భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు

వికీపీడియా నుండి
(List of state and union territory capitals in India నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల జాబితా ఇది.

భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు పటం.కొన్ని మార్పులు జరిగి ఉండవచ్చు.అందువలన తేడాలు ఉండటానికి అవకాశముంది

భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది. అయితే పుదుచ్చేరి, జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలు అయినప్పటికీ వాటికి స్వంత ప్రభుత్వాలు ఉన్నాయి. స్వంత ప్రభుత్వం కలిగిన ఢిల్లీ మాత్రం అటు రాష్ట్రం కాక, ఇటు కేంద్ర పాలిత ప్రాంతం కాక మధ్యస్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ కి ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

రాజధానులు

[మార్చు]

వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన, చట్టసభల, న్యాయ కేంద్రాల జాబితా ఇది. ప్రభుత్వ కార్యాలయాలు ఉండే స్థానాన్ని పరిపాలక కేంద్రం గాను, శాసనసభ ఉండే ప్రదేశాన్ని శాసన కేంద్రం గాను, హైకోర్టు ఉండే ప్రదేశాన్ని న్యాయ కేంద్రం గాను గుర్తించబడ్డాయి.

రాజధానిగా ఎప్పటినుండి ఏర్పడింది అనేది "ఎప్పటి నుండి" అనే నిలువులో ఇవ్వబడింది. వేసవి, శీత అనేవి శాసన సభ బడ్జెట్ సమావేశాల కాలాలను సూచిస్తాయి.

పరిపాలనా కేంద్రం రాష్ట్ర రాజధానిగా గుర్తించబడుతుంది. పూర్వ రాజధాని అంటే ప్రస్తుత రాజధానికి ముందు లేదా భారత్ లో విలీనానికి ముందు ఉన్న రాజధాని అని అర్థం. చట్ట రాజధాని స్థానం ఖాళీగా ఉంటే దానర్థం, అది కేంద్ర పాలనలో ఉందని అనుకోవాలి.

వ.సంఖ్య పరిపాలన కేంద్రం శాసన కేంద్రం న్యాయ కేంద్రం పూర్వ రాజధాని ఎప్పటి నుండి వ్యాఖ్యలు
1 అండమాన్ నికోబార్ దీవులు పోర్ట్ బ్లెయిర్ కోల్కతా 1956 — కేంద్ర పాలితప్రాంతం
2 అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ ఇటానగర్ గౌహతి 1972
3 ఆంధ్రప్రదేశ్ అమరావతి

హైదరాబాద్ - (తాత్కాలికం, 2024 వరకు)

అమరావతి అమరావతి 1956 2014 కర్నూలు. [1] (1953-1956)

హైదరాబాద్. (1956-2024)

4 అసోం గౌహతి దిస్పూర్ గౌహతి 1972 షిల్లాంగ్. [2] (1874-1972)
5 బీహార్ పాట్నా పాట్నా పాట్నా 1936
6 చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ రాయ్‌పూర్ బిలాస్‌పూర్ 2000
7 చండీగఢ్ చండీగఢ్[3] చండీగఢ్ 1966
8 దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ సిల్వాస్సా

డామన్

డామన్

ముంబై

డామన్

డామన్

1961

1987

2020

దాద్రా, నగర్ హవేలీ కి

— డామన్, డయ్యూ కి

— 2020 జనవరి 26 నుండి దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ కు

9 ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ 1956
10 గోవా పనాజి[4] పోర్వోరిం ముంబై 1961
11 గుజరాత్ గాంధీనగర్ గాంధీనగర్ అహమ్మదాబాదు 1970 అహ్మదాబాదు (1960-1970)
12 చండీగఢ్ చండీగఢ్ చండీగఢ్ చండీగఢ్ 1966
13 హిమాచల్ ప్రదేశ్ సిమ్లా సిమ్లా సిమ్లా 1948
14 జమ్మూ కాశ్మీరు శ్రీనగర్ (వేసవి)

జమ్మూ (శీతా)

శ్రీనగర్ 1948 — అలాగే లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడినప్పటి నుంచి లేహ్ దాని రాజధానిగా కొనసాగుతుంది
15 లడఖ్ లేహ్ జమ్మూ కాశ్మీరు శ్రీనగర్ 1948

2019

2019 అక్టోబరు 31 నుండి లడఖ్ ను జమ్మూ కాశ్మీరు నుండి విడగొట్టి ప్రత్యేక కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించింది.
16 జార్ఖండ్ రాంచీ రాంచీ రాంచీ 2000
17 కర్ణాటక బెంగళూరు బెంగళూరు బెంగళూరు 1956
18 కేరళ తిరువనంతపురం తిరువనంతపురం ఎర్నాకులం 1956 కొచ్చి[5] (1949-1956)
19 లక్షద్వీపాలు కవరట్టి ఎర్నాకులం 1956
20 మధ్య ప్రదేశ్ భోపాల్ భోపాల్ జబల్పూర్ 1956 నాగపూర్ [6] (1861-1956)
21 మహారాష్ట్ర ముంబై[7]

నాగపూర్ (శీత/2వ)[8]

ముంబై 1818
1960
22 మణిపూర్ ఇంఫాల్ ఇంఫాల్ గౌహతి 1947
23 మేఘాలయ షిల్లాంగ్ షిల్లాంగ్ గౌహతి 1970
24 మిజోరం ఐజాల్ ఐజాల్ గౌహతి 1972
25 నాగాలాండ్ కోహిమా కోహిమా గౌహతి 1963
26 ఒడిషా భువనేశ్వర్ భువనేశ్వర్ కటక్ 1948 కటక్ (1936-1948)
27 పుదుచ్చేరి పుదుచ్చేరి పుదుచ్చేరి చెన్నై 1954
28 పంజాబ్ చండీగఢ్ చండీగఢ్ చండీగఢ్ 1966 లాహోర్ [10] (1936-1947)

