్తుంది..[ఆధారం కోరబడింది]

(HL7 ఇంక్ లేదా HL7 అనుబంధ సంస్థకు చెందిన) గ్లోబల్ సభ్యత్వంలో 45% ఐరోపా‌లో, 35% ఉత్తర అమెరికాలో, 15% ఆసియా-ఓషేనియాలో మరియు 5% ఇతర ప్రాంతాల్లో ఉంటోంది.[5]

HL7 ప్రమాణాలు[మార్చు]

ఆసుపత్రులు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ ప్రదాత సంస్థలు సాధారణంగా బిల్లింగ్ రికార్డులనుంచి పేషెంట్ ట్రాకింగ్ వరకు ప్రతిదానికీ ఉపయోగించే పలు విభిన్న కంప్యూటర్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయి. కొత్త సమాచారాన్ని అవి అందుకునేటప్పుడు, ఈ అన్ని సిస్టమ్‌లూ ప్రతి ఒక సిస్టమ్‌తోనూ (లేదా "ఇంటర్‌ఫేస్")తో కమ్యూనికేట్ చేయాలి కాని, అన్ని సిస్టమ్‌లూ ఇలా చేయవు. HL7 వెసులుబాటు కలిగిన ప్రమాణాలు, మార్గదర్శకాలు మరియు మెథడాలజీలను నిర్దేశిస్తుంది. వీటిలో పలు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు పరస్పరం కమ్యూనికేట్ చేసుకుంటాయి. అటువంటి మార్గదర్శకాలు మరియు డేటా ప్రమాణాలు కొన్ని నిబంధనల కలయికగా ఉంటాయి, ఇవి సమాచారాన్ని ఒక ఏకీకృత మరియు స్థిరమైన పద్ధతిలో సమాచారాన్ని పంచుకుని, ప్రాసెస్ చేస్తాయి. ఈ డేటా ప్రమాణాలు ఆరోగ్య సంరక్షణ సంస్థలను క్లినికల్ సమాచారాన్ని సులభంగా పంచుకునేలా అనుమతిస్తాయి. సూత్రపరంగా, సమాచారాన్ని మార్పిడి చేసుకునే ఈ సామర్థ్యం భౌగోళికంగా వేరుపడిపోయి, చాలా అస్థిరంగా ఉంటున్న వైద్య సంరక్షణ ధోరణిని తగ్గించడంలో సహాయపడాలి[ఆధారం కోరబడింది]

HL7 భావనాత్మక ప్రమాణాలను వృద్ధి చేస్తుంది (ఉదా., HL7 RIM), డాక్యుమెంట్ ప్రమాణాలు (ఉదా. HL7 CDA) అప్లికేషన్ ప్రమాణాలు (ఉదా., HL7 CCOW), మరియు మెసేజింగ్ ప్రమాణాలు (ఉదా., HL7 v2.x మరియు v3.0). మెసేజింగ్ ప్రమాణాలు ప్రత్యేకించి ముఖ్యమైనవి, ఎందుకంటే, సమాచారం ఒక పార్టీ నుంచి మరొక దానికి ఎలా ప్యాకేజ్ చేయబడి, కమ్యూనికేట్ చేయబడుతుందో నిర్వచిస్తుంది. అలాంటి ప్రమాణాలు ఒక సిస్టమ్ నుంచి మరొక దానికి స్థిరమైన సమగ్రత అవసరమైన భాష, నిర్మాణం మరియు డేటాలను ఏర్పరుస్తాయి.[6]

HL7 అభివృద్ధి, దత్తత, మార్కెట్ గుర్తింపు, ఉపయోగం మరియు నిబద్ధతలతో కూడిన ప్రమాణాల విధుల నిర్దేశక సంపూర్ణ వలయాన్ని వ్యావృతం చేస్తుంది.[ఆధారం కోరబడింది] HL7 ప్రమాణాలకు యాక్సెస్ కావాలంటే HL7 ఇంక్. లేదా దాని అనుబంధ సంస్థలలో ఒకదాన్ని పెయిడ్ సభ్యత్వం అవసరమవుతుంది.

HL7 వెర్షన్ 2.x[మార్చు]

HL7 వెర్షన్ 2 ప్రమాణం ఆసుపత్రుల్లోని పని తీవ్రతకు బాసటగా నిలిచే లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఇది తొలిసారిగా 1987లో రూపొందించబడింది.[ఆధారం కోరబడింది]

V2.x మెసేజింగ్

HL7 వెర్షన్ 2 కార్యనిర్వాహక, లాజిస్టికల్, ఆర్థికం మరియు క్లినికల్ ప్రాసెస్‌లకు బాసటగా నిలిచేందుకోసం ఎలెక్ట్రానికి సందేశాల సీరీస్‌ను నిర్వచిస్తుంది. 1987 నుంచి ప్రమాణం నిత్యం అప్‌డేట్ అవుతూ వచ్చింది, దీని ఫలితంగా 2.1, 2.2, 2.3, 2.3.1, 2.4, 2.5, 2.5.1 మరియు 2.6 వెర్షన్‌లు వచ్చాయి. సామాహికంగా ఈ వెర్షన్‌లు వెర్షన్‌ 2.x గా సుపరిచితం. v2.x ప్రమాణాలు బ్యాక్‌వర్డ్ కంపేటిబుల్ ప్రమాణాలతో ఉంటాయి ఉదా. వెర్షన్ 2.3 వెర్షన్ 2.6.ని సపోర్ట్ చేసే అప్లికేషన్ ద్వారా అర్ధం చేసుకోబడుతుంది.

HL7 v2.x చాలావరకు పాఠ్య రూపంలోని, డెలిమీటర్లపై ఆధారపడిన XML యేతర ఎన్‌కోడింగ్ సింటాక్స్‌ని ఉపయోగిస్తుంది.

HL7 v2.x ఎలక్ట్రానిక్ పేషెంట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్ (PAS), ఎలెక్ట్రానిక్ ప్రాక్టీస్ మేనేజ్‌మెంట్ (EPM) సిస్టమ్‌లు, లాబొరేటరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లు (LIS), డయటరీ, ఫార్మసీ మరియు బిల్లింగ్ సిస్టమ్‌లతోపాటు ఎలెక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ (EMR) లేదా ఎలెక్ట్రానిక్ హెల్త్ రికార్డు (EHR) సిస్టమ్‌ల మధ్య, ఇంటరోపెరాబిలిటీని అనుమతిస్తుంది. ప్రస్తుతం, HL7 యొక్క v2.x మెసేజింగ్ ప్రమాణాన్ని యునైటెడ్ స్టేట్స్ లోని ప్రతి ప్రముఖ మెడికల్ సమాచార వ్యవస్థల విక్రేత ద్వారా బలపర్చబడుతోంది [1].

HL7 వెర్షన్ 3[మార్చు]

HL7 వెర్షన్ 3 ప్రమాణం అన్ని ఆరోగ్య సంరక్షణ పనులకూ బాసటగా ఉండే లక్ష్యాన్ని కలిగి ఉంటోంది. వెర్షన్ 3 అభివృద్ధి క్రమం 1995లో ప్రారంభమైంది, ఫలితంగా 2005లో దీని ప్రారంభ పబ్లికేషన్ మొదలైంది. వెర్షన్ 2కి వ్యతిరేకంగా ఉన్న v3 ప్రమాణం, లాంఛనప్రాయ మెథడాలజీపైనా (HDF) మరియు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సూత్రాలపైనా ఆధారపడి ఉంది.

RIM - ISO/HL7 21731

రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ మోడల్ (RIM) అనేది HL7 వెర్షన్ 3 అభివృద్ధి క్రమం యొక్క మూలమలుపు లాంటిది మరియు HL7 V3 అభివృద్ధి మెథడాలజీ యొక్క అత్యవసర భాగం. RIM నిర్దిష్ట క్లినికల్ లేదా కార్యనిర్వాహక నేపథ్యం అవసరమైన డేటా కంటెంట్‌ను వ్యక్తీకరిస్తుంది మరియు HL7 మెసేజ్‌ల రంగాల్లో తీసుకునిపోయే సమాచారం మధ్య సెమాంటిక్ మరియు లెక్సికల్ సంబంధాల యొక్క స్పష్టమైన ప్రాతినిధ్యాన్ని అందచేస్తుంది. కచ్చితత్వాన్ని పెంచడానికి మరియు అమలు వ్యయాలను తగ్గించడానికి RIM అత్యవసరం. మోడళ్లు లభ్యమవుతున్నాయి.

HL7 అభివృద్ధి ఫ్రేమ్‌వర్క్ - ISO/HL7 27931

HL7 వెర్షన్ 3 అభివృద్ధి ఫ్రేమ్ వర్క్ (HDF) ఒక నిరంతరం పరిణమించే ప్రక్రియ, ఇది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల మధ్య ఇంటెరోపెరాబిలిటీకి వీలుకలిగించే విధుల నిర్దేశకాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాయి. HL7 RIM, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఇంటెరోపెరాబిలిటీ కోసం ఏకాభిప్రాయ ఆధారిత ప్రమాణాల అభివృద్ధికోసం వొకాబులరీ నిర్దేశకాలు, విశ్లేషణ మరియు డిజైన్ కంబైన్ యొక్క మోడల్-డ్రైవన్ ప్రక్రియలు HL7 వెర్షన్ 3 వన్ మెధడాలజీ HDF అనేది HL7 V3 డెవలప్‌మెంట్ మెథడాలజీ యొక్క అత్యంత ప్రస్తుత ఎడిషన్.

HDF కేవలం మెసేజింగ్ మాత్రమే కాకుండా ప్రాసెస్‌లు, ఉపకరణాలు, ఆక్టర్లు, నిబంధనలు మరియు అన్ని HL7 ప్రామాణిక విధుల నిర్దేశకాలను నమోదు చేస్తుంది. చివరికి, ఎలెక్ట్రానిక్ ఆరోగ్య ఆర్కిటెక్చర్లు మరియు అవసరాలకు సంబంధించిన విశ్లేషణనుంచి పుట్టుకొచ్చిన నూతన ప్రమాణంతో సహా HL7 యొక్క అన్ని ప్రామాణిక విధుల నిర్దేశకాలను HDF కలిగి ఉంటుంది,

HL7 విధుల నిర్దేశకాలు పలు రకాల వనరుల నుండి కోడ్‌లు మరియు పదజాలాలమీద కూర్చబడుతుంది. HL7 నిర్దేశకాలను అమలు చేసే వ్యవస్థలు అవి ఉపయోగిస్తున్న కోట్ సోర్స్‌లు మరియు కోడ్ వాల్యూ డొమైన్‌లను స్పష్టంగా అర్థం చేసుకుంటాయని V3 వొకాబులరీ పని హామీ ఇస్తుంది.

V3 మెసేజింగ్

HL7 వెర్షన్ 3 మెసేజింగ్ ప్రమాణం ఏదైనా లేదా అన్ని ఆరోగ్య సంరక్షణ పనితీరును బలపర్చడానికి ఎలెక్ట్రానిక్ సందేశాల సీరీస్‌ను (పరస్పరచర్యలు అని పిలవబడతాయి) నిర్వచిస్తుంది. HL7 v3 సందేశాలు XML ఎన్‌కోడింగ్ సింటాక్స్‌పై ఆధారపడతాయి.

V3 క్లినికల్ డాక్యుమెంట్ ఆర్కిటెక్చర్ - ISO 10781

HL7 వెర్షన్ 3 క్లినికల్ డాక్యుమెంట్ ఆర్కిటెక్చర్ (CDA) అనేది మార్పిడికోసం క్లినికల్ డాక్యుమెంట్‌ల నిర్మాణం మరియు అర్థవిచారాలను ఎన్‌కోడ్ చేయడానికి నిర్దేశించబడిన ఒక XML- ఆధారిత మార్కప్ ప్రమాణం.

HL7 ద్వారా వర్తించబడే పద్ధతులు[మార్చు]

సర్వీసెస్ అవేర్ ఇంటెరోపెరాబిలిటీ ఫ్రేమ్‌వర్క్[మార్చు]

HL7 సర్వీసెస్ అవేర్ ఇంటెరోపెరాబిలిటీ ఫ్రేమ్‌వర్క్ (SAIF) అన్ని HL7 కళాకృతుల మధ్య నిలకడను అందిస్తుంది మరియు ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్ (EA) అభివృద్ధి మరియు అమలుకు ప్రామాణిక వైఖరిని కల్పిస్తుంది మరియు నిలకడను కొలవడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది.

SAIF అనేది కంప్యూటబుల్ సెమాంటిక్ వర్కింగ్ ఇంటెరోపెరాబిలిటీని సాధించడానికి అవసరమైన పాలన, నిర్ధారణ, అంగీకారం మరియు ప్రవర్తనా అర్థవిచారాలు వంటివాటిని నిర్వచించే విధి నిర్దేశకాలను తయారుచేసే పద్ధతి. ఉద్దేశించబడిన సమాచార ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ, మెసేజింగ్, డాక్యుమెంట్ మార్పిడి లేదా సర్వీస్ అప్రోచ్ వంటి వాటిని ఉపయోగించవచ్చు.

SAIF ఒక ప్రేమ్‌వర్క్, ఇది ఇతర ప్రమాణాల యొక్క ఇంటెరోపెరాబిలిటీని హేతుబద్ధం చేస్తుంది. SAIF అనేది ఇంటెరోపెరాబిలిటీని సాధించడానికి ఒక ఆర్కిటెక్చర్, కాని ఇది ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్ మేనేజ్‌మెంట్ కోసం మొత్తం సొల్యూషన్ డిజైన్ కాదు.

ఆర్డెన్ సింటాక్స్[మార్చు]

ఆర్డెన్ సింటాక్స్ అనేది వైద్య విజ్ఞానాన్ని ఎన్‌కోడింగ్ చేసే ఒక భాష. HL7, ఆర్డెన్ సింటాక్స్ 2.0తో ప్రారంభమవుతున్న ప్రమాణాన్ని స్వీకరిస్తుంది మరియు పరిశీలిస్తుంది. ఈ మెడికల్ లాజిక్ మోడ్యూల్స్ (MLMలు) క్లినికల్ సెట్టింగులలో ఉపయోగించబడతాయి ఎందకంటే ఇవి సింగిల్ మెడికల్ నిర్ణయాలను తీసుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని కలిగి ఉంటాయి. ఇవి హెచ్చరికలు, చికిత్సలు మరియు వ్యాఖ్యానాలను రూపొందిస్తాయి మరియు నాణ్యతా హామీ చర్యను మరియు కార్యనిర్వాహక మద్దతును కలిగి ఉంటాయి. కనీస సిస్టమ్ అవసరాలను కలిగి ఉండి సరైన ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ అయి ఉన్న కంప్యూటర్‌పై MLM తప్పనిసరిగా రన్ కావాలి. తర్వాత ఎప్పుడు, ఎక్కడ అవసరమైనప్పుడల్లా MLM సలహాను ఇస్తుంది.

MLLP[మార్చు]

HL7 మెసేజింగ్‌లో పెద్ద భాగాన్ని మినిమల్ లోయర్ లేయర్ ప్రోటోకాల్ (MLLP) ద్వారా రవాణా చేయబడుతుంది. [2][3]

CCOW[మార్చు]

CCOW, లేదా "క్లినికల్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ వర్క్ గ్రూప్," నిజ సమయంలో మరియు యూజర్ ఇంటర్‌పేస్ స్థాయిలో, యూజర్ నేపథ్యాన్ని మరియు పేషెంట్ నేపథ్యాన్ని పంచుకునే అసమాన అప్లికేషన్‌లను ప్రారంభంచడానికి రూపొందించబడిన ప్రామాణిక ప్రొటోకాల్. CCOW పరికరాలు ప్రత్యేకించి అప్లికేషన్ల మధ్య యూజర్ సెక్యూరిటీని నిర్వహించడానికి అవసరమైన CCOW వాల్ట్ సిస్టమ్.

ఫంక్షనల్ EHR మరియు PHR నిర్దేశకాలు[మార్చు]

ఎలెక్ట్రానిక్ ఆరోగ్య రికార్డు కోసం ఫంక్షనల్ నిర్దేశకాలు

దేశానికి ప్రత్యేకమైన అంశాలు[మార్చు]

ఆస్ట్రేలియా[మార్చు]

HL7 ఆస్ట్రేలియా 1988లో స్థాపించబడింది.

ఆస్ట్రేలియా HL7 V2.x ప్రమాణాల యొక్క తొలి స్వీకర్త, ఇవి ఇప్పుడు ఆస్ట్రేలియన్ ప్రజలు మరియు ప్రయివేట్ హెల్త్‌కేర్ సంస్థలలో సర్వవ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయి.

HL7 ప్రమాణాల స్థానికీకరణ జాతీయ ప్రమాణాల సంస్థ అయిన స్టాండర్డ్స్ ఆస్ట్రేలియాతో సహకారాన్ని తీసుకుంది.

HL7 ఆస్ట్రేలియా, నేషనల్ ఈ-హెల్త్ ట్రాన్షిషన్ అథారిటీ (NEHTA) తో సన్నిహిత సహకారంలో ఉంటుంది.

ఫిన్లాండ్[మార్చు]

ఆర్యోగ్య సంరక్షణ కోసం జాతీయ IT సర్వీసులు

ఫిన్లాండ్ యొక్క సామాజిక బీమా సంస్థ ఒక జాతీయ ఇ-ప్రిస్ర్కైబింగ్ మరియు HL7 CDA R2 మరియు V3 మెసేజ్‌లమీద ఆధారపడిన పేషెంట్ రికార్డ్ ఆర్కైవల్ సర్వీస్‌ని నిర్మిస్తుంది. దశ చేయబడింది 2008-2011 కోసం వ్యూహరచన సిద్ధం చేయబడింది. వెర్షన్ 2 మెసేజింగ్ అనేక ఆసుపత్రులు మరియు ఆరో్గ్య సంరక్షణ కేంద్రాలలో విస్తృతంగా నియమించబడింది. CDA R1 పేషెంట్ రికార్డులను పంచుకోవడంలో ఉపయోగించబడింది. ప్రాంతీయ స్థాయి

జర్మనీ[మార్చు]

HL7 జర్మన్ సంస్థ 1993లో స్థాపించబడింది. ఇది ప్రజా ప్రయోజనాలకోసం ఉద్దేశించిన సంస్థ మరియు HL7 e అనుబంధ సంస్థగా నమోదు చేయబడింది. వి

జర్మన్ ఆరోగ్య సంరక్షణలో ఆపరేషనల్ పాలనాయంత్రాంగపు సమాఖ్య వ్యవస్థ కారణంగా, మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల అభివృద్ధికి తక్కువ ప్రమాణీకారక ప్రభావపు పరిశ్రమలోని పోటీ ప్రయోజనాల కారణంగా ప్రామాణీకరణ అంశం పబ్లిక్ ఎకానమీ అవకాశాలకు చాలా వెనుకగా ఉండిపోయింది. జర్మనీ లోని HL7 ప్రస్తుతం అనధికారక భాగంలా పనిచేస్తోంది మరియు జాతీయ ప్రామాణీకరణ సంస్థతో కలిసి పనిచేస్తోంది[7].

HL7 లోని స్వచ్ఛంద సభ్యత్వం వ్యక్తిగత ప్రయోజనం మరియు క్లినికల్ యూజర్లతో సంబంధం మరియు పారిశ్రామిక ఆసక్తిపై ప్రధానంగా ఆధారపడింది: వైద్యపరమైన సభ్యత్వాలు మైనారిటీలో ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలో తక్కువ సభ్యత్వం ఉంది అందుచేత, ఉదాహరణకు, పేషెంట్ డేటా రికార్డులు (EPA = elektronische Patientenakte) డేటా లభ్యత వర్సెస్ డేటా సెక్యూరిటీలను బ్యాలెన్స్ చేయడం వంటి అంశాలపై సాగుతున్న చర్చ తక్కువ స్థాయిలో ఉంటోంది. HIS సిస్టమ్స్ విభిన్నత ఇంకా HL7చే సవాలు చేయబడనందున హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ల కోసం ఉత్పాదకతపై ప్రభావం ( జర్మన్‌లో KIS = Krankenhaus-Informationssysteme అని పిలవబడింది) ఎలాంటి ప్రాముఖ్యతను కలిగి లేదు.

విస్తృత స్థాయిలో HL7ని స్వీకరించడం కోసం ప్రభుత్వ నిధులను కేటాయింటడం అనేది జర్మనీలో సమాఖ్య స్థాయిలో లేదా చాలా ప్రాంతీయ ప్రభుత్వాలలో ఇప్పటికీ ఉనికిలో లేదు.

ది నెదర్లాండ్స్[మార్చు]

AORTA - నేషనల్ హెల్త్‌కేర్ ICT ఇన్ఫ్రాస్ట్రక్చర్

AORTA అనేది ఆరోగ్య సంరక్షణ ప్రదాల మధ్య డేటా మార్పిడికోసం ఏర్పడిన డచ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. AORTA, HL7 వెర్షన్ 3 మెసేజ్‌లను మరియు డాక్యుమెంట్లను తన ప్రధాన సమాచార మార్పిడి యంత్రాంగంగా ఉపయోగిస్తుంది. ప్రారంభ నిర్దేశకాలు 2003లో రూపొందించబడినవి. డచ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విర్చువల్ నేషనల్ ఎలెక్ట్రానిక్ పేషెంట్ రికార్డుల (EPR)తో పనిచేస్తోంది, ఇది పేషెంట్ డేటాను పంచుకోవడానికి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు వీలు కల్పిస్తుంది. ఈ పరిణామం నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ కేర్, Nictizతో సన్నిహిత సహకారంతో ఉంటుంది. HL7 వెర్షన్ 3 ఉపయోగానికి సంబంధించి Nictiz తన ప్రయత్నాలను నెదర్లాండ్స్ HL7 వాలంటీర్లతో కలిసి ప్రయత్నిస్తుంది.

హాస్పిటల్ అంతర్గత పనితీరుకు మద్దతుగా నిలబడేందుకు దాదాపు అన్ని ఆసుపత్రులు HL7 వెర్షన్ 2ని ఉపయోగిస్తున్నాయి. EDIfact జనరల్ ప్రాక్టీషనర్లతో ముడిపడి ఉన్న పనితీరుకు మద్దతుగా నిలిచేందుకు ఉపయోగపడింది (GPలు/PCPలు). EDIfact స్థానంలో HL7 వెర్షన్ 3 నెమ్మదిగా వచ్చి చేరింది

యు.ఎస్.ఎ[మార్చు]

లైకా

CCHIT ఇంటెరోపెరాబిలిటీ ప్రమాణాలతో అనువర్తనం కోసం EHR సాఫ్ట్‌వేర్ పరీక్షకు లైకా అని పిలువబడే ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్‌ను సర్టిఫికేషన్ కమిషన్ ఫర్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CCHIT) అభివృద్ధి చేసింది.

HIPAA

హెల్త్ కేర్ బీమా మరియు ఇతర ఇ-కామర్స్ లావాదేవీలకు బాసటగా నిలవడానికి అవసరమైన సప్లిమెంటల్ సమాచారాన్ని ప్రామాణికీకరించడానికి అటాచ్‌మెంట్స్ స్పెషల్ ఇంటరెస్ట్ గ్రూప్ ఏర్పాటుతో, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ ఎక్కౌంటబిలిటీ యాక్ట్ (HIPAA) లెజిస్లేషన్‌లో HL7 ప్రారంభ జోక్యం 1996లో మొదలైంది. ఈ గ్రూపు ప్రారంభ ఉత్పత్తులు ఏవంటే, నోటీస్ ఆఫ్ ప్రపోజ్డ్ రూల్ మేకింగ్ (NPRM) ప్రక్రియ కోసం ఆరు సిఫార్స్ చేయబడిన క్లెయిమ్‌ల అటాచ్‌మెంట్‌ల సెట్. భవిష్యత్‌ అటాచ్‌మెంట్ ప్రాజెక్టులు ఏవంటే, హోమ్ హెల్త్, స్కిల్డ్ నర్సింగ్ ఫెసిలిటీ, నాణ్యమైన వైద్య సామగ్రి (DME), చివరి దశలోని మూత్రపిండ వ్యాధి (ESRD) మరియు ప్రీ-ఆథరైజేషన్ మరియు రెఫరల్స్. అయితే వీటితో పరిమితం కావు. అటాచ్‌మెంట్ ప్రత్యేక ప్రయోజనాల గ్రూపు HIPAA ఆదేశాలకు సంబంధించిన నిర్వాహక సాధారణీకరణ ప్రక్రియను అమలు చేయడానికి బాధ్యత పడుతుంది మరియు HIPAA డిజిగ్నేటెడ్ స్టాండర్డ్ మెయిన్‌టెయిన్స్ ఆర్గనైజేషన్ (DSMO) ప్రయత్నాలలో HL7 కి ప్రాతినిధ్య వహిస్తుంది. ఈ అనుబంధ సమాచారాన్ని ఏకీకృతంగా అమలు చేయడంకోసం HL7 ఉపయోగాన్ని ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. ANSI X12 లావాదేవీల లోపల ఎంబెడెడ్ చేయడం లేదా విడిగా ఉండే HL7 మెసేజ్‌ల కోసం గైడ్లు తయారు చేసి నిర్వహించడానికి ఈ SIG పరిశ్రమ ఉత్పాదకాలను సమన్వయపరుస్తుంది.

పెద్ద గాలివాన క్యాటరినా

HL7 హరికేన్ కత్రినా ఘటన తర్వాత రోగులకు సహకరించడానికి HL7 గ్రూపు ఎలెక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ వెండార్స్ అసోసియేషన్ (EHRVA)తో కలిసి పనిచేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న వారి సమస్యలకు పరిష్కారాలు అందించడం కోసం ఇరు సంస్థల సభ్యులు స్థానిక, రాష్ట్ర వ్యాప్తంగా మరియు జాతీయ సంస్థలతో (DHHS మరియు CDC) కూడా కలిసి పనిచేశారు.

ఇది కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

క్రిటికల్ రివ్యూస్[మార్చు]

ఓపెన్ సోర్స్ టూల్స్[మార్చు]

దేర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ ఎఫ్ఓఎస్ఎస్ బేస్‌డ్ టూల్స్ దట్ కెన్ ఫోస్టెర్ వరల్డ్‌వైడ్ అడాప్షన్ ఆఫ్ ది హెచ్7 స్టాండర్డ్స్

"https://te.wikipedia.org/w/index.php?title=HL7&oldid=1975294" నుండి వెలికితీశారు