సిమ్లా (1947-1966)

29 రాజస్థాన్ జైపూర్ జైపూర్ జోధ్‌పూర్ 1948
30 సిక్కిం గాంగ్‌టక్[11] గాంగ్‌టక్ గాంగ్‌టక్ 1975
31 తమిళనాడు చెన్నై[12] చెన్నై చెన్నై 1956
32 తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ 1590
33 త్రిపుర అగర్తలా అగర్తలా గౌహతి 1956
34 ఉత్తరాంచల్ డెహ్రాడూన్ [13] డెహ్రాడూన్ నైనీతాల్ 2000
35 ఉత్తర ప్రదేశ్ లక్నో లక్నో అలహాబాదు 1937
36 పశ్చిమ బెంగాల్ కోల్‌కాతా కోల్‌కాతా కోల్‌కాతా 1905

గమనికలు:జమ్మూ కాశ్మీర్ కు శ్రీనగర్, జమ్మూ లు రాజధానులుగా, లఢఖ్ కు లేహ్ రాజధానిగా 2019 అక్టోబరు 31న కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చబడ్డాయి.

మూలాలు

[మార్చు]
 1. 1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడక ముందు ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం అని రెండు రాష్ట్రాలుగా ఉండేది. ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగాను, హైదరాబాదు రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని గాను ఉండేవి.
 2. 1971లో అసోం నుండి మేఘాలయ విడిపోక ముందు వరకు సంయుక్త రాష్ట్రానికి షిల్లాంగ్ రాజధానిగా ఉండేది.
 3. చండీగఢ్ పంజాబు, హర్యానాలు రెండింటికీ రాజధాని. ఈ రెండింటికి చెందకుండా అది ఒక కేంద్రపాలిత ప్రాంతం.
 4. 1843 నుండి (పోర్చుగీసు పాలనలో) గోవాకు పనాజి రాజధానిగా ఉంటూ వచ్చింది.
 5. 1956లో కేరళ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తిరువాన్కూరు-కొచ్చిన్ రాష్ట్రానికి కొచ్చి రాజధానిగా ఉండేది.
 6. 1861 నుండి 1950 వరకు ప్రత్యేక రాష్ట్రం గా ఉన్న మధ్య ప్రావిన్సులు, బేరారుకు నాగపూరు రాజధానిగా ఉండేది. 1950లో ఏర్పడిన మధ్య ప్రదేశ్ లో ఇది ప్రముఖ భాగంగా ఉండేది. కొత్త రాష్ట్రానికి కూడా నాగపూరే రాజధానిగా ఉండేది. 1956లో బేరారును విడదీసి, బాంబే రాష్ట్రంలో కలిపాక, నాగపూరు రాజధాని హోదాను కోల్పోయింది. 1960లో కుదిరిన నాగపూర్ ఒప్పందం ద్వారా నాగపూరు మహారాష్ట్రకు రెండో రాజధాని అయింది.
 7. 1956 వరకు ఉనికిలో ఉన్న బాంబే ప్రావిన్సుకు ముంబై రాజధానిగా ఉండేది. తరువాత, బాంబే రాష్ట్రం ఏర్పడినపుడు ముంబై రాజధాని అయింది. తరువాత బాంబే రాష్ట్రం చీలి మహారాష్ట్ర, గుజరాత్ లు ఏర్పడ్డాయి.
 8. 1960లో కుదిరిన నాగపూరు ఒప్పందం ద్వారా నాగపూరు మహారాష్ట్రకు రెండో రాజధాని అయింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన 1988లో వెలువడింది. అయినా భారత ప్రభుత్వం ప్రచురించే భారత సంవత్సర పుస్తకంలో నాగపూరు యొక్క రాజధాని ప్రతిపత్తి గురించిన ప్రస్తావన ఉండదు.
 9. నాగపూరు ఒప్పందం ప్రకారం విదర్భ మహారాష్ట్రలో విలీనమౌతున్నందుకు గాను, ఏటా జరిగే శాసనసభ సమావేశాల్లో కనీసం ఒకటైనా నాగపూరులో జరగాలి. ఆ సమావేశం ప్రత్యేకించి విదర్భ సమస్యలపై జరగాలి. ఈ సమావేశాలపై మహారాష్ట్ర ప్రభుత్వాల అలసత్వ ధోరణి కారణంగా చివరికి "పిక్నిక్ సమావేశాలు" గా పేరుపడ్డాయి.
 10. 1936లో పంజాబు రాష్ట్రం ఏర్పాటయినపుడు లాహోరు దాని రాజధానిగా ఉండేది. ప్రస్తుతం లాహోరు పాకిస్తానులో ఉంది
 11. 1890 నుండి గాంగ్‌టక్ సిక్కింకు రాజధానిగా ఉంటూ వచ్చింది. 1975లో సిక్కిం భారత్‌లో అంతర్భాగమయింది.
 12. 1839 నుండి మద్రాసు ప్రెసిడెన్సీ కి చెన్నై రాజధానిగా ఉంటూ వచ్చింది. 1950లో మద్రాసు ప్రెసిడెన్సీ నుండి సర్కారు జిల్లాలు వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది. మిగిలిన ప్రాంతం 1956లో తమిళనాడుగా ఏర్పడింది..
 13. డెహ్రాడూన్ ఉత్తరాంచల్ కు తాత్కలిక రాజధాని. రాష్ట్ర కొత్త రాజధానిగా గైర్సే అనే పట్టణం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.

వనరులు

[మార్చు